డేవిడ్ బూన్
![]() | ||||
వ్యక్తిగత సమాచారం | ||||
---|---|---|---|---|
పూర్తి పేరు | డేవిడ్ క్లారెన్స్ బూన్ | |||
జననం | లాన్సెస్టన్, టాస్మానియా, ఆస్ట్రేలియా | 1960 డిసెంబరు 29|||
బ్యాటింగ్ శైలి | కుడిచేతి వాటం | |||
బౌలింగ్ శైలి | Right arm off break | |||
పాత్ర | బ్యాట్స్ మన్ | |||
అంతర్జాతీయ సమాచారం | ||||
జాతీయ జట్టు | ఆస్ట్రేలియా | |||
టెస్టు అరంగ్రేటం(cap 325) | 23 నవంబరు 1984 v వెస్టిండీస్ | |||
చివరి టెస్టు | 29 జనవరి 1996 v శ్రీలంక | |||
వన్డే లలో ప్రవేశం(cap 80) | 12 ఫిబ్రవరి 1984 v వెస్టిండీస్ | |||
చివరి వన్డే | 15 మార్చి 1995 v వెస్టిండీస్ | |||
దేశవాళీ జట్టు సమాచారం | ||||
సంవత్సరాలు | జట్టు | |||
1978–1999 | టాస్మానియా టైగర్స్ | |||
1997–1999 | Durham | |||
కెరీర్ గణాంకాలు | ||||
పోటీ | టెస్ట్ | అంతర్జాతీయ వన్డేలు | దేశీవాళీ క్రికెట్ | LA |
మ్యాచ్‌లు | 107 | 181 | 350 | 313 |
సాధించిన పరుగులు | 7,422 | 5,964 | 23,413 | 10,236 |
బ్యాటింగ్ సగటు | 43.65 | 37.04 | 44.00 | 37.49 |
100s/50s | 21/32 | 5/37 | 68/114 | 9/68 |
ఉత్తమ స్కోరు | 200 | 122 | 227 | 172 |
బాల్స్ వేసినవి | 36 | 82 | 1,153 | 280 |
వికెట్లు | 0 | 0 | 14 | 4 |
బౌలింగ్ సగటు | – | – | 49.71 | 66.50 |
ఇన్నింగ్స్ లో 5 వికెట్లు | – | – | 0 | – |
మ్యాచ్ లో 10 వికెట్లు | – | n/a | 0 | n/a |
ఉత్తమ బౌలింగ్ | – | – | 2/18 | 2/44 |
క్యాచులు/స్టంపింగులు | 99/– | 45/– | 283/– | 82/– |
Source: క్రిక్ ఇన్ఫో, 9 డిసెంబరు 2009 |
1960, డిసెంబర్ 29న జన్మించిన డేవిడ్ బూన్ (David Boon) ఆస్ట్రేలియాకు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు. 1980, 1990 దశకంలో ఆస్ట్రేలియా తరఫున 107 టెస్టులలో, 181 వన్డేలలో ప్రాతినిధ్యం వహించాడు. దేశవాళీ క్రికెట్‌లో టాస్మేనియా తరఫున ఆడుతూ 1978-79లో జిల్లెట్ కప్‌లో టాస్మేనియా ఆశ్చర్యకరమైన విజయానికి దోహదపడ్డాడు.[1]
టెస్ట్ క్రికెట్ గణాంకాలు[మార్చు]
డేవిడ్ బూన్ 107 టెస్టులకు ప్రాతినిధ్యం వహించి 43.65 సగటుతో 7422 పరుగులు సాధించాడు. అందులో 21 సెంచరీలు, 32 అర్థసెంచరీలు ఉన్నాయి. టెస్ట్ క్రికెట్‌లో అతడి అత్యధిక స్కోరు సరిగ్గా 200 పరుగులు.
వన్డే క్రికెట్ గణాంకాలు[మార్చు]
బూన్ 181 వన్డేలు ఆడి 37.04 సగటుతో 5946 పరుగులు సాధించాడు. అందులో 5 సెంచరీలు, 37 అర్థసెంచరీలు ఉన్నాయి. వన్డేలలో అతడి అత్యధిక స్కోరు 122 పరుగులు.
ప్రపంచ కప్ క్రికెట్[మార్చు]
డేవిడ్ బూన్ ఆస్ట్రేలియా విజయం సాధించిన 1987 ప్రపంచ కప్‌లో తొలిసారిగా పాల్గొన్నాడు. భారత ఉపఖండంలో జరిగిన ఆ టోర్నమెంటులో 55.87 సగటుతో 447 పరుగులు సాధించాడు. లాహోర్లో జరిగిన సెమీఫైనల్‌లో పాకిస్తాన్ పై 65 పరుగులు సాధించాడు. కోల్‌కతలో జరిగిన ఫైనల్‌లో 75 పరుగులు సాధించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు పొందినాడు.[2] 1987 ప్రపంచకప్ అనగానే వెంటనే గుర్తొచ్చే పేరు డేవిడ్ బూన్. ఆస్ట్రేలియా విజయంలో డేవిడ్ బూన్దే కీలకపాత్ర. పాకిస్థాన్‌తో సెమీస్‌లో 65 పరుగులు చేసిన బూన్ ఫైనల్లో 75 పరుగులు చేసి టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. టోర్నీలో అతను 8 మ్యాచ్‌ల్లో 447 పరుగులు చేశాడు