హార్దిక్ పాండ్యా
![]() | ||||
2015 ఆగస్టులో హార్దిక్ పాండ్యా | ||||
వ్యక్తిగత సమాచారం | ||||
---|---|---|---|---|
పూర్తి పేరు | హార్దిక్ హిమాన్షు పాండ్యా | |||
జననం | చోరియాసి, సూరత్ జిల్లా, గుజరాత్, భారతదేశం | 1993 అక్టోబరు 11|||
ఇతర పేర్లు | కుంగ్ ఫూ పాండ్యా,[1] హేయిరీ[2] | |||
బ్యాటింగ్ శైలి | కుడిచేతి వాటం | |||
బౌలింగ్ శైలి | కుడిచేతి - ఫాస్ట్ బౌలింగ్ | |||
పాత్ర | ఆల్ రౌండర్ | |||
సంబంధాలు | నటాషా స్టాంకోవిక్ (భార్య) కృనాల్ పాండ్యా (సోదరుడు) | |||
అంతర్జాతీయ సమాచారం | ||||
జాతీయ జట్టు | India | |||
టెస్టు అరంగ్రేటం(cap 289) | 26 July 2017 v Sri Lanka | |||
చివరి టెస్టు | 30 August 2018 v England | |||
వన్డే లలో ప్రవేశం(cap 215) | 16 October 2016 v New Zealand | |||
చివరి వన్డే | 17 July 2022 v England | |||
ఒ.డి.ఐ. షర్టు నెం. | 33 | |||
టి20ఐ లో ప్రవేశం(cap 58) | 26 January 2016 v Australia | |||
చివరి టి20ఐ | 7 August 2022 v West Indies | |||
దేశవాళీ జట్టు సమాచారం | ||||
సంవత్సరాలు | జట్టు | |||
2012/13–present | Baroda | |||
2015–2021 | Mumbai Indians (squad no. 33) | |||
2022-present | Gujarat Titans (squad no. 33) | |||
కెరీర్ గణాంకాలు | ||||
పోటీ | Test | ODI | T20I | |
మ్యాచులు | 11 | 62 | 49 | |
సాధించిన పరుగులు | 532 | 1,267 | 484 | |
బ్యాటింగ్ సగటు | 31.29 | 33.34 | 19.36 | |
100 పరుగులు/50 పరుగులు | 1/4 | 0/7 | 0/1 | |
ఉత్తమ స్కోరు | 108 | 92* | 51 | |
వేసిన బాల్స్ | 937 | 2,506 | 815 | |
వికెట్లు | 17 | 56 | 42 | |
బౌలింగ్ సగటు | 31.05 | 41.44 | 26.45 | |
ఇన్నింగ్స్ లో వికెట్లు | 1 | 0 | 0 | |
మ్యాచులో 10 వికెట్లు | 0 | 0 | 0 | |
ఉత్తమ బౌలింగు | 5/28 | 4/28 | 4/38 | |
క్యాచులు/స్టంపింగులు | 7/– | 24/– | 30/– | |
Source: ESPNcricinfo, 7 August 2022 {{{year}}} |
హార్దిక్ పాండ్యా (జననం 1993 అక్టోబరు 11) బరోడా క్రికెట్ టీంకు చెందిన భారత ఆటగాడు. ఇతను కుడి చేయి ఆటగాడు, బౌలర్ కూడా. 2015 పెప్సీ ఐపియల్ లో ముంబై ఇండియన్స్ జట్టు హార్దిక్ ను పది లక్షలు పెట్టి కొనుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ తో మ్యాచ్ లో 12 బంతులలో 30 పరుగులు కావాల్సిఉండగా హార్దిక్ 8 బంతులలొనే 21 పరుగులు చేసి మ్యాచ్ గెలిపించాడు. కె కె ఆర్ తో డూ ఆర్ డై మ్యాచ్ లో 30 బంతుల్లో 61 పరుగులు చేసి మ్యాచ్ గెలిపించాడు. ఈ ప్రదర్శనకు హార్దిక్ భారత్ ఏ కు ఎంపిక అయ్యాడు. 2016లో ఆస్ట్రేలియా తో టీ20లో అంతర్జాతీయ క్రికెట్ కు అరంగేట్రం చేశాడు. తన తొలి బంతి వేయడానికి ముందు వరసగా 3 వైడ్ బాల్స్ వేసాడు. ఆ మ్యాచ్ లో హార్దిక్ 2 ఓవర్లకి 27 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసాడు. శ్రీలంక, ఆసియా కప్, ప్రపంచ కప్ టీ20లలో బాగా ఆడి ఆకట్టుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ లో ఎంపిక అయ్యినందుకు ముంబై ఇండియాన్స్ ఏటా జీతం 50 లక్షలకు పెంచింది. 2016లో వన్ డే లలో అరంగేట్రం చేసాడు. అన్ని ఫార్మాట్లో కీలక ఆటగాడిగా మారాడు. పాకిస్థాన్ తో 2017 ఛాంపియన్స్ ట్రోఫీ లో పాక్ కు వణుకు పుట్టించాడు. కానీ ఆ మ్యాచ్ భారత్ ఓడిపోయింది. 2017లో లంక తో టెస్ట్ అరంగేట్రం చేసాడు. 2017లో ఆస్ట్రేలియాతో వన్ డే సిరీస్ లో మ్యాన్ ఆఫ్ ద సిరీస్ గా వెలుగొందాడు. 2018 ఐపీఎల్ కోసం 12 కోట్లు వెచ్చించింది. 2018 ఐపీఎల్ లో 18 వికెట్లు తీసాడు. 2018 జూన్ 29న జరిగిన ఐర్లాండ్ టీ20 లో 9 బంతుల్లో 32 పరుగులు చేసి జట్టు కు బారి స్కోర్ అందించాడు. జులై 8న ఇంగ్లండ్ తో టీ20 లో 4 వికెట్లు, 14 బంతులలో 33 పరుగులు చేసి విజయం అందించాడు. 2019 ఐపిఎల్ లో మంచి ఆటతీరు ప్రదర్శించి బ్యాటింగ్ తో ముంబైనీ ఫైనల్ వరకు తిసుకెళ్లాడు. 2018లో వెన్నుముక శాస్త్ర చికిత్స తరువాత టెస్ట్ టీం లో చోటు కోల్పోయి ఫామ్ లో లేక ఇబ్బంది పడుతున్నాడు.
మూలాలు[మార్చు]
- ↑ "Hardik 'Kung Fu' Pandya's 37 Ball Ton Gets Praise from Natasa Stankovic". News18 (in ఇంగ్లీష్). Retrieved 27 March 2021.
- ↑ "Virat as 'Cheeku', Dhoni as 'Mahi' - The fascinating story behind the nicknames of Indian cricketers". DNA India. Retrieved 3 August 2016.
ఇతర లింకులు[మార్చు]
- క్రిక్ఇన్ఫో లో హార్దిక్ పాండ్యా ప్రొఫైల్
- క్రికెట్ ఆర్కివ్ లో హార్దిక్ పాండ్యా వివరాలు