Jump to content

బరోడా క్రికెట్ జట్టు

వికీపీడియా నుండి
బరోడా క్రికెట్ జట్టు
వ్యక్తిగత సమాచారం
కెప్టెన్అంబటి రాయుడు
కోచ్జాకబ్ మార్టిన్
యజమానిబరోడా క్రికెట్ అసోసియేషన్
జట్టు సమాచారం
స్థాపితం1886
స్వంత మైదానంమోతీబాగ్ స్టేడియం
సామర్థ్యం18,000
చరిత్ర
రంజీ ట్రోఫీ విజయాలు5
ఇరానీ ట్రోఫీ విజయాలు0
విజయ్ హజారే ట్రోఫీ విజయాలు0
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ విజయాలు2
అధికార వెబ్ సైట్BCA

బరోడా క్రికెట్ జట్టు గుజరాత్‌లోని వడోదర నగరంలో ఉన్న దేశీయ క్రికెట్ జట్టు. ప్యాలెస్ మైదానంలో ఉన్న మోతీ బాగ్ స్టేడియం, ఈ జట్టు హోమ్ గ్రౌండ్. బరోడా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ జట్టు నడుస్తోంది. కొత్త మిలీనియంలో రంజీ ట్రోఫీలో అత్యంత విజయవంతమైన జట్లలో ఇది ఒకటి.

బరోడా, 2005/06 రంజీ ట్రోఫీలో రన్నరప్‌గా నిలిచింది. గుజరాత్‌లో ఉన్న మూడు జట్లలో ఇది ఒకటి కాగా, మిగిలినవి సౌరాష్ట్ర క్రికెట్ జట్టు, గుజరాత్ క్రికెట్ జట్టు.

పోటీల చరిత్ర

[మార్చు]

బరోడా ఇటీవలి సంవత్సరాలలో మాత్రమే బలమైన జట్టుగా అవతరించింది. ఇది చివరిసారి 2000–01లో రంజీ ట్రోఫీని గెలుచుకుంది, అయితే తర్వాతి సంవత్సరంలో ఫైనల్‌కు చేరినప్పటికీ, టైటిల్‌ను కాపాడుకోవడంలో విఫలమై, రన్నరప్‌గా నిలిచింది. అంటే ఇది ఒకే ఒక్క సారి ఇరానీ ట్రోఫీ లో ఆడింది. ఇందులో VVS లక్ష్మణ్ (13 & 148), దినేష్ మోంగియా (125 & 90*), దేబాశిష్ మొహంతి, సరణ్‌దీప్ సింగ్, ఆకాష్ చోప్రా వంటి ఆటగాళ్ళున్న బలమైన రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టును ఓడించడంలో విఫలమైంది. బరోడా జట్టు 1940లు, 1950లలో బలమైన జట్టుగా పరిగణించబడేది. రంజీ ట్రోఫీని 4 సార్లు గెలిచి రెండుసార్లు రన్నరప్‌గా నిలిచింది. విజయ్ హజారే, ఇర్ఫాన్ పఠాన్, యూసుఫ్ పఠాన్, హార్దిక్ పాండ్యా బరోడా నుంచి వచ్చిన క్రికెటర్లలో ప్రముఖులు. వారు భారతదేశం కోసం అంతర్జాతీయ స్థాయిలో అద్భుతమైన ప్రదర్శనలు చేశారు.

రంజీ ట్రోఫీలో అత్యుత్తమ ప్రదర్శన

[మార్చు]
సంవత్సరం స్థానం
2010–11 ద్వితియ విజేత
2001–02 ద్వితియ విజేత
2000–01 విజేత
1957–58 విజేత
1949–50 విజేత
1948–49 ద్వితియ విజేత
1946–47 విజేత
1945–46 ద్వితియ విజేత
1942–43 విజేత

హోమ్ గ్రౌండ్స్

[మార్చు]
  • మోతీ బాగ్ స్టేడియం, వడోదర - మూడు వన్‌డేలు జరిగాయి. సామర్థ్యం 18,000.
  • రిలయన్స్ స్టేడియం, వడోదర - 10 వన్‌డేలు జరిగాయి.
  • గుజరాత్ స్టేట్ ఫర్టిలైజర్ కార్పొరేషన్ గ్రౌండ్

ప్రస్తుత స్క్వాడ్

[మార్చు]

అంతర్జాతీయ క్యాప్‌లు ఉన్న ఆటగాళ్లు బోల్డ్‌లో జాబితా చేయబడ్డారు.

Name Birth date Batting style Bowling style Notes
Batters
జ్యోత్స్నిల్ సింగ్ (1997-12-15) 1997 డిసెంబరు 15 (వయసు 26) కుడిచేతి వాటం కుడిచేతి ఆఫ్ బ్రేక్
ప్రత్యూష్ కుమార్ (1995-07-01) 1995 జూలై 1 (వయసు 29) కుడిచేతి వాటం కుడిచేతి మీడియం
అంబటి రాయుడు (1985-09-23) 1985 సెప్టెంబరు 23 (వయసు 39) కుడిచేతి వాటం కుడిచేతి ఆఫ్ బ్రేక్ Captain

Plays for Chennai Super Kings in IPL
భాను పానియా (1996-09-04) 1996 సెప్టెంబరు 4 (వయసు 28) కుడిచేతి వాటం కుడిచేతి మీడియం ఫాస్ట్
ఆదిత్య వాఘ్మోడే (1989-11-08) 1989 నవంబరు 8 (వయసు 35) ఎడమచేతి వాటం కుడిచేతి ఆఫ్ బ్రేక్
హర్ష దేశాయ్ (2002-10-30) 2002 అక్టోబరు 30 (వయసు 22) ఎడమచేతి వాటం కుడిచేతి మీడియం ఫాస్ట్
All-rounders
మహేష్ పితియా (2001-12-24) 2001 డిసెంబరు 24 (వయసు 22) కుడిచేతి వాటం కుడిచేతి ఆఫ్ బ్రేక్
అభిమన్యుసింగ్ రాజ్‌పుత్ (1998-05-09) 1998 మే 9 (వయసు 26) కుడిచేతి వాటం కుడిచేతి ఫాస్ట్-medium
కృనాల్ పాండ్యా (1991-03-24) 1991 మార్చి 24 (వయసు 33) ఎడమచేతి వాటం ఎడమచేతి స్లో ఆర్థడాక్స్ Plays For Lucknow Super Giants in IPL
ధ్రువ్ పటేల్ (1997-09-12) 1997 సెప్టెంబరు 12 (వయసు 27) కుడిచేతి వాటం కుడిచేతి మీడియం
హార్దిక్ పాండ్యా (1993-10-11) 1993 అక్టోబరు 11 (వయసు 31) కుడిచేతి వాటం కుడిచేతి మీడియం ఫాస్ట్ Plays For Gujarat Titans in IPL
Wicket-keeper
విష్ణు సోలంకి (1992-10-15) 1992 అక్టోబరు 15 (వయసు 32) కుడిచేతి వాటం Vice-captain
మితేష్ పటేల్ (1997-05-15) 1997 మే 15 (వయసు 27) కుడిచేతి వాటం
Spin Bowlers
నినాద్ రథ్వ (1999-03-10) 1999 మార్చి 10 (వయసు 25) ఎడమచేతి వాటం ఎడమచేతి స్లో ఆర్థడాక్స్
భార్గవ్ భట్ (1990-05-13) 1990 మే 13 (వయసు 34) ఎడమచేతి వాటం ఎడమచేతి స్లో ఆర్థడాక్స్
చింతల్ గాంధీ (1994-08-25) 1994 ఆగస్టు 25 (వయసు 30) కుడిచేతి వాటం కుడిచేతి లెగ్ బ్రేక్
కార్తీక్ కాకడే (1995-07-25) 1995 జూలై 25 (వయసు 29) కుడిచేతి వాటం కుడిచేతి ఆఫ్ బ్రేక్
Pace Bowlers
లుక్మాన్ మేరివాలా (1991-12-11) 1991 డిసెంబరు 11 (వయసు 32) ఎడమచేతి వాటం ఎడమచేతి ఫాస్ట్ మీడియం
అతిత్ షెత్ (1996-02-03) 1996 ఫిబ్రవరి 3 (వయసు 28) కుడిచేతి వాటం కుడిచేతి మీడియం
వరుణ్ ఆరోన్ (1989-10-29) 1989 అక్టోబరు 29 (వయసు 35) కుడిచేతి వాటం కుడిచేతి ఫాస్ట్
బాబాషఫీ పఠాన్ (1994-08-19) 1994 ఆగస్టు 19 (వయసు 30) కుడిచేతి వాటం కుడిచేతి మీడియం ఫాస్ట్
సోయెబ్ సోపారియా (1994-09-10) 1994 సెప్టెంబరు 10 (వయసు 30) కుడిచేతి వాటం Left-arm medium
సఫ్వాన్ పటేల్ (1998-10-03) 1998 అక్టోబరు 3 (వయసు 26) కుడిచేతి వాటం Left-arm medium

కోచింగ్ సిబ్బంది

[మార్చు]

ప్రసిద్ధ క్రీడాకారులు

[మార్చు]
ఇర్ఫాన్ పఠాన్

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Jacob Martin, former India player with criminal record, named Baroda Ranji coach". India Today. 14 September 2016. Retrieved 18 June 2018.