సర్వీసెస్ క్రికెట్ జట్టు
వ్యక్తిగత సమాచారం | |
---|---|
కెప్టెన్ | రజత్ పలివాల్ |
యజమాని | సర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డ్ |
జట్టు సమాచారం | |
స్థాపితం | 1926 |
స్వంత మైదానం | పాలం ఎ స్టేడియం ఢిల్లీ |
చరిత్ర | |
రంజీ ట్రోఫీ విజయాలు | 0 |
విజయ్ హజారే ట్రోఫీ విజయాలు | 0 |
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ విజయాలు | 0 |
అధికార వెబ్ సైట్ | SSCB |
సర్వీసెస్ క్రికెట్ జట్టు భారతదేశంలోని ప్రధాన దేశీయ ఫస్ట్-క్లాస్ క్రికెట్ పోటీ అయిన రంజీ ట్రోఫీలో ఆడుతుంది. సర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డ్ ఆధ్వర్యంలో, వారు భారత సాయుధ దళాలకు ప్రాతినిధ్యం వహిస్తారు. వారి హోమ్ గ్రౌండ్ పాలమ్ ఎ గ్రౌండ్, మోడల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఢిల్లీ .
రికార్డులు
[మార్చు]సర్వీసెస్ జట్టు తొలిసారిగా 1949–50లో రంజీ ట్రోఫీలో ఆడింది. వారు 2001-02 వరకు నార్త్ జోన్‌లో ఆడారు. 2005-06లో ఎలైట్ గ్రూప్‌లో ఆడిన ఒక సీజన్ మినహా 2002-03 నుండి ప్లేట్ గ్రూప్,లో, ఇతర తక్కువ-ర్యాంక్ గ్రూపులలో ఆడారు. జట్టు బలంగా ఉన్న కాలం 1950లు: 1950-51, 1959-60 మధ్య వారు ఆరుసార్లు రంజీ సెమీ-ఫైనల్‌కు, రెండుసార్లు ఫైనల్‌కూ చేరుకున్నారు. 1956-57లో బాంబేతో ఇన్నింగ్స్ తేడాతో ఓడిపోయారు.[1] 1957-58లో బరోడాతో కూడా ఇన్నింగ్స్ తేడాతో ఓడిపోయారు. [2]
2022 మార్చి ప్రారంభం నాటికి సర్వీసెస్, 91 విజయాలు, 119 ఓటములు, 140 డ్రాలతో 350 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు ఆడింది. వారి విజయాల్లో 33 జమ్మూ, కాశ్మీర్‌పై ఉన్నాయి. [3]
వారి అత్యధిక ఫస్ట్‌క్లాస్ స్కోరు 2012–13లో త్రిపురపై యశ్‌పాల్ సింగ్ చేసిన 250 నాటౌట్.[4] 1968–69లో జమ్మూ కాశ్మీర్‌పై గోకుల్ ఇందర్ దేవ్ 37 పరుగులకు 8 వికెట్లు పడగొట్టడం అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు. [5]
వారు 2021–22 సీజన్‌లో తొలిసారిగా విజయ్ హజారే ట్రోఫీలో సెమీ-ఫైనల్‌కు చేరుకున్నారు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో వారి అత్యుత్తమ ముగింపు 2019-20 సీజన్‌లో ఉంది, అక్కడ వారు తమ గ్రూప్‌లో 4 విజయాలు, 2 ఓటములతో మూడవ స్థానంలో నిలిచారు.
ప్రసిద్ధ క్రీడాకారులు
[మార్చు]భారతదేశం తరపున టెస్ట్ క్రికెట్ ఆడిన సర్వీసెస్ ఆటగాళ్ళు. తొలి మ్యాచ్ ఆడిన సంవత్సరం బ్రాకెట్లలో:
- హేము అధికారి (1947) (ప్రధానంగా బరోడా తరపున ఆడాడు)
- బాల్ డాని (1952)
- చంద్రశేఖర్ గడ్కరీ (1953)
- నారాయణ స్వామి (1955)
- సురేంద్ర నాథ్ (1958)
- అపూర్వ సేన్‌గుప్తా (1959)
- VM ముద్దయ్య (1959)
ప్రస్తుత స్క్వాడ్
[మార్చు]పేరు | పుట్టినరోజు | బ్యాటింగు శైలి | బౌలింగు శైలి | గమనికలు |
---|---|---|---|---|
Batsmen | ||||
రజత్ పలివాల్ | 1991 డిసెంబరు 24 | కుడిచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | Captain |
రవి చౌహాన్ | 1993 సెప్టెంబరు 17 | కుడిచేతి వాటం | Right-arm leg-break | |
జి రాహుల్ సింగ్ | 1995 సెప్టెంబరు 18 | ఎడమచేతి వాటం | కుడిచేతి మీడియం | |
శుభమ్ రోహిల్లా | 1998 మార్చి 10 | ఎడమచేతి వాటం | కుడిచేతి లెగ్ బ్రేక్ | |
అన్షుల్ గుప్తా | 1989 సెప్టెంబరు 20 | కుడిచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | |
అమిత్ పచారా | 1995 సెప్టెంబరు 8 | కుడిచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | |
సుఫియాన్ ఆలం | 1995 ఏప్రిల్ 2 | కుడిచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | |
వికాస్ హత్వాలా | 1993 సెప్టెంబరు 6 | ఎడమచేతి వాటం | ఎడమచేతి మీడియం | |
లఖన్ సింగ్ | 1998 ఆగస్టు 21 | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం | |
Wicket-keeper | ||||
దేవేందర్ లోచాబ్ | 1992 నవంబరు 5 | కుడిచేతి వాటం | ||
లోవ్‌కేష్ బన్సల్ | 1995 ఆగస్టు 17 | ఎడమచేతి వాటం | ||
Spin Bowlers | ||||
పులకిత్ నారంగ్ | 1994 జూన్ 18 | కుడిచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | |
రాహుల్ సింగ్ | 1992 సెప్టెంబరు 12 | కుడిచేతి వాటం | ఎడమచేతి స్లో ఆర్థడాక్స్ | |
మోహిత్ రాథీ | 1999 జనవరి 13 | కుడిచేతి వాటం | కుడిచేతి లెగ్ బ్రేక్ | Plays for Punjab Kings in IPL |
అర్జున్ శర్మ | 1996 మే 25 | ఎడమచేతి వాటం | ఎడమచేతి స్లో ఆర్థడాక్స్ | |
పార్థ్ రేఖడే | 1999 జూలై 18 | కుడిచేతి వాటం | ఎడమచేతి స్లో ఆర్థడాక్స్ | |
Pace Bowlers | ||||
దివేష్ పఠానియా | 1989 జూన్ 22 | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం | |
అర్పిత్ గులేరియా | 1997 ఏప్రిల్ 26 | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం | Plays for Lucknow Super Giants in IPL |
పూనమ్ పూనియా | 1994 డిసెంబరు 12 | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం | |
నితిన్ యాదవ్ | 1992 నవంబరు 20 | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం | |
సచ్చిదానంద్ పాండే | 1996 జూలై 1 | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం | |
అభిషేక్ తివారీ | 1988 డిసెంబరు 7 | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం | |
మోహిత్ కుమార్ | 1996 సెప్టెంబరు 25 | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం-fast | |
గౌరవ్ శర్మ | 1994 జూలై 6 | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం |
మూలాలు
[మార్చు]- ↑ "Services v Bombay 1956–57". Cricinfo. Retrieved 20 February 2019.
- ↑ "Baroda v Services 1957–58". Cricinfo. Retrieved 20 February 2019.
- ↑ "Playing Record (1949/50-2021/22)". CricketArchive. Retrieved 5 March 2022.
- ↑ "Most Runs in an Innings for Services". CricketArchive. Retrieved 10 July 2018.
- ↑ "Most Wickets in an Innings for Services". CricketArchive. Retrieved 10 July 2018.