విజయ్ హజారే ట్రోఫీ
విజయ్ హజారే ట్రోఫీ | |
---|---|
దేశాలు | భారతదేశం |
నిర్వాహకుడు | బిసిసిఐ |
ఫార్మాట్ | లిస్ట్ ఎ క్రికెట్ |
తొలి టోర్నమెంటు | 2002–03 |
చివరి టోర్నమెంటు | 2022–23 |
టోర్నమెంటు ఫార్మాట్ | రౌండ్ రాబిన్, నాకౌట్ |
జట్ల సంఖ్య | 38 |
ప్రస్తుత ఛాంపియన్ | సౌరాష్ట్ర (2వ టైటిలు) |
అత్యంత విజయవంతమైన వారు | తమిళనాడు (5 టైటిళ్ళు) |
అత్యధిక పరుగులు | యశ్పాల్ సింగ్ (3193 పరుగులు) |
వెబ్‌సైటు | Vijay Hazare Trophy |
2022–23 విజయ్ హజారే ట్రోఫీ |
విజయ్ హజారే ట్రోఫీ (IDFC ఫస్ట్ బ్యాంక్ విజయ్ హజారే ట్రోఫీ), వార్షిక పరిమిత ఓవర్ల దేశీయ క్రికెట్ పోటీ. భారత క్రికెట్ నియంత్రణ బోర్డు నిర్వహించే ఈ పోటీలో రంజీ ట్రోఫీ ప్లేట్ల లోని రాష్ట్ర జట్లు ఆడతాయి. గతంలో దీన్ని రంజీ వన్-డే ట్రోఫీ అనేవారు. 2002-03 సీజన్‌లో ప్రారంభించిన ఈ టోర్నమెంటుకు ఆ తరువాత, ఇరవయ్యవ శతాబ్దపు దిగ్గజ భారత క్రికెటరు విజయ్ హజారే పేరు పెట్టారు. [1]
ఐదుసార్లు ఈ ట్రోఫీని గెలుచుకున్న అత్యంత విజయవంతమైన జట్టుగా తమిళనాడు నిలిచింది. సౌరాష్ట్ర క్రికెట్ జట్టు ప్రస్తుత (2022-23 విజయ్ హజారే ట్రోఫీ) ఛాంపియన్. మహారాష్ట్రను ఓడించి వారు తమ రెండవ టైటిల్‌ను గెలుచుకున్నారు. [2]
ఆకృతి
[మార్చు]2014-15 సీజన్ వరకు, 28 జట్లను క్రింది విధంగా 5 జోనల్ గ్రూపులుగా విభజించారు:
జోన్ | జట్లు | జట్ల సంఖ్య |
---|---|---|
సెంట్రల్ | మధ్యప్రదేశ్, రైల్వేలు, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, విదర్భ | 5 |
తూర్పు | అస్సాం, బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, త్రిపుర | 6 |
ఉత్తరం | ఢిల్లీ, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ & కాశ్మీర్, పంజాబ్, సర్వీసెస్ | 6 |
దక్షిణ | ఆంధ్రప్రదేశ్, గోవా, హైదరాబాద్, కర్ణాటక, కేరళ, తమిళనాడు | 6 |
వెస్ట్ | బరోడా, గుజరాత్, మహారాష్ట్ర, ముంబై, సౌరాష్ట్ర | 5 |
గ్రూప్‌లోని ప్రతి జట్టుతోనూ ఒకసారి ఆడిన తర్వాత, ఐదుగురు విజేతలు, ఉత్తమ ప్రదర్శన కనబరిచిన రన్నరప్ నేరుగా క్వార్టర్ ఫైనల్ దశకు అర్హత సాధిస్తారు. అయితే మిగిలిన నలుగురు రన్నరప్‌లు ప్రిలిమినరీ క్వార్టర్ ఫైనల్స్‌లో ఆడతారు. ప్రీ-క్వార్టర్ ఫైనల్స్‌లో గెలిచిన ఇద్దరు, క్వార్టర్ ఫైనల్ దశలోని మిగిలిన ఆరు జట్లతో చేరతారు. 2015–16 నుండి 2017–18 సీజన్ వరకు, జోనల్ గ్రూపులను 4 చేసి ఒక్కో గ్రూపులో 7 జట్లను పెట్టారు.
2018 నుండి 2019 సీజన్ వరకు, జట్లను 3 ఎలైట్ గ్రూపులు, 1 ప్లేట్ గ్రూపుగా విభజించారు. 2 టాప్ ఎలైట్ గ్రూప్‌లో 9 జట్లు ఉండగా, 3వ ఎలైట్ గ్రూప్‌లో 10 టీమ్‌లు ఉన్నాయి. ప్లేట్ గ్రూప్‌లో 9 కొత్త జట్లు ఉంటాయి. మునుపటి 3 సీజన్లలో సగటు పాయింట్ల ఆధారంగా జట్లను సమూహాలలో చేర్చారు.
టోర్నమెంటు చరిత్ర
[మార్చు]టోర్నమెంటు ప్రారంభ ఎడిషన్ 1993-94 సీజన్ నుండి 2001-02 సీజన్ వరకు, ఫైనల్స్ నిర్వహించలేదు. జట్లు తమతమ జోన్‌లలో మాత్రమే ఆడాయి. విజేత అంటూ ఎవరూ ఉండేవారు కాదు.
2002-03, 2003-04 సీజన్లలో, ప్రతి జోన్‌లోని అగ్రశ్రేణి జట్లకు చివరి రౌండ్-రాబిన్ దశ జరిగింది. 2004–05 టోర్నమెంటు నుండి, సెమీ-ఫైనల్, ఫైనల్‌తో సహా వివిధ ఫార్మాట్‌లతో నిర్వహించారు.
సంవత్సరం | ఫైనల్ ఆతిథేయి | విజేత | రన్నరప్ | అత్యధిక పరుగులు | Most wickets | Ref |
---|---|---|---|---|---|---|
2002–03 | ఫైనల్ లేదు | తమిళనాడు | పంజాబ్ | Niranjan Godbole (మహారాష్ట్ర) | Iqbal Siddiqui (మహారాష్ట్ర) | |
2003–04 | ఫైనల్ లేదు | ముంబై | బెంగాల్ | Devang Gandhi (బెంగాల్) | Sarandeep Singh (ఢిల్లీ) | |
2004–05 | వాంఖడే స్టేడియం, ముంబై | పంచుకున్నాయి: తమిళనాడు (2), ఉత్తర ప్రదేశ్ |
V. Sivaramakrishnan (తమిళనాడు) | Ranadeb Bose (బెంగాల్) Praveen Kumar (ఉత్తర ప్రదేశ్) |
||
2005–06 | వాంఖడే స్టేడియం, ముంబై | రైల్వేలు | ఉత్తర ప్రదేశ్ | Dinesh Mongia (పంజాబ్) | Sankalp Vohra (బరోడా) | |
2006–07 | సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం, జైపూర్ | ముంబై (2) | రాజస్థాన్ | Wasim Jaffer (ముంబై) | D. Tamil Kumaran (తమిళనాడు) | |
2007–08 | డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి ACA-VDCA క్రికెట్ స్టేడియం, విశాఖపట్నం | సౌరాష్ట్ర | బెంగాల్ (2) | Ajinkya Rahane (ముంబై) | Vishal Bhatia (హిమాచల్ ప్రదేశ్) | |
2008–09 | మహారాజా బీర్ బిక్రమ్ కాలేజ్ స్టేడియం, అగర్తల | తమిళనాడు (3) | బెంగాల్ (3) | Virat Kohli (ఢిల్లీ) | Shoaib Ahmed (హైదరాబాదు) | |
2009–10 | సర్దార్ పటేల్ స్టేడియం, అహ్మదాబాద్ | తమిళనాడు (4) | బెంగాల్ (4) | Shreevats Goswami (బెంగాల్) | Yo Mahesh (తమిళనాడు) | |
2010–11 | హోల్కర్ స్టేడియం, ఇండోర్ | జార్ఖండ్ | గుజరాత్ | Ishank Jaggi (Jharkhand) | Amit Mishra (హర్యానా) | |
2011–12 | ఫిరోజ్ షా కోట్లా గ్రౌండ్, ఢిల్లీ | బెంగాల్ | ముంబై | Wriddhiman Saha (బెంగాల్) | Parvinder Awana (ఢిల్లీ) | |
2012–13 | డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి ACA-VDCA క్రికెట్ స్టేడియం, విశాఖపట్నం | ఢిల్లీ | అస్సాం | Robin Uthappa (కర్ణాటక) | Pritam Das (అస్సాం ) | |
2013–14 | ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా | కర్ణాటక | రైల్వేలు | Robin Uthappa (కర్ణాటక) | Vinay Kumar (కర్ణాటక) | |
2014–15 | సర్దార్ పటేల్ స్టేడియం, అహ్మదాబాద్ | కర్ణాటక (2) | పంజాబ్ (2) | Manish Pandey (కర్ణాటక) | Abhimanyu Mithun (కర్ణాటక) | |
2015–16 | ఎం చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు | గుజరాత్ | ఢిల్లీ | Mandeep Singh (పంజాబ్) | Jasprit Bumrah (గుజరాత్) | |
2016–17 | ఫిరోజ్ షా కోట్లా గ్రౌండ్, ఢిల్లీ | తమిళనాడు (5) | బెంగాల్ (5) | Dinesh Karthik (తమిళనాడు) | Aswin Crist (తమిళనాడు) | |
2017–18 | ఫిరోజ్ షా కోట్లా గ్రౌండ్, ఢిల్లీ | కర్ణాటక (3) | సౌరాష్ట్ర | Mayank Agarwal (కర్ణాటక) | Mohammed Siraj (హైదరాబాదు) | |
2018–19 | M. చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు | ముంబై (3) | ఢిల్లీ (2) | Abhinav Mukund (తమిళనాడు) | Shahbaz Nadeem (Jharkhand) | |
2019–20 | M. చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు | కర్ణాటక (4) | తమిళనాడు | Devdutt Padikkal (కర్ణాటక) | Pritam Das (అస్సాం ) | |
2020–21 | అరుణ్ జైట్లీ స్టేడియం, ఢిల్లీ | ముంబై (4) | ఉత్తర ప్రదేశ్ | Prithvi Shaw (ముంబై) | Shivam Sharma (ఉత్తర ప్రదేశ్) | |
2021–22 | సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం, జైపూర్ | హిమాచల్ ప్రదేశ్ | తమిళనాడు (2) | Ruturaj Gaikwad (మహారాష్ట్ర) | Yash Thakur (Vidarbha) | |
2022–23 | నరేంద్ర మోదీ స్టేడియం, అహ్మదాబాద్ | సౌరాష్ట్ర (2) | మహారాష్ట్ర | Narayan Jagadeesan (తమిళనాడు) | Vasuki Koushik (కర్ణాటక) |
మూలాలు
[మార్చు]- ↑ "Sept 2022- MasterCard acquire title sponsorship: BCCI".
- ↑ "Vijay Hazare Trophy final: Aditya Tare century, Prithvi Shaw heroics help Mumbai win their 4th title". India Today. Retrieved 14 March 2021.
- ↑ Ranji Trophy One Day 1993/94 – CricketArchive. Retrieved 25 May 2015.
- ↑ Ranji Trophy One Day 1994/95 – CricketArchive. Retrieved 25 May 2015.
- ↑ "Ranji One-day Championships 1995-96 (1 day matches)".
- ↑ Ranji Trophy One Day 1995/96 – CricketArchive. Retrieved 25 May 2015.
- ↑ Ranji Trophy One Day 1996/97 – CricketArchive. Retrieved 25 May 2015.
- ↑ Ranji Trophy One Day 1997/98 – CricketArchive. Retrieved 25 May 2015.
- ↑ Ranji Trophy One Day 1998/99 – CricketArchive. Retrieved 25 May 2015.
- ↑ Ranji Trophy One Day 1999/00 – CricketArchive. Retrieved 25 May 2015.
- ↑ Ranji Trophy One Day 2000/01 – CricketArchive. Retrieved 25 May 2015.
- ↑ Ranji Trophy One Day 2001/02 – CricketArchive. Retrieved 25 May 2015.