మధ్య ప్రదేశ్ క్రికెట్ జట్టు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మధ్య ప్రదేశ్ క్రికెట్ జట్టు
MP cricket team
మారుపేరుMP
వ్యక్తిగత సమాచారం
కెప్టెన్ఆదిత్య శ్రీవాస్తవ (ఫ.క్లా& లిస్ట్ ఎ)
పార్థ్ సహానీ (టి20)
కోచ్చంద్రకాంత్ పండిట్
చైర్మన్జ్యోతిరాదిత్య సింధియా
యజమానిమధ్య ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్
జట్టు సమాచారం
స్థాపితం1950
స్వంత మైదానంహోల్కార్ స్టేడియం
సామర్థ్యం30,000
రెండవ స్వంత మైదానంకెప్టెన్ రూప్‌సింగ్ స్టేడియం
రెండవ మైదాన సామర్థ్యం18,000
చరిత్ర
రంజీ ట్రోఫీ విజయాలు5
విల్స్ ట్రోఫీ విజయాలు1
విజయ్ హజారే ట్రోఫీ విజయాలు0
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ విజయాలు0
అధికార వెబ్ సైట్MPCA Official

మధ్యప్రదేశ్ క్రికెట్ జట్టును గతంలో హోల్కర్ క్రికెట్ జట్టు అని పిలిచేవారు, ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న దేశీయ క్రికెట్ జట్టు. ఇది రంజీ ట్రోఫీలో పోటీపడుతుంది.

చరిత్ర[మార్చు]

హోల్కర్ క్రికెట్ జట్టు[మార్చు]

సెంట్రల్ ఇండియా జట్టు 1934–35, 1939–40 మధ్య రంజీ ట్రోఫీలో 12 మ్యాచ్‌లు ఆడింది. [1] 1941లో, హోల్కర్ జట్టు పోటీలో ప్రవేశించింది. మరాఠాల హోల్కర్ రాజవంశానికి చెందిన రాజు యశ్వంతరావు హోల్కర్ II ఈ జట్టును ఏర్పరచి, నిర్వహించాడు. సికె నాయుడు, ముస్తాక్ అలీ వంటి ఆటగాళ్ళు ఉన్న హోల్కర్, అది ఉనికిలో ఉన్న పద్నాలుగు సంవత్సరాలలో నాలుగు సార్లు టైటిల్‌ను గెలుచుకుంది. మరో ఆరు సందర్భాలలో రెండవ స్థానంలో నిలిచింది. మధ్యప్రదేశ్‌లో చేరిన మరో రంజీ ట్రోఫీ జట్టు గ్వాలియర్ (1943-44లో ఒక మ్యాచ్). [2]

మధ్యప్రదేశ్ జట్టు[మార్చు]

మధ్యప్రదేశ్ 1950-51 నుండి జట్టుగా పోటీ చేయడం ప్రారంభించింది. హోల్కర్ 1954-55 వరకు రంజీ ట్రోఫీలో ఆడింది. ఆ తర్వాత అది రద్దై, దాని స్థానంలో మధ్యభారత్ జట్టు వచ్చింది. రెండు సంవత్సరాల తర్వాత రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణతో అది మధ్యప్రదేశ్ జట్టులో భాగమైంది.

మధ్యప్రదేశ్ మొట్టమొదటి టైటిల్ 1998-99 విల్స్ ట్రోఫీ. ఫైనల్‌లో బెంగాల్‌ను ఓడించింది. [3] ఇదే సీజన్‌లో మధ్యప్రదేశ్ జట్టు తొలిసారిగా రంజీ ట్రోఫీలో ఫైనల్‌కు చేరుకుంది. కర్ణాటకతో జరిగిన మ్యాచ్‌లో మొదటి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం సాధించింది. టైటిల్ గెలవడానికి కేవలం డ్రా అయితే సరిపోయే స్థితిలో, చివరి రోజు చివరి సెషన్‌లో బ్యాటింగు కుప్పకూలడంతో ఐదు ఓవర్లు మిగిలి ఉండగానే ఓడిపోయింది. [4]


చివరగా 2021-22 సీజన్‌లో, బెంగళూరులో జరిగిన ఫైనల్‌లో మధ్యప్రదేశ్ 41 సార్లు ఛాంపియన్లైన ముంబైని ఓడించి ఐదవ సారి, మధ్యప్రదేశ్‌గా మొదటిసారి రంజీ ట్రోఫీని గెలుచుకుంది.[5]

విజయాలు[మార్చు]

హోల్కర్

  • రంజీ ట్రోఫీ
    • విజేతలు (4): 1945–46, 1947–48, 1950–51, 1952–53
    • రన్నర్స్-అప్ (6): 1944–45, 1946–47, 1949–50, 1951–52, 1953–54, 1954–55

మధ్యప్రదేశ్

  • విల్స్ ట్రోఫీ
    • విజేతలు: 1998–99
  • సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ
    • రన్నరప్: 2010-11

ప్రసిద్ధ క్రీడాకారులు[మార్చు]

భారతదేశం తరపున టెస్ట్ క్రికెట్ ఆడిన హోల్కర్, మధ్యప్రదేశ్ జట్ల ఆటగాళ్లు. బ్రాకెట్లలో తొలి మ్యాచ్ ఆడిన సంవత్సరం:

భారతదేశం తరపున ODI ఆడిన (కానీ టెస్ట్ క్రికెట్ ఆడని) మధ్యప్రదేశ్ ఆటగాళ్ళు. బ్రాకెట్లలో తొలి మ్యాచ్ ఆడిన సంవత్సరం:

మధ్యప్రదేశ్ తరపున, భారతదేశం తరపున టెస్ట్ క్రికెట్ ఆడిన ఇతర రాష్ట్ర జట్ల క్రికెటర్లు. బ్రాకెట్లలో తొలి మ్యాచ్ ఆడిన సంవత్సరం:

భారతదేశం తరపున, మధ్యప్రదేశ్ తరపున కూడా ODI ఆడిన (కానీ టెస్ట్ క్రికెట్ ఆడని) ఇతర రాష్ట్ర జట్ల క్రికెటర్లు. బ్రాకెట్లలో తొలి మ్యాచ్ ఆడిన సంవత్సరం:

దేశీయ స్థాయిలో ప్రముఖ ఆటగాళ్లు:

ప్రస్తుత స్క్వాడ్[మార్చు]

అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్ల పేర్లను బొద్దుగా చూపించాం.

పేరు పుట్టినరోజు బ్యాఅటింగు శైలి బౌలింగు శైలి గమనికలు
బ్యాటర్లు
శుభం శర్మ (1993-12-24) 1993 డిసెంబరు 24 (వయసు 30) కుడిచేతి వాటం కుడిచేతి ఆఫ్ బ్రేక్
రజత్ పాటిదార్ (1993-06-01) 1993 జూన్ 1 (వయసు 30) కుడిచేతి వాటం కుడిచేతి ఆఫ్ బ్రేక్ Plays for Royal Challengers Bangalore in IPL
ఆదిత్య శ్రీవాస్తవ (1993-09-18) 1993 సెప్టెంబరు 18 (వయసు 30) కుడిచేతి వాటం Right-arm leg break ఫస్ట్ క్లాస్, లిస్ట్ ఎ కెప్టెన్
యష్ దూబే (1998-12-23) 1998 డిసెంబరు 23 (వయసు 25) కుడిచేతి వాటం
అక్షత్ రఘువంశీ (2003-09-15) 2003 సెప్టెంబరు 15 (వయసు 20) కుడిచేతి వాటం కుడిచేతి ఆఫ్ బ్రేక్
హర్ష్ గావ్లీ (1998-11-09) 1998 నవంబరు 9 (వయసు 25) కుడిచేతి వాటం కుడిచేతి మీడియం
అమన్ సోలంకి (2003-12-27) 2003 డిసెంబరు 27 (వయసు 20) కుడిచేతి వాటం కుడిచేతి ఆఫ్ బ్రేక్
పార్థ్ సహాని (1993-03-09) 1993 మార్చి 9 (వయసు 31) ఎడమచేతి వాటం ఎడమచేతి స్లో ఆర్థడాక్స్ Twenty20 Captain
అర్హమ్ అక్విల్ (2002-07-20) 2002 జూలై 20 (వయసు 21) ఎడమచేతి వాటం ఎడమచేతి స్లో ఆర్థడాక్స్
ఆల్ రౌండర్లు
అశ్విన్ దాస్ (1995-12-16) 1995 డిసెంబరు 16 (వయసు 28) కుడిచేతి వాటం కుడిచేతి మీడియం ఫాస్ట్
వెంకటేష్ అయ్యర్ (1994-12-25) 1994 డిసెంబరు 25 (వయసు 29) ఎడమచేతి వాటం కుడిచేతి మీడియం ఐపిఎల్‌లో Kolkata Knight Riders తరఫున ఆడతాడు
వికెట్ కీపర్లు
హిమాన్షు మంత్రి (1994-02-09) 1994 ఫిబ్రవరి 9 (వయసు 30) ఎడమచేతి వాటం
అభిషేక్ భండారి (1994-11-01) 1994 నవంబరు 1 (వయసు 29) కుడిచేతి వాటం
చంచల్ రాథోడ్ (2002-11-29) 2002 నవంబరు 29 (వయసు 21) కుడిచేతి వాటం
సిద్ధార్థ్ పాటిదార్ (1997-11-07) 1997 నవంబరు 7 (వయసు 26) కుడిచేతి వాటం
స్పిన్ బౌలర్లు
కుమార్ కార్తికేయ (1997-12-26) 1997 డిసెంబరు 26 (వయసు 26) కుడిచేతి వాటం ఎడమచేతి స్లో ఆర్థడాక్స్ Plays For Mumbai Indians in IPL
శరన్ష్ జైన్ (1993-03-31) 1993 మార్చి 31 (వయసు 31) ఎడమచేతి వాటం కుడిచేతి ఆఫ్ బ్రేక్
కమల్ త్రిపాఠి (1998-08-15) 1998 ఆగస్టు 15 (వయసు 25) కుడిచేతి వాటం కుడిచేతి ఆఫ్ బ్రేక్
అమన్ భడోరియా (2001-10-15) 2001 అక్టోబరు 15 (వయసు 22) కుడిచేతి వాటం ఎడమచేతి స్లో ఆర్థడాక్స్
రితేష్ షాక్యా (1998-11-11) 1998 నవంబరు 11 (వయసు 25) ఎడమచేతి వాటం ఎడమచేతి స్లో ఆర్థడాక్స్
Fast-bowlers
అవేష్ ఖాన్ (1996-12-13) 1996 డిసెంబరు 13 (వయసు 27) కుడిచేతి వాటం కుడిచేతి ఫాస్ట్ మీడియం Plays For Lucknow Super Giants in IPL
గౌరవ్ యాదవ్ (1991-10-31) 1991 అక్టోబరు 31 (వయసు 32) కుడిచేతి వాటం కుడిచేతి మీడియం
కుల్దీప్ సేన్ (1996-10-22) 1996 అక్టోబరు 22 (వయసు 27) కుడిచేతి వాటం కుడిచేతి మీడియం ఫాస్ట్ ఐపిఎల్‌లో Rajasthan Royals తరఫున ఆడతాడు
అనుభవ్ అగర్వాల్ (1996-10-31) 1996 అక్టోబరు 31 (వయసు 27) కుడిచేతి వాటం కుడిచేతి ఫాస్ట్ మీడియం
పునీత్ డేట్ (1994-09-10) 1994 సెప్టెంబరు 10 (వయసు 29) కుడిచేతి వాటం కుడిచేతి మీడియం ఫాస్ట్
అంకిత్ కుష్వా (1992-04-20) 1992 ఏప్రిల్ 20 (వయసు 31) కుడిచేతి వాటం కుడిచేతి ఫాస్ట్ మీడియం

2023 మార్చి 1 నాటికి నవీకరించబడింది

కోచింగ్ సిబ్బంది[మార్చు]

కింది కోచింగ్ సిబ్బంది జట్టుకు సేవలందిస్తున్నారు.

మూలాలు[మార్చు]

  1. "First-class matches played by Central India". Cricket Archive. Archived from the original on 9 March 2016. Retrieved 1 September 2015.
  2. "First-class matches played by Gwalior". Cricket Archive. Archived from the original on 10 సెప్టెంబర్ 2022. Retrieved 1 September 2015. {{cite web}}: Check date values in: |archive-date= (help)
  3. "Final: Bengal v Madhya Pradesh at Calcutta, 17 Jan 1999".
  4. Scorecard of the 1998-99 final
  5. "Dubey, Shubham, Patidar, bowlers fashion Madhya Pradesh's maiden Ranji Trophy title".