నమన్ ఓజా
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | నమన్ వినయ్ కుమార్ ఓజా | |||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | ఉజ్జయిని, మధ్య ప్రదేశ్ | 1983 జూలై 20|||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||
పాత్ర | వికెట్ కీపరు batsman | |||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||
ఏకైక టెస్టు (క్యాప్ 285) | 2015 ఆగస్టు 28 - శ్రీలంక తో | |||||||||||||||||||||||||||||||||||
ఏకైక వన్‌డే (క్యాప్ 186) | 2010 జూన్ 5 - శ్రీలంక తో | |||||||||||||||||||||||||||||||||||
వన్‌డేల్లో చొక్కా సంఖ్య. | 30 | |||||||||||||||||||||||||||||||||||
తొలి T20I (క్యాప్ 32) | 2010 జూన్ 12 - జింబాబ్వే తో | |||||||||||||||||||||||||||||||||||
చివరి T20I | 2010 జూన్ 13 - జింబాబ్వే తో | |||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||
2001-2021 | మధ్య ప్రదేశ్ (స్క్వాడ్ నం. 30) | |||||||||||||||||||||||||||||||||||
2009–2010 | రాజస్థాన్ రాయల్స్ (స్క్వాడ్ నం. 30) | |||||||||||||||||||||||||||||||||||
2011–2013 | ఢిల్లీ డేర్ డెవిల్స్ (స్క్వాడ్ నం. 30) | |||||||||||||||||||||||||||||||||||
2014–2017 | సన్ రైజర్స్ హైదరాబాద్ (స్క్వాడ్ నం. 53) | |||||||||||||||||||||||||||||||||||
2018 | ఢిల్లీ డేర్ డెవిల్స్ (స్క్వాడ్ నం. 48) | |||||||||||||||||||||||||||||||||||
2021 | India Legends | |||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||
మూలం: ESPNcricinfo, 2021 ఫిబ్రవరి 15 |
నమన్ వినయ్‌కుమార్ ఓజా (జననం 1983 జూలై 20) మాజీ భారత క్రికెటరు. అతను అంతర్జాతీయ క్రికెట్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాడు. అతను 2015 ఆగస్టు 28 న శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో భారతదేశం తరపున తన తొలి మ్యాచ్ ఆడాడు.[1] అతను 2021 ఫిబ్రవరి 15 న క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుండి రిటైర్ అయ్యాడు [2]
2016లో ఆస్ట్రేలియాలో జరిగిన రెండు అనధికారిక 'టెస్టులు', నాలుగు దేశాల వన్డే టోర్నమెంట్‌లో పాల్గొన్న భారత్ A జట్టుకు నమన్ ఓజా కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. 2014లో ఓజా నాలుగు రోజుల మ్యాచ్‌లో డబుల్ సెంచరీ, సెంచరీ కొట్టి భారత్ A జట్టుతో తన ఆస్ట్రేలియా పర్యటనను చిరస్మరణీయంగా చేసుకున్నాడు.[3]
అతను సమర్ధుడైన టాప్-ఆర్డర్ బ్యాట్స్‌మన్, వికెట్ కీపరు. ఓజా 2000-01లో మధ్యప్రదేశ్ తరపున ఫస్ట్-క్లాస్ లో ప్రవేశించాడు.[4]
అతను దక్షిణాఫ్రికాలో జరిగిన 2009 ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో రాజస్థాన్ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు.[5] రాజస్థాన్ రాయల్స్ జట్టులో ఓపెనింగు బ్యాటరుగా, కొన్ని ముఖ్యమైన ఇన్నింగ్స్‌లు ఆడాడు. టోర్నీలో అతను రెండు అర్ధ సెంచరీలు, 11 సిక్సర్లు కొట్టాడు. అతను మధ్యప్రదేశ్ టీ20 లీగ్‌లో ఇండోర్ జట్టుకు ఆడతాడు.
2014 జూలైలో, అనధికారిక టెస్ట్‌లో ఇండియా A తరపున ఆడుతున్నప్పుడు, నమన్ బ్రిస్బేన్‌లో 29 బౌండరీలు, 8 సిక్సర్‌లతో అజేయంగా 219 పరుగులు చేశాడు. 2016 జూన్‌లో ఇండియా A తరపున తన తదుపరి ఆస్ట్రేలియా పర్యటనలో, నమన్‌కు కెప్టెన్‌గా బాధ్యతలు అప్పగించారు.[6]
దేశీయ కెరీర్
[మార్చు]ఓజా 2000/01లో మధ్యప్రదేశ్ తరఫున తొలి ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడాడు. అతను పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో 2008/09 ఛాలెంజర్ ట్రోఫీలో ఇండియా గ్రీన్ తరపున 96 పరుగులు చేశాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) రెండవ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతూ, అతని రెండవ గేమ్‌లో అర్ధ శతకం కొట్టాడు.
2013 నవంబరులో, బెంగాల్‌పై మధ్యప్రదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో ఓజా తన ఫస్ట్‌క్లాస్ కెరీర్‌లో పదవ సెంచరీని కొట్టాడు. 13 ఇన్నింగ్స్‌ల తరువాత ఓజాకు అది తొలి యాభై ప్లస్ స్కోరు.
2014 మార్చిలో, ఓజా 94 పరుగులు సాధించి మధ్యప్రదేశ్‌ను దాదాపు విజయానికి చేరవేసాడు. అయితే రైల్వేస్ గట్టి బౌలింగ్ చేయడంతో MP ఎనిమిది పరుగుల దూరంలో ఆగిపోయింది.
దేవధర్ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్స్‌లో ఈస్ట్ జోన్‌తో జరిగిన ఛేజింగ్‌లో ఓజా అజేయంగా 65 పరుగులతో సెంట్రల్ జోన్‌ను గెలిపించాడు.
2014 IPL వేలంలో, అతను 83 లక్షలకు సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో సంతకం చేశాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ పెద్ద పేరున్న టాప్ ఆర్డర్‌కు మద్దతు ఇవ్వడానికి భారత బ్యాట్స్‌మన్ కోసం వెతుకుతున్న సమయంలో అతను జట్టులో చేరి, 36 బంతుల్లో 79 పరుగులు చేశాడు.
2014 జూలైలో తన 100 వ ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లో ఓజా, బ్రిస్బేన్‌లోని అలన్ బోర్డర్ ఫీల్డ్‌లో ఆస్ట్రేలియా Aతో జరిగిన మ్యాచ్‌లో ఇండియా A తరపున ఆడుతూ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీ చేశాడు. అతను మొదటి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీని సాధించాడు. 10, 11 నంబరు బ్యాటర్లతో కలిసి 122 పరుగులు జోడించాడు. ఆ రెండు భాగస్వామ్యాల్లో ఆ ఇద్దరు బ్య్హాటర్లు చేసినది 11 పరుగులు. ముందు ఇండియా A, 9 వికెట్లకు 475 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. నమన్ 250 బంతుల్లో 29 ఫోర్లు, 8 సిక్సర్లతో అజేయంగా 219 పరుగులు చేశాడు. 100 పరుగులకు చేరిన తర్వాత, అతను 114 బంతుల్లో 119 పరుగులు చేశాడు.
2018 జనవరిలో, 2018 IPL వేలంలో అతన్ని ఢిల్లీ డేర్‌డెవిల్స్ కొనుగోలు చేసింది.[7]
అంతర్జాతీయ కెరీర్
[మార్చు]2010లో భారత జట్టు జింబాబ్వే పర్యటనకు T20I జట్టులో బ్యాకప్ వికెట్-కీపర్‌గా, అదే పర్యటనలో ODI ట్రై-సిరీస్‌లో బ్యాకప్ వికెట్-కీపర్‌గా ఓజాను తీసుకున్నపుడు అతని తొలి మ్యాచ్‌లు ఆడాడు. సెలెక్టర్లు వికెట్ కీపరు మహేంద్ర సింగ్ ధోనితో సహా పలువురు సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించారు.[8] అతని టెస్ట్ అరంగేట్రం 32 సంవత్సరాల వయస్సులో, 2015 ఆగస్టులో, శ్రీలంక పర్యటనలో మూడవ టెస్ట్‌లో జరిగింది. వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా స్నాయువు గాయం కారణంగా ఆడనపుడు ఓజా జట్టిఉలో చేరాడూ. ఆ టెస్టులో ఓజా, 56 పరుగులు, నాలుగు క్యాచ్‌లు, ఒక స్టంపింగ్‌తో చేసాడు.[9][10]
మూలాలు
[మార్చు]- ↑ "India tour of Sri Lanka, 3rd Test: Sri Lanka v India at Colombo (SSC), Aug 28-Sep 1, 2015". ESPNCricinfo. 28 August 2015. Retrieved 28 August 2015.
- ↑ "Naman Ojha retires from all formats of the game". ESPN Cricinfo. Retrieved 15 February 2021.
- ↑ "Naman Ojha to lead India A team in Australia". 25 June 2016. Retrieved 31 October 2018.
- ↑ "I am amongst the Top Wicketkeepers of India, Says Naman Ojha". Archived from the original on 13 May 2009. Retrieved 4 January 2010.
- ↑ "Naman Ojha to join Rajasthan Royals". rediff.com. Retrieved 31 October 2018.
- ↑ "Naman Ojha to lead India A in Australia". ESPNCricinfo. 25 June 2016. Retrieved 25 June 2016.
- ↑ "List of sold and unsold players". ESPN Cricinfo. Retrieved 27 January 2018.
- ↑ "Raina to lead India in Zimbabwe". ESPNcricinfo. 9 May 2015. Retrieved 4 September 2015.
- ↑ Ugra, Sharda (26 August 2015). "Ojha's time to 'relax' before Test debut". ESPNcricinfo. Retrieved 4 September 2015.
- ↑ Ugra, Sharda (2 September 2015). "The Ashwin show, and Ishant's second wind". ESPNcricinfo. Retrieved 4 September 2015.