ఎం. చిన్నస్వామి స్టేడియం
కెఎస్‌సిఏ స్టేడియం | |
మైదాన సమాచారం | |
---|---|
ప్రదేశం | బెంగళూరు |
స్థాపితం | మే 1969 |
సామర్థ్యం (కెపాసిటీ) | 40,000 |
యజమాని | కర్ణాటక ప్రభుత్వం |
ఆపరేటర్ | కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (కెఎస్‌సిఎ) |
వాడుతున్నవారు | |
ఎండ్‌ల పేర్లు | |
పెవిలియన్ ఎండ్ బిఇఎమ్‌ఎల్ ఎండ్ | |
అంతర్జాతీయ సమాచారం | |
మొదటి టెస్టు | 1974 నవంబరు 22–27: India v వెస్ట్ ఇండీస్ |
చివరి టెస్టు | 2022 మార్చి 12–16: India v శ్రీలంక |
మొదటి ODI | 1982 26 సెప్టెంబరు: India v శ్రీలంక |
చివరి ODI | 202019 జనవరి: India v ఆస్ట్రేలియా |
మొదటి T20I | 2012 25 డిసెంబరు: India v పాకిస్తాన్ |
చివరి T20I | 2022 19 జూన్: India v దక్షిణాఫ్రికా |
ఏకైక మహిళా టెస్టు | 1976 31 అక్టోబరు – 2 నవంబరు: India v వెస్ట్ ఇండీస్ |
మొదటి WODI | 1997 12 డిసెంబరు: ఆస్ట్రేలియా v దక్షిణాఫ్రికా |
చివరి WODI | 2015 8 జూలై: India v న్యూజీలాండ్ |
మొదటి WT20I | 2014 30 నవంబరు: India v దక్షిణాఫ్రికా |
చివరి WT20I | 2016 28 మార్చి: శ్రీలంక v దక్షిణాఫ్రికా |
2022 19 జూన్ నాటికి Source: Cricinfo |
మంగళం చిన్నస్వామి స్టేడియం బెంగళూరులోని క్రికెట్ స్టేడియం. దీనిని కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం అని కూడా పిలుస్తారు.
బెంగుళూరు నగరం నడిబొడ్డున, చుట్టూ సుందరమైన కబ్బన్ పార్క్, క్వీన్స్ రోడ్, MG రోడ్‌లతో ఉన్న ఈ స్టేడియం ఐదు దశాబ్దాల నాటిది. దీనికి 40,000 మంది కూర్చునే సామర్థ్యం ఉంది.[1] టెస్టు క్రికెట్, వన్ డే ఇంటర్నేషనల్స్ (ODI), ట్వంటీ 20 ఇంటర్నేషనల్స్ (T20i) ఇతర ఫస్ట్-క్లాస్ క్రికెట్ మ్యాచ్‌లతో పాటు సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఇక్కడ జరుగుతాయి. ఈ స్టేడియం కర్ణాటక రాష్ట్ర క్రికెట్ జట్టు, ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంచైజీ రాయల్ ఛాలెంజర్స్ లకు ఇది హోమ్ గ్రౌండ్. ఇది కర్నాటక ప్రభుత్వ యాజమాన్యంలో ఉన్న ఈ స్టేడియాన్ని 100 సంవత్సరాల కాలానికి కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (KSCA)కి లీజుకు ఇచ్చారు.
గతంలో దీన్ని కర్నాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంగా పిలిచేవారు. ఆ తరువాత మాండ్యాకు చెందిన న్యాయవాది, మైసూర్ స్టేట్ క్రికెట్ అసోసియేషన్ వ్యవస్థాపక సభ్యుడు అయిన మంగళం చిన్నస్వామి ముదలియార్‌కు నివాళిగా పేరు మార్చారు.[2] అతను నాలుగు దశాబ్దాల పాటు KSCAకి సేవలందించాడు. 1977 నుండి 1980 వరకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (BCCI) అధ్యక్షుడిగా కూడా పనిచేసాడు.
స్టేడియం నడపడానికి అవసరమైన విద్యుత్‌లో ఎక్కువ భాగం ఉత్పత్తి చేయడానికి సౌర ఫలకాలను ఉపయోగించిన క్రికెట్ స్టేడియంలలో ప్రపంచంలోనే ఇది మొదటిది.[3] 2016లో నీటి శుద్ధి కర్మాగారాన్ని ఏర్పాటు చేసారు.[4] 2017 జనవరిలో తడిగా ఉన్న అవుట్‌ఫీల్డ్ కారణంగా మ్యాచ్‌లు కుదించబడకుండా ఉండటానికి గాలిని పంపుచేసే వ్యవస్థ, డ్రైనేజీ వ్యవస్థలను ఏర్పాటు చేశారు.[5]
చరిత్ర
[మార్చు]కర్నాటక ప్రభుత్వం నుండి ఉదారమైన ప్రోత్సాహంతో, ఈ స్టేడియానికి 1969లో పునాది వేసారు. 1970లో నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. 1972-73 సీజన్‌లో ఫస్ట్-క్లాస్ క్రికెట్ మ్యాచ్‌ల కోసం ఈ స్టేడియాన్ని మొదట ఉపయోగించారు. 1974-75 సీజన్‌లో వెస్టిండీస్ భారత్‌లో పర్యటించినప్పుడు ఇది టెస్టు హోదాను పొందింది.[6][7]
1977 నుండి 1980 వరకు BCCI ప్రెసిడెంట్‌గా ఉండి KSCAకి సేవలందించిన M. చిన్నస్వామి ముదలియార్‌కు నివాళిగా కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (KSCA) స్టేడియం పేరు మార్చారు.[6][7] 1900లో మాండ్యలో జన్మించిన అతను మైసూర్ స్టేట్ క్రికెట్ అసోసియేషన్ వ్యవస్థాపక సభ్యుడు, వృత్తిరీత్యా న్యాయవాది.[2] ఇతర ప్రముఖుల తోడ్పాటుతో అతను,1969లో ప్రైమ్ MG రోడ్ ప్రాంతంలో క్రికెట్ కోసం మైదానాన్ని కేటాయించడానికి కర్ణాటక ప్రభుత్వంపై వత్తిడి తెచ్చి విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు [8]
ఈ స్టేడియంలో మొదటి టెస్టు 1974 నవంబరు 22-29 లలో జరిగింది [7] యాదృచ్ఛికంగా, వెస్టిండీస్ బ్యాటింగ్ దిగ్గజాలు వివ్ రిచర్డ్స్, గార్డన్ గ్రీనిడ్జ్‌లకు అదే తొలి టెస్టు మ్యాచ్. క్లైవ్ లాయిడ్ నేతృత్వంలోని వెస్టిండీస్ 256 పరుగుల భారీ తేడాతో MAK పటౌడీ నేతృత్వం లోని భారత జట్టును చిత్తు చేసింది. 1976-77లో టోనీ గ్రెగ్ నేతృత్వంలోని టూరింగ్ ఇంగ్లిష్ జట్టుపై భారత్ ఈ మైదానంలో తొలి టెస్టు విజయాన్ని నమోదు చేసింది. ఈ వేదికపై మొదటి ODI మ్యాచ్ 1982 సెప్టెంబరు 6 న జరిగింది. ఆ మ్యాచ్‌లో భారత్ ఆరు వికెట్ల తేడాతో శ్రీలంకను ఓడించింది.
1996 విల్స్ ప్రపంచ కప్ కోసం ఈ స్టేడియంలో ఫ్లడ్‌లైట్‌లు మొదటగా ఏర్పాటు చేసారు. 1996 మార్చి 9న చిరకాల ప్రత్యర్థులు భారత పాకిస్థాన్‌ల మధ్య జరిగిన క్వార్టర్-ఫైనల్ పోరులో 39 పరుగుల తేడాతో భారతదేశం పాకిస్థాన్‌ను ఓడించింది. 2007లో, భారతదేశం, పాకిస్తాన్ ల మధ్య జరిగిన 3వ టెస్టు మ్యాచ్‌లో, సౌరవ్ గంగూలీ, యువరాజ్ సింగ్లు 61/4 నుండి 300 పరుగుల భాగస్వామ్యం సాధించి, అనేక రికార్డులను బద్దలు కొట్టారు. ఆట ముగిసే సమయానికి భారత్ సాధించిన 365/5 భారత్‌లో తొలి రోజున సాధించిన అత్యధిక స్కోరు. 300 పరుగుల భాగస్వామ్యం స్టేడియంలో అత్యధిక భాగస్వామ్యం. ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్లు సాధించిన అత్యధిక భాగస్వామ్యం. సౌరవ్ గంగూలీ 239 పరుగులే ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ సాధించిన అత్యధిక స్కోరు.
2000లో BCCI జాతీయ క్రికెట్ అకాడమీకి బెంగళూరును కేంద్రంగా ఎంచుకున్నప్పటి నుండి, ఈ మైదానంలో ఉన్న అకాడమీ నుండి చాలా మంది వర్ధమాన క్రికెటర్లు ఉత్తీర్ణులయ్యారు. చిన్నస్వామి స్టేడియం బెంగళూరు ఫ్రాంచైజీ జట్టు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యొక్క హోమ్ గ్రౌండ్ కూడా. ఈ స్టేడియం 1996 మిస్ వరల్డ్ పోటీకి వేదికగా కూడా పనిచేసింది.[9]
KSCA సీటింగ్ కెపాసిటీని 70,000కి పెంచాలని యోచిస్తోంది. 70,000–80,000 సీటింగ్ కెపాసిటీతో కొత్త క్రికెట్ స్టేడియాన్ని నిర్మించాలని కూడా ఆలోచించింది.[10] అయితే, ఆ ప్రణాళికలు ఇంకా కార్యరూపం దాల్చలేదు. ఐపీఎల్ మొదటి సీజన్ కోసం ఈ స్టేడియానికి కొత్త రూపాన్ని అందించారు.
క్రికెట్ ప్రపంచ కప్‌లు
[మార్చు]ఈ స్టేడియం భారతదేశంలో జరిగిన ప్రపంచ కప్ లన్నిటి లోనూ వన్డే ఇంటర్నేషనల్ (ODI) మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చింది.
క్వార్టర్ ఫైనల్ మ్యాచ్
ICC ప్రపంచ కప్ 2011, 15వ మ్యాచ్, గ్రూప్ B
ICC ప్రపంచ కప్ 2011, 22వ మ్యాచ్, గ్రూప్ B
ICC ప్రపంచ కప్ 2011, 31వ మ్యాచ్, గ్రూప్ A
ICC ప్రపంచ కప్ 2011, 35వ మ్యాచ్, గ్రూప్ A
ICC ప్రపంచ కప్ 2011, 11వ మ్యాచ్, గ్రూప్ B
ఈవెంట్లు
[మార్చు]మిస్ వరల్డ్ 1996 అందాల పోటీ ఈ స్టేడియంలో జరిగింది, భారతదేశంలో ఈ ఈవెంట్ నిర్వహించడం ఇదే తొలిసారి. గ్రీస్‌కు చెందిన ఐరీన్ స్క్లివా విజేతగా నిలిచింది.
రికార్డులు, గణాంకాలు
[మార్చు]2017లో ICC 'టెస్టు స్టేటస్' మంజూరు చేసిన తర్వాత, ఈ వేదికపై తమ మొట్టమొదటి టెస్టు మ్యాచ్ 2018 జూన్ 14 న, ఆఫ్ఘనిస్తాన్ భారత్‌తో ఆడింది.[11]
టెస్టు మ్యాచ్ రికార్డులు
[మార్చు]బ్యాటింగ్
[మార్చు]
|
|
|
|
|
|
|
జట్టు రికార్డులు
[మార్చు]
|
|
భాగస్వామ్య రికార్డులు
[మార్చు]పరుగులు | వికెట్ | ఆటగాళ్ళు | మ్యాచ్ | సంవత్సరం |
---|---|---|---|---|
324 | 3వ | యూనిస్ ఖాన్ (267) & ఇంజమామ్-ఉల్-హక్ (187) | పాకిస్తాన్</img> పాకిస్తాన్ vs భారత్ | 2005 |
308 | 3వ | సచిన్ టెండూల్కర్ (214) & మురళీ విజయ్ (139) | భారతదేశం</img> భారతదేశం vs ఆస్ట్రేలియా | 2010 |
300 | 5వ | సౌరవ్ గంగూలీ (239) & యువరాజ్ సింగ్ (169) | భారతదేశం</img> భారతదేశం vs పాకిస్థాన్ | 2007 |
207 | 4వ | గోర్డాన్ గ్రీనిడ్జ్ (107) & క్లైవ్ లాయిడ్ (163) | వెస్ట్ ఇండీస్</img> వెస్ట్ ఇండీస్ vs భారత్ | 1974 |
2015 నవంబరు 10 నాటికి ఉన్న రికార్డులు
వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్ రికార్డులు
[మార్చు]అత్యధిక మొత్తం: 383–6 – భారత్ v ఆస్ట్రేలియా 2013 నవంబరు 2. రెండవది 347–2 – ఆస్ట్రేలియా v ఇండియా, 2011 ప్రపంచ కప్ మ్యాచ్‌లో భారత్ - ఇంగ్లండ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో 338 వద్ద టై అయిన మూడవ, నాల్గవ అత్యధిక స్కోర్లు.
అత్యధిక పరుగుల వేట: 329–7 – ప్రపంచ కప్ మ్యాచ్ సందర్భంగా 2011 మార్చి 2న 50 ఓవర్లలో ఇంగ్లండ్ 327 పరుగులకు వ్యతిరేకంగా ఐర్లాండ్ 329 (49.1 ఓవర్లలో) పరుగులు చేసింది.
అత్యధిక వ్యక్తిగత స్కోరు: రోహిత్ శర్మ 209 పరుగులు చేశాడు
అత్యధిక పరుగులు సచిన్ టెండూల్కర్ (534 పరుగులు), రోహిత్ శర్మ (437 పరుగులు), వీరేంద్ర సెహ్వాగ్ (328 పరుగులు) చేశారు.
అత్యధిక వికెట్లు జహీర్ ఖాన్ (14 వికెట్లు), జవగల్ శ్రీనాథ్ (10 వికెట్లు), వెంకటేష్ ప్రసాద్ & కపిల్ దేవ్ (తలా 8 వికెట్లు)
అత్యధిక మొత్తం - 263 - RCB v పూణే వారియర్స్, 2013
అత్యధిక వ్యక్తిగత స్కోరు - CH గేల్, 175 (66 బంతుల్లో) RCB v పూణే వారియర్స్, 2013
ఉత్తమ బౌలింగ్ గణాంకాలు - S బద్రీ, RCB v MI 4/9, 2017
గ్యాలరీ
[మార్చు]ఇవి కూడా చూడండి
[మార్చు]- టెస్ట్ క్రికెట్ మైదానాల జాబితా
మూలాలు
[మార్చు]- ↑ "M. Chinnaswamy Stadium, Bengaluru". The Board of Control for Cricket in India. Archived from the original on 28 ఫిబ్రవరి 2021. Retrieved 21 January 2021.
- ↑ 2.0 2.1 S. S. Shreekumar (2021). Karnataka Cricket's Hall of Fame And It's Corridors. Chennai: Clever Fox Publishing. p. 103. ISBN 9789390850730.
- ↑ "A sunny pitch at Chinnaswamy stadium". The Hindu. 10 April 2015. ISSN 0971-751X. Retrieved 25 April 2018.
- ↑ Anirudh R Gangavaram (21 April 2016). "KSCA to modernize the Chinnaswamy stadium". CricTracker.
- ↑ "Historic: Bengaluru's M Chinnaswamy Stadium gets next-generation outfield to fight rain delays". OneIndia. 3 August 2017 – via MyKhel.
- ↑ 6.0 6.1 "M Chinnaswamy Stadium, Bangalore, India". Hindustan Times. 26 February 2005. Retrieved 21 February 2021.
- ↑ 7.0 7.1 7.2 "Bengaluru's M Chinnaswamy Stadium: Where iconic matches were fought". Bangalore Mirror. 15 October 2017. Retrieved 21 February 2021.
- ↑ "'The frank, honest MC I knew'". The New Indian Express. 5 November 2012. Retrieved 17 February 2022.
- ↑ "Miss World Crowned As Indians Protest". The New York Times. Reuters. 24 November 1996.
- ↑ Coovercolly Indresh (15 January 2023). "20.8 acres handed over to KSCA for new stadium: MUDA". Hindustan Times.
- ↑ "Only Test, Afghanistan tour of India at Bengaluru, Jun 14-15 2018: Match Summary". ESPNcricinfo. Retrieved 24 August 2018.
- ↑ "Statistics / Statsguru / Test matches / Batting records/ M. Chinnaswamy Stadium / Runs scored". ESPN Cricinfo. Retrieved 10 November 2015.
- ↑ "Statistics / Statsguru / Test matches / Batting records / M. Chinnaswamy Stadium / Runs scored (Non-India)". ESPN Cricinfo. Retrieved 10 November 2015.
- ↑ "Statistics / Statsguru / Test matches / Batting records / M. Chinnaswamy Stadium / Runs scored in an innings". ESPNcricinfo. Retrieved 10 November 2015.
- ↑ "Statistics / Statsguru / Test matches / Bowling records / M. Chinnaswamy Stadium / తీసుకున్న వికెట్లు". ESPNcricinfo. Retrieved 10 November 2015.
- ↑ "Statistics / Statsguru / Test matches / Bowling records / M. Chinnaswamy Stadium / తీసుకున్న వికెట్లు (భారతేతర)". ESPNcricinfo. Retrieved 10 November 2015.
- ↑ "Statistics / Statsguru / Test matches / Bowling records / M. Chinnaswamy Stadium / Wickets taken in an innings". ESPNcricinfo. Retrieved 10 November 2015.
- ↑ "Statistics / Statsguru / Test matches / Bowling records / M. Chinnaswamy Stadium / Wickets taken in a match". ESPNcricinfo. Retrieved 10 November 2015.
- ↑ "Statistics / Statsguru / Test matches / Team records / M. Chinnaswamy Stadium / Team score". ESPNcricinfo. Retrieved 10 November 2015.
- ↑ "Statistics / Statsguru / Test matches / Team records / M. Chinnaswamy Stadium / Team score (lowest)". ESPNcricinfo. Retrieved 10 November 2015.
- ↑ "Statistics / Statsguru / Test matches / Partnership records / M. Chinnaswamy Stadium / Partnership runs". ESPNcricinfo. Retrieved 10 November 2015.
- ↑ "IPL Records M. Chinnaswamy Stadium Karnataka Bangalore". T20 Head to Head. 1 March 2023. Retrieved 20 March 2023.