కబ్బన్ పార్కు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కబ్బన్ పార్కు
Cubbon Park W.jpg
Lua error in మాడ్యూల్:Location_map at line 488: Unable to find the specified location map definition: "Module:Location map/data/India Bengaluru" does not exist.
అక్షాంశ రేఖాంశాలు: 12°58′N 77°36′E / 12.97°N 77.6°E / 12.97; 77.6Coordinates: 12°58′N 77°36′E / 12.97°N 77.6°E / 12.97; 77.6
Country India
Stateకర్ణాటక
Districtబెంగళూరు నగరం
Metroబెంగళూరు
విస్తీర్ణం
 • Total1.2 కి.మీ2 (0.5 చ. మై)
భాషలు
 • Officialకన్నడ
ప్రామాణిక కాలమానముUTC+5:30 (IST)

కబ్బన్ పార్కు బెంగుళూరు నగరం మధ్యలో ఉన్న ఒక ఉద్యానవనం. దీన్ని 1870లో అప్పటి మైసూరు రాష్ట్రానికి ముఖ్య ఇంజనీరుగా పనిచేస్తున్న రిచర్డ్ సాంకే ప్రారంభించాడు. మొదట్లో వంద ఎకరాల్లో ప్రారంభమైన ఈ ఉద్యానవనం తరువాత విస్తరించి ప్రస్తుతం సుమారు 300 ఎకరాలకు వ్యాపించింది.[1] అనేక వైవిధ్యమైన వృక్ష, పుష్ప జాతులకు ఈ పార్కులో ఉన్నాయి. దీని చుట్టూ అందంగా నిర్మించిన భవనాలు, ఆవరణ లోపల ప్రముఖుల విగ్రహాలు ఉన్నాయి.[2]

మొదట్లో ఈ పార్కును 1870 లో మైసూరు నగర కమీషనరుగా పనిచేస్తున్న సర్ జాన్ మీడే పేరు మీదుగా మీడే పార్కు అని పిలిచేవారు. తరువాత అదే పదవిలోనే అత్యధిక కాలం కమీషనరు గా పనిచేసిన మార్క్ కబ్బన్ పేరు మీదుగా కబ్బన్ పార్కు అని పేరు పెట్టారు. 1927లో మైసూరు మహరాజా చామరాజేంద్ర ఒడయార్ పాలన రజతోత్సవాల సందర్భంగా ఈ పార్కుకు శ్రీ చామరాజేంద్ర పార్కు అని పేరు మార్చారు. ఈ పార్కు ఈయన హయాంలోనే నెలకొల్పబడింది.[3]

మూలాలు[మార్చు]

  1. "Bangalore Tourist Attractions".
  2. Cubbon Park
  3. http://www.horticulture.kar.nic.in/ Gardens Cubbon Park