బిషన్ సింగ్ బేడి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బిషన్ సింగ్ బేడి
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
బిషన్ సింగ్ బేడి
పుట్టిన తేదీ(1946-09-25)1946 సెప్టెంబరు 25
అమృత్‌సర్
మరణించిన తేదీ2023 అక్టోబరు 23(2023-10-23) (వయసు 77)
ఢిల్లీ
మారుపేరుబిషు
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుఎడమ చేతి స్లో స్పిన్
పాత్రబౌలరు
బంధువులుఅంగద్ బేడి (కుమారుడు)
నేహా ధూపియా (కోడలు)
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 113)1966 డిసెంబరు 31 - వెస్టిండీస్ తో
చివరి టెస్టు1979 ఆగస్టు 30 - ఇంగ్లాండు తో
తొలి వన్‌డే (క్యాప్ 2)1974 జూలై 13 - ఇంగ్లాండు తో
చివరి వన్‌డే1979 జూన్ 16 - శ్రీలంక తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1961–1967ఉత్తర పంజాబ్ క్రికెట్ జట్టు
1968–1981ఢిల్లీ క్రికెట్ జట్టు
1972–1977నార్తాంపటన్ షిరె కౌంటీ క్రికెట్ జట్టు
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు ODI ఫక్లా లి ఎ
మ్యాచ్‌లు 67 10 370 72
చేసిన పరుగులు 656 31 3,584 218
బ్యాటింగు సగటు 8.98 6.20 11.37 6.81
100లు/50లు 0/1 0/0 0/7 0/0
అత్యుత్తమ స్కోరు 50* 13 61 24*
వేసిన బంతులు 21,364 590 90,315 3,686
వికెట్లు 266 7 1,560 71
బౌలింగు సగటు 28.71 48.57 21.69 29.39
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 14 0 106 1
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 1 0 20 0
అత్యుత్తమ బౌలింగు 7/98 2/44 7/5 5/30
క్యాచ్‌లు/స్టంపింగులు 26/– 4/– 172/– 21/–
మూలం: ESPNCricinfo, 2014 నవంబరు 9

బిషన్ సింగ్ బేడి (1946 సెప్టెంబరు 25 - 2023 అక్టోబరు 23) మాజీ భారత క్రికెట్ క్రీడాకారుడు. ప్రధానంగా అతను ఎడమచేతి స్లో ఆర్థోడాక్స్ బౌలరు. 1966 నుండి 1979 వరకు భారతదేశం తరపున టెస్ట్ క్రికెట్ ఆడాడు. ప్రసిద్ధ భారతీయ స్పిన్ చతుష్టయంలో భాగం. మొత్తం 67 టెస్టులు ఆడి 266 వికెట్లు పడగొట్టాడు. 22 టెస్టు మ్యాచ్‌లలో జాతీయ జట్టుకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. బేడి రంగురంగుల తలగుడ్ద (పట్కా) ధరించేవాడు. క్రికెట్ విషయాలపై బాహాటంగా, ముక్కుసూటిగా అభిప్రాయాలు చెప్పేందుకు అతను పేరుగాంచాడు. అతనికి 1970లో పద్మశ్రీ పురస్కారం,[1] 2004 లో CK నాయుడు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు లభించాయి.

కెరీర్‌

[మార్చు]
మేజర్ అహ్లువాలియాతో బిషన్ సింగ్ బేడి(ఎడమవైపు).

భారత దేశవాళీ క్రికెట్‌లో, పదిహేనేళ్ల వయసులోనే బేడి ఉత్తర పంజాబ్ తరపున ఆడాడు. అంతకు రెండేళ్ల ముందే క్రికెట్‌ ఆడడం మొదలుపెట్టాడు. క్రికెట్లో ఇది ఆలస్యమనే చెప్పవచ్చు.[2] 1968-69 లో ఢిల్లీ వెళ్ళి, 1974-75 రంజీ ట్రోఫీ సీజన్‌లో రికార్డు స్థాయిలో 64 వికెట్లు పడగొట్టాడు. బేడి చాలా సంవత్సరాలు ఇంగ్లీష్ కౌంటీ క్రికెట్‌లో నార్తాంప్టన్‌షైర్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో 1560 వికెట్లతో కెరీర్‌ను ముగించాడు. ఏ ఇతర భారతీయ ఆటగాడి కంటే ఇది ఎక్కువ.

అతని బౌలింగ్ మనోహరంగా, చూడముచ్చటగా, మోసపూరితంగా, కళాత్మకంగా ఉండేది. [3] బంతిని ఫ్లైట్ చేయడంలో బేడి నిపుణుడు. దానిని కాస్త నిదానంగా వెళ్ళేలానూ, ముందుకు దూకేలాగానూ చెయ్యగలడు. స్పిన్‌లో సూక్ష్మ వైవిధ్యాలను జోడించేవాడు. అతని బౌలింగు యాక్షను చాలా రిలాక్స్‌డ్‌గా, సమన్వయంతో కూడుకుని ఉండేది. దాంతో రోజంతా కూడా అలసిపోకుండా చక్కటి లయతో, నియంత్రణతో బౌలింగ్ చేయగలిగేవాడు. అతను ఏ కెప్టెన్‌కైనా గొప్ప ఆస్తి. అతని కెరీర్‌లో చాలా విజయవంతమైన టెస్ట్ సిరీస్‌లున్నాయి. [4]

  • భారతదేశం vs ఆస్ట్రేలియా 1969–70: 20.57 సగటుతో 21 వికెట్లు [5]
  • భారతదేశం vs ఇంగ్లండ్ 1972–73: 25.28 సగటుతో 25 వికెట్లు [6]
  • నేను వెస్టిండీస్‌లో 1975–1976లో ఉన్నాను : 25.33 సగటుతో 18 వికెట్లు [7]
  • భారత్ vs న్యూజిలాండ్ 1976–77 : 13.18 సగటుతో 22 వికెట్లు [8]
  • భారతదేశం vs ఇంగ్లండ్ 1976–77 : 22.96 సగటుతో 25 వికెట్లు [9]
  • ఆస్ట్రేలియాలో భారతదేశం 1977–78 : 23.87 సగటుతో 31 వికెట్లు [10]

అతని అత్యుత్తమ టెస్ట్ బౌలింగ్ 1969-70లో కలకత్తాలో ఆస్ట్రేలియాపై 7/98. 1977-78లో పెర్త్‌లో ఆస్ట్రేలియాపై అత్యుత్తమ మ్యాచ్ గణాంకాలు 10/194 సాధించాడు. [4] 1974-75లో ఢిల్లీ వర్సెస్ జమ్మూ అండ్ కాశ్మీర్ మ్యాచ్‌లో సాధించిన 7/5 అతని అత్యుత్తమ ఫస్ట్ క్లాస్ బౌలింగు.[4] అతని బ్యాటింగు అంత చెప్పుకోదగ్గదేమీ కానప్పటికీ, నార్తాంప్టన్‌షైర్ vs హాంప్‌షైర్ కోసం జరిగిన జిల్లెట్ కప్ సెమీ ఫైనల్‌లో చివరి బంతికి ముందు బంతిని బౌండరీ కొట్టి, మ్యాచ్‌ను రెండు వికెట్ల తేడాతో గెలిపించాడు. [4] అతని అత్యధిక స్కోరు 50 నాటౌట్ 1976లో కాన్పూర్‌లో న్యూజిలాండ్‌పై చేసాడు. టెస్టుల్లో అది అతని ఏకైక హాఫ్ సెంచరీ.[11]

1976లో మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ తర్వాత బేడి భారత కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. 1976 సిరీస్‌లోని 3వ టెస్టులో పోర్ట్-ఆఫ్-స్పెయిన్‌లో వెస్టిండీస్‌పై టెస్టు విజయం, కెప్టెన్‌గా అతని మొదటిది. దీనిలో భారత్ నాల్గవ ఇన్నింగ్స్‌లో 406 పరుగులు చేసింది. అది అప్పటికి రికార్డు.[12] దీని తర్వాత స్వదేశంలో న్యూజిలాండ్‌పై 2-0తో సిరీస్ విజయం సాధించింది. అయితే, ఇంగ్లండ్ (3-1 స్వదేశంలో), ఆస్ట్రేలియా (3-2 దూరంలో), పాకిస్తాన్ (2-0 దూరంలో) లలో వరుసగ టెస్టు సిరీస్‌లను కోల్పోయిన తరువాత, అతని స్థానంలో సునీల్ గవాస్కర్ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు.

ఒక టెస్టుకు మెయిడెన్ ఓవర్ల పరంగా 16.62 తో బేడి లాన్స్ గిబ్స్ (16.35) తర్వాత రెండో స్థానంలో ఉన్నాడు. తీసుకున్న ఒక్కో వికెట్‌కు బేడి 4.2 మెయిడిన్ ఓవర్లు వేయగా గిబ్స్ కు ఇది 4.24.

2008లో, విస్డెన్ క్రికెటర్స్ అల్మానాక్ విస్డెన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపిక కాని ఐదుగురు అత్యుత్తమ క్రికెటర్లలో ఒకరిగా బేడిని పేర్కొంది. [13]

స్పిన్ బౌలింగ్‌కు అవయవాల్లో మృదుత్వం ఉండడం ముఖ్యంగదా అని అన్నపుడు, తన బట్టలు ఎప్పుడూ తానే ఉతుక్కుంటానని బేడి చెప్పాడు. "భుజాలు, వేళ్లకు అది ఉత్తమ వ్యాయామం" అన్నాడు.[14]

వివాదం

[మార్చు]

భారత కెప్టెన్‌గా బేడి కొన్ని వివాదాల్లో చిక్కుకున్నాడు.

వెస్టిండీస్‌తో జరిగిన 1976 సిరీస్‌లో 3వ టెస్ట్‌లో భారతదేశపు రికార్డ్-బ్రేకింగ్ రన్-ఛేజింగ్ తర్వాత, వెస్టిండీస్ 4వ టెస్ట్ కోసం దూకుడుగా నలుగురు వ్యక్తుల ఫాస్ట్ బౌలర్ దాడిని ఎంచుకుంది. భారత బ్యాట్స్‌మెన్‌లను ఔట్ చేయలేక, బీమర్‌లు వేస్తున్న బౌలర్ల వ్యూహాల పట్ల బేడి అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఇద్దరు ఆటగాళ్ళు గాయపడి పదవీ విరమణ చేయవలసి రావడంతో భారత తొలి ఇన్నింగ్స్‌ను ముందుగానే డిక్లేరు చేసాడు. ఆ తర్వాత, మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో గాయాల కారణాంగా ఐదుగురు ఆటగాళ్లు ఆడలేదు. [15]

1976-77లో ఇంగ్లండ్ భారత పర్యటనలో అతను మద్రాస్‌లో జరిగిన మూడో టెస్టులో జాన్ లీవర్, బంతిని అక్రమంగా పాలిష్ చేయడానికి వాసెలిన్‌ ఉపయోగించాడని బేడి ఆరోపించాడు. లీవర్, నుదుటి మీది చెమట కళ్లలోకి జారకుండా ఉండేందుకు నుదిటిపై వాసెలిన్ పూసిన గాజుగుడ్డను పెట్టుకున్నాడు. తదనంతరం అతను ఏ తప్పు చేయలేదని తేలింది.[4]

1978 నవంబరులో, అతను అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌ను అప్పగించేసిన మొదటి కెప్టెన్ అయ్యాడు. సాహివాల్(పాకిస్థాన్)లో పాకిస్థాన్‌తో జరిగిన వన్డే ఇంటర్నేషనల్‌లో భారత్ చేతిలో 8 వికెట్లు ఉండగా, 14 బంతుల్లో 23 పరుగులు చేయాల్సి ఉంది. అయితే బేడి, సర్ఫరాజ్ నవాజ్ బౌలింగులో వరుసగా 4 బౌన్సర్లు వేసినప్పటికీ అంపైర్లు ఒక్కటి కూడా వైడ్‌ ఇవ్వకపోవడంతో అందుకు నిరసనగా క్రీజులో ఉన్న బ్యాట్స్‌మెన్‌లను ఆట మానిపించి వెనక్కి పిలిచేసి, మ్యాచ్‌ను ఇచ్చేసాడు. [16]

మరణం

[మార్చు]

బిషన్ సింగ్ బేడి అనారోగ్య కారణాల రీత్యా 2023 అక్టోబరు 23 న ఢిల్లీలో మరణించాడు.[17] అతనికి భార్య అంజు, కుమారుడు అంగద్ బేడి ఉన్నారు. అంగద్ సినీనటుడు, మాజీ మోడల్ కాగా, కోడలు నేహా ధూపియా బాలీవుడ్ నటి.

కోచింగ్

[మార్చు]

1990 లో అతను, ఓ పర్యటనలో భారత్ పేలవంగా ఆడినపుడు, తిరుగు ప్రయాణంలో మొత్తం జట్టును సముద్రంలో పడవేస్తానని బెదిరించాడు. [18]

ఆధునిక క్రికెట్‌పై అభిప్రాయాలు

[మార్చు]

ఆధునిక క్రికెట్‌లోని అనేక అంశాలపై బేడి బలమైన అభిప్రాయాలను వ్యక్తం చేశాడు. అతను "ఆధునిక కాలంలోని గొప్ప స్పిన్నర్లను చూసి అసూయపడుతున్నాడ"ని అన్నారు. [19] ముఖ్యంగా, అతను ముత్తయ్య మురళీధరన్ బౌలింగ్ యాక్షన్‌ను తీవ్రంగా విమర్శించేవాడు ("మురళీ చకింగు చెయ్యడం లేదనేపనైతే, సరే బౌలింగు ఎలా చేయాలో నాకు చూపించు" [14] )' అతను దానిని మోసం అని సూటిగా అన్నాడు.[20] అతని బౌలింగును జావెలిన్ త్రో అనీ షాట్ పుటింగ్‌ అనీ పోల్చాడు. మురళీధరన్ "1000 వికెట్లు తీసుకోవచ్చు, కాని అవన్నీ నా దృష్టిలో 1000 రనౌట్ల కిందే లెక్క" [21] అతను చకింగ్ గురించి తీవ్రంగా విమర్శిస్తూ "అది లంచం కంటే, బెట్టింగ్ కంటే పెద్ద ముప్పు" అని అన్నాడు. [14] 2004 లో ఉపఖండంలోని చాలా మంది బౌలర్లు చకింగు చేస్తారని అంటూ, మురళీధరన్‌ను "షేన్ వార్న్ అనే కలల కళాకారుడిని చేరుకుంటున్న శ్రీలంక బందిపోటు" అని పేర్కొన్నాడు. [22] అయితే, మురళీధరన్‌పై తనకు వ్యక్తిగతంగా వ్యతిరేకత ఏమీ లేదని అన్నాడు. [23] అయినప్పటికీ మురళీధరన్ అతనిపై దావా వేస్తానని బెదిరించాడు. [24] హర్భజన్ సింగ్‌పై కూడా అదే విమర్శలు చేశాడు. [25] క్రికెట్‌లో అనుమానాస్పద చర్యలకు సంబంధించి, అతను ఇలా అన్నాడు, "ఒక బౌలర్ చకింగు చేస్తోంటే అతన్ని ప్యానెళ్ళకు, స్వంత క్రికెట్ బోర్డుకూ నివేదిస్తారు. మరి, వైడ్ బాలుకు, నో-బాలుకూ అలా ఎందుకు చేయరు?". [19] వన్డే క్రికెట్‌, ఆధునిక క్రికెట్ బ్యాట్లు, చిన్న మైదానాలూ భారతదేశంలో క్లాసికల్ స్పిన్ బౌలింగ్ క్షీణించడానికి కారణమయ్యాయని అతను ఆరోపించాడు. [14]

బేడి సునీల్ గవాస్కర్‌పై కూడా దాడి చేశాడు, అతన్ని "విధ్వంసక ప్రభావం" అని పేర్కొన్నాడు. [26] అతను ఆస్ట్రేలియన్ కోచ్ జాన్ బుకానన్‌తో "చెప్పు జాన్, నువ్వు ఈ ఆస్ట్రేలియన్ జట్టును గొప్పదాన్ని చేసావా, లేక వారు నిన్ను గొప్పవాణ్ణి చేశారా?" అని అన్నాడు. [27]

రికార్డులు

[మార్చు]
  • 60 ఓవర్ల ODI మ్యాచ్‌లో తమ కోటా ఓవర్లు (12 ఓవర్లు) పూర్తి చేసిన బౌలర్లలో బేడి అత్యంత పొదుపుగా బౌలింగ్ చేసిన ప్రపంచ రికార్డు బేడి పేరిట ఉంది. 1975 ప్రపంచ కప్‌లో, బౌలర్లు ఒక్కొక్కరు 12 ఓవర్లు వేసేవారు. తూర్పు ఆఫ్రికాపై హెడ్డింగ్లీలో జరిగిన మ్యాచ్‌లో బేడి, తన కోటాలో 12-8-6-1 (ఓవర్లు-మెయిడిన్లు-పరుగులు-వికెట్లు) సాధించాడు. [28]

మూలాలు

[మార్చు]
  1. "C.K. Nayudu award for Kapil Dev". The Hindu (in Indian English). 2013-12-18. ISSN 0971-751X. Retrieved 2023-04-25.
  2. Trevor Bailey, Richie Benaud, Colin Cowdrey and Jim Laker, The Lord's Taverners Fifty Greatest, Heinemann-Quixote, 1983
  3. D.J. Rutnagur, The Barclays World of Cricket, Willow Books 1986
  4. 4.0 4.1 4.2 4.3 4.4 Peter Arnold, The Illustrated Encyclopedia of World Cricket, WH Smith 1985
  5. "India v Australia 1969/70" (in బ్రిటిష్ ఇంగ్లీష్). BBC. 2001-02-20. Archived from the original on 9 November 2020. Retrieved 2020-11-09.
  6. "England tour of India 1972/73 – Cricket Scores, Match Schedules, Points, News, Results | ESPNcricinfo.com". ESPNcricinfo (in ఇంగ్లీష్). Archived from the original on 29 October 2020. Retrieved 2020-11-09.
  7. "India tour of West Indies 1975/76 – Cricket Scores, Match Schedules, Points, News, Results | ESPNcricinfo.com". ESPNcricinfo (in ఇంగ్లీష్). Archived from the original on 15 August 2020. Retrieved 2020-11-09.
  8. "New Zealand tour of India 1976/77 – Cricket Scores, Match Schedules, Points, News, Results | ESPNcricinfo.com". ESPNcricinfo (in ఇంగ్లీష్). Archived from the original on 11 April 2020. Retrieved 2020-11-09.
  9. "England tour of India 1976/77 – Cricket Scores, Match Schedules, Points, News, Results | ESPNcricinfo.com". ESPNcricinfo (in ఇంగ్లీష్). Archived from the original on 27 March 2020. Retrieved 2020-11-09.
  10. "India in Australia, 1977/78". ESPNcricinfo. Archived from the original on 28 December 2018. Retrieved 2020-11-09.
  11. "Full Scorecard of India vs New Zealand 2nd Test 1976 – Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo (in ఇంగ్లీష్). Archived from the original on 24 May 2020. Retrieved 2020-11-09.
  12. "Full Scorecard of West Indies vs India 3rd Test 1976 – Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo (in ఇంగ్లీష్). Archived from the original on 21 September 2020. Retrieved 2020-11-09.
  13. Scyld, Berry (2009-03-18). "Never a cricketer of the year". ESPNcricinfo. Archived from the original on 21 September 2020. Retrieved 2020-11-09.
  14. 14.0 14.1 14.2 14.3 "Chucking is a bigger threat than bribing or betting". ESPNcricinfo (in ఇంగ్లీష్). February 2002. Archived from the original on 5 March 2016. Retrieved 2020-11-09.
  15. "4th Test: West Indies v India at Kingston, 21–25 April 1976". ESPNcricinfo. Archived from the original on 7 November 2012. Retrieved 18 March 2007.
  16. "Full Scorecard of Pakistan vs India 3rd ODI 1978 – Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo (in ఇంగ్లీష్). Archived from the original on 20 April 2010. Retrieved 2020-11-09.
  17. "Bishan Singh Bedi: క్రికెట్‌ దిగ్గజం బిషన్‌ సింగ్‌ బేడీ ఇకలేరు". ఈనాడు. 2023-10-23. Archived from the original on 2023-10-23. Retrieved 2023-10-23.
  18. "Bishan Bedi". ESPNcricinfo. Archived from the original on 15 October 2020. Retrieved 2020-11-09.
  19. 19.0 19.1 Vasu, Anand (11 April 2002). "Bishan Bedi's deadly straight delivery". ESPNcricinfo (in ఇంగ్లీష్). Archived from the original on 5 March 2016. Retrieved 2020-11-09.
  20. "Chucking is a bigger threat than bribing or betting". ESPNcricinfo. Archived from the original on 8 March 2016. Retrieved 18 March 2007.
  21. "Murali considers legal action after Bedi jibe". ESPNcricinfo (in ఇంగ్లీష్). 14 August 2007. Archived from the original on 1 January 2016. Retrieved 2020-11-09.
  22. "Home boys, Sheikhs and chucking". ESPNcricinfo (in ఇంగ్లీష్). 20 March 2004. Archived from the original on 7 March 2016. Retrieved 2020-11-09.
  23. "'I have nothing personal against Murali' – Bedi". ESPNcricinfo (in ఇంగ్లీష్). 7 June 2004. Archived from the original on 8 November 2015. Retrieved 2020-11-09.
  24. "Murali threatens to sue Bedi". ESPNcricinfo (in ఇంగ్లీష్). 7 June 2004. Archived from the original on 18 November 2015. Retrieved 2020-11-09.
  25. Swanton, Will (2007-12-02). "Bedi points finger at Harbhajan". The Age (in ఇంగ్లీష్). Archived from the original on 1 February 2015. Retrieved 2020-11-09.
  26. "Gavaskar a 'destructive' influence – Bishan Bedi". ESPNcricinfo (in ఇంగ్లీష్). 17 June 2017. Archived from the original on 9 November 2020. Retrieved 9 November 2020.
  27. Bal, Sambit (4 November 2003). "The malaise of bitterness". ESPNcricinfo (in ఇంగ్లీష్). Archived from the original on 8 November 2015. Retrieved 2020-11-09.
  28. Lynch, Steven (5 March 2013). "Seven men bowled, and Yousuf's purple patch". ESPNcricinfo (in ఇంగ్లీష్). Archived from the original on 2 July 2019. Retrieved 2020-11-09.