సౌరాష్ట్ర క్రికెట్ జట్టు
వ్యక్తిగత సమాచారం | |
---|---|
కెప్టెన్ | జయదేవ్ ఉనద్కత్ |
కోచ్ | నీరజ్ ఒనేద్రా |
యజమాని | సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ |
జట్టు సమాచారం | |
స్థాపితం | 1950 |
స్వంత మైదానం | సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, రాజ్‌కోట్ |
చరిత్ర | |
రంజీ ట్రోఫీ విజయాలు | 2 |
ఇరానీ ట్రోఫీ విజయాలు | 0 |
విజయ్ హజారే ట్రోఫీ విజయాలు | 2 |
అధికార వెబ్ సైట్ | SCA |
గుజరాత్‌లో ఉన్న మూడు ఫస్ట్-క్లాస్ క్రికెట్ జట్లలో సౌరాష్ట్ర క్రికెట్ జట్టు ఒకటి. ఫస్ట్-క్లాస్ టోర్నమెంట్ రంజీ ట్రోఫీ, పరిమిత ఓవర్ల విజయ్ హజారే ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలలో పోటీపడుతుంది. మిగతా రెండు జట్లు బరోడా, గుజరాత్.
పోటీ చరిత్ర
[మార్చు]సౌరాష్ట్ర ప్రాంతం నుండి గతంలో పోటీ చేసిన జట్లు నవనగర్, వెస్టర్న్ ఇండియా. నవనగర్ 1936-37లో రంజీ ట్రోఫీని గెలుచుకుంది, 1937-38లో రన్నరప్‌గా నిలిచింది.[1] వెస్టర్న్ ఇండియా జట్టు 1943-44లో రంజీ ట్రోఫీని గెలుచుకుంది.
సౌరాష్ట్ర 1950-51 నుండి రంజీ ట్రోఫీలో పోటీ చేయడం ప్రారంభించింది. 2012–13, 2015–16 లలో ముంబై గెలిచినపుడు, 2018–19లో విదర్భ గలిచినపుడూ సౌరాష్ట్ర రన్నరప్‌గా నిలించింది. ఎట్టకేలకు 2019–20లో, రాజ్‌కోట్‌లో జరిగిన ఫైనల్‌లో బెంగాల్‌ను తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యంలో ఓడించి తొలిసారి రంజీ ట్రోఫీని గెలుచుకుంది. [2]
సన్మానాలు
[మార్చు]- రంజీ ట్రోఫీ
- విజేతలు (2): 2022-23, 2019–20
- రన్నర్స్-అప్ (3): 2012–13, 2015–16, 2018–19
- విజయ్ హజారే ట్రోఫీ
- విజేతలు (2): 2022-23, 2007–08
- రన్నరప్: 2017–18
హోమ్ గ్రౌండ్
[మార్చు]అంతర్జాతీయ క్రీడాకారులు
[మార్చు]సౌరాష్ట్ర క్రికెట్ జట్టులోని అంతర్జాతీయ ఆటగాళ్లు:
- కర్సన్ ఘావ్రీ
- రవీంద్ర జడేజా
- చెతేశ్వర్ పుజారా
- జయదేవ్ ఉనద్కత్
- చేతన్ సకారియా
రాబిన్ ఉతప్ప, సౌరాష్ట్ర తరపున రెండు సీజన్లు ఆడాడు.
ఆటగాళ్ళు
[మార్చు]- ↑ The Ranji Trophy espncricinfo.com.
- ↑ "Final, Rajkot, Mar 9 – Mar 13 2020, Ranji Trophy". Cricinfo. Retrieved 9 January 2021.
ప్రస్తుత స్క్వాడ్
[మార్చు]అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్ల పేర్లు బొద్దుగా చూపించాం
పేరు | పుట్టినరోజు | బ్యాటింగు శైలి | బౌలింగు శైలి | గమనికలు |
---|---|---|---|---|
బ్యాటర్లు | ||||
చెతేశ్వర్ పుజారా | 25 జనవరి 1988 | కుడిచేతి వాటం | కుడిచేతి లెగ్ బ్రేక్ | |
అర్పిత్ వాసవాడ | 28 అక్టోబరు 1988 | ఎడమచేతి వాటం | ఎడమచేతి స్లో ఆర్థడాక్స్ | |
సమర్థ్ వ్యాస్ | 28 నవంబరు 1995 | కుడిచేతి వాటం | కుడిచేతి లెగ్ బ్రేక్ | Plays for Sunrisers Hyderabad in IPL |
జై గోహిల్ | 13 డిసెంబరు 2000 | కుడిచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | |
విశ్వరాజ్ జడేజా | 19 జూలై 1998 | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం | |
తరంగ్ గోహెల్ | 17 ఆగస్టు 1999 | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం | |
ఆల్ రౌండర్లు | ||||
చిరాగ్ జానీ | 9 నవంబరు 1989 | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం | |
ప్రేరక్ మన్కడ్ | 23 మార్చి 1994 | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం | Plays for Lucknow Super Giants in IPL |
పార్థ్ చౌహాన్ | 4 జూలై 1995 | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం | |
రవీంద్ర జడేజా | 6 డిసెంబరు 1988 | ఎడమచేతి వాటం | ఎడమచేతి స్లో ఆర్థడాక్స్ | Vice-captain Plays for Chennai Super Kings in IPL |
వికెట్ కీపర్లు | ||||
షెల్డన్ జాక్సన్ | 27 సెప్టెంబరు 1986 | కుడిచేతి వాటం | ||
హార్విక్ దేశాయ్ | 4 అక్టోబరు 1999 | కుడిచేతి వాటం | ||
స్నెల్ పటేల్ | 15 అక్టోబరు 1993 | కుడిచేతి వాటం | ||
స్పిన్ బౌలర్లు | ||||
ధర్మేంద్రసింగ్ జడేజా | 4 ఆగస్టు 1990 | ఎడమచేతి వాటం | ఎడమచేతి స్లో ఆర్థడాక్స్ | |
పార్త్ భుట్ | 4 ఆగస్టు 1997 | కుడిచేతి వాటం | ఎడమచేతి స్లో ఆర్థడాక్స్ | Plays for Sunrisers Hyderabad in IPL |
యువరాజ్ చూడసమా | 23 నవంబరు 1995 | ఎడమచేతి వాటం | కుడిచేతి లెగ్ బ్రేక్ | |
యువరాజ్ దోడియా | 3 అక్టోబరు 2000 | కుడిచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | |
పేస్ బౌలర్లు | ||||
జయదేవ్ ఉనద్కత్ | 18 అక్టోబరు 1991 | కుడిచేతి వాటం | ఎడమచేతి మీడియం ఫాస్ట్ | Captain Plays for Lucknow Super Giants in IPL |
చేతన్ సకారియా | 28 ఫిబ్రవరి 1998 | ఎడమచేతి వాటం | ఎడమచేతి మీడియం ఫాస్ట్ | Plays for Delhi Capitals in IPL |
కుషాంగ్ పటేల్ | 13 సెప్టెంబరు 1991 | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం | |
దేవాంగ్ కరమ్త | 24 జనవరి 1998 | ఎడమచేతి వాటం | ఎడమచేతి మీడియం |
కోచింగ్ సిబ్బంది
[మార్చు]- క్రికెట్ డైరెక్టర్ : లేరు
- ప్రధాన కోచ్:
నీరజ్ ఒదేద్రా
- అసిస్టెంట్ కోచ్: లేరు
- బ్యాటింగ్ కోచ్: లేదు
- బౌలింగ్ కోచ్: లేరు
- స్పిన్ బౌలింగ్ కోచ్: లేరు
- ఫీల్డింగ్ కోచ్: లేరు
- మేనేజర్: అర్జున్‌సింగ్ రాణా
- మెంటల్ కండిషనింగ్ కోచ్: ఖాళీగా ఉంది
- ఫిట్‌నెస్ ట్రైనర్: లేరు
- హెడ్ ఫిజియోథెరపిస్ట్: అభిషేక్ థాకర్
- మసాజ్: లేరు
- పనితీరు విశ్లేషకుడు: లేరు