కర్సన్ ఘావ్రి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Karsan Ghavri
వ్యక్తిగత సమాచారం
బ్యాటింగ్ శైలి Left-hand bat
బౌలింగ్ శైలి Left-arm medium
కెరీర్ గణాంకాలు
పోటీ Tests ODIs
మ్యాచులు 39 19
చేసిన పరుగులు 913 114
బ్యాటింగ్ సరాసరి 21.23 11.40
100s/50s -/2 -/-
అత్యధిక స్కోరు 86 20
బౌలింగ్ చేసిన బంతులు 7036 1033
వికెట్లు 109 15
Bowling average 33.54 47.20
ఇన్నింగ్స్ లో 5 వికెట్లు 4 -
మ్యాచ్ లో 10 వికెట్లు - n/a
Best bowling 5/33 3/40
క్యాచులు/స్టంపులు 16/- 2/-
Source: [1], 4 February 2006

కర్సన్ ఘావ్రి (Karsan Devjibhai Ghavri ) భారత మాజీ క్రికెట్ ఆటగాడు. ఇతను 1951, ఫిబ్రవరి 28గుజరాత్ లోని రాజ్‌కోట్లో జన్మించాడు. భారత్ తరఫున 1974 నుంచి 1981 మధ్యకాలంలో 39 టెస్టులు, 19 వన్డే మ్యాచ్‌లు ఆడినాడు. 1975 మరియు 1979 ప్రపంచ కప్ క్రికెట్ లో కూడా ఇతడు భారత జట్టు సభ్యుడు. ఇతను ఎడమ చేతి మీడియం పేస్ బౌలర్. టెస్ట్ క్రికెట్ లో మొత్తం 109 వికెట్లను 33.54 సగటుతో సాధించాడు. ఒకే ఇన్నింగ్సులో 5 వికెట్లను 4 సార్లు చేజిక్కించుకున్నాడు. బ్యాటింగ్ లో చివర వసరలో వచ్చి 2 అర్థ సెంచరీలను కూడా సాధించాడు. అతని అత్యధిక స్కోరు 86 పరుగులు. దీనిని ముంబాయిలో ఆస్ట్రేలియా పై సాధించాడు. ఆ కాలంలో అతను 8 వ వికెట్టుకు సయ్యద్ కిర్మాణితో జతగా సాధించిన 127 పరుగులు ఆ వికెట్టుకు రికార్డుగా నిల్చింది.

వన్డే క్రికెట్ లో 19 మ్యాచ్‌లు ఆడి 119 పరుగులు చేశాడు. 15 వికెట్లను పడగొట్టాడు. అత్యుత్తమ బౌలింగ్ 40 పరుగులకు 3 వికెట్లు.

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

ఇతర లింకులు[మార్చు]