మదన్‌లాల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మదన్‌లాల్
Cricket no pic.png
వ్యక్తిగత సమాచారం
బ్యాటింగ్ శైలి కుడిచేతి బ్యాట్స్‌మన్
బౌలింగ్ శైలి రైట్-ఆర్మ్ మీడియం
కెరీర్ గణాంకాలు
TestsODIs
మ్యాచ్‌లు 39 67
పరుగులు 1042 401
బ్యాటింగ్ సగటు 22.65 19.09
100లు/50లు 0/5 0/1
అత్యుత్తమ స్కోరు 74 53*
ఓవర్లు 999.3 536
వికెట్లు 71 73
బౌలింగ్ సగటు 40.08 29.27
ఒకే ఇన్నింగ్స్ లో 5 వికెట్లు 4 0
ఒకే మ్యాచ్ లో 10 వికెట్లు 0 n/a
అత్యుత్తమ బౌలింగ్ 5/23 4/20
క్యాచ్ లు/స్టంపింగులు 15/- 18/-

As of ఫిబ్రవరి 4, 2006
Source: [1]

మార్చి 20, 1951లో పంజాబ్ లోని అమృత్‌సర్లో జన్మించిన మదన్‌లాల్ (Madan Lal Udhouram Sharma) [1] భారతదేశపు మాజీ క్రికెట్ క్రీడాకారుడు. ఇతడు 1974 నుంచి 1987 వరకు భారత క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. భారత్ తరఫున 31 టెస్టులు, 67 వన్డేలు ఆడినాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో చక్కగా రాణించి 10,000 పరుగులు, 600 వికెట్లు సాధించాడు.

టెస్ట్ క్రికెట్[మార్చు]

మదన్‌లాల్ భారత్ తరఫున 31 టెస్టులలో పాల్గొని 22.65 సగటుతో 1042 పరుగులు సాధించాడు. అందులో 5 అర్థ సెంచరీలు ఉన్నాయి. టెస్టులలో అతడి అత్యధిక స్కోరు 74 పరుగులు. బౌలింగ్‌లో 71 టెస్ట్ వికెట్లు సాధించాడు. ఇన్నింగ్సులో 5 వికెట్లను 4 పర్యాయాలు తీసుకున్నాడు. టెస్టులలో అతడి అత్యుత్తమ బౌలింగ్ విశ్లేషణ 23 పరుగులకు 5 వికెట్లు.

వన్డే క్రికెట్[మార్చు]

మదన్‌లాల్ 67 వన్డేలలో పాల్గొని 19.090 సగటుతో 401 పరుగులు చేశాడు. ఇందులో ఒక అర్థసెంచరీ ఉంది. వన్డేలలో ఇతడి అత్యధిక స్కోరు 53 పరుగులు నాటౌట్. బౌలింగ్‌లో 29.27 సగటుతో 73 వికెట్లు సాధించాడు. వన్డేలలో అత్యుత్తమ బౌలింగ్ విశ్లేషణ 20 పరుగులకు 4 వికెట్లు.

ప్రపంచ కప్ క్రికెట్[మార్చు]

1975 ప్రపంచ కప్ క్రికెట్‌లో మదన్‌లాల్ తొలి బంతిని ఇంగ్లాండుకు చెందిన డెన్నిస్ అమిస్కు బౌలింగ్ చేశాడు.[2]. రెండో సారి భారత్ ప్రపంచ కప్ సాధించిన 1983లో కూడా ప్రాతినిధ్యం వహించాడు.

రిటైర్‌మెంట్ తరువాత[మార్చు]

అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటర్‌మెంట్ పొందిన తరువాత మదన్‌లాల్ అనేక స్థానాలలో క్రికెట్ పదవులను నిర్వహించాడు.

మూలాలు[మార్చు]

  1. http://content.cricinfo.com/ci/content/player/30873.html | మదన్‌లాల్ ప్రొఫైల్
  2. "Who Shrunk Test Cricket?". Rediff. 2002-12-26. Retrieved 2007-04-02. {{cite web}}: Check date values in: |date= (help)