రవిశాస్త్రి
![]() | ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
1962 మే 27న ముంబాయిలో జన్మించిన రవిశంకర్ జయధ్రిత శాస్త్రి (Ravishankar Shastri) (మరాఠీ : रविशंकर जयद्रिथ शास्त्री) భారతదేశానికి చెందిన మాజీ క్రికెట్ ఆటగాడు. కుడిచేతితో బ్యాటింగ్, ఎడమచేతితో స్పిన్ బౌలింగ్ చేయగల ఈ ఆల్‌రౌండర్ ఆటగాడు 18 సంవత్సరాల వయస్సులోనే అంతర్జాతీయ క్రికెట్‌లో ప్రవేశించి 12 సంవత్సరాల పాటు దేశానికి ప్రాతినిధ్యం వహించాడు. ప్రారంభంలో బౌలర్‌గానే క్రీడా జీవితం ప్రారంభించిననూ తర్వాత బ్యాట్స్‌మెన్‌గా రాణించి బౌలింగ్ కూడా చేయగల ఆటగాడిగా మారినాడు. 1985లో ఆస్ట్రేలియాలో జరిగిన ప్రపంచ చాంపియన్ క్రికెట్లో తన క్రీడా జీవితంలోనే అత్యంత ప్రతిభను కనబర్చి చాంపియన్ ఆఫ్ చాంపియన్స్‌గా ఎన్నికైనాడు. అదే సీజన్‌లో ఒకే ఓవర్లో వరుసగా 6 సిక్సర్లు కొట్టి ఈ ఘనతను సాధించిన తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ప్రపంచంలోనే ఈ ఘనతను సాధించిన వారిలో వెస్ట్‌ఇండీస్కు చెందిన గారీ సోబర్స్ తర్వాత ఇతను రెండో వాడు మాత్రమే. టెస్ట్ క్రికెట్లో ఇతను 11 సెంచరీలు సాధించాడు, ఇందులో ఒక డబుల్ సెంచరీ (206 పరుగులు) కూడా ఉంది. టెస్ట్ మ్యాచ్‌లో ఒక్కసారి భారత జట్టుకు నేతృత్వం వహించి ఆ టెస్ట్‌ను గెలిపించాడు. దేశవాళీ క్రికెట్‌లో బొంబాయి (ఇప్పటి ముంబాయి) తరఫున ప్రాతినిధ్యం వహించాడు. గ్లామోర్గన్ తరఫున ఇంగ్లీష్ కౌంటీ క్రికెట్ కూడా ఆడినాడు. 31 ఏళ్ళ వయసులో మోకాలి నొప్పి వల్ల క్రికెట్ నుంచి నిష్క్రమించాడు. ఆ తర్వాత ప్రముఖ టెలివిజన్ వ్యాఖ్యాతగా రాణించాడు. 2007లో బంగ్లాదేశ్ పర్యటించిన భారత జట్టుకు తాత్కాలిక కోచ్‌గా వ్యవహరించాడు.
రవిశాస్త్రి మంగుళూరుకు చెందిన కన్నడ బ్రాహ్మణ కుటుంబంలో ముంబాయిలో జన్మించాడు[1] ఈయన తండ్రి ఎం. జయధ్రిత శాస్త్రి వృత్తిరీత్యా వైద్యుడు[2], కుటుంబంలో చాలామంది విద్యాధికులు.[1] యుక్తవయసు వచ్చేవరకు రవిశాస్త్రి క్రికెట్ ఆటను పెద్దగా పట్టించుకోలేదు. కేవలం సరదాగా ఆడేవాడు. 1974లో మాతుంగా డాన్ బాస్కో పాఠశాల తరఫున అంతర్ పాఠశాల గిల్లెస్ షీల్డ్ పోటీల్లో ఫైనల్ కు చేరుకున్నాడు. అయితే ఫైనల్లో సెయింట్ మేరీస్ పాఠశాల జట్టుతో ఓడిపోయాడు. సెయింట్ మేరీస్ జట్టులో ఆ తరువాత రంజీ క్రీడల్లో ఆడిన శిశిర్ హట్టాంగడి, జిగ్నేష్ సంఘానీ కూడా ఉన్నారు. ఆ మరుసటి సంవత్సరం రవిశాస్త్రి ఆధ్వర్యంలో డాన్ బాస్కో గిల్లెస్ షీల్డును గెలుచుకున్నది. ఫైనల్ ఆటలో రవిశాస్త్రి సాధించిన అత్యధిక స్కోరు రికార్డు ఆ తర్వాత 27 సంవత్సరాల వరకు అవిఛ్ఛిన్నంగా నిలచింది.[3]
ఇవి కూడా చూడండి[మార్చు]
మూలాలు[మార్చు]
- All articles with dead external links
- Articles with dead external links from ఫిబ్రవరి 2021
- Articles with permanently dead external links
- విస్తరించవలసిన వ్యాసాలు
- 1962 జననాలు
- భారతీయ క్రీడాకారులు
- భారతీయ క్రికెట్ క్రీడాకారులు
- భారతీయ టెస్ట్ క్రికెట్ క్రీడాకారులు
- భారతీయ వన్డే క్రికెట్ క్రీడాకారులు
- భారతీయ టెస్ట్ కెప్టెన్లు
- ముంబాయి క్రికెట్ క్రీడాకారులు
- మహారాష్ట్ర క్రీడాకారులు
- జీవిస్తున్న ప్రజలు