సునీల్ వాల్సన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సునీల్ వాల్సన్
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ (1958-10-02) 1958 అక్టోబరు 2 (వయసు 65)
సికింద్రాబాదు, తెలంగాణ
బ్యాటింగుకుడిచేతివాటం
బౌలింగులెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్

సునీల్ వాల్సన్ (జననం 1958 అక్టోబరు 2) తెలంగాణ రాష్ట్రానికి చెందిన మాజీ భారత క్రికెటర్. కపిల్ దేవ్ నేతృత్వంలోని భారత జట్టు గెలిచిన 1983 ప్రపంచకప్ జట్టులో సునీల్ సభ్యుడిగా ఉన్నాడు. 14 మంది సభ్యుల టీమ్‌లో 13 మంది కనీసం 2 మ్యాచ్‌లైనా ఆడగా, వాల్సన్‌కు మాత్రం ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడే అవకాశం రాలేదు. ఎడంచేతి వాటం మీడియం పేసర్‌ అయిన వాల్సన్‌ మైదానంలోకి దిగకపోయినా విన్నింగ్‌ టీమ్‌ సభ్యుడిగా చరిత్రలో నిలిచిపోయాడు. అంతేకాకుండా భారత్‌ తరఫున ఒక్క అంతర్జాతీయ మ్యాచ్‌ (టెస్టులు సహా) కూడా ఆడలేకపోయాడు. పదేళ్ల ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌ కెరీర్‌లో ఢిల్లీ, రైల్వేస్‌ జట్ల తరఫున ఆడి అతను 212 వికెట్లు పడగొట్టాడు. [1]

జననం

[మార్చు]

సునీల్ 1958, అక్టోబరు 2న తెలంగాణ రాష్ట్రంలోని సికింద్రాబాదులో జన్మించాడు.

క్రీడారంగం

[మార్చు]

1981-1987 మధ్యకాలంలో భారతదేశంలోని అత్యుత్తమ లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్ లలో సునీల్ ఒకడు. 1981-82లో తమిళనాడు రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించి, ఆ సీజన్‌లోని 5 మ్యాచ్‌ల్లో 26 వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్‌ల్లోని సునీల్ ప్రతిభను గుర్తించి దులీప్, దేవధర్ ట్రోఫీలలో సౌత్ జోన్‌కు ఎంపికచేశారు. ఆ టోర్నమెంట్‌లలో సునీల్ మంచి ప్రతిభను కనబరచాడు.

తర్వాత రైల్వేస్ కోసం ఆడాడు, 1987 రంజీ ట్రోఫీ ఫైనల్‌కు చేరిన జట్టులో సనీల్ ఒకడు.[2] 1977 - 1988 మధ్యకాలంలో 75 ఫస్ట్-క్లాస్ క్రికెట్ మ్యాచ్‌లు ఆడాడు. ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు మేనేజర్‌గా పనిచేస్తున్నాడు.[3][4]

1983 క్రికెట్ ప్రపంచ కప్

[మార్చు]

తదుపరి సీజన్‌లో ఢిల్లీ తరపున ప్రాతినిధ్యం వహించి మంచి ఆటతీరును ప్రదర్శించాడు. అది ప్రపంచ కప్‌కు ఎంపికవడంలో సహాయపడింది. 1983 ప్రపంచ కప్ ఫైనల్ లో కపిల్ దేవ్ చేసిన 175 పరుగుల నాక్ సమయంలో సునీల్ 12వ వ్యక్తిగా ఉన్నాడు. అయినాకానీ భారత్‌కు ప్రాతినిధ్యం వహించే అవకాశం రాలేదు.[5]

ఇతర వివరాలు

[మార్చు]

భారతదేశం ప్రపంచ కప్ విజయం ఆధారంగా 2021లో రూపొందించబడిన 83 అనే పినిమాలో వాల్సన్ పాత్రను ఆర్ బద్రీ పోషించాడు.[6][7]

మూలాలు

[మార్చు]
  1. సాక్షి, క్రీడలు (మే 18 2019). "విజయ విశ్వ సారథులు". Sakshi. Retrieved అక్టోబరు 28 2021. {{cite news}}: Check date values in: |accessdate= and |date= (help)
  2. "Strange appearances". ESPN Cricinfo. Retrieved అక్టోబరు 28 2021. {{cite web}}: Check date values in: |access-date= (help)
  3. "Sunil Valson". ESPN Cricinfo. Retrieved అక్టోబరు 28 2021. {{cite web}}: Check date values in: |access-date= (help)
  4. "Coaches and support staff of IPL Teams". Retrieved అక్టోబరు 28 2021. {{cite web}}: Check date values in: |access-date= (help)
  5. ఆంధ్రజ్యోతి, క్రీడాజ్యోతి (జూన్ 10 2019). "అదృష్టమంటే వీళ్లదే.. ఆడకుండానే విజేతలయ్యారు!". m.andhrajyothy.com. Archived from the original on అక్టోబరు 28 2021. Retrieved అక్టోబరు 28 2021. {{cite news}}: Check date values in: |accessdate=, |date=, and |archivedate= (help)
  6. "South star R Badree to play Sunil Valson in Ranveer Singh starrer '83". Deccan Chronicle (in ఇంగ్లీష్). 2019-03-27. Retrieved అక్టోబరు 28 2021. {{cite web}}: Check date values in: |access-date= (help)
  7. "'83 : South actor R Badree as Sunil Valson character poster unveiled". The Statesman (in అమెరికన్ ఇంగ్లీష్). 2020-01-23. Retrieved అక్టోబరు 28 2021. {{cite web}}: Check date values in: |access-date= (help)