చేతన్ శర్మ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చేతన్ శర్మ
Chetan Sharma Cricketer.jpg
వ్యక్తిగత సమాచారం
జననం (1966-01-03) 1966 జనవరి 3 (వయసు 57)
లుధియానా, పంజాబ్, భారతదేశం
బ్యాటింగ్ శైలి కుడిచేతి వాటం
బౌలింగ్ శైలి కుడిచేతి ఫాస్ట్ బౌలింగ్
పాత్ర ఆల్ రౌండర్
అంతర్జాతీయ సమాచారం
జాతీయ జట్టు India
టెస్టు అరంగ్రేటం(cap 167) 17 October 1984 v Pakistan
చివరి టెస్టు 3 May 1989 v West Indies
వన్డే లలో ప్రవేశం(cap 45) 7 December 1983 v West Indies
చివరి వన్డే 11 November 1994 v West Indies
దేశవాళీ జట్టు సమాచారం
సంవత్సరాలు జట్టు
1982/83–1992/93 Punjab (squad no. Sussex)
1993/94–1996/97 Mumbai
కెరీర్ గణాంకాలు
పోటీ Tests ODI FC LA
మ్యాచ్‌లు 23 65 121 107
సాధించిన పరుగులు 396 456 3,714 852
బ్యాటింగ్ సగటు 22.00 24.00 35.03 23.66
100s/50s 0/1 1/0 3/21 1/2
ఉత్తమ స్కోరు 54 101* 114* 101*
బాల్స్ వేసినవి 3470 2,835 19,934 4,504
వికెట్లు 61 67 433 115
బౌలింగ్ సగటు 35.45 34.86 26.05 31.42
ఇన్నింగ్స్ లో 5 వికెట్లు 4 0 24 1
మ్యాచ్ లో 10 వికెట్లు 1 n/a 1 0
ఉత్తమ బౌలింగ్ 6/58 3/22 7/72 5/16
క్యాచులు/స్టంపింగులు 7/– 7/– 71/– 20/–
Source: Cricinfo, 24 December 2020

చేతన్ శర్మ (జననం 1966 జనవరి 3) మాజీ భారతీయ క్రికెటర్, రాజకీయ నాయకుడు. భారత క్రికెట్ జట్టుకు ఫాస్ట్ బౌలర్‌గా టెస్టులు, ODIలు ఆడిన అతను 2020 డిసెంబరు 24న భారత క్రికెట్ జట్టు ఎంపిక కమిటీకి ఛైర్మన్‌గా ఎన్నికయ్యాడు. 2022 టీ20 ప్రపంచ కప్‌ సెమీస్‌లో టీమిండియా ఓటమి అనంతరం చేతన్ శర్మ సారథ్యంలోని సెలెక్షన్‌ కమిటీపై భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) వేటు వేసింది. ఆ తరువాత 2023 జనవరి 7న బీసీసీఐ ప్రకటించిన కొత్త సీనియర్ సెలక్షన్ కమిటీకి కూడా చేతన్ శర్మ ఛైర్మన్‌గా నియమితులవ్వడం విశేషం.[1]

దేశ్ ప్రేమ్ ఆజాద్ దగ్గర శిక్షణ పొందిన చేతన్ శర్మ ద్రోణాచార్య అవార్డు గ్రహీత. అతను భారత మాజీ క్రికెటర్ యశ్‌పాల్ శర్మ మేనల్లుడు.

డొమెస్టిక్ కెరీర్[మార్చు]

17 సంవత్సరాల వయస్సులో చేతన్ శర్మ పంజాబ్ తరపున ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేసాడు. ఒక సంవత్సరం తర్వాత వన్ డే ఇంటర్నేషనల్స్‌లో మెరిసాడు. వన్డే ప్రపంచకప్‌లో హ్యాట్రిక్‌ సాధించిన తొలి వ్యక్తిగా గుర్తింపు పొందాడు. అతను 1987 రిలయన్స్ ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌పై ఈ ఘనత సాధించాడు.

ఇంటర్నేషనల్ కెరీర్[మార్చు]

1984లో లాహోర్‌లో పాకిస్తాన్‌తో జరిగిన టెస్ట్‌లలో తన మొదటి ఆటలోనే ఐదవ బంతికి మొహ్సిన్ ఖాన్‌ను బౌల్డ్ చేసాడు. దీంతో టెస్ట్ క్రికెట్‌లో మొదటి ఓవర్‌లో వికెట్ తీసిన మూడవ భారతీయుడుగా నిలిచాడు. అతను 1985లో శ్రీలంకలో జరిగిన మూడు టెస్టుల్లో పద్నాలుగు వికెట్లు తీశాడు. ఆ లీగ్‌లోని చివరి మ్యాచ్‌లో భారత్‌ విజయం సాధించి ఆ తర్వాత ఆస్ట్రేలియాలో జరిగిన ప్రపంచ సిరీస్ కప్ ఫైనల్‌కు అర్హత సాధించింది.

1986లో ఇంగ్లండ్‌ను 2-0తో ఓడించిన భారత జట్టులో చేతన్ శర్మ ముఖ్యమైన సభ్యుడు. అతను ఆడిన రెండు టెస్టుల్లో పదహారు వికెట్లు తీసాడు. అతను బర్మింగ్‌హామ్‌లో 10 వికెట్లు పడగొట్టాడు, అంతేకాకుండా రెండో ఇన్నింగ్స్‌లో 58 పరుగులకు 6 వికెట్లు సాధించాడు. దీంతో ఇంగ్లండ్‌లో 10 వికెట్లు తీసిన భారత్‌కు చెందిన ఏకైక వీరుడుగా నిలిచాడు. అతని మెంటర్ కపిల్ దేవ్ వంటి కొద్దిమంది భారత పేసర్లలో అతను కూడా ఒకడు, అతని 32 ఓవర్ల స్పెల్‌లో 5-64తో ముగిసే వరకు 5 వికెట్లు తీసుకున్నాడు. లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లోని హాల్ ఆఫ్ ఫేమ్ బోర్డులో ఇరవై ఏళ్ల వయసులోనే అతని పేరు శాశ్వతంగా నిలిచిపోయింది.

తరచూ గాయాల కారణంగా అతని కెరీర్‌ కొంత పరిమితం అయినా అందుబాటులో ఉన్నప్పుడు, తరువాతి మూడు సంవత్సరాలు కపిల్ దేవ్‌తో ఓపెనింగ్ బౌలర్‌గా ఆడాడు. అంతేకాదు వేగంగా పరుగులను సాధించగల సామర్థ్యంతో చేతన్ శర్మ ఆల్ రౌండర్ విభాగంలో కపిల్ దేవ్‌కు వారసుడిగా కనిపించాడు.

1987 ప్రపంచ కప్[మార్చు]

1987లో రిలయన్స్ వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్‌కు చెందిన కెన్ రూథర్‌ఫోర్డ్, ఇయాన్ స్మిత్, ఇవెన్ చాట్‌ఫీల్డ్‌లను వరుస బంతుల్లో క్లీన్ బౌల్డ్ చేయడంతో చేతన్ శర్మ టోర్నమెంట్ చరిత్రలో మొదటి హ్యాట్రిక్ సాధించాడు.[2]

రిటైర్మెంట్ తర్వాత[మార్చు]

రిటైర్మెంట్ తర్వాత చేతన్ శర్మ క్రికెట్ వ్యాఖ్యాతగా మారాడు. అతను 2004లో హర్యానాలోని పంచకులలో ఫాస్ట్ బౌలింగ్ క్రికెట్ అకాడమీని ప్రారంభించాడు, అది 2009లో మూసివేయబడింది.

2009 లోక్‌సభ ఎన్నికల్లో ఫరీదాబాద్ నుంచి బహుజన్ సమాజ్ పార్టీ టిక్కెట్‌పై చేతన్ శర్మ పోటీ చేసి ఓటమిపాలయ్యాడు.

డిసెంబర్ 2020లో అతను భారత క్రికెట్ జట్టు ఎంపిక కమిటీ ఛైర్మన్‌గా ఎన్నికయ్యాడు. నవంబర్ 2022లో క్రికెట్ ప్రపంచ కప్ నుండి టీమ్ ఇండియా నిష్క్రమించిన తర్వాత అతను తొలగించబడ్డాడు. తిరిగి 2023 జనవరి 7న బీసీసీఐ కొత్త సీనియర్ సెలక్షన్ కమిటీకి చేతన్ శర్మను ఛైర్మన్‌గా నియమించింది.

మూలాలు[మార్చు]

  1. "BCCI: కొత్త సెలెక్షన్‌ కమిటీని ప్రకటించిన బీసీసీఐ.. మరోసారి ఛైర్మన్‌గా చేతన్‌కే అవకాశం". web.archive.org. 2023-01-08. Archived from the original on 2023-01-08. Retrieved 2023-01-08.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. క్రికెట్ ప్రపంచ కప్‌లో హ్యాట్రిక్ వీరుడు, చేతన్ శర్మ (23 జూన్ 2019). "క్రికెట్ ప్రపంచ కప్‌లో హ్యాట్రిక్ వీరులు... చేతన్ శర్మ నుంచి మహ్మద్ షమీ వరకు". Archived from the original on 2023-01-08. Retrieved 2023-01-08.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)