సందీప్ పాటిల్
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | సందీప్ మధుసూదన్ పాటిల్ | |||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | బొంబాయి | 1956 ఆగస్టు 18|||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడి చేతి బ్యాట్స్‌మన్ | |||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడి చేతి మీడియం పేస్ | |||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు | ||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 149) | 1980 జనవరి 15 - పాకిస్తాన్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 1984 డిసెంబరు 12 - ఇంగ్లాండు తో | |||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 32) | 1980 డిసెంబరు 6 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 1986 మే 26 - ఇంగ్లాండు తో | |||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: ESPNCricinfo, 2006 ఫిబ్రవరి 4 |
సందీప్ పాటిల్ (జననం 1956 ఆగష్టు 18) మాజీ భారతీయ క్రికెట్ ఆటగాడు. భారత జాతీయ ఏజ్ గ్రూప్ క్రికెట్ మేనేజరు. కెన్యా జాతీయ జట్టుకు కోచ్‌గా ఉంటూ, 2003 ప్రపంచ కప్‌లో సెమీ-ఫైనల్ వరకు నడిపించాడు. అతను హార్డ్ హిట్టింగ్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్. అప్పుడప్పుడు మీడియం పేస్ బౌలింగు వేసేవాడు . 1983 క్రికెట్ ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టులో పాటిల్ సభ్యుడు. అతను ఇండియన్ క్రికెట్ లీగ్‌లో ముంబై ఛాంప్స్‌కి కోచ్‌గా ఉన్నాడు. కానీ 2009లో ఆ అనధికారిక లీగ్‌తో సంబంధాలను తెంచుకోవడంతో తిరిగి ప్రధాన స్రవంతిలోకి వచ్చాడు. డేవ్ వాట్‌మోర్ స్థానంలో జాతీయ క్రికెట్ అకాడమీ (NCA) డైరెక్టరుగా BCCI అతన్ని నియమించింది. [1] పాటిల్ 2012 నుండి 2016 వరకు బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా సెలెక్టర్ల ఛైర్మన్‌గా పనిచేశాడు.[2]
జీవితం తొలి దశలో
[మార్చు]సందీప్ పాటిల్ 1956 ఆగస్టు 18న ముంబైలో జన్మించాడు. అతని తండ్రి, మధుసూదన్ పాటిల్, మాజీ ఫస్ట్ క్లాస్ క్రికెటర్, [3] జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ ఆటగాడు, టెన్నిస్, ఫుట్‌బాల్‌లో నైపుణ్యం కలిగిన ఆటగాడు. అతను బొంబాయిలోని శివాజీ పార్క్ ప్రాంతంలో పెరిగాడు. బాలమోహన్ విద్యామందిర్, రామ్‌నారాయణ్ రుయా కళాశాలలో చదువుకున్నాడు. అంకుష్ 'అన్నా' వైద్య దగ్గర క్రికెట్ శిక్షణ పొందాడు.
క్రికెట్ కెరీర్
[మార్చు]అతని కెరీర్ ప్రారంభంలో పాటిల్ బ్యాట్స్‌మన్‌గా ఎంత నైపుణ్యం ఉండేదో, మీడియం పేస్ బౌలింగులో కూడా అంతే నైపుణ్యం ఉండేది. రోహింటన్ బారియా ట్రోఫీలో బాంబే విశ్వవిద్యాలయం తరపున మూడు సంవత్సరాలు ఆడాక, 1975-76లో బాంబే రంజీ జట్టులో చేరాడు. మూడు సీజన్ల పాటు జట్టు లోపల వెలుపలా ఉన్న తర్వాత, అతను 1979 సెమీఫైనల్‌లో ఢిల్లీకి వ్యతిరేకంగా తన మొదటి ప్రధాన ఇన్నింగ్స్‌ను ఆడాడు. బాంబే మొదటి నాలుగు వికెట్లను 72 పరుగులకు కోల్పోయిన తర్వాత 6 వ స్థానంలో బ్యటింగుకు దిగిన పాటిల్ 276 నిమిషాల్లో 18 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 145 పరుగులు చేశాడు. అతని భాగస్వాములెవరూ 25 కంటే ఎక్కువ పరుగులు చేయలేదు.[4] పాటిల్ 1979, 1980లో మిడిల్‌సెక్స్ లీగ్‌లో ఎడ్మోంటన్ తరపున ఆడాడు. చివరి సంవత్సరంలో సోమర్‌సెట్ 'బి' తరపున ఆడాడు.
1979-80లో ఆస్ట్రేలియా, పాకిస్తాన్ లు భారతదేశాన్ని సందర్శించాయి. పాటిల్ వెస్ట్ జోన్ కోసం రెండు జట్లకు వ్యతిరేకంగా టూర్ మ్యాచ్‌లలో కనిపించాడు, ఆస్ట్రేలియాపై 44, 23, [5] పాకిస్తాన్‌పై 68, 71 పరుగులు చేశాడు. [5] దీంతో అతను పాకిస్థాన్‌తో జరిగిన చివరి రెండు టెస్టు మ్యాచ్‌లకు ఎంపికయ్యాడు. అరంగేట్రం చేయడానికి ఒక వారం ముందు, అతను వాంఖడే స్టేడియంలో సౌరాష్ట్రపై తన కెరీర్‌లో అత్యుత్తమ ఫస్ట్ క్లాస్ స్కోర్‌ను చేశాడు. రెండవ ఉదయం బ్యాటింగ్‌కి వచ్చిన అతను లంచ్ సమయానికి 45* పరుగులతో ఉన్నాడు, రెండవ సెషన్‌లో 139 బంతుల్లో 105 పరుగులు చేసి శతకం పూర్తిచేసాడు. 205 బంతుల్లో ఏడు సిక్సర్లు, పంతొమ్మిది ఫోర్లతో 210 పరుగులు చేశాడు. [6] సిక్సర్లలో చివరిది స్టేడియం బయటికి పోయి (వాంఖడేలో ఇది చాలా అరుదైన ఫీట్), బయట హాకీ గ్రౌండ్స్‌లో పడింది. కలకత్తాలో జరిగిన ఆఖరి టెస్ట్‌లో పాటిల్ 62 పరుగులు చేశాడు, [7] ఆ తర్వాత సీజన్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన గోల్డెన్ జూబ్లీ టెస్ట్‌లో కనిపించాడు [8] 1980-81లో ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికయ్యాడు.
ఆస్ట్రేలియన్ టూర్ ప్రారంభ మ్యాచ్‌లలో, అతను సౌత్ ఆస్ట్రేలియాపై 116 పరుగులు చేశాడు, [9] ఇందులో రాడ్నీ హాగ్ కూడా ఉన్నాడు. క్వీన్స్‌లాండ్‌పై జెఫ్ థామ్సన్, జియోఫ్ డైమాక్, కార్ల్ రాక్‌మాన్‌లతో కలిసి 60, 97 పరుగులు చేశాడు. [10] అతను తన తొలి ODI మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై 64 పరుగులు చేసి, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌ను గెలుచుకున్నాడు. [11]
సిడ్నీలో జరిగిన మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో పాటిల్ 65 పరుగులకు చేరుకున్నప్పుడు, మొదటి రోజు టీ విరామానికి ముందు, హాగ్ వేసిన బంతి అతని గొంతుకు తగిలింది. హెల్మెట్ లేకుండానే ఆడుతూండగా, టీ తర్వాత మొదటి ఓవర్‌లో లెన్ పాస్కో వేసిన బౌన్సర్ అతని కుడి చెవికి తగిలింది. క్రీజులో కుప్పకూలిన పాటిల్ గాయపడి రిటైర్ కావాల్సి వచ్చింది. అస్వస్థతకు గురైనప్పటికీ, ఇన్నింగ్స్ ఓటమిని తప్పించుకోవడానికి భారత్ కష్టపడుతుండగా, కెప్టెన్ సునీల్ గవాస్కర్ ఒత్తిడితో అతను రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగు చేశాడు. [12]
రెండు వారాల తర్వాత, హెల్మెట్ ధరించి, పాటిల్ అడిలైడ్ టెస్టులో అద్భుతమైన 174 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా చేసిన 528 కి బదులుగా భారత్ 130 పరుగులకే తొలి నాలుగు వికెట్లు కోల్పోయింది. ఆ సమయంలో పాటిల్ చేసినది ఆస్ట్రేలియాలో ఒక భారతీయుడి అత్యధిక పరుగులు. అందుకు అతనికి కేవలం ఐదు గంటల కంటే కొద్దిగా ఎక్కువ సమయం పట్టింది. అందులో ఇరవై రెండు ఫోర్లు, బ్రూస్ యార్డ్లీ వేసిన బంతిని మిడ్ వికెట్ మీదుగా కొట్టిన ఒక సిక్స్ ఉన్నాయి. [13] న్యూజిలాండ్‌తో జరిగిన తదుపరి సిరీస్‌లో, ఆక్లాండ్ టెస్టులో కపిల్ దేవ్‌తో కలిసి పాటిల్ భారత్ బౌలింగును ప్రారంభించాడు. [14]
1981–82లో ఇంగ్లండ్‌తో జరిగిన స్వదేశంలో జరిగిన సిరీస్‌లో నాలుగు టెస్టుల తర్వాత పాటిల్ జట్టుకు దూరమయ్యాడు, అయితే ఆ తర్వాత వెంటనే జరిగిన విదేశీ సిరీస్‌కు ఎంపికయ్యాడు. ఇక్కడ మాంచెస్టర్ టెస్టులో అతను తన రెండో సెంచరీ సాధించాడు. భారత్ ఫాలో ఆన్ లో పడే ప్రమాదంలో ఉన్నపుడు, అతను కపిల్ దేవ్‌తో కలిసి ఒక గంటలో 96 పరుగులు జోడించాడు. పాటిల్ ఇయాన్ బోథమ్ వేసిన ఓవర్లో చివరి రెండు బంతులను ఫోర్, మూడు బాదాడు. ఇంగ్లండ్ వాళ్ళు వెంటనే రెండో కొత్త బంతిని తీసుకున్నారు. తర్వాతి ఓవర్‌లో అతను బాబ్ విల్లీస్‌ను ఆరు ఫోర్లు (4440444, మూడవ బంతి నో బాల్) కొట్టాడు – "రెండు కవర్ డ్రైవ్‌లు, బౌలర్ తల మీదుగా ఒకటి, రెండు స్క్వేర్ కట్‌లు, ఒక శక్తివంతమైన హుక్" - లతో అతని స్కోరు తొమ్మిది బంతుల్లో 73 నుండి 104కి చేరుకుంది. వర్షం కారణంగా మ్యాచ్ ముగిసే సమయానికి అతను 129 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు.[15]
సెప్టెంబరులో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో మరో వంద పరుగులు చేశాడు, అయితే సీజన్ మధ్యలో అతను మళ్లీ జట్టుకు దూరమయ్యాడు. భారత జట్టు వెస్టిండీస్‌లో పర్యటించినప్పుడు, అతను కర్ణాటకతో జరిగిన రంజీ ఫైనల్ రెండో ఇన్నింగ్స్‌లో 84 బంతుల్లో 121* పరుగులు చేశాడు. చివరి రోజు బాంబే డిక్లేర్ చేసే ఉద్దేశంతో ఉండడంతో అతని పరుగులన్నీ ఒక్క సెషన్‌లోనే చేసాడు. [16] ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్‌లో 51*తో సహా ప్రుడెన్షియల్ ప్రపంచ కప్‌లో పాటిల్ ఎనిమిది మ్యాచ్‌లలో 216 పరుగులు చేశాడు. [17] అతను 1983-84 రంజీ సీజన్‌లో 609 పరుగులు చేశాడు. ఫైసలాబాద్‌లో పాకిస్తాన్‌పై తన నాల్గవ, చివరి టెస్ట్ సెంచరీ చేశాడు.
1984 డిసెంబరులో ఇంగ్లండ్‌తో జరిగిన ఢిల్లీ టెస్టులో చివరి రోజున, అతని స్కోరు 41 పరుగులతో, ఫిల్ ఎడ్మండ్స్ బౌలింగ్‌లో పెద్ద హిట్‌కి ప్రయత్నించిన పాటిల్ లాంగాన్‌లో క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.[18] ఇది అతని పతనానికి దారితీసింది. బాగా రక్షించుకోగలిగిన మ్యాచ్‌లో భారత్ ఓడిపోయింది. క్రమశిక్షణా చర్యగా పాటిల్‌ను కోల్‌కతాలో జరిగిన తదుపరి టెస్టు నుంచి తీసేసారు. కపిల్ దేవ్ కూడా పాట్ పోకాక్ బౌలింగ్‌లో ఇదే విధమైన షాట్‌కు ఔటవడంతో అతన్ని కూడా ఆ టెస్టులో తీసుకోలేదు. పాటిల్ స్థానంలో వచ్చిన మహమ్మద్ అజారుద్దీన్ తాను ఆడిన మొదటి మూడు టెస్ట్ మ్యాచ్‌లలో సెంచరీలు చేశాడు, ఆపై పాటిల్ ఇక టెస్ట్ క్రికెట్ ఆడలేదు. అయితే కపిల్ దేవ్ తిరిగి జట్టులోకి వచ్చాడు. 1986లో పాటిల్‌ను కొన్ని వన్డే మ్యాచ్‌లకు తీసుకున్నారు. టెస్టుల్లో ఆడలేదుగానీ, ఇంగ్లండు పర్యటనలో పాల్గొన్నాడు.
1986 సెప్టెంబరులో బాంబే, ఆస్ట్రేలియాల మధ్య జరిగిన మ్యాచ్‌లో పాటిల్ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. కానీ అతను మళ్ళీ మధ్యప్రదేశ్ క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా 1988 నుండి 1993 వరకు గణనీయమైన విజయాలు సాధించాడు. 1990లో బాంబేపై 185 పరుగులు చేయడం అతని చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్‌లలో ఒకటి.[19] అతను భారత జాతీయ జట్టుకు, భారత 'A' జట్టుకూ కోచ్‌గా కొనసాగాడు. కెన్యా కోచ్‌గా, 2003 ప్రపంచ కప్‌లో సెమీఫైనల్ స్థానానికి చేరుకునేలా ఆ జట్టును మలచాడు.
అతను 2012 సెప్టెంబరు 7 నుండి 2016 సెప్టెంబరు వరకు బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా సెలెక్టర్ల ఛైర్మన్‌గా పనిచేశాడు.[2]
బాలీవుడ్ అరంగేట్రం
[మార్చు]1983 క్రికెట్ ప్రపంచ కప్ విజయం తర్వాత, కభీ అజ్‌నభీ థే లో ఇద్దరు బాలీవుడ్ నటీమణులు పూనమ్ ధిల్లాన్, దేబశ్రీ రాయ్‌ల సరసన హీరోగా నటించమని విజయ్ సింగ్ పాటిల్‌కు ప్రతిపాదించాడు. సయ్యద్ కిర్మాణికి విలన్ పాత్రను ప్రతిపాదించారు. [20] పాటిల్ తన బాలీవుడ్ అరంగేట్రంతో చాలా నిమగ్నమై 1983లో వెస్టిండీస్ పర్యటనలో పాల్గొనడానికి నిరాకరించాడు.[21] ఆ సమయంలో తాను గాయంతో బాధపడుతున్నందున ఆ పర్యటన నుండి వైదొలిగినట్లు అతను ఆ తరువాత వాదించాడు.[22] చిత్రీకరణ 1983లో ప్రారంభమై, 1985లో విడుదలైంది. ఈ చిత్రంలో పాటిల్, కిర్మాణిల మధ్య ఉన్న ఫైటింగ్‌తో పాటు దేబశ్రీ రాయ్‌తో అతని కెమిస్ట్రీకి బాగా ప్రచారం వచ్చింది. ముఖ్యంగా గీత్ మేరే హోతోన్ కో దే గయా కోయి అనే పాటకు బాగా ప్రచారం వచ్చింది. [23] [24] విడుదలైనపుడు 80% సీటు ఆక్యుపెన్సీ వచ్చింది గానీ, చివరికి బాక్సాఫీస్ వద్ద పెద్ద పరాజయం పాలైంది. [23] [24]
ఎడిటింగ్ కెరీర్
[మార్చు]పాటిల్ మరాఠీ స్పోర్ట్స్ మ్యాగజైన్ ఎకాచ్ షట్కర్‌కు సంపాదకత్వం వహించాడు. ఇది ఒకప్పుడు మహారాష్ట్రలో అత్యధికంగా అమ్ముడైన క్రీడా పత్రిక. [25] ఇది స్పోర్ట్‌స్టార్‌ను మించిపోయింది. అది, స్పోర్ట్స్‌వీక్ శవపేటికలోని చివరి మేకు అనేవారు. అత్యధికంగా అమ్ముడవుతున్న మహానగర్ వార్తాపత్రిక కూడా అతని గ్యారేజీలోనే మొదలైంది. [26]
వ్యక్తిగత జీవితం
[మార్చు]1983లో, కభీ అజ్నాబి థీ (1985) సెట్‌లో దేబాశ్రీ రాయ్‌ని కలుసుకున్నప్పటికి పాటిల్‌కు పెళ్ళి అయింది. అతనికి ఆమెతో సంబంధం ఉన్నట్లు వార్తలొచ్చాయి.[27][28] అతని మొదటి పెళ్ళి చెడిపోవడానికి ఆ వ్యవహారమే ఏకైక కారణమని భారతీయ మీడియా వ్యాఖ్యానించింది.[29][30][31] ఆ చిత్రం విడుదలైన వెంటనే వారు తమ సంబంధాన్ని నిలిపివేశారు. వారి విడిపోవడంపై బహిరంగంగా ఎప్పుడూ చర్చించలేదు. [24] పాటిల్ ఆ తర్వాత దీపను పెళ్లి చేసుకున్నాడు. [32] అతనికి చిరాగ్ పాటిల్, ప్రతీక్ పాటిల్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు.[33] 1984లో పాటిల్ తన ఆత్మకథ శాండీ స్టార్మ్ రాశాడు.
జనాదరణ పొందిన సంస్కృతిలో
[మార్చు]కబీర్ ఖాన్ తీసిన 83 (2021)లో పాటిల్ పెద్ద కుమారుడు చిరాగ్ పాటిల్ అతని పాత్రను పోషించాడు. ఇందులో కపిల్ దేవ్ పాత్రలో రణవీర్ సింగ్ నటించాడు. [34]
మూలాలు
[మార్చు]- ↑ "Patil replaces Whatmore as NCA head". Retrieved 2011-08-25.
- ↑ 2.0 2.1 "Patil is Chief Selector, Amarnath exits". Wisden India. 27 September 2012.
- ↑ "SANDEEP PATIL : Career statistics". Cricketarchive.co.uk. Retrieved 2016-01-18.
- ↑ "Bombay v Delhi : Ranji Trophy 1978/79 (Semi-Final)". Cricketarchive.co.uk. Retrieved 2016-01-18.
- ↑ 5.0 5.1 "West Zone v Australians : Australia in India 1979/80". Cricketarchive.co.uk. Retrieved 2016-01-18.
- ↑ "Bombay v Saurashtra : Ranji Trophy 1979/80 (West Zone)". Cricketarchive.co.uk. Retrieved 2016-01-18.
- ↑ "India v Pakistan : Pakistan in India and Bangladesh 1979/80 (6th Test)". Cricketarchive.co.uk. Retrieved 2016-01-18.
- ↑ "India v England : England in Australia and India 1979/80 (Only Test)". Cricketarchive.co.uk. Retrieved 2016-01-18.
- ↑ "South Australia v Indians : India in Australia and New Zealand 1980/81". Cricketarchive.co.uk. Retrieved 2016-01-18.
- ↑ "Queensland v Indians : India in Australia and New Zealand 1980/81". Cricketarchive.co.uk. Retrieved 2016-01-18.
- ↑ "Australia v India : Benson and Hedges World Series Cup 1980/81". Cricketarchive.co.uk. Retrieved 2016-01-18.
- ↑ "Australia v India : India in Australia and New Zealand 1980/81 (1st Test)". Cricketarchive.co.uk. Retrieved 2016-01-18.
- ↑ "Australia v India : India in Australia and New Zealand 1980/81 (2nd Test)". Cricketarchive.co.uk. Retrieved 2016-01-18.
- ↑ "3rd Test: New Zealand v India at Auckland, Mar 13–18, 1981 | Cricket Scorecard". ESPN Cricinfo. Retrieved 2016-01-18.
- ↑ "England v India : India in British Isles 1982 (2nd Test)". Cricketarchive.co.uk. Retrieved 2016-01-18.
- ↑ "Bombay v Karnataka : Ranji Trophy 1982/83 (Final)". Cricketarchive.co.uk. Retrieved 2016-01-18.
- ↑ "England v India : Prudential World Cup 1983 (Semi-Final)". Cricketarchive.co.uk. Retrieved 2016-01-18.
- ↑ "India v England : England in India, Sri Lanka and Australia 1984/85 (2nd Test)". Cricketarchive.co.uk. Retrieved 2016-01-18.
- ↑ "Bombay v Madhya Pradesh : Ranji Trophy 1989/90 (Pre-Quarter-Final)". Cricketarchive.co.uk. Retrieved 2016-01-18.
- ↑ "Second innings in B-Town for Sandip Patil s son". mid-day. 2012-10-04. Retrieved 2018-04-08.
- ↑ "Cricketer Sandeep Patil set to make his debut in films opposite Poonam Dhillon". India Today (in అమెరికన్ ఇంగ్లీష్). 2013-08-23. Retrieved 2018-01-20.
- ↑ "Everybody played to their potential". Rediff. Retrieved 2018-01-21.
- ↑ 23.0 23.1 "They also played cricket". Cricinfo (in ఇంగ్లీష్). Retrieved 2017-11-25.
- ↑ 24.0 24.1 24.2 "Lesser Known Facts about Debasree Roy". filmsack (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 5 August 2017. Retrieved 2017-11-25.
- ↑ "20 Interesting Sandeep Patil facts - Charisma, Persona and Intelligence". CricTracker (in అమెరికన్ ఇంగ్లీష్). 2015-08-18. Retrieved 2017-12-25.
- ↑ Mustafi, Suvajit (2015-08-18). "Sandeep Patil: 18 facts about the crowd puller". Cricket Country (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2017-12-25.
- ↑ "Second innings: Cricketers who tried their luck in films". santabanta.com (in ఇంగ్లీష్). Retrieved 2017-11-25.
- ↑ "Cricketers And Their Affairs With Film Stars". outlookindia.com (in ఇంగ్లీష్). Retrieved 2017-12-29.
- ↑ "Unlike Anushka Virat, these actress-cricketers pairs failed to make it to the aisle". zoom.timesnownews.com (in ఇంగ్లీష్). Archived from the original on 2017-12-24. Retrieved 2017-12-24.
- ↑ "They also play cricket". The Times of India. Retrieved 2017-12-25.
- ↑ "R.K. Laxman awarded with 1984 Ramon Magsaysay Award for Journalism and Creative Arts". India Today (in అమెరికన్ ఇంగ్లీష్). 1984-08-31. Retrieved 2018-01-20.
- ↑ "Sandeep Patil, Sports Photo, The 1983 World Cup hero, Sande". Timescontent.com. Retrieved 2016-01-18.
- ↑ "Chirag Patil, Entertainment Photo, Former Indian cricketer Sandee". Timescontent.com. Retrieved 2016-01-18.
- ↑ "83". Reliance Entertainment Twitter. 4 February 2019. Retrieved 5 February 2020.