Jump to content

పూనమ్ ధిల్లాన్

వికీపీడియా నుండి
పూనమ్ ధిల్లాన్
2012లో పూనమ్ ధిల్లాన్
జననం
వృత్తినటి, రాజకీయ నాయకురాలు
క్రియాశీల సంవత్సరాలు1978– ప్రస్తుతం
జీవిత భాగస్వామి
అశోక్ ఠాకేరియా
(m. 1988; div. 1997)
పిల్లలు2
వెబ్‌సైటుఅధికారిక వెబ్‌సైటు

పూనమ్ ధిల్లాన్ భారతీయ నటి, రాజకీయవేత్త. ఆమె ఈవ్స్ వీక్లీ మిస్ యంగ్ ఇండియా 1978 విజేత.[1] ఆమె తన 1979 చిత్రం నూరీకి ప్రసిద్ధి చెందింది. రెడ్ రోజ్ (1980), దార్ద్ (1981), రొమాన్స్ (1983), సోహ్ని మహివాల్ (1984), తేరీ మెహెర్బనియన్ (1985) సముందర్ (1986), సవేరేవాలి గాడి (1986), కర్మ (1986), నామ్ (1986), మాలమాల్ (1988). వంటివి ఆమె నటించిన విజయవంతమైన చిత్రాలలో కొన్ని.

2001లో విడుదలైన ఇష్టం సినిమాతో ఆమె తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.

2009లో హిందీ బిగ్ బాస్‌లో ఆమె పాల్గొన్నది. ఆమె 2013లో సోనీ టీవీ సిరీస్ ఏక్ నయీ పెహచాన్‌(एक नई पहचान)లో శారదా మోదీగా ప్రధాన పాత్ర పోషించింది. అవార్డు దక్కించుకున్న "ది పర్ఫెక్ట్ హస్బెండ్" నాటకంతో ప్రారంభించి, ఆమె పలు నాటకాలలో నటించింది. కాగా యునైటెడ్ స్టేట్స్, దుబాయ్‌లలో ఆమె అనేక ప్రదర్శనలతో పాటు "ది పర్ఫెక్ట్ వైఫ్"లో కూడా నటించింది.

నటిగానే కాకుండా ఆమె సామాజిక కార్యకర్తగా, రాజకీయవేత్తగానూ ఎదిగింది. మాదకద్రవ్యాలు, ఎయిడ్స్, కుటుంబ నియంత్రణ, అవయవ దానం వంటి సామాజిక అంశాలపై ప్రజలలో అవగాహన కల్పించడంలో ఆమె చాలా చురుకుగా ఉంటుంది.[2]

ఆమె ఖాట్మండు, ఢిల్లీలలో జరిగిన సార్క్ శిఖరాగ్ర సమావేశాలలో ప్రముఖ వక్తగా వ్యవహరించింది. అంతేకాకుండా సాంస్కృతిక రాయబారిగా ఆమె విధులు నిర్వర్తించింది.[3] ఆమె మైండ్‌మైన్(MINDMINE) ఈవెంట్‌లో వక్త కూడా.[4] 2012లో, ఆమె లీలావతి హాస్పిటల్ సహకారంతో "సేవ్ అండ్ ఎంపవర్ ది గర్ల్ చైల్డ్" కార్యక్రమానికి మద్దతుగా ప్రదర్శన కూడా ఇచ్చింది.[5][6]

2017లో, భారతీయ చలనచిత్ర పరిశ్రమలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ నిర్ణయాలకు వ్యతిరేకంగా అప్పీళ్లకు సంబంధించిన అధికారిక సంస్థ అయిన ఫిల్మ్ సర్టిఫికేషన్ అప్పిలేట్ ట్రిబ్యునల్‌కు నలుగురు సభ్యులలో ఒకరిగా పూనమ్ ధిల్లాన్ నియమితులవడం విశేషం.[7]

2004లో, ఆమె భారతీయ జనతా పార్టీలో చేరి, 2019 నాటికి ఆ పార్టీ ముంబై యూనిట్ వైస్ ప్రెసిడెంట్‌గా ఎదిగింది.[8][9]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

ఆమె ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో జన్మించింది. ఆమె తండ్రి అమ్రీక్ సింగ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ఏరోనాటికల్ ఇంజనీర్ కాగా తల్లి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు. ఆమె తోబుట్టువులిద్దరూ వైద్యులు. ఆమె పాఠశాల విద్యను చండీగఢ్ లోని కార్మెల్ కాన్వెంట్‌లో పూర్తిచేసింది.[10][11][12] 16 సంవత్సరాల వయస్సులో సినిమాల్లో అరంగేట్రం చేసాక ఆమె గ్రాడ్యుయేషన్ చేసింది.[13] 2013లో, ఆమె ఇంటర్నేషనల్ బిజినెస్‌లో ఎంబీఏ చదువుతోంది.[14]

సినిమా నిర్మాత అశోక్ థాకేరియాను వివాహం చేసుకున్న ఆమెకు ఇద్దరు పిల్లలు, కుమార్తె పలోమా, కుమారుడు అన్మోల్ ఉన్నారు.[15][16]

మూలాలు

[మార్చు]
  1. "Poonam Dhillon: Act II". Khabar.com. Retrieved 1 February 2014.
  2. "Actors need good PR skills: Poonam Dhillon - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 19 August 2019.
  3. "Promote tourism through cinema in SAARC countries: actors". MSN. 23 September 2011. Retrieved 1 February 2014.
  4. "MindMine Summit". MindMine Summit. Archived from the original on 24 October 2013. Retrieved 1 February 2014.
  5. "Poonam's show". The Telegraph (India) (in ఇంగ్లీష్). Retrieved 19 August 2019.
  6. "Images: Kajol and Sushmita Sen lend their celeb power to the girl child". Firstpost. 12 April 2012. Retrieved 19 August 2019.
  7. "Dhillon among three women on Film Tribunal". Indian Television Dot Com (in ఇంగ్లీష్). 10 January 2017. Retrieved 19 August 2019.
  8. "Mumbai BJP's new vice-president Poonam Dhillon says she wants to be a hardcore worker, not decorative piece". Firstpost. 14 November 2018. Retrieved 19 August 2019.
  9. "BJP appoints actress Poonam Dhillon as BJP Mumbai Vice-President". Mumbai Live (in ఇంగ్లీష్). Retrieved 19 August 2019.
  10. "Actors need good PR skills: Poonam Dhillon - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 19 August 2019.
  11. "Poonam Dhillon: Do you know the actress-turned-politician wanted to be a doctor?". mid-day (in ఇంగ్లీష్). Retrieved 19 August 2019.
  12. "Nokia Jeena Isi Ka Namm Hai". The Times of India. Retrieved 1 February 2014.
  13. "Poonam Dhillon talks about her school time friends and teachers | Hindi Movie News - Bollywood - Times of India". The Times of India. Retrieved 19 August 2019.
  14. Priyanka Naithani (26 March 2013). "Poonam Dhillon pursuing MBA degree". The Times of India. TNN. Retrieved 1 February 2014.
  15. "Meet Poonam Dhillon's daughter Paloma, internet's latest CRUSH!- News Nation". News Nation (in ఇంగ్లీష్). 27 June 2019. Retrieved 19 August 2019.
  16. "Bhansali to launch Poonam Dhillon's son Anmol with Tuesdays and Saturdays?". India Today (in ఇంగ్లీష్). 12 September 2018. Retrieved 19 August 2019.