Jump to content

ఏరోస్పేస్ ఇంజినీరింగ్

వికీపీడియా నుండి
అపోలో 13 మిషన్ నియంత్రణ చేసే సమయంలోనానా ఇంజనీర్లు

ఏరోస్పేస్ ఇంజినీరింగ్ విమానాలు, అంతరిక్ష నౌకల యొక్క నమూనా, నిర్మాణానికి సంబంధించిన ఇంజినీరింగ్ యొక్క ప్రధాన శాఖ. ఇది రెండు ముఖ్యమైన శాఖలుగా విభజించబడింది : అవి ఏరోనాటికల్ ఇంజినీరింగ్, ఆస్ట్రోనాటికల్ ఇంజినీరింగ్. వీటిలో మొదటిది భూమి యొక్క వాతావరణం లోపల పనిచేసే విమానాల గురించి వ్యవహరిస్తుంది. ఆస్ట్రోనాటికల్ ఇంజినీరింగ్ వాతావరణం వెలుపల పనిచేసే అంతరిక్ష నౌకల గురించి వ్యవహరిస్తాయి.

ఏరోస్పేస్ ఇంజినీరింగ్ లో విమానాలు, అంతరిక్ష నౌకలు, రాకెట్ల యొక్క నమూనా, నిర్మాణం, వాటి శరీరం వెనుక సైన్స్ గురించి వ్యవహరిస్తుంధి. . అంతేకాకుండా ఏరోడైనమిక్ లక్షణాలు, ప్రవర్తనలు, ఎయిర్ఫాయిల్, నియంత్రణ ఉపరితలాలు, లిఫ్ట్, డ్రాగ్, ఇతర లక్షణాలను కూడా వివరిస్తుంది. ఏరోస్పేస్ ఇంజినీరింగ్ అంటే క్లిష్టమైన క్రాఫ్ట్లను తయారు చేసేటువంటి శాస్త్రం కాదు. ఒక విమానం తయారీకి అని రంగాలకు సంబంధీచినా ఇంజినీర్లు కావాలి. ఉదాహరణకు విమానం ఏవియానిక్స్ యొక్క రూపకల్పన ఎలక్ట్రికల్ లేదా కంప్యుటర్ ఇంజినీరింగ్ గా పరిగణిస్తారు,  విమానం యొక్క లాండింగ్ గేర్ సిస్టం ప్రధానంగా మెకానికల్ ఇంజినీరింగ్ రంగంలో భాగంగా పరిగణిస్తారు. ఏరోస్పేస్ ఇంజినీరింగ్ అనేక విభాగాల కలయికకు తోడ్పడుతుంది.

ఏరోనాటికల్ ఇంజినీరింగ్ అనేది ఈ రంగం యొక్క అసలు పేరు. బాహ్య అంతరిక్షంలో పనిచేసే క్రాఫ్ట్ చేర్చుకోనునట్లు విమాన సాంకేతికత అభివృద్ధి చెందడం వల్ల ఎరోస్పస్ ఇంజినీరింగ్ అనే పదం వాడుక భాషలో ఎక్కువగా ఉపయోగించబడింది. ఎరోస్పసు ఇంజినీరింగ్, ముఖ్యంగా ఆస్ట్రోనాటికల్ శాఖ అనధికారంగా తరచూ “రాకెట్ సైన్స్”గా పిలుస్తారు.

అంశాలు:

[మార్చు]

విమానం తయారీకి ఎరోస్పస్ ఇంజినీరింగ్ లో ఫిజిక్స్ ఎక్కువుగా వాడుతామ్. ఫ్లూయిడ్ మెకానిక్స్, ఆస్ట్రో డైనమిక్స్ లాంటివి ఎంతో అవసరం.

  • ఫ్లూయిడ్ మెకానిక్స్- వస్తువుల చుట్టూ ఉండే ద్రవ ప్రవాహం యొక్క అధ్యయనం.

ముఖ్యంగా రెక్కల చుట్టూ ఉండే గాలి ప్రవాహం లేదా గాలి సొరంగాల గుండా ఉండే ప్రవాహాలకు సంబంధించిన ఏరోడైనమిక్స్.

  •  ఆస్ట్రో డైనమిక్స్ – కొన్ని ఎంపిక చేయబడిన వేరియబుల్స్ ఇచినప్పుడు కక్ష్య అంశాలను అంచనా వేయడం సహా కక్ష్య మెకానిక్స్ యొక్క అధ్యయనం.

యునైటెడ్ స్టేట్స్ లో కొన్ని పాఠశాలల్లో దీనిని అండర్గ్రాడుయేట్ స్థాయిలో బోధిస్తారు, మిగిలిన అనేక వాటిలో ఈ విషయం మీద గ్రాడుయేట్ కార్యక్రమాలు ఉన్నాయి.

  • స్థితి శాస్త్రం (స్టాటిక్స్, గతి శాస్త్రం (డైనమిక్స్, ఇంజనీరింగ్

 మెకానిక్స్) యాంత్రిక వ్యవస్థలలోని కదలికలు, బలాల యెల్ల అధ్యయనం) .

  • గణిత శాస్త్రం – ముఖ్యంగా కలనం, భేదాత్మక సమీకరణలు, సరళ బీజగణితం . చాలా పెడవైన, కస్టమైన, సమీకరణలు పరిష్కరించటానికి గణిత శాస్త్రం వుపయోగిస్తాం.
  •  విద్యుత్ సాంకేతిక విజ్ఞానం (ఎలక్ట్రోటెక్నాలజీ) : ఇంజినీరింగ్ లోనే ఎలక్ట్రానిక్స్ యొక్క అధ్యయనం .
  •  ప్రొపల్షన్ : ఒక వాహనాని గాలిలో (లేదా బాహ్య అంతరిక్స్యంలో ) నడపడానికి కావలసిన శక్తి ఇది అంతర్గత దహన యంత్రాలు, జెట్ ఇంజన్లు, టర్బోమెషినరీ లేదా రాకెట్ల చే అందింపబడుతుంది.
  • నియంత్రణ ఇంజినీరింగ్ (కంట్రోల్ ఇంజినీరింగ్) : వ్యవస్థల రూపకల్పన, వాటి గతిశీల ప్రవర్తన యొక్క గణిత నమూనా అధ్యయనం సాధారణంగా కోరిన డైనమిక్ ప్రవర్తన కోసం చూడు సంకేతాలను (ఫీడ్ బాక్ సిగ్నల్స్) ఉపయోగించడం. ఇది అంతరిక్ష వాహనాలు, విమానాలు, ప్రొపల్షన్ వ్యవస్థలు, ఉపవ్యవస్థల యొక్క డైనమిక్ ప్రవర్తనకు వర్తిస్తుంది.
  • విమాన నిర్మాణం ( ఎయిర్ క్రాఫ్ట్ స్ట్రక్చెర్స్ ) -  నిర్మాణాల బరువు తక్కువగా ఉంచడం ఏరోస్పేస్ ఇంజినీరింగ్ యొక్క లక్ష్యం ఎంధుకంటే విమానం గాలిలో ఎగురునపుడు ఎదురయ్యే బలాలను తట్టుకొనగల రూపాణి తయారుచేయాలి .
  • మెటీరియల్ సైన్సు- నిర్మాణాలకు సంబంధించినది, ఏరోస్పేస్ నిర్మాణాలకు సంబంధించిన పదార్ధాల గురించి కూడా ఏరోస్పేస్ ఇంజినీరింగ్ అధ్యయనం చేస్తుంది. నిర్దిష్ట లక్షణాలతో కొత్త పదార్ధాలు కనిపెట్టబడ్డాయి లేదా పనితీరు మెరుగుపడటానికి ఇప్పటికే ఉన్న పదార్ధాలు మార్చబడ్డాయి.
  • ఏరో స్థితి స్థాపకత (ఏరో ఎలాస్టిసిటి) - ఏరోడైనమిక్ బలాల, నిర్మాణ వ్యవస్థ యొక్క సంకర్షణ దీనివల్ల డైవర్జెన్స్ మొదలగునవి శక్తివంతంగా ఏర్పడతాయి.
  • అపాయం, విశ్వనీయత : అపాయం, విశ్వనీయత అంచన్న మెలకువలు, పరిమాణాత్మక పద్ధతుల లోని గణితం యొక్క అధ్యయనం.
  • ధ్వని నియంత్రణ : ధ్వని యాంత్రిక శాస్త్రం (మెకానిక్స్) యొక్క అధ్యయనం .

ఈ అంశాలన్నిటికి మొదలగు సిద్ధాంతపరమైన భౌతిక శాస్త్రంయే మూలం. ఎందుక్కంటే ఎరోడైనమిక్స్ లేదా ఫ్లూయిడ్ డైనమిక్స్  లేదా ఫ్లైట్ డైనమిక్స్ భౌతిక శాస్త్రంకి సంబంధించినవి.