దేబాశ్రీ రాయ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దేబాశ్రీ రాయ్
జననం (1962-08-08) 1962 ఆగస్టు 8 (వయసు 61)[1][2]
ఇతర పేర్లుకోల్‌కతార్ రసగుల్ల[4]
విద్యాసంస్థపార్క్ ఇంగ్లీష్ స్కూల్
వృత్తినటి, నర్తకి, కొరియోగ్రాఫర్, రాజకీయ నాయకురాలు
క్రియాశీల సంవత్సరాలు1966–ప్రస్తుతం
దేబాశ్రీ రాయ్ ఫౌండేషన్[5][6]
జీవిత భాగస్వామిప్రోసెన్‌జిత్ ఛటర్జీ (1994-1995, విడాకులు)
బంధువులురామ్ ముఖర్జీ (మరిది)
రాణీ ముఖర్జీ (మేనకోడలు)[7]
పురస్కారాలుజాతీయ అవార్డు[8]
బిఎఫ్‌జెఏ అవార్డు
కళాకార్ అవార్డు[9]
బంగా బిభూషణ్
అనందలోక్ అవార్డు
శాసనసభ సభ్యురాలు
In office
2011–2021
అంతకు ముందు వారుకంటి గంగూలీ
తరువాత వారుఅలోక్ జలదాత
నియోజకవర్గంరైడిఘి నియోజకవర్గం, పశ్చిమ బెంగాల్[10]
వ్యక్తిగత వివరాలు
రాజకీయ పార్టీఅఖిల భారత తృణమూల్ కాంగ్రెస్ (2011 - మార్చి 2021)

దేబాశ్రీ రాయ్ (జననం 1962 ఆగస్టు 8) బెంగాలీ సినిమా నటి, నర్తకి, కొరియోగ్రాఫర్, రాజకీయ నాయకురాలు, జంతు హక్కుల కార్యకర్త.[11][12] హిందీ, బెంగాలీ సినిమాల్లో నటించింది.[13] బెంగాలీ కమర్షియల్ సినిమా ప్రస్థానంలో నటిగా పేర్కొనబడింది.[14] వందకు పైగా చిత్రాలలో నటించి, ఒక జాతీయ అవార్డు, మూడు బెంగాలీ ఫిల్మ్ జర్నలిస్టు అవార్డులు, ఐదు కళాకర్ అవార్డులు, ఆనందలోక్ అవార్డుతో సహా నలభైకి పైగా అవార్డులను గెలుచుకుంది.[15] భారతీయ శాస్త్రీయ, గిరిజన, జానపద నృత్యాల అంశాలతో నిండిన వినూత్న నృత్య రూపాలకు ప్రసిద్ధి చెందింది. నటరాజ్ డ్యాన్స్ సంస్థను స్థాపించింది.[16] దేబాశ్రీ రాయ్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు.[17]

జననం[మార్చు]

రాయ్ 1962 ఆగస్టు 8న పశ్చిమ బెంగాల్ లోని కలకత్తాలో జన్మించింది.

వ్యక్తిగత జీవితం[మార్చు]

రాయ్ కి 1994లో ప్రోసెన్‌జిత్ ఛటర్జీతో వివాహం జరిగింది. 1995లో వారిద్దరు విడాకులు తీసుకున్నారు.

సినిమారంగం[మార్చు]

హిరణ్‌మోయ్ సేన్ 166లో తీసిన పాగల్ ఠాకూర్ అనే బెంగాలీ భక్తిరస చిత్రంలో తొలిసారిగా నటించింది.[14] 1978లో వచ్చిన అరబింద ముఖోపాధ్యాయ దర్శకత్వం వమించిన నాడి తేకే సాగరే అనే బెంగాలీ సినిమాలో మొదటిసారిగా ప్రధాన పాత్రలో నటించింది.[18] అపర్ణా సేన్ దర్శకత్వంలో జాతీయ అవార్డు గెలుచుకున్న 36 చౌరింగ్గీ లేన్ (1981),[19] రాజశ్రీ ప్రొడక్షన్ లో కనక్ మిశ్రా తీసిన జియో టు ఐస్ జియో (1981)లో సినిమాలలో నటించి గుర్తింపు పొందింది.[20] బురా ఆద్మీ (1982),[21] జస్టిస్ చౌదరి (1983),[22] ఫుల్వారీ (1984),[23] కభీ అజ్నబీ ది (1985),[24] సీపీయాన్ (1986), ప్యార్ కా సావన్ (1989) వంటి హిందీ సినిమాలలో కూడా నటించింది.[25][26] బెంగాలీ చిత్రం ట్రాయీ (1982) బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయం సాధించిన తర్వాత బెంగాలీ సినిమాపై ఎక్కువ దృష్టి పెట్టింది.[27][28] భాలోబాసా భలోబాస (1985),[29] లాల్‌మహల్ (1986), చోఖేర్ అలోయ్ (1989), ఝంకార్ (1989),[30] అహంకార్ (1991),[31] యుద్ధ (1985) వంటి సినిమాలు విజయం సాధించాయి.[32]

టివిరంగం[మార్చు]

సౌమిత్ర ఛటర్జీ నటించిన బెంగాలీ టీవీ సిరీస్ దేనా పవోనా తో టివిరంగంలోకి అడుగుపెట్టింది.[32] లౌహకపట్, రత్నదీప్, నగర్‌పరే రూప్‌నగర్, బిరాజ్ బౌ లలో నటించింది.[32] 1988లో, బిఆర్‌చోప్రా తీసిన మహాభారతంలో సత్యవతిగా కనిపించింది.[33]

రాజకీయ జీవితం[మార్చు]

రాయ్ అఖిల భారత తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరపున 2011 నుండి 2021 వరకు రైడిఘి నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యునిగా ప్రాతినిధ్యం వహించింది.


అవార్డులు, నామినేషన్లు[మార్చు]

అవార్డు సంవత్సరం వర్గం సినిమా పేరు ఫలితం
జాతీయ చలనచిత్ర అవార్డు 1995 ఉత్తమ నటి యునిషే ఏప్రిల్ గెలుపు[8]
బంగా బిభూషణ్ 2014 సినిమా రంగంలో సహకారం గెలుపు
బెంగాల్ ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ అవార్డులు 1992 ఉత్తమ నటి తికన గెలుపు
1997 ఉత్తమ నటి యునిషే ఏప్రిల్ గెలుపు
2000 ఉత్తమ నటి అసుఖ్ గెలుపు
ఆనందలోక్ పురస్కారం 1999 ఉత్తమ నటి దాహో Nominated
2000 ఉత్తమ నటి అసుఖ్ Nominated
2001 ఉత్తమ సహాయ నటి ఏక్ జే అచే కన్యా Nominated
2005 ఉత్తమ నటి తీస్తా గెలుపు
కళాకర్ అవార్డులు 1993 ఉత్తమ నటి ప్రేమ్
1994 ఉత్తమ నటి సంధ్యతార
1996 ఉత్తమ నటి లౌహకపట్
2002 ఉత్తమ నటి దేఖా
2003 ఉత్తమ నటి శిల్పాంతర్
భారత్ నిర్మాణ్ అవార్డులు 1999 సినిమా, టెలివిజన్‌లో సహకారం గెలుపు[34]

మూలాలు[మార్చు]

 1. "West Bengal Assembly Election 2011". ceowestbengal.nic.in. Retrieved 2022-03-24.
 2. "Debashree Roy". aboxoffice.com. Archived from the original on 2019-08-29. Retrieved 2022-03-24.
 3. "Debasree Roy MLA of RAIDIGHI West Bengal contact address & email". nocorruption.in. Retrieved 2022-03-24.
 4. "Debashree: 'রূপ নিয়ে অহংকার কোরো না মাসি, সেরা রসগোল্লাও আজ বাসি', নেটমাধ্যমে কটাক্ষ দেবশ্রীকে". www.anandabazar.com. Retrieved 2022-03-24.
 5. "Rescued from sticks of death". The Telegraph. Retrieved 2022-03-24.
 6. "Federation of Indian Animal Protection Organisations". fiapo.org. Archived from the original on 13 June 2018. Retrieved 2022-03-24.
 7. "Rani Mukherji biography in pictures". www.lightscamerabollywood.com. Archived from the original on 23 October 2018. Retrieved 2022-03-24.
 8. 8.0 8.1 "42nd National Film Festival, 1995". iffi.nic.in. Archived from the original on 23 May 2015. Retrieved 2022-03-24.
 9. "Kalakar Awards Winner" (PDF). 25 April 2012. Archived from the original (PDF) on 25 April 2012. Retrieved 2022-03-24.
 10. "TMC MLA Debashree Roy makes unsuccessful attempt to meet West Bengal BJP chief Dilip Ghosh". The New Indian Express. Retrieved 2022-03-24.
 11. "Debasree Roy movies, filmography, biography and songs". Cinestaan. Archived from the original on 15 May 2019. Retrieved 2022-03-24.
 12. "Nataraj Group". www.calcuttayellowpages.com. Retrieved 2022-03-24.
 13. "Debashree Roy set to return to acting after 10-year hiatus". www.outlookindia.com. Archived from the original on 4 June 2021. Retrieved 2022-03-24.
 14. 14.0 14.1 "Rediff On The NeT, Movies: Debasree Roy profile". www.rediff.com. Retrieved 2022-03-24.
 15. "Debashree Roy to return on screens with Bengali TV serial after decade-long hiatus". Firstpost. 30 April 2021. Archived from the original on 14 May 2021. Retrieved 2022-03-24.
 16. "- FAMILY album". www.telegraphindia.com. Retrieved 2022-03-24.
 17. "Put India on cruelty-free cosmetics map: Debasree Roy". @businessline (in ఇంగ్లీష్). Archived from the original on 12 October 2020. Retrieved 2022-03-24.
 18. "সিনেমার জন্য ডাক্তারি ছেড়েছিলেন এই পরিচালক - Anandabazar". www.anandabazar.com. Retrieved 2022-03-24.
 19. "Directorate of Film Festival". iffi.nic.in. Archived from the original on 3 December 2013. Retrieved 2022-03-24.
 20. "Jiyo To Aise Jiyo (1981)". Cinestaan. Archived from the original on 2018-02-18. Retrieved 2022-03-24.
 21. "Bura Aadmi (1982)". Cinestaan. Archived from the original on 2018-02-19. Retrieved 2022-03-24.
 22. "Justice Chowdhury (1983)". Cinestaan. Archived from the original on 2018-01-29. Retrieved 2022-03-24.
 23. "Phulwari (1984)". Cinestaan. Archived from the original on 18 ఫిబ్రవరి 2018. Retrieved 18 February 2018.
 24. "Kabhie Ajnabi The (1984)". Cinestaan. Archived from the original on 2017-10-23. Retrieved 2022-03-24.
 25. "Seepeeyan (1984)". Cinestaan. Archived from the original on 2017-11-15. Retrieved 2022-03-24.
 26. "Pyar Ka Sawan (1991)". Cinestaan. Archived from the original on 2019-06-07. Retrieved 2022-03-24.
 27. "The Superlative Roy". Filmzack. 30 December 2017. Retrieved 2022-03-24.
 28. মক্ষীরানি.
 29. "Bhalobasha Bhalobasha (1985)". Cinestaan. Archived from the original on 2018-02-25. Retrieved 2022-03-24.
 30. "Jankar (1989)". Cinestaan. Archived from the original on 2018-03-04. Retrieved 2022-03-24.
 31. "Ahankar (1991)". Cinestaan. Retrieved 2022-03-24.[permanent dead link]
 32. 32.0 32.1 32.2 "Will Debasree Roy Ever Look for A Life Time Companion". www.bhashyo.in. 21 July 2005. Retrieved 2022-03-24.[permanent dead link]
 33. "B.R. Chopra's serial 'Mahabharat' promises to be another bonanza". India Today. 31 October 1988. Retrieved 2022-03-24.
 34. "-:: Bharat Nirman Awards ::-". www.bharatnirmanawards.com. Archived from the original on 2017-07-29. Retrieved 2022-03-24.

బయటి లింకులు[మార్చు]