ఇండియన్ క్రికెట్ లీగ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఐ.సి.ఎల్. అని సంక్షిప్తంగా పిలువబడే ఇండియన్ క్రికెట్ లీగ్ (The Indian Cricket League-ICL) భారత క్రికెట్ కంట్రోల్ బోర్డుకు పోటీగా సమాంతరంగా ఏర్పడిన క్రికెట్ క్రీడా సంస్థ. ట్వంటీ-20 పద్ధతిలో క్రికెట్ పోటీలు నిర్వహించబడే ఈ సంస్థ 2007లో ఏర్పడి అదే ఏడాదే చండీగఢ్ లోని తావూ దేవీలాల్ పంచకుల స్టేడియంలో పోటీలకు కూడా నిర్వహించింది. ప్రారంభంలో 6 జట్లను ఏప్రాటుచేసిన ఈ లీగ్ 2008లో మరో రెండు జట్లను కొత్తగా ఏర్పర్చి మొత్తం జట్ల సంఖ్యను 8కి చేర్చింది. అహ్మదాబాద్ రాకెట్స్, లాహోర్ బాద్షాస్ జట్లు కొత్తగా ఏర్పాటైనవి. లాహోర్ బాద్షాస్ అందరూ పాకిస్తాన్కు చెందిన క్రీడాకారులే ఉన్న జట్టు. జీ టెలిఫిల్మ్స్ సంస్థ అధినేత సుభాష్ చంద్ర దీన్ని ఏర్పాటు చేశాడు. కపిల్ దేవ్, కిరణ్ మోరేలు ఈ లీగ్‌లో చేరిన ప్రముఖులు. బ్రియాన్ లారా, ఇంజమామ్ ఉల్ హక్ లాంటి మేటి క్రీడాకారులు ఈ లీగ్‌లోని జట్లకు నాయకత్వం వహిస్తున్నారు.

చరిత్ర[మార్చు]

సుభాష్ చంద్ర యొక్క ఎస్సెల్ గ్రూప్‌లోని భాగమైన జీ టెలిఫిల్మ్స్ 2003 ప్రపంచ కప్‌కు అధిక మొత్తంలో బిడ్ వేసిననూ ఫలితం దక్కలేదు. 2004లో సుభాష్ చంద్ర మళ్ళీ బిడ్ వేశాడు. 2006 నుంచి 2010 వరకు ప్రసార హక్కుల కొరకు బిడ్ వేసిననూ ఓడిపోయాడు. ఈ ఫలితాలే ఇండియన్ క్రికెట్ లీగ్ ఏర్పాటుకు దారితీశాయి. క్రికెట్ పోటీలో నిందకు గురైనందుకే లీగ్ ప్రారంభించినట్లు ఐ.సి.ఎల్., జీ స్పోర్ట్స్ వ్యాపార అధినేత హిమాంశు మోడి పేర్కొన్నాడు.[1] 100 కోట్ల రూపాయల కార్పస్‌తో ప్రారంభించబడిన ఈ లీగ్ విజేతకు ఒక మిలియన్ అ.డాలర్లు. ప్రారంభంలో ప్రముఖ క్రికెటర్లు ఇందులోకి రావడానికి మొగ్గుచూపలేదు. కాని క్రమక్రమంగా ప్రముఖ ఆటగాళ్ళు కూడా చేరుతూవచ్చారు. ఇదే క్రమంలో జూలై 24, 2007న వెస్టీండీస్ దిగ్గజం బ్రియాన్ లారా ఈ లీగ్‌లో చేరడం జరిగింది.[2] పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా ఆటగాళ్ళు లీగ్‌లో ఆడకుండా అడ్డుపడింది. జావేద్ మియాందాద్ లాంటి ఆటగాళ్ళు కూడా పాకిస్తాన్ వైఖరిని తప్పుపట్టారు. లీగ్‌లోచేరిన ఆటగాళ్ళను దేశవాళి టర్నమెంట్లలో ఆడకుండా నిషేధించింది. బిసిసిఐ కూడా లీగ్‌లో చేరిన ఆటగాళ్ళను జాతీయ జట్టులో చేర్చుకోమని ప్రకటించింది. టోర్నమెంట్లు నిర్వహించడానికి స్టేడియాలు ఇవ్వడానికి కూడా బిసిసిఐ ఒప్పుకోలేదు. ప్రారంభంలో అన్ని పోటీలు చండీగర్‌లోని (పంచకుల) తావూ దేవీలాల్ స్టేడియంలో నిర్వహించారు. 2008లో హైదరాబాదులోని లాల్ బహదూర్ స్టేడియంలో పోటీలు ప్రారంభమయ్యాయి.

లీగ్ జట్ల కూర్పు[మార్చు]

ప్రారంభంలో 6 జట్లను ప్రకటించింది. ఆ తరువాత 2008లో మరో రెండు జట్లను కూడా దీనితో జతచేశారు. ప్రస్తుతం మొత్తం జట్ల సంఖ్య 8 కి చేరింది. ప్రతి జట్టులో 4 అంతర్జాతీయ ఆటగాళ్ళు, ఇద్దరు భారతీయులు, 8 దేశవాళి ఆటగాళ్ళు ఉంటారు. కాని కొత్తగా చేరిన లాహోర్ బాద్షాస్ జట్టులో అందరూ పాకిస్తాన్ ఆటగాళ్ళే ఉన్నారు. నవంబర్ 2007లో తొలిసారిగా పోటీలు నిర్వహించారు.

ఐసిఎల్ జట్లు[మార్చు]

  • ముంబాయి చాంప్స్
  • చెన్నై సూపర్‌స్టార్స్
  • చండీగర్ లయన్స్
  • హైదరాబాద్ హీరోస్

  • కోల్‌కత టైగర్స్
  • ఢిల్లీ జెట్స్
  • అహ్మదాబాద్ రాకెట్స్
  • లాహోర్ బాద్షాస్

ప్రతి జట్టు ఒక మెంటర్, ఒక మీడియా మేనేజర్, సైకాలజిస్ట్, ఫిజియోథెరాపిస్ట్‌ను కలిగి ఉండవచ్చు. గెలిచిజ జట్టుకు ఒక మిలియన్ అమెరిక డాలర్ల నగదు బహమతి ప్రధానం చేస్తారు. అన్ని పోటీలు ట్వంటీ-20 పద్ధతిలో జరిగుతాయి. ఆటగాళ్ళ వివాదాలను అంబుడ్స్‌మెన్ పరిష్కరిస్తుంది.

జట్ల వారీగా లీగ్ ఆటగాళ్ళు[మార్చు]

చండీగర్ లయన్స్

పేరు ప్రాంతము
క్రిస్ కైర్న్స్ న్యూజీలాండ్
అమిత్ ఉనియల్ పంజాబ్
ఆండ్రూ హాల్ దక్షిణాఫ్రికా
బిపుల్ శర్మ పంజాబ్
చేతన్ శర్మ పంజాబ్
డారిల్ టఫీ న్యూజీలాండ్
దినేష్ మోంగియా పంజాబ్
గౌరవ్ గుప్తా పంజాబ్
హమిష్ మార్షల్ న్యూజీలాండ్
హర్‌ప్రీత్ సింగ్ పంజాబ్
ఇషాన్ మల్హోత్ర పంజాబ్
కరణ్‌వీర్ సింగ్ పంజాబ్
లవ్ అబ్లీశ్ పంజాబ్
మనీష్ శర్మ పంజాబ్
రాజేష్ శర్మ పంజాబ్
సరబ్‌జిత్ సింగ్ పంజాబ్
సుమిత్ కాలియా పంజాబ్
టి.పి.సింగ్ పంజాబ్
అజిత్ ఉపాధ్యాయ్ ఢిల్లీ

చెన్నై సూపర్‌స్టార్స్

పేరు ప్రాంతము
రాజగోపాల్ సతీశ్
ఆడం పరోరే
క్రిస్ రీడ్
హేమంగ్ బదాని
హేమంత్ కుమార్
ఇయాన్ హార్వే
జె.హరీష్
పి.వివేక్
ఆర్.జేసురాజ్
రెస్సెల్ ఆర్నాల్డ్
షబ్బీర్ అహ్మద్
సయ్యద్ మహ్మద్
తమిళ్ కుమారన్
థిరు ముకారన్
వి.దేవేంద్ర
వసంత్ సర్వానన్
సుభాషిణి
మణి

ఢిల్లీ జెయింట్స్

పేరు ప్రాంతము
మర్వన్ ఆటపట్టు శ్రీలంక
నియాల్ ఓ బ్రీన్ ఐర్లాండ్
మొహనిష్ మిశ్రా మధ్యప్రదేశ్
తాఫీక్ ఉమర్ పాకిస్తాన్
అబ్బాస్ అలీ మధ్యప్రదేశ్
డేల్ బెంకెన్‌స్టీన్ దక్షిణాప్రికా
జె.పి.యాదవ్ రైల్వేస్
అలీ ముర్తజా ఉత్తర ప్రదేశ్
టి.సుధీంద్ర మధ్యప్రదేశ్
ఆబిద్ నబీ అహంగర్ జమ్మూ కాశ్మీర్
సచిన్ ధోరల్‌పురె మధ్యప్రదేశ్
అభిషేక్ టామ్రాకర్ మధ్యప్రదేశ్
శలభ శ్రీవాస్తవ్ ఉత్తర ప్రదేశ్
అభిషేక్ శర్మ ఉత్తర ప్రదేశ్
దిశాంత్ యాజ్ఞిక్ ఉదయపూర్
ధ్రువ్ మహాజన్ జమ్మూకాశ్మీర్
అభినవ్ బాలి
రాఘవ్ సచ్‌దేవ్

హైదరాబాదు హీరోస్

పేరు ప్రాంతము
క్రిస్ హారిస్ న్యూజీలాండ్
అనిరుద్ సింగ్ హైదరాబాదు
అంబటి రాయుడు జైపూర్
అబ్దుల్ రజాక్ పాకిస్తాన్
సయ్యద్ షాబుద్దీన్ హైదరాబాదు
నికీ బోయ్ దక్షిణాఫ్రికా
స్టూవర్ట్ బిన్నీ కర్ణాటక
ఇందర్ శేఖర్ రెడ్డి హైదరాబాదు
వినయ్ కుమార్ హైదరాబాదు
ఇబ్రహీం ఖలీల్ హైదరాబాదు
కౌశిక్ రెడ్డి హైదరాబాదు
భీమారావు
ఆల్ఫ్రెడ్ అబ్సోలోమ్ హైదరాబాదు
శషాంక్ నాగ్ హైదరాబాదు
పి.ఎస్.నిరంజన్ హైదరాబాదు
బాబూరావు యాదవ్
జయారియా జుఫ్రీ అసోం

కోల్‌కత టైగర్స్

పేరు ప్రాంతము
క్రెగ్ మెక్‌మిలన్ న్యూజీలాండ్
పర్వేజ్ అజీం అసోం
డారెన్ మాడి ఇంగ్లాండు
అభిషేక్ ఝున్‌ఝున్‌వాలా కోల్‌కత
లాన్స్ క్లుసెనర్ దక్షిణాఫ్రికా
రోహన్ గవాస్కర్ బెంగాల్
ఉపుల్ చందన శ్రీలంక
దీప్ దాస్‌గుప్తా బెంగాల్
అబు నెచిమ్ అసోం
శివసాగర్ సింగ్ బెంగాల్
బోయిడ్ రాన్‌కిన్ ఐర్లాండ్
మిహిర్ దివాకర్ ఝార్ఖండ్
రాజీవ్ కుమార్ కోల్‌కత
సయ్యద్ అఖ్లాక్ అహ్మద్ కోల్‌కత
సుబోమయ్‌దాస్ కోల్‌కత
సుజయ్ తరఫ్దార్ అసోం
ప్రీతం దాస్ అసోం
అంశు జైన్
అలి.హెచ్.జైడి
పంకజ్ తులు

ముంబాయి చాంప్స్

పేరు ప్రాంతము
బ్రియాన్ లారా వెస్టీండీస్
విక్రం సోలంకీ ఇంగ్లాండు
రాబిన్ మోరిస్ ముంబాయి
నాథన్ ఆస్టిల్ న్యూజీలాండ్
కిరణ్ పవార్ ముంబాయి
శ్రేయాస్ ఖనోల్కర్ ముంబాయి
వాన్‌డెర్ వాత్ దక్షిణాఫ్రికా
రాకేశ్ పటేల్ గుజరాత్
అవినాశ్ యాదవ్ ముంబాయి
మెర్విన్ డిలాన్ వెస్టీండీస్
సుభోజిత్ పౌల్ కోల్‌కత
ధీరజ్ జాదవ్ పూనె
అనుపమ్ సంక్లేచ ముంబాయి
రంజీత్ కిరిద్ పూనె
పుష్కరాజ్ జోషి పూనె
సుయాష్ బార్కుల్ మాహారాష్ట్ర
రవిరాజ్ పాటిల్ మహారాష్ట్ర
నిఖిల్ మండాలె ముంబాయి
శ్రీధర్ అయ్యర్ చత్తీస్ ఘర్

అహ్మదాబాద్ రాకెట్స్

పేరు ప్రాంతము
డామియెన్ మార్టిన్ ఆస్ట్రేలియా
అభిషేక్ తమ్రాకర్
అంశు జైన్
బాబూరావు యాదవ్
హీత్ స్ట్రీక్ జింబాబ్వే
జసోన్ గిలెప్సీ ఆస్ట్రేలియా
ముర్రే గుడ్‌విన్ జింబాబ్వే
పల్లవ్ వోరా
పర్వీజ్ అజీజ్
పి.భీమారావు
రాకేశ్ పటేల్
రీతిందర్ సోధి
సచిన్ ధోల్‌పురె
సంజీవ్ మార్టిన్
శ్రీరాం శ్రీధరన్
సుమిత్ కాలియా
వావెల్ హిండ్స్ వెస్టీండీస్

లాహోర్ బాద్షాస్

పేరు ప్రాంతము
ఇంజముమ్ ఉల్ హక్ పాకిస్తాన్
సక్లేన్ ముస్తాక్ పాకిస్తాన్
ముస్తాక్ అహ్మద్ పాకిస్తాన్
తాఫిక్ ఉమర్ పాకిస్తాన్
ఇమ్రాన్ ఫర్హత్ పాకిస్తాన్
ఇమ్రాన్ నజీర్ పాకిస్తాన్
మహ్మద్ సమీ పాకిస్తాన్
రియాజ్ ఆఫ్రిది పాకిస్తాన్
అర్షద్ ఖాన్ పాకిస్తాన్
నవెద్ లతీఫ్ పాకిస్తాన్
అజహర్ మహమూద్ పాకిస్తాన్
హుమ్‌యున్ ఫర్హత్ పాకిస్తాన్
హసన్ రాజా పాకిస్తాన్
షహీద్ నజీర్ పాకిస్తాన్

మూలాలు[మార్చు]

  1. Ekbaat staff (September 15 2007). "Why and how was ICL created". Ekbaat. Archived from the original on 2007-10-13. Retrieved 2007-09-15. Check date values in: |date= (help)
  2. Cricinfo staff (July 26 2007). "Warne and McGrath set to join ICL: Kapil". Cricinfo. Retrieved 2007-07-26. Check date values in: |date= (help)

బయటిలింకులు[మార్చు]