రోహన్ గవాస్కర్
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | రోహన్ సునీల్ గవాస్కర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | కాన్పూర్, ఉత్తర ప్రదేశ్ | 1976 ఫిబ్రవరి 20|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | ఎడమచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | స్లో లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | బ్యాటింగ్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బంధువులు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 154) | 2004 జనవరి 18 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2004 సెప్టెంబరు 19 - పాకిస్తాన్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1996–2009 | బెంగాల్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2009–2010 | కోల్‌కతా నైట్‌రైడర్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 2012 ఫిబ్రవరి 9 |
రోహన్ సునీల్ గవాస్కర్ ఉత్తర ప్రదేశ్ కు చెందిన మాజీ భారత క్రికెట్ ఆటగాడు. 11 అంతర్జాతీయ వన్డేలు ఆడాడు.[1] మిడిల్ ఆర్డర్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మన్, స్లో లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ బౌలర్ గా ప్రతిభ కనబరిచాడు.
జననం
[మార్చు]రోహన్ సునీల్ గవాస్కర్ 1976, ఫిబ్రవరి 20న ఉత్తర ప్రదేశ్లోని కాన్పూర్ లో జన్మించాడు. ఇతని తండ్రి ఇండియన్ క్రికెటర్ సునీల్ గవాస్కర్.[2][3] సునీల్ తనకి ఇష్టమైన ముగ్గురు క్రికెటర్లు రోహన్ కన్హాయి, ఎం.ఎల్. జయసింహ, గుండప్ప విశ్వనాథ్[4] లకు నివాళిగా అతనికి రోహన్ జైవిశ్వ అనే పేరు పెట్టారు. అతని పేరు రోహన్ సునీల్ గవాస్కర్ అని నమోదు చేయబడుతోంది. రోషన్ కోల్‌కతాలోని సెయింట్ జేవియర్స్ కాలేజియేట్ స్కూల్, బాంబే స్కాటిష్ స్కూల్, ఆ తరువాత రాంనిరంజన్ ఆనందిలాల్ పోడార్ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్‌లో చదివాడు.
దేశీయ క్రికెట్
[మార్చు]గవాస్కర్ ఎడమచేతి వాటంతో బ్యాటింగ్ చేసేవాడు. నెమ్మదిగా, సున్నితమైన ఎడమచేతి వాటం స్పిన్ బౌలింగ్ చేయడం నేర్చుకున్నాడు. బెంగాల్‌కు కొన్ని సమయాల్లో కీలక వికెట్లు తీశాడు.
దేశవాళీ క్రికెట్‌లో రంజీ ట్రోఫీలో బెంగాల్‌కు, దులీప్ ట్రోఫీలో ఈస్ట్ జోన్‌కు ప్రాతినిధ్యం వహించాడు. రెండు సంవత్సరాలు వేచి ఉండి బెంగాల్ జట్టులో చేరాడు.[5]
2001–02లో బెంగాల్‌కు కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. లీడర్‌గా రెండు సీజన్‌లు పేలవంగా ఆడాడు. వరుసగా రెండుసార్లు ఫైనల్స్ వరకి వెళ్ళినా కూడా బెంగాల్ తరఫున రంజీ ట్రోఫీని గెలవలేకపోయారు.[5]
2007లో కోల్‌కతా టైగర్స్ తరపున ఇండియన్ క్రికెట్ లీగ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు, దానిని బిసిసిఐ అనధికారికంగా ప్రకటించింది. లీగ్‌తో అతని సంబంధాలను తెంచుకుని, ప్రధాన స్రవంతి భారత దేశీయ క్రికెట్‌కు తిరిగి వచ్చిన తర్వాత, అతను కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున ఇండియన్ ప్రీమియర్ లీగ్ మూడవ సీజన్‌లో ఆడేందుకు ఎంపికయ్యాడు. 2009లో తన చివరి ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లో ఆడి, 2012లో రిటైరయ్యాడు.[6]
2009 జూన్ లో బిసిసిఐ ద్వారా క్షమాభిక్ష ప్రసాదించిన 71 మంది ఆటగాళ్లలో రోషన్ ఒకడు, తరువాత అధికారిక స్థానానికి తిరిగి వచ్చాడు. 2012, ఫిబ్రవరి 9న న ఫస్ట్-క్లాస్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. బెంగాల్ తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడిన రోహన్ 75 మ్యాచ్‌ల్లో 51.24 సగటుతో 5073 పరుగులు చేశాడు.[5]
అంతర్జాతీయ క్రికెట్
[మార్చు]2004లో జరిగిన ఆస్ట్రేలియా పర్యటనకు భారత క్రికెట్ జట్టుకు ఎంపికయ్యాడ. అందులో గాయం కారణంగా మహ్మద్ కైఫ్ నిష్క్రమించిన తరువాత రోహన్ అంతర్జాతీయ వన్డేలోకి అరంగేట్రం చేశాడు.[7] 2004 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో చివరిసారిగా అడాడు.
మీడియారంగం
[మార్చు]రోహన్ తన పదవీ విరమణ తర్వాత వ్యాఖ్యాతగా మారాడు. ఐపిఎల్ 2013లో వ్యాఖ్యాతగా స్టార్ స్పోర్ట్స్ వారి స్టార్ పవర్, ఎన్డీటీవి వారి స్పోర్ట్స్ షోలో కనిపించాడు.
వ్యక్తిగత జీవితం
[మార్చు]రోహన్ కు స్వాతి మాన్కర్‌తో వివాహం జరిగింది.
మూలాలు
[మార్చు]- ↑ Balachandran, Kanishkaa (8 February 2012). "Rohan Gavaskar quits first-class cricket". ESPN CricInfo.
- ↑ "Rohan Gavaskar turns 44: Candid photos of Sunny's son you must see!". Mid Day. 4 March 2020.
- ↑ Shaikh, Jamal (16 February 2020). "HT Brunch Cover Story: Game night at the Gavaskars'". Hindustan Times.
- ↑ V.V.S. Laxman bats for new cause Archived 30 సెప్టెంబరు 2007 at the Wayback Machine, 10 November 2005. Press Trust on India. Retrieved on 2023-08-03.
- ↑ 5.0 5.1 5.2 "Father's cricket genes propelled Rohan Gavaskar – NDTV Sports". Archived from the original on 2016-03-04. Retrieved 2023-08-03.
- ↑ "Rohan Gavaskar retires from competitive cricket". The Times of India. 7 February 2012. Retrieved 2023-08-03.
- ↑ "Rohan Gavaskar to replace Kaif". Retrieved 2023-08-03.