ఇయాన్ బోథం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సర్ ఇయాన్ బోథం
Ian Botham headshot.jpg
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు Sir Ian Terence Botham OBE
జననం (1955-11-24) 1955 నవంబరు 24 (వయసు 67)
Heswall, Cheshire, England
ఇతర పేర్లు Beefy, Both, Guy[1]
ఎత్తు 6 అ. 2 అం. (1.88 మీ.)
బ్యాటింగ్ శైలి Right-handed
బౌలింగ్ శైలి Right-arm fast-medium
పాత్ర All-rounder
అంతర్జాతీయ సమాచారం
జాతీయ జట్టు England
టెస్టు అరంగ్రేటం(cap 474) 28 July 1977 v Australia
చివరి టెస్టు 18 June 1992 v Pakistan
వన్డే లలో ప్రవేశం(cap 33) 26 August 1976 v West Indies
చివరి వన్డే 24 August 1992 v Pakistan
దేశవాళీ జట్టు సమాచారం
సంవత్సరాలు జట్టు
1974–86 Somerset
1987–88 Queensland
1987–91 Worcestershire
1992–93 Durham
కెరీర్ గణాంకాలు
పోటీ Tests ODI FC LA
మ్యాచ్‌లు 102 116 402 470
సాధించిన పరుగులు 5200 2113 19399 10474
బ్యాటింగ్ సగటు 33.54 23.21 33.97 29.50
100s/50s 14/22 0/9 38/97 7/46
ఉత్తమ స్కోరు 208 79 228 175*
బాల్స్ వేసినవి 21815 6271 63547 22899
వికెట్లు 383 145 1172 612
బౌలింగ్ సగటు 28.40 28.54 27.22 24.94
ఇన్నింగ్స్ లో 5 వికెట్లు 27 0 59 3
మ్యాచ్ లో 10 వికెట్లు 4 n/a 8 n/a
ఉత్తమ బౌలింగ్ 8/34 4/31 8/34 5/27
క్యాచులు/స్టంపింగులు 120/– 36/– 354/– 196/–
Source: [1], 22 August 2007
వ్యక్తిగత సమాచారం
పూర్తిపేరు Ian Botham
ఆడే స్థానం Centre half
సీనియర్ కెరీర్*
సంవత్సరాలు జట్టు Apps (Gls)
1978–80 Yeovil Town 17 (1)
1980–85 Scunthorpe United 11 (0)
  • Senior club appearances and goals counted for the domestic league only.
† Appearances (Goals).

1955, నవంబర్ 24న జన్మించిన ఇయాన్ బోథం (Ian Botham) ఇంగ్లాండుకు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు, ప్రస్తుత క్రికెట్ వ్యాఖ్యాత. టెస్ట్ క్రికెట్‌లో ఆల్‌రౌండర్ ప్రతిభ చూపి 14 సెంచరీలు, 383 వికెట్లు సాధించాడు. అనేక టెస్ట్ క్రికెట్ రికార్డులను సృష్టించిన బోథం రిటైర్‌మెంట్ అయి 15 సంవత్సరాలు గడిచినప్పటికీ ఇంగ్లాండు తరఫున అత్యధిక టెస్ట్ వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా తన రికార్డును నిలబెట్టుకున్నాడు.

టెస్ట్ క్రికెట్ గణాంకాలు[మార్చు]

ఇయాన్ బోథం 102 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి 33.54 సగటుతో 5200 పరుగులు చేయడమే కాకుండా బౌలింగ్‌లో 28.40 సగటుతో 383 వికెట్లను సాధించాడు. టెస్ట్ క్రికెట్‌లో అతని అత్యధిక వ్యక్తిగత స్కోరు 208 పరుగులు. 14 సెంచరీలు, 22 అర్థసెంచరీలు నమోదుచేశాడు. బౌలింగ్‌లో ఒకే ఇన్నింగ్సులో ఐదేసి వికెట్లను 27 సార్లు, ఒకే టెస్టులో పదేసి వికెట్లను 4 సార్లు సాధించాడు. అతని అత్యుత్తమ బౌలింగ్ విశ్లేషణ 34 పరుగులకు 8 వికెట్లు.

వన్డే క్రికెట్ గణాంకాలు[మార్చు]

బోథం 116 వన్డేలలో ఇంగ్లాండు జట్టుకు ప్రాతినిధ్యం వహించి 23.21 సగటుతొ 2113 పరుగులు చేశాడు. ఇందులో 9 అర్థసెంచరీలు ఉన్నాయి. వన్డేలో అతని అత్యధిక స్కోరు 79 పరుగులు. బౌలింగ్‌లో 28.54 సగటుతో 145 వికెట్లను పడగొట్టినాడు. అత్యుత్తమ బౌలింగ్ విశ్లేషణ 31 పరుగులకు 4 వికెట్లు.

ప్రపంచ కప్ పోటీలు[మార్చు]

ఇయాన్ బోథం 3 సార్లు ప్రపంచ కప్ టోర్నమెంట్‌లలో పాల్గొన్నాడు. 1979లో తొలిసారిగా ప్రాతినిధ్యం వహించగా, 1983లో జరిగిన మూడవ ప్రపంచ కప్‌లో విల్లీస్ నేతృత్వంలో పాల్గొన్నాడు. 1992లో గ్రాహం గూచ్ నేతృత్వంలోని ఇంగ్లాండు జట్టుకు చివరిసారిగా ప్రపంచ కప్‌లో ప్రాతినిధ్యం వహించాడు.

అవార్డులు[మార్చు]

  • 1978లో విజ్డెన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు ఎంపికైనాడు.
  • 1981లో బిబిసి స్పోర్ట్స్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యాడు.

సాధించిన రికార్డులు[మార్చు]

  • అతి తక్కువ టెస్టులలో 1000 పరుగులు, 100 వికెట్లు; 2000 పరుగులు, 200 వికెట్లు; 3000 పరుగులు, 300 వికెట్లు సాధించిన రికార్డు సృష్టించాడు.
  • అత్యధిక టెస్ట్ వికెట్లు సాధించిన రికార్డు సృష్టించిననూ అది తరువాతి కాలంలో పలువురిచే ఛేదించబడింది. అయిననూ అత్యధిక టెస్ట్ వికెట్లు సాధించిన ఇంగ్లాండు బౌలర్‌గా ఇంకనూ రికార్డు ఇతని పేరిటే కొనసాగుతోంది.
  • ఒకే ఇన్నింగ్సులో సెంచరీ, 5 వికెట్లను 5 పర్యాయాలు సాధించి ఈ ఘనత వహించిన ఏకైక క్రికెటర్‌గా కొనసాగుతున్నాడు.
  • 1980లో భారత్‌పై ఒకే టెస్టులో 10 వికెట్లు, సెంచరీ సాధించి ఈ ఘనత పొందిన తొలి క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు.
  • 1981లో ఒకే టెస్టులో 6 సిక్సర్లు సాధించి రికార్డు సృష్టించాడు. తరువాత ఈ రికార్డు అధికమించబడింది.

మూలాలు[మార్చు]

  1. "Ian Botham". espncricinfo. Retrieved 18 April 2012.

బయటి లింకులు[మార్చు]