Jump to content

వినోద్ కాంబ్లీ

వికీపీడియా నుండి
వినోద్ కాంబ్లీ
2007లో వినోద్ కాంబ్లీ
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
వినోద్ గణపత్ కాంబ్లీ
పుట్టిన తేదీ (1972-01-18) 1972 జనవరి 18 (వయసు 52)
ముంబై, మహారాష్ట్ర, భారతదేశం
బ్యాటింగుఎడమచేతి వాటం
బౌలింగుకుడి చేయి ఆఫ్ స్పిన్
పాత్రబ్యాట్స్ మాన్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు1993 జనవరి 29 - ఇంగ్లండ్ తో
చివరి టెస్టు1995 నవంబరు 8 - న్యూజిలాండ్ తో
తొలి వన్‌డే1991 అక్టోబరు 18 - పాకిస్తాన్ తో
చివరి వన్‌డే2000 అక్టోబరు 29 - శ్రీలంక తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1989–2011ముంబయి క్రికెట్ జట్టు
కెరీర్ గణాంకాలు
పోటీ Test cricket ODIs FC LA
మ్యాచ్‌లు 17 104 129 221
చేసిన పరుగులు 1,084 2,477 9,965 6,476
బ్యాటింగు సగటు 54.20 32.59 59.97 41.24
100లు/50లు 4/3 2/14 35/44 11/35
అత్యుత్తమ స్కోరు 227 106 262 149
వేసిన బంతులు 4 777 156
వికెట్లు 1 10 1
బౌలింగు సగటు 7.00 49.70 159.00
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0
అత్యుత్తమ బౌలింగు 1/7 2/15 1/7
క్యాచ్‌లు/స్టంపింగులు 7/– 15/– 56/– 50/–
మూలం: Cricinfo, 2006 ఫిబ్రవరి 4
పాఠశాల రోజుల్లో క్రికెట్ ఆడుతూ వినోద్ కాంబ్లీ, సచిన్ టెండూల్కర్

వినోద్ గణపత్ కాంబ్లీ (ఆంగ్లం: Vinod Ganpat Kambli; 1972 జనవరి 18) మాజీ భారతీయ క్రికెటర్. ఆయన భారతదేశం తరపున మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్‌గా రాణించాడు. ప్రస్తుతం అతను క్రికెట్ నిపుణుడిగా, వివిధ టెలివిజన్ ఛానెల్‌లలో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు.

జీవితం తొలి దశలో

[మార్చు]

వినోద్ కాంబ్లీ ముంబైకి చెందినవాడు. అతను భారత క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌కి చిన్ననాటి స్నేహితుడు. వీరిరువురు కలసి పాఠశాల క్రికెట్ రోజుల్లో సెయింట్ జేవియర్స్ స్కూల్‌తో జరిగిన స్కూల్ క్రికెట్ మ్యాచ్‌లో 664 పరుగుల వర్షం కురిపించారు. వినోద్ కాంబ్లీ వ్యక్తిగతంగా 349 పరుగులతో దోహదపడ్డాడు. వారి కోచ్ రమాకాంత్ అచ్రేకర్ ఈ జంటను ఇన్నింగ్స్ డిక్లేర్ చేయమని ఒత్తిడి చేశాడు. వినోద్ కాంబ్లీ సెయింట్ జేవియర్స్ మొదటి ఇన్నింగ్స్‌లో 37 పరుగులకు ఆరు వికెట్లు పడగొట్టాడు.

కెరీర్

[మార్చు]

వినోద్ కాంబ్లీ తాను ఎదుర్కొన్న తొలి బంతికే సిక్స్‌తో రంజీ ట్రోఫీ కెరీర్‌ను ప్రారంభించాడు. అతను 1991, 1992లలో వరుసగా వన్డే ఇంటర్నేషనల్, టెస్ట్ మ్యాచ్ లతో అరంగేట్రం చేశాడు. టెస్టుల్లో రెండు డబుల్ సెంచరీలతో సహా నాలుగు సెంచరీలు చేశాడు. టెస్టుల్లో అత్యంత వేగంగా 14 ఇన్నింగ్స్‌లలో 1000 పరుగులు చేసిన భారత ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.