ముహమ్మద్ అజహరుద్దీన్

వికీపీడియా నుండి
(అజహరుద్దీన్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
ముహమ్మద్ అజహరుద్దీన్

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2009
ముందు షాఫిఖర్ రహమాన్ బరక్
నియోజకవర్గం మొరదాబాద్

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెసు
జీవిత భాగస్వామి సంగీత బిజ్లానీ
సంతానం అయాజుద్దిన్
అసద్
మతం ఇస్లాం
వెబ్‌సైటు http://azhar.co/
2 జనవరి, 2014నాటికి


ముహమ్మద్ అజహరుద్దీన్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు ముహమ్మద్ అజహరుద్దీన్
మారుపేరు అజహర్
జననం (1963-02-08) 1963 ఫిబ్రవరి 8 (వయస్సు 59)
హైదరాబాదు - ఆంధ్రప్రదేశ్ - భారత్, భారత్
పాత్ర బ్యాట్స్-మ్యాన్
బ్యాటింగ్ శైలి కుడిచేతి బ్యాట్స్‌మాన్
బౌలింగ్ శైలి Right-arm మీడియం
అంతర్జాతీయ క్రికెట్ సమాచారం
తొలి టెస్టు (cap 169) 31 డిసెంబరు 1984: v ఇంగ్లాండు
చివరి టెస్టు 2 మార్చి 2000: v దక్షిణాఫ్రికా
తొలి వన్డే (cap 51) 20 జనవరి 1985: v ఇంగ్లాండు
చివరి వన్డే 3 జూన్ 2000:  v పాకిస్తాన్
దేశవాళీ క్రికెట్ సమాచారం
Years Team
1981–2000 హైదరాబాద్ క్రికెట్ టీమ్
1983–2000 సౌత్ జోన్
1991–1994 Derbyshire
కెరీర్ గణాంకాలు
TestODIFCLA
మ్యాచ్‌లు 99 334 229 433
పరుగులు 6,215 9,378 15,855 12,941
బ్యాటింగ్ సగటు 45.03 36.92 51.98 39.33
100s/50s 22/21 7/58 54/74 11/85
అత్యుత్తమ స్కోరు 199 153* 226 161*
వేసిన బంతులు 13 552 1,432 827
వికెట్లు 0 12 17 15
బౌలింగ్ సగటు 39.91 46.23 47.26
ఒకే ఇన్నింగ్స్ లో 5 వికెట్లు 0 0 0
ఒకే మ్యాచ్ లో 10 వికెట్లు n/a 0 n/a
అత్యుత్తమ బౌలింగ్ 0/4 3/19 3/36 3/19
క్యాచ్ లు/స్టంపింగులు 105/– 156/– 220/– 200/–

As of 13 February, 2009
Source: CricketArchive

ముహమ్మద్ అజహరుద్దీన్ (జననం 1963, ఫిబ్రవరి 8, హైదరాబాదులో) అజహర్ గా పిలువబడే అజహరుద్దీన్, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్. మ్యాచ్‌ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొని ఆటకు దూరమయ్యాడు. కానీ కోర్టులో ఆ కేసు నుంచి నిర్దోషిగా విడుదలయ్యాడు.[1] మే 2009 లో కాంగ్రెస్ పార్టీ తరఫున పార్లమెంటు సభ్యునిగా ఉత్తరప్రదేశ్ లోని మురాదాబాద్ నియోజకవర్గం నుండి గెలుపొందాడు. ఈయన సికింద్రాబాదులోని మహబూబ్ కళాశాలలో చదువుకున్నాడు.

జీవిత చరిత్ర[మార్చు]

అజారుద్దీన్ 1963 ఫిబ్రవరి 8 న మహమ్మద్ అజీజుద్దీన్, యూసఫ్ సుల్తానా దంపతులకు, హైదరాబాదులో జన్మించాడు. ఆల్ సెయింట్స్ హైస్కూల్లో చదివాడు. నిజాం కళాశాల నుంచి బి.కాం డిగ్రీ పుచ్చుకున్నాడు.[2]

క్రికెట్ జీవితం[మార్చు]

ఇతని మణికట్టు ఆట శైలికి పేరు పొందాడు. ఇతను మొట్టమొదటిసారిగా 1984 డిసెంబరు 31 న కలకత్తాలో భారత్ ఇంగ్లండు దేశాల మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్ తో అంతర్జాతీయ కెరీర్ ప్రారంభించాడు. మొదటి ఇన్నింగ్స్ లోనే 322 బంతులు ఎదుర్కొని 110 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ లో ఇతనికి జతగా రవిశాస్త్రి 111 పరుగులు చేశాడు. ఈ ఆట డ్రాగా ముగిసింది. తర్వాత ఆడిన రెండు టెస్టు మ్యాచుల్లోనూ అజర్ రెండు శతకాలు సాధించాడు.

1989 లో కృష్ణమాచారి శ్రీకాంత్ తర్వాత భారత క్రికెట్ జట్టు కెప్టెన్సీ చేపట్టాడు. మొత్తం 47 టెస్ట్ మ్యాచులు, 174 వన్డే మ్యాచులకు కెప్టెన్ గా వ్యవహరించాడు.

మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు[మార్చు]

2000 లో అజారుద్దీన్ మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొన్నాడు.[3] సిబిఐ నివేదిక ప్రకారం దక్షిణాఫ్రికా కెప్టెన్ హ్యాన్సీ క్రోనే కి బుకీలకు పరిచయం చేసింది అజారుద్దీనే.[4] సిబిఐ తరఫున కె. మాధవన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఐసిసి, బిసిసిఐ అజారుద్దీన్ ను జీవితకాలం క్రికెట్ లో ఆడకుండా నిషేధించారు.[5] [6]

2012 నవంబరు 8 న హైదరాబాదులోని డివిజనల్ కోర్టులోని న్యాయమూర్తులు అశుతోష్ మొహంతా, కృష్ణమోహన్ రెడ్డి కోర్టుకు సమర్పించిన ఆధారాల మేరకు ఆయనపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేశారు. అతనిపై నిషేధం అక్రమమని తీర్పు చెప్పింది. అయితే ఆరోపణలు ఎదుర్కొన్నప్పటి నుంచి అజహర్ మైదానంలోకి రాలేదు. ఈ తీర్పు వెలువడే నాటికి అజహర్ వయసు 49 సంవత్సరాలు.[7][8][9]

రాజకీయ జీవితం[మార్చు]

2009 పార్లమెంటు ఎన్నికలు[మార్చు]

కాంగ్రెస్ పార్టీ తరఫున పార్లమెంటు సభ్యునిగా ఉత్తరప్రదేశ్ లోని మురాదాబాద్ నియోజకవర్గం నుండి 49,107 మెజారిటీతో గెలుపొందాడు.[10]

ఇతరాలు[మార్చు]

2013 జూలై 14 న మొహమ్మద్ అజహరుద్దీన్ ఢిల్లీ బ్యాడ్మింటన్ సంఘం (డీబీఏ) అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు.[11]

వ్యక్తిగత జీవితం[మార్చు]

అజహర్ తన మొదటి భార్య నౌరీన్ కు విడాకులిచ్చి, నటి సంగీతా బిజలానీని వివాహం చేసుకున్నాడు. మొదటి భార్య సంతానం ఇద్దరు కొడుకులు అయాజుద్దీన్, అసద్. అయాజుద్దీన్ 2011 సెప్టెంబరు 11 న ఔటర్ రింగ్ రోడ్డులో పుప్పాలగూడ వద్ద బైక్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చనిపోయాడు.

మూలాలు[మార్చు]

  1. http://news.bbc.co.uk/sport2/hi/in_depth/2000/corruption_in_cricket/1055889.stm
  2. "Biography of Azhar". azhar.co.in. Retrieved 12 May 2016..
  3. The CBI Report in Full – Part 26 (Report). 1 November 2000. Retrieved 21 December 2010 – via Rediff.com.
  4. The CBI Report in Full – Part 25 (Report). 1 November 2000. Retrieved 21 December 2010 – via Rediff.com.
  5. Full text of the CBI (Report). Central Bureau of Investigation, New Delhi. 1 November 2000. Retrieved 21 December 2010 – via Rediff.com.
  6. "Azharuddin confesses all". Archived from the original on 11 January 2022.
  7. "AP high court lifts ban on Azharuddin". Wisden India. 8 November 2012. Archived from the original on 12 మే 2016. Retrieved 14 May 2016. {{cite news}}: Check date values in: |archive-date= (help)
  8. "Match fixing scandal". The Hindu. 8 November 2012. Retrieved 21 March 2015.
  9. "Match fixing charges: Andhra court says life ban on Azharuddin illegal". NDTV. 8 November 2012. Archived from the original on 9 June 2016. Retrieved 21 March 2015.
  10. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-10-11. Retrieved 2013-11-25.
  11. http://www.andhraprabha.com/sports/azahar-new-innings/1140.html[permanent dead link]

బయటి లింకులు[మార్చు]