Jump to content

మ్యాచ్ ఫిక్సింగు

వికీపీడియా నుండి

వ్యవస్థీకృత క్రీడలలో, మ్యాచ్ ఫిక్సింగ్ అనేది ముందుగా నిర్ణయించిన ఫలితాన్ని సాధించాలనే ఉద్దేశ్యంతో, ఆట నియమాలను, కొన్నిసార్లు చట్టాలనూ ఉల్లంఘించి ఆడటం లేదా ఆటను నిర్వహించడం. దీన్ని గేమ్ ఫిక్సింగ్, రేస్ ఫిక్సింగ్ లేదా సాధారణంగా స్పోర్ట్స్ ఫిక్సింగ్ అని కూడా అంటారు. మ్యాచ్ ఫిక్సింగ్ జరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. బుక్‌మేకర్లు లేదా స్పోర్ట్స్ బెట్టింగ్ చేసేవారి నుండి లంచాలు స్వీకరించడం, బ్లాక్ మెయిల్ చేయడం వంటివి వీటిలో కొన్ని. మెరుగైన డ్రాఫ్ట్ పిక్[1] లేదా తదుపరి రౌండ్ పోటీలో సులభమైన ప్రత్యర్థిని ఎదుర్కోవడం వంటి ప్రయోజనాలను పొందేందుకు పోటీదారులు ఉద్దేశపూర్వకంగా సరిగా ఆడకపోవచ్చు.[2] హ్యాండిక్యాప్ సిస్టమ్‌ను అడ్డగోలుగా., అనుకూలంగా వాడుకోవడానికి కూడా ఆటగాడు పేలవంగా ఆడవచ్చు.[3]

జూదం కోసం మ్యాచ్ ఫిక్సింగ్ జరిగినప్పుడు, జూదగాళ్లు, ఆటగాళ్లు, జట్టు అధికారులు, లేదా రిఫరీల మధ్య పరిచయాలు (డబ్బులు చేతులు మారడం కూడా జరుగుతుంది) అవసరమౌతాయి. ఈ పరిచయాలు, డబ్బు మార్పిళ్ళూ కొన్నిసార్లు తెలిసిపోతాయి. తద్వారా చట్టం లేదా స్పోర్ట్స్ లీగ్‌ల ద్వారా విచారణకు దారితీయవచ్చు. అయితే, భవిష్యత్తులో జరిగే ఆటల్లో ప్రయోజనం కోసం జట్లు కావాలని ఓడిపోవడం అనేది అంతర్గత విషయం. దాన్ని నిరూపించడం చాలా కష్టం. ఉద్దేశపూర్వకంగా తమ జట్టు ఓడిపోయే అవకాశాలను పెంచడానికి కోచ్‌లు ఆటమధ్యలో ఆటగాళ్లను మార్చవచ్చు (చిన్నపాటి గాయాలను, అసలు లేని దెబ్బలనూ సాకుగా చూపి, కీలకమైన ఆటగాళ్ళను బయట కూర్చోబెట్టడం వంటివి). వాస్తవానికి మైదానంలో ఉన్న ఆటగాళ్లను ఉద్దేశపూర్వకంగా సరిగ్గా ఆడవద్దని చెప్పడం కంటే పై పద్ధతినే ఎక్కువగా అవలంబిస్తారని పలు సందర్భాలలో వెల్లడైంది.

మ్యాచ్ ఫిక్సింగ్‌లో పాయింట్ షేవింగ్, స్పాట్ ఫిక్సింగ్ వంటివి కూడా భాగంగా ఉంటాయి. మ్యాచ్‌లోని చిన్న చిన్న సందర్భాలపై పందేలు వేయవచ్చు. కానీ ఇవి గేమ్ తుది ఫలితాన్ని నిర్ణయించడంలో అంత కీలకమైనవి కాకపోవచ్చు. స్పోర్ట్స్ ఫెడరేషన్ల తరపున స్పోర్ట్స్ ఈవెంట్‌ల సమగ్రతను పర్యవేక్షించే సంస్థ అయిన స్పోర్ట్‌రాడార్ ప్రకారం, వారు పర్యవేక్షించే మ్యాచ్‌లలో ఒక శాతం వరకూ అనుమానాస్పద బెట్టింగ్ జరుగుతున్నట్లు చూపాయి. అది మ్యాచ్ ఫిక్సింగుకు సూచన.[4]

ప్రోద్బలాలు, కారణాలు

[మార్చు]

మ్యాచ్ ఫిక్సింగ్ వెనుక ఉన్న కొన్ని ప్రధాన ప్రేరణలు జూదం, భవిష్యత్తు జట్టు ప్రయోజనం. పరిశోధనాత్మక జర్నలిస్ట్ డెక్లాన్ హిల్ ప్రకారం ఇది అవినీతి, హింస, పన్ను ఎగవేతతో కూడా ముడిపడి ఉంది.[5] తూర్పు ఐరోపాలో, వ్యవస్థీకృత నేరాలు అక్రమ జూదాలూ స్కోర్ ఫిక్సింగ్‌తో ముడిపడి ఉన్నాయి. రష్యాలో, క్రీడలలో లంచానికి వ్యతిరేకంగా నిలబడ్డ కొందరు, ఆ తరువాత అదృశ్యమయ్యారు లేదా హత్య చేయబడ్డారు.[6]

జూదగాళ్లతో ఒప్పందాలు

[మార్చు]

జూదగాళ్లతో ఒప్పందాల ద్వారా ధనలాభం కలగవచ్చు. 1919 నాటి బ్లాక్ సాక్స్ స్కాండల్, దీనిలో MLB వారి చికాగో వైట్ సాక్స్ కు చెందిన అనేక మంది సభ్యులు జూదగాళ్లతో కలిసి ద్రవ్య లాభం కోసం ఆ సంవత్సరం వరల్డ్ సిరీస్‌ను ఫిక్సింగు చేసేందుకు కుట్ర పన్నారు. [7]

మెరుగైన ప్లేఆఫ్ అవకాశాలు

[మార్చు]

మెరుగైన డ్రాఫ్ట్ స్థానం

[మార్చు]

పైఏడు మరింత అనుకూలమైన షెడ్యూల్ కోసం

[మార్చు]

రిఫరీలు చేసే మ్యాచ్ ఫిక్సింగు

[మార్చు]

ఆటగాళ్ళు, కోచ్‌లు, టీమ్ అధికారులూ చేసే మ్యాచ్ ఫిక్సింగుతో పాటు, అవినీతిపరులైన రిఫరీలు ఫలితాలను తారుమారు చేయడం వింత కాదు. 2004 నుండి, పోర్చుగల్‌, జర్మనీ (బుండెస్లిగా కుంభకోణం ), బ్రెజిల్ ( బ్రెజిలియన్ ఫుట్‌బాల్ మ్యాచ్-ఫిక్సింగ్ కుంభకోణం ), యునైటెడ్ స్టేట్స్ ( టిమ్ డోనాఘీ కుంభకోణం చూడండి) ల లోని ప్రముఖ స్పోర్ట్స్ లీగ్‌లలో కుంభకోణాలు చెలరేగాయి.[8] ఇవన్నీ, జూదగాళ్ల కోసం మ్యాచ్‌లు ఫిక్స్ చేసిన రిఫరీలకు సంబంధించినవే. అధిక జీతాలు తీసుకునే ఆటగాళ్ళున్న లీగ్‌లలో, రిఫరీ అవినీతికి పాల్పడే అవకాశం ఎక్కువగా ఉంటుందని చాలా మంది క్రీడా రచయితలు ఊహించారు. ఎందుకంటే అటువంటి పోటీలలో వారి వేతనం సాధారణంగా ఆటగాళ్ల కంటే చాలా తక్కువగా ఉంటుంది.

డ్రా కోసం లేదా ముందే అనుకున్న స్కోరు కోసంమ్యాచ్ ఫిక్సింగు

[మార్చు]

మ్యాచ్ ఫిక్సింగ్‌లో ఉద్దేశపూర్వకంగా మ్యాచ్ ఓడిపోవాల్సిన అవసరమేమీ లేదు. అప్పుడప్పుడు, జట్లు ఉద్దేశపూర్వకంగా డ్రా కోసమో ముందే అనుకున్న ఒక స్కోరు సాధించేందుకో ఆడుతున్నాయనే ఆరోపణలున్నాయి. ఇది పరస్పర ప్రయోజనాల కోసం ఉద్దేశించినది (ఉదా. రెండు జట్లూ పోటీలో తదుపరి దశకు చేరుకోవడం.) ఆధునిక కాలంలో ఈ విధమైన మ్యాచ్ ఫిక్సింగ్‌కు ఒక ఉదాహరణ - 1898 లో స్టోక్ సిటీ, బర్న్లీ జట్లు ఆ ఏటి చివరి "టెస్ట్ మ్యాచ్"లో ఉద్దేశ్యపూర్వకంగా డ్రా చేసుకుని, తర్వాతి సీజన్‌లో ఇద్దరూ ఫస్ట్ డివిజన్‌లో ఉండేలా చూసుకున్నారు. ప్రతిస్పందనగా, ఫుట్‌బాల్ లీగ్ ఆ సంవత్సరం డివిజన్‌లను 18 జట్లకు విస్తరించింది, తద్వారా ఆ ఫిక్సింగుకు గురైన బాధిత జట్లు ( న్యూకాజిల్ యునైటెడ్, బ్లాక్‌బర్న్ రోవర్స్) కూడా మొదటి డివిజన్‌లో ఉండేలా చూసారు. "టెస్ట్ మ్యాచ్" వ్యవస్థను రద్దు చేసి, దాని స్థానంలో ఆటోమేటిక్ బహిష్కరణ పద్ధతిని ప్రవేశపెట్టారు.

మూడవ ప్రత్యర్థిని దెబ్బతీయడం కోసం కావాలని ఓడిపోవడం

[మార్చు]

ఒక జట్టు ఉద్దేశపూర్వకంగా ఒక మ్యాచ్‌లో ఓడిపోయి, ప్రత్యర్థి జట్టుకు విజయాన్ని అందించి, మూడవ ప్రత్యర్థిని దెబ్బతీయడం దీనిలో ఉద్దేశం. దీనికి ఉదాహరణ 1999-2000 లా లిగా సమయంలో స్పెయిన్‌లోని సెవిల్లాలో జరిగింది. సెవిల్లా FC చివరి స్థానంలో ఉంది, అప్పటికే అధికారికంగా పోటీలోంచి బయటికి పోయింది. సీజన్‌లో ముప్పై-ఐదవ మ్యాచ్‌లో (మొత్తం 38), సెవిల్లా, బహిష్కరణను నివారించడానికి పోరాడుతున్న రియల్ ఒవిడోతో తలపడింది. ఇందులో ఓవిడో గెలిస్తే సెవిల్లాకు బలమైన ప్రత్యర్థి అయిన రియల్ బెటిస్‌ బయటికి పోతుంది. ఆ ఆటలో సెవిల్లా పేలవంగా ఆడింది. దాని అభిమానులు ఓవిడోకు మద్దతునిచ్చారు. అస్టురియా జట్టు స్కోరింగు చేసే అవకాశాలను కోల్పోయినందుకు ఆందోళన వ్యక్తం చేశారు. చివరికి ఒవిడో 3-2 తో సెవిల్లాను ఓడించడంతో, బెటిస్‌ పోటీ లోంచి బయటికి పోయింది.[9] పన్నెండు సంవత్సరాల తరువాత, మాజీ సెవిల్లా గోల్‌కీపర్ ఫ్రోడ్ ఒల్సేన్ బెటిస్‌ను పోటీ లేకుండా చేసేందుకు ఉద్దేశపూర్వకంగా తమ జట్టు ఓడిపోయిందని అంగీకరించాడు.[10]

ఆట వసూళ్ళు పెంచేందుకు

[మార్చు]

టై బ్రేకింగ్ నిబంధనల దుర్వినియోగం

[మార్చు]

క్రికెట్ లో కొన్ని మ్యాచ్‌ల ఫిక్సింగులో టై బ్రేకింగ్ నియమాలు ప్రధాన పాత్ర పోషించాయి. 1979 లో ఇంగ్లండ్‌లో బెన్సన్ & హెడ్జెస్ కప్ లీగ్‌లో వోర్సెస్టర్‌షైర్ చివరి గ్రూప్ మ్యాచ్‌లో సోమర్‌సెట్‌కు ఆతిథ్యం ఇచ్చింది. అప్పటికే సోమర్‌సెట్ మూడు మ్యాచ్‌లలో మూడు విజయాలతో తమ గ్రూపులో అగ్రస్తానంలో ఉంది. అయితే వారు వోర్సెస్టర్‌షైర్‌తో ఓడిపోతే, గ్లామోర్గాన్ అప్పటికి ఒక్క గెలుపు కూడా లేని మైనర్ కౌంటీస్ సౌత్‌ను ఓడించినట్లయితే అగ్రస్థానానం కోసం మరో రెండు జట్లతో పోటీ పడాల్సి వస్తుంది. అలా జరిగితే, బౌలింగులో ఎవరి స్ట్రైక్ రేట్ ఎక్కువ ఉంటే ఆ జట్టు అగ్రస్థానానికి వెళ్తుంది. సోమర్సెట్ ఆటగాళ్ళు, తాము బాగా పెద్ద తేడాతో ఓడిపోతే క్వార్టర్-ఫైనల్‌కు చేరే అవకాశం కోల్పోవచ్చని లెక్క వేసుకున్నారు. అలా జరగకుండా ఉండేందుకు గాను, తాము ముందుగా బ్యాటింగ్ చేసి, ఒకే ఒక్క ఓవర్ తర్వాత తమ ఇన్నింగ్స్‌ను ముగించినట్లు డిక్లేరు చేసినట్లైతే, తమకు సరిపడా స్ట్రైక్ రేట్ ఉంటుందనీ, క్వార్టర్-ఫైనల్‌కు వెళ్ళడానికి ఢోకా ఉండదనీ సోమర్‌సెట్ కెప్టెన్ బ్రియాన్ రోస్ లెక్క వేసుకున్నాడు. సోమర్సెట్ టాస్ గెలవడంతో, రోజ్ తన ప్రణాళిక ప్రకారం, మొదట బ్యాటింగ్ చేసి, తొలి ఓవరులో ఒక పరుగు మాత్రమే చేసి డిక్లేర్ చేసాడు. వోర్సెస్టర్‌షైర్ రెండో ఓవర్‌లో విజయం సాధించింది. రోజ్ వ్యూహం, నియమాలకు వ్యతిరేకమేమీ కానప్పటికీ, మీడియా, క్రికెట్ అధికారులు ఆ వ్యూహాన్ని విమర్శించారు. టెస్ట్ అండ్ కౌంటీ క్రికెట్ బోర్డు, సోమర్‌సెట్‌ను ఆ సీజన్ పోటీల నుండి బహిష్కరించింది.

బహుమతిలో భాగస్వామ్యం

[మార్చు]

ప్రత్యర్థికి వచ్చే బహుమతిలో తనకూ వాటా ఇవ్వాలనే ముందస్తు అవగాహనకు వచ్చాక ఆటగాడు ఓడిపోవచ్చు. ఆట జరిగిన విధానాన్ని బట్టి, ఇది అనర్హతకు దారి తీయవచ్చు.[11]

నిరసన చర్య

[మార్చు]

విరుద్ధాసక్తులు

[మార్చు]

జట్టు క్రీడలలో వ్యక్తిగత ప్రదర్శన

[మార్చు]

చరిత్ర

[మార్చు]

క్రీడల చరిత్ర నిండా మ్యాచ్ ఫిక్సింగుకు ఆధారాలు లభిస్తాయి. మ్యాచ్ ఫిక్సింగు చరిత్ర, చట్టవిరుద్ధమైన జూదపు చరిత్రకూ దగ్గరి సంబంధం ఉంది.[12]

పురాతన ఒలింపిక్ క్రీడలు పోటీలో [13] ఓడిపోవడానికి అథ్లెట్లు లంచాలు తీసుకుంటున్నారనే ఆరోపణలు, పెద్ద మొత్తంలో డబ్బుతో ఫలితాన్ని తారుమారు చేయడానికి ప్రయత్నించే నగర-రాష్ట్రాల ఆరోపణలూ ఎప్పుడూ ఉండేవి. ఈవెంట్‌ల సమగ్రతను కాపాడేందుకు ప్రతి అథ్లెట్ ప్రమాణం చేసినప్పటికీ, కొన్నిసార్లు పట్టుబడిన వారికి కఠినమైన శిక్ష విధించినప్పటికీ ఈ కార్యకలాపాలు కొనసాగాయి. రథాల పోటీలలో ఫిక్సింగు బాగా జరిగేది.

క్రికెట్లో

[మార్చు]

అంతర్జాతీయ క్రికెట్‌లో మ్యాచ్ ఫిక్సింగ్‌కు సంబంధించిన కొన్ని అపఖ్యాతి పాలైన సందర్భాలు ఉన్నాయి. 2000 లో ఢిల్లీ పోలీసులు బ్లాక్‌లిస్ట్‌లో ఉన్న ఒక బుకీకి, దక్షిణాఫ్రికా క్రికెట్ కెప్టెన్ హన్సీ క్రోన్యేకీ మధ్య జరిగిన సంభాషణను విన్నారు. అందులో మ్యాచ్‌లు వదులుకోడానికి క్రోన్యే డబ్బు తీసుకున్నాడని తెలుసుకున్నారు. విచారణలో క్రోన్యే, మ్యాచ్‌ ఫిక్సింగు చేసినట్లు అంగీకరించాడు. వెంటనే అతడిని అన్ని రకలా క్రికెట్ పోటీల నుంచి నిషేధించారు. అతను సలీమ్ మాలిక్ (పాకిస్తాన్), మహ్మద్ అజారుద్దీన్, అజయ్ జడేజా (భారత్) లను తన తోటి మ్యాచ్ ఫిక్సర్లుగా పేర్కొన్నాడు. జడేజాపై 4 ఏళ్ల నిషేధం పడింది. క్రోన్యే బెట్టింగ్‌లో కింగ్‌పిన్ అయినప్పటికీ, 2002 లో అతని అకాల మరణం తర్వాత అతని ఫిక్సింగ్ భాగస్వాములు చాలా మంది చట్ట సంస్థల నుండి తప్పించుకున్నారు. అంతకుముందు 1998 లో, ఆస్ట్రేలియా ఆటగాళ్లు మార్క్ వా, షేన్ వార్న్‌లు 'వాతావరణం' గురించి బుక్‌మేకర్‌కు వెల్లడించినందుకు వారికి జరిమానా విధించారు.

2010 వేసవిలో పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఇంగ్లాండ్‌లో జరిపిన పర్యటనలో నాల్గవ టెస్టులో స్పాట్ ఫిక్సింగ్ కు సంబంధించిన అనేక సంఘటనలు జరిగాయి. ఇందులో పాకిస్తాన్ జట్టు సభ్యులు బుక్‌మేకర్ల ద్వారా బెట్టింగ్‌ను సులభతరం చేయడానికి నిర్దిష్ట పాయింట్ల వద్ద ఉద్దేశపూర్వకంగా నో-బాల్‌లు వేసారు.[14] విచారణ తరువాత, ముగ్గురు పాకిస్తానీ ఆటగాళ్లను క్రికెట్ నుండి నిషేధించి, వారికి జైలు శిక్ష విధించారు.[15] అదేవిధంగా, 2013 లో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో, మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై S. శ్రీశాంత్, మరో ఇద్దరు ఆటగాళ్లను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు నిషేధించింది.[16] శ్రీశాంత్ నిషేధాన్ని కొద్ది రోక్జుల్లోనే ఎత్తివేసారు. అయితే కేరళ హైకోర్టు 2017లో నిషేధాన్ని సమర్థించింది.[17]

భారత్, శ్రీలంకల మధ్య జరిగిన 2011 క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ ఫిక్స్ అయ్యిందని శ్రీలంక మాజీ క్రికెట్ కెప్టెన్ అర్జున రణతుంగ 2017 జూలైలో ఆరోపించాడు. సాక్ష్యాధారాలు లేకపోవడంతో 2020 లో శ్రీలంక అధికారులు, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ దర్యాప్తును విరమించుకున్నారు.[18][19][20]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; draft pick అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  2. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; easier opponent అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  3. Myers Gallardo, Alfonso (2015). Corrupción en el deporte. Represión penal ¿necesaria?, en Carrillo, Ana & Myers Gallardo, Alfonso (Edts.) "Corrupción y delincuencia económica: prevención, represión y recuperación de activos", Universidad de Salamanca, Ratio Legis, pp. 195–216
  4. "Fixers beware". Gambling Insider. Archived from the original on 19 April 2023. Retrieved 24 January 2016.
  5. Hill, Declan (2008). The Fix: Soccer and Organized Crime. ISBN 9780771041389.
  6. Likaista peliä ja rahaa, Voima 9/2017 page.30
  7. Leifer, Eric M. (1998). Making the majors: The transformation of team sports in America. Harvard University Press. pp. 88–89. ISBN 978-0674543317.
  8. "Porto chief up on referee bribery charges". ESPN. Archived from the original on 2011-04-27. Retrieved 2008-09-05.
  9. Ponce de León, R. (2000-05-01). "Mummery at the Sánchez Pizjuán. An indolent Sevilla lets Oviedo win in a shameful match". El País. Seville. Archived from the original on 2020-11-05. Retrieved 2020-12-09.
  10. "Frod Olsen, former Sevilla goalkeeper, admits they tanked in 2000 to damage Betis". Mundo Deportivo. Barcelona. 2012-07-11. Archived from the original on 2020-11-05. Retrieved 2020-12-09.
  11. "Unsporting Conduct — Improperly Determining a Winner and Bribery". November 2013. Archived from the original on 4 November 2016. Retrieved 3 November 2016.
  12. Paoli, Letizia (2014). The Oxford Handbook of Organized Crime. Oxford University Press. p. 414.
  13. Owen Jarus (Apr 17, 2014). "The Fix Was in for Ancient Wrestling Match". Discovery News. Archived from the original on April 20, 2014. Retrieved April 18, 2014.
  14. "England beat Pakistan in tarnished Test to win series". BBC Sport. 29 August 2010. Archived from the original on 1 April 2020. Retrieved 3 August 2010.
  15. "Salman Butt and Pakistan bowlers jailed for no-ball plot". BBC News. Archived from the original on 2018-10-30. Retrieved 2016-08-11.
  16. "Sreesanth: Former India bowler banned for life for spot-fixing". BBC. 2013-09-13. Archived from the original on 2014-09-12. Retrieved 26 September 2013.
  17. Gollapudi, Nagraj (18 October 2017). "Kerala High Court restores Sreesanth's life ban". ESPNcricinfo. ESPN.com. Archived from the original on 9 February 2019. Retrieved 7 February 2019.
  18. "Former Sri Lanka minister alleges 2011 Cricket World Cup final was fixed; Jayawardene, Sangakkara demand evidence". The New Indian Express. 18 June 2020. Archived from the original on 2021-04-11. Retrieved 2021-06-21.
  19. "ICC rubbishes allegations of match-fixing in 2011 World Cup". The Indian Express (in ఇంగ్లీష్). 2020-07-04. Archived from the original on 2021-04-11. Retrieved 2021-06-21.
  20. "Sri Lanka police calls off 2011 World Cup final fixing probe". Hindustan Times (in ఇంగ్లీష్). 2020-07-03. Archived from the original on 2021-04-11. Retrieved 2021-06-21.