శ్రీశాంత్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శాంతకుమరన్ శ్రీశాంత్
Sreesanth on the sets of KBC 10.jpg
2012 లో ఒక కార్యక్రమంలో శ్రీశాంత్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు శాంతకుమరన్ శ్రీశాంత్
జననం (1983-02-06) 1983 ఫిబ్రవరి 6 (వయసు 40)
కోథమంగళం,
కేరళ,
భారతదేశం
ఇతర పేర్లు శ్రీ, గోపు
ఎత్తు 5 అ. 11 అం. (1.80 మీ.)
బ్యాటింగ్ శైలి Right-handed
బౌలింగ్ శైలి Right-arm fast-medium
పాత్ర Bowler
అంతర్జాతీయ సమాచారం
జాతీయ జట్టు భారతదేశం
టెస్టు అరంగ్రేటం(cap 253) 1 March 2006 v England
చివరి టెస్టు 18 August 2011 v England
వన్డే లలో ప్రవేశం(cap 162) 25 October 2005 v Sri Lanka
చివరి వన్డే 2 April 2011 v Sri Lanka
టి20ఐ లో ప్రవేశం(cap 10) 1 December 2006 v South Africa
చివరి టి20ఐ 1 February 2008 v england
దేశవాళీ జట్టు సమాచారం
సంవత్సరాలు జట్టు
2002–2013 కేరళ
2008–2010 Kings XI Punjab
2009 Warwickshire
2011 Kochi Tuskers Kerala
Banned for life in 2013[1] Rajasthan Royals
కెరీర్ గణాంకాలు
పోటీ Tests ODI FC List A
మ్యాచ్‌లు 27 53 72 82
సాధించిన పరుగులు 284 44 642 127
బ్యాటింగ్ సగటు 10.40 4.00 9.44 6.04
100s/50s 0/0 0/0 0/0 0/0
ఉత్తమ స్కోరు 35 10* 35 33
బాల్స్ వేసినవి 5,419 2,476 12,895 3,874
వికెట్లు 87 75 210 104
బౌలింగ్ సగటు 37.59 33.44 35.55 35.48
ఇన్నింగ్స్ లో 5 వికెట్లు 3 1 6 1
మ్యాచ్ లో 10 వికెట్లు 0 0 0 0
ఉత్తమ బౌలింగ్ 5/40 6/55 5/40 6/55
క్యాచులు/స్టంపింగులు 5/– 7/– 16/– 9/–
Source: Cricinfo, 4 January 2013

శాంతకుమరన్ శ్రీశాంత్ ఒక కళంకిత భారతీయ క్రికెట్ ఆటగాడు. మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడి జీవితకాల నిషేధానికి గురయ్యాడు.

నేపధ్యము[మార్చు]

జట్టులో ఒకప్పుడు కీలక బౌలర్‌గా ఎదిగిన కేరళ స్పీడ్‌స్టర్ శ్రీశాంత్‌కు ఆది నుంచీ దూకుడెక్కువే. తన ప్రవర్తనతో ఎన్నోసార్లు మందలింపునకు గురయ్యాడు. మైదానంలో ఏమాత్రం ఆవేశం ఆపుకోలేని తత్వంతో వివాదాస్పదంగా మారాడు. కేరళ తరఫున రంజీల్లో హ్యాట్రిక్ నమోదు చేసిన తొలి ఆటగాడిగా గుర్తింపు పొందిన శ్రీ అనవసరంగా ఉద్రేకపడే స్వభావంతో కెరీర్‌ను ఇబ్బందుల్లో పడేసుకున్నాడు.

2005లో చాలెంజర్స్ ట్రోఫీలో బాగా ఆడటంతో తొలిసారిగా జాతీయ జట్టుకు ఎంపికై ఆకట్టుకున్నాడు. ప్రత్యర్థి జట్టుకు ధారాళంగా పరుగులు ఇచ్చినా వికెట్లు తీయగలడని పేరు తెచ్చుకున్నాడు. ఐపీఎల్ తొలి సీజన్‌లో పంజాబ్‌కు ఆడిన సమయంలో ముంబై ఆటగాడు హర్భజన్ సింగ్‌తో చెంప దెబ్బ తిని వార్తల్లోకెక్కాడు. ఆ తర్వాత కెప్టెన్ ధోని, భజ్జీతో పొసకగపోవడం ఇతడిని మరింత ఇబ్బందుల్లోకి నెట్టింది. స్పాట్ ఫిక్సింగ్‌లో శ్రీశాంత్ పాత్ర ఉన్నట్టు ఢిల్లీ పోలీసులు ప్రకటించారు. 2013 సెప్టెంబరు 13, శుక్రవారం బీసీసీఐ ఈ 30 ఏళ్ల ఆటగాడిపై జీవిత కాలం వేటు వేయడంతో కెరీర్‌కు ఫుల్‌స్టాప్ పడింది.[2]

వివాహము[మార్చు]

ఇతని వివాహమురాజస్థాన్ రాజవంశానికి చెందిన జ్యువెలరీ డిజైనర్ భువనేశ్వరి కుమారితో గురువాయూరు లోని శ్రీ కృష్ణ ఆలయంలో 2013 డిసెంబరు 12 తేదిన జరిగింది. ఇరు కుటుంబాలకు చెందినవారితో పాటు అతి కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో గురువాయూర్ లోని శ్రీ కృష్ణ ఆలయంలో వీరిద్దరు కేరళ హిందు సంప్రదాయం ప్రకారం ఒకటయ్యారు. గత కొద్ది సంవత్సరాలుగా వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం కొనసాగుతోందని.. ఐపీఎల్ ఆరవ ఎడిషన్ లో స్పాట్ ఫిక్సింగ్ పాల్పడి.. జైలుకెళ్లిన సమయంలో కూడా శ్రీశాంత్ కు నయన్ బాసటగా నిలిచింది.[3]

చిత్రమాలిక[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Who is Jiju Janardhanan?". India Today Online. India Today. Retrieved 17 May 2013.
  2. http://timesofindia.indiatimes.com/sports/cricket/fixing-hits-ipl/news/Sreesanth-The-showman-who-couldnt-handle-the-spotlight/articleshow/22561026.cms
  3. "Sreesanth marries Jaipur princess Bhuveneshwari Kumari". ZeeNews. 2013-12-12. Archived from the original on 2013-12-13. Retrieved 2013-12-12.

యితర లింకులు[మార్చు]