స్పాట్ ఫిక్సింగ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

స్పాట్-ఫిక్సింగ్ అనేది క్రీడల్లో చేసే చట్టవిరుద్ధమైన చర్య. దీనిలో ఆట లోని నిర్దిష్ట అంశం గురించి ఈ చర్య ఉంటుంది తప్ప, తుది ఫలితంతో దీనికి సంబంధం ఉండదు. కానీ బెట్టింగ్ మార్కెట్ దీని ప్రభావం ఉంటుంది. ప్రతిపాదన పందెంలో నిర్దిష్ట ఫలితాన్ని నిర్ధారించే ప్రయత్నంలో భాగంగా ఉంటుంది. ఉదాహరణకు, క్రికెట్‌లో నో బాల్ లేదా వైడ్ డెలివరీ వేయడం లేదా అసోసియేషన్ ఫుట్‌బాల్‌లో మొదటి త్రో-ఇన్ లేదా కార్నర్‌ను టైమింగ్ చేయడం వంటివి.

నిర్దిష్ట ఈవెంట్ ఫలితాన్ని ప్రభావితం చేసేలా ఒక ఆటగాడు ముందుగా అనుకున్న చర్యను తీసుకోవడం ద్వారా బుక్‌మేకర్‌లను మోసం చేయడానికి స్పాట్ ఫిక్సింగ్ ప్రయత్నిస్తుంది.[1] స్పాట్ ఫిక్సింగ్ అనేది మ్యాచ్ ఫిక్సింగ్‌కు భిన్నంగా ఉంటుంది. దీనిలో మ్యాచ్ తుది ఫలితం స్థిరంగానే ఉంటుంది లేదా ఆటగాళ్లు (లేదా అధికారులు) ఇష్టపడే జట్టు గెలుపు మార్జిన్‌ను తగ్గించేలా చేయడానికి ప్రయత్నిస్తారు. స్పాట్ ఫిక్సింగును మ్యాచ్ ఫిక్సింగు లేదా పాయింట్ షేవింగుల లాగా గుర్తించడం చాలా కష్టం. దాని స్వభావం ప్రకారం, ఏ ఇతర ఆటగాళ్ళు లేదా అధికారుల సహకారమేమీ లేకుండా, ఒకే ఆటగాడు ఒంటరిగా దీనిని చేయవచ్చు. ఇంటర్నెట్ జూదం, పెరిగిన వివిధ రకాల బెట్టింగుల (ఉదాహరణకు, స్ప్రెడ్ బెట్టింగ్, ఫస్ట్-స్కోరర్ బెట్టింగ్) ఫలితంగా ముఖ్యంగా 2000 ల మొదటి దశాబ్దంలో స్పాట్ ఫిక్సింగ్ ఆవిర్భవించింది.[2]

ఉదాహరణలు[మార్చు]

అసోసియేషన్ ఫుట్‌బాల్[మార్చు]

మాట్ లే టిసియర్ అనే ఫుట్‌బాల్ ఆటగాడు తన పదవీ విరమణ తరువాత, 1995 లో వింబుల్డన్‌తో సౌతాంప్టన్ తరపున ఆడిన మ్యాచ్‌లో మొదటి త్రో-ఇన్ సమయంపై తాను పందెం వేసినట్లు అంగీకరించాడు. ఆ స్కామ్ గురించి తెలియని సహచరుడు తాను ఇచ్చిన అండర్‌హిట్ పాస్‌ను పిచ్‌పైనే ఉంచగలగడంతో అతని ప్లాను విఫలమైంది.[3] లే టిస్సియర్, పందెంలో డబ్బును కోల్పోకుండా ఉండేందుకు, బంతిని ఆట నుండి త్వరగా బైటికి తన్నవలసి వచ్చింది. 70 సెకన్ల తర్వాత బంతిని బైటికి తన్ని పందెం గెలిచాడు. [4] ఈ సంఘటన గురించి తాను చాలా సిల్లీగా భావించానని, మళ్లీ అలాంటి ప్రయత్నం చేయలేదనీ అతను పేర్కొన్నాడు.

క్రికెట్[మార్చు]

క్రికెట్‌లో స్పాట్ ఫిక్సింగ్ మొట్టమొదట 2010 ఇంగ్లండ్ టూర్‌లో అంతర్జాతీయ ప్రాముఖ్యతను సంతరించుకుంది. పాకిస్తాన్ ఆటగాళ్లు మహ్మద్ ఆసిఫ్, మహ్మద్ అమీర్ లు బుక్‌మేకర్లను మోసం చేసేందుకు కెప్టెన్ సల్మాన్ బట్ చేసిన కుట్రలో భాగంగా నిర్దిష్ట డెలివరీలలో ఉద్దేశపూర్వకంగా నో బాల్‌లు వేసినట్లు తేలింది. దీంతో బట్‌పై పదేళ్లు, ఆసిఫ్‌పై ఏడేళ్లు, అమీర్‌పై ఐదేళ్లు నిషేధం పడింది.[5] ఈ విషయం నేర పరిశోధన అంశంగా మారి, దీని ఫలితంగా నలుగురు వ్యక్తులకు శిక్ష పడింది; 2011 నవంబరులో బట్‌కి 30 నెలల జైలుశిక్ష, ఆసిఫ్‌కు ఒక సంవత్సరం, అమీర్‌కు ఆరు నెలల జైలుశిక్ష విధించారు.

2012 ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్‌లో ఐదుగురు ఆటగాళ్లు స్పాట్ ఫిక్సింగ్ కారణంగా సస్పెన్షన్‌కు గురయ్యారు. ఆ ఐదుగురు ఆటగాళ్లు - మోహ్నీష్ మిశ్రా, శలభ్ శ్రీవాస్తవ, టిపి సుధీంద్ర, హర్మీత్ సింగ్, అభినవ్ బాలి. సస్పెన్షన్‌లు సీజన్‌లో ఏదైనా నిర్దిష్ట ఈవెంటులో జరిగినందుకు కాదు.., ఒక స్టింగ్ ఆపరేషనులో ఈ ఐదుగురూ గతంలో స్పాట్ ఫిక్సింగ్‌లో పాల్గొన్న కేసుల గురించి చర్చించుకోవడం, భవిష్యత్తులో స్పాట్ ఫిక్సింగ్ అవకాశాలను కోరుకోవడం గురించి మాట్లాడుకోవడం వెల్లడైంది. [6]

భారతదేశంలో, IPL సీజన్ 6 (2013) లో ముగ్గురు భారతీయ ఆటగాళ్లు శ్రీశాంత్, అంకిత్ చవాన్, అజిత్ చండీలా - స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డారు. వీరితో పాటు పదకొండు మంది బుక్‌మేకర్లను అరెస్టు చేశారు. 2013 మే 16 న ముంబైలో జరిగిన అర్ధరాత్రి ఆపరేషన్‌లో ఢిల్లీ పోలీసులు ఈ ముగ్గురు ఆటగాళ్ళు ఒక ఓవర్‌లో ముందుగా నిర్ణయించిన సంఖ్యలో పరుగులు ఇచ్చినందుకు రూ 60 లక్షలు తీసుకున్నందుకు ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసారు. [7] సెప్టెంబర్ 13న, శ్రీశాంత్‌పై జీవితకాల నిషేధం విధించారు.[8]

ఇంగ్లాండ్‌లో, 2009 సెప్టెంబరులో డర్హామ్‌తో జరిగిన ప్రో40 మ్యాచ్‌లో పేలవంగా బౌలింగ్ చేసిన తర్వాత, ఎసెక్స్ బౌలర్ మెర్విన్ వెస్ట్‌ఫీల్డ్‌పై స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చాయి. వెస్ట్‌ఫీల్డ్ తర్వాత మ్యాచ్‌లో స్పాట్ ఫిక్సింగ్ కోసం డబ్బును అంగీకరించినందుకు నేరాన్ని అంగీకరించాడు. ప్రత్యేకంగా అతను తన మొదటి ఓవర్‌లో పన్నెండు పరుగులు ఇచ్చేందుకు ప్రయత్నించాడు (అయితే అతను కేవలం పది మాత్రమే ఇచ్చాడు); [9] అతన్ని ఐదేళ్ల పాటు నిషేధించారు. అతని ఎసెక్స్ జట్టు సహచరుడు, మాజీ పాకిస్తాన్ టెస్ట్ బౌలర్ డానిష్ కనేరియాపై జీవితకాల నిషేధం విధించారు.[10]

ట్వంటీ 20 క్రికెట్ఆగమనంతో క్రికెట్‌లో స్పాట్ ఫిక్సింగ్‌ను గుర్తించడం మరింత కష్టతరమైంది. ఎందుకంటే ఆ ఆట లోని వేగం, మరింత వేరియబుల్ స్వభావం వలన స్పాట్ ఫిక్సింగ్‌కు సంబంధించిన క్రమరాహిత్యాలు సరిగ్గా కనిపించవు.[2]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. Mehaffey, John (9 February 2009). "Q+A-Cricket-Spot fixing latest threat to game's integrity". Reuters. Retrieved 30 August 2010.
  2. 2.0 2.1 Selvey, Mike (15 April 2010). "Spotting spot-fixing is harder than ever in Twenty20 era". The Guardian. London. Retrieved 30 August 2010.
  3. Wilson, Steve (3 September 2009). "Matthew Le Tissier admits being part of attempted betting scam at Southampton". The Telegraph. Retrieved 30 August 2010.
  4. "UK | Le Tissier in police bet inquiry". BBC News. 11 September 2009. Retrieved 30 August 2010.
  5. "Pakistan match-fixing claim: what is spot-fixing?". The Telegraph. London. 29 August 2010. Retrieved 30 August 2010.
  6. "BCCI suspends five players accused in spot-fixing". Cricketcountry.com. 15 May 2012. Archived from the original on 19 May 2012. Retrieved 15 May 2012.
  7. DNA Webdesk (16 May 2013). "Sreesanth, 2 other Rajasthan Royals players arrested for spot-fixing, suspended from IPL". DNA. Retrieved 16 May 2013.
  8. "Sreesanth: Former India bowler banned for life for spot-fixing". BBC Sport.
  9. "Ex-Essex cricketer Mervyn Westfield admits spot betting charge". BBC News. 12 January 2012.
  10. James Rowland (26 September 2013). "Mervyn Westfield spot-fixing scandal: a timeline". The Telegraph. UK. Retrieved 21 August 2014.