అజయ్ జడేజా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అజయ్ జడేజా
Cricket no pic.png
వ్యక్తిగత సమాచారం
బ్యాటింగ్ శైలి కుడిచేతి బ్యాట్స్‌మన్
బౌలింగ్ శైలి రైట్-ఆర్మ్ మీడియం
కెరీర్ గణాంకాలు
TestsODIs
మ్యాచ్‌లు 15 196
పరుగులు 576 5359
బ్యాటింగ్ సగటు 26.18 37.47
100లు/50లు -/4 6/30
అత్యుత్తమ స్కోరు 96 119
ఓవర్లు - 208
వికెట్లు - 20
బౌలింగ్ సగటు - 54.70
ఒకే ఇన్నింగ్స్ లో 5 వికెట్లు - -
ఒకే మ్యాచ్ లో 10 వికెట్లు - n/a
అత్యుత్తమ బౌలింగ్ - 3/3
క్యాచ్ లు/స్టంపింగులు 5/- 59/-

As of ఫిబ్రవరి 4, 2006
Source: [1]

1971, ఫిబ్రవరి 1గుజరాత్ లోని జామ్‌నగర్లో జన్మించిన అజయ్ జడేజా (పూర్తి పేరు అజయ్ సింహ్‌జీ దౌలత్‌సింహ్‌జీ జడేజా) (Ajaysinhji Daulatsinhji Jadeja) భారత దేశానికి చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు. 1992 నుంచి 2000 వరకు ఇతడు భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించి 15 టెస్టు మ్యాచ్‌లు, 196 వన్డే మ్యాచ్‌లు ఆడినాడు. కాని చివరి దురదృష్టం వెంటాడి మ్యావ్ ఫిక్సింగ్ లో ఇరుక్కొని మాధవన్ కమిటీ సిఫార్సుల ఆధారంగా 5 సంవత్సరాల నిషేధానికి గురైనాడు. ఆ తర్వాత 2003 జనవరిలో ఢిల్లీ హైకోర్టులో సవాలు చేయబడింది. నిషేధాన్ని సడలించడానికి ఫిబ్రవరిలో జడేజా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డుకు వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించాడు.

అతడు భారత జట్టు తరఫున ఆడుతున్న కాలంలో అత్యుత్తమ ఫీల్డర్ గా పేరు సంపాదిమ్చాడు. బ్యాటింగ్ లో అతని ఆత్యుత్తమ ప్రదర్శన 1996 ప్రపంచ కప్ క్రికెట్ లో క్వార్టర్ ఫైనలో ప్రదర్శించాడు. పాకిస్తాన్ పై కేవలం 25 బంతుల్లో 45 పరుగులు సాధించాడు. అందులో 40 పరుగులు వకార్ యూనిస్ యొక చివరి రెండు ఓవర్లలో సాధించినవే. అతని మరో ఉత్తమ ఆట ప్రదర్శన షార్జాలో ఇంగ్లాండు పై కేవలం ఒకే ఓవర్ లో 3 పరుగులకు 3 వెకెట్లు పడగొట్టి భారత్ కు విజయాన్నందించాడు. జడేజా 13 పర్యాయాలు భారత వన్డే జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించాడు. జడేజా ప్రస్తుతం క్రికెట్ కామంటేటర్ గా వ్యవహరిస్తున్నారు. 2003లో ఖేల్ చలనచిత్రంలో నటించాడు.

అజయ్ జడేజా పై కల ఆర్టికల్స్[మార్చు]