రాబిన్ సింగ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రాబిన్ సింగ్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
రోబీంద్ర రామ్‌నారాయణ్ సింగ్
పుట్టిన తేదీ (1963-09-14) 1963 సెప్టెంబరు 14 (వయసు 60)
ప్రిన్సెస్ టౌన్, ట్రినిడాడ్ టొబాగో
బ్యాటింగుఎడమచేతి వాటం
బౌలింగుకుడిచేతి వాటం మీడియం పేసరు
పాత్రఆల్ రౌండరు
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
ఏకైక టెస్టు (క్యాప్ 217)1998 అక్టోబరు 7 - జింబాబ్వే తో
తొలి వన్‌డే (క్యాప్ 71)1989 మార్చి 11 - వెస్టిండీస్ తో
చివరి వన్‌డే2001 ఏప్రిల్ 3 - ఆస్ట్రేలియా తో
వన్‌డేల్లో చొక్కా సంఖ్య.6
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు ODI ఫక్లా లిస్ట్ ఎ క్రికెట్
మ్యాచ్‌లు 1 136 137 228
చేసిన పరుగులు 27 2,336 6,997 4,057
బ్యాటింగు సగటు 13.50 25.95 46.03 26.51
100లు/50లు 0/0 1/9 22/33 1/20
అత్యుత్తమ స్కోరు 15 100 183* 100
వేసిన బంతులు 60 3,734 12,201 7,544
వికెట్లు 0 69 172 150
బౌలింగు సగటు 43.26 35.97 39.00
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 2 4 2
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 1 0
అత్యుత్తమ బౌలింగు 5/22 7/54 5/22
క్యాచ్‌లు/స్టంపింగులు 5/– 33/– 109/– 56/–
మూలం: ESPNcricinfo, 2014 నవంబరు 9

రొబీంద్ర రామ్‌నారాయణ్ "రాబిన్" సింగ్ (జననం 1963 సెప్టెంబరు 14) మాజీ భారత క్రికెటర్, క్రికెట్ కోచ్. 1989 - 2001 మధ్య అతను ఆల్ రౌండర్‌గా ఒక టెస్టు, 136 ODIలలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాడు. 2010 నుండి ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ముంబై ఇండియన్స్, 2013 నుండి కరేబియన్ ప్రీమియర్ లీగ్ లో బార్బడోస్ ట్రైడెంట్స్‌కూ కోచ్‌గా ఉన్నాడు. అతను IPL ప్రారంభ సంవత్సరంలో డెక్కన్ ఛార్జర్స్‌కు కోచ్‌గా కూడా పనిచేసాడు.[1] ఆటగాడిగా ప్రశాంతంగా ఉంటూ, ఒత్తిడిలో కూడా మంచి ప్రదర్శన చేయగల సామర్థ్యానికి అతను ప్రసిద్ధి చెందాడు. భారత క్రికెట్‌కు ప్రపంచ స్థాయి ఫీల్డింగ్‌ను తీసుకొచ్చాడు.[2][3][4][5]

ఇండో-ట్రినిడాడియన్ తల్లిదండ్రులకు ట్రినిడాడ్‌లో జన్మించిన సింగ్, 1984లో భారతదేశం వెళ్లి మద్రాస్ విశ్వవిద్యాలయంలో చదువుకున్నాడు. ఆ సమయంలో అతను క్లబ్, కళాశాల స్థాయి క్రికెట్ ఆడాడు. 1988లో అతను తమిళనాడు రంజీ ట్రోఫీ గెలవడంలో దోహదపడ్డాడు. ఆ సీజన్‌లో అత్యంత స్థిరంగా ఆడిన ఆటగాళ్ళలో ఒకడు. 33 ఏళ్ల తర్వాత ఆ సంవత్సరం తమిళనాడు ట్రోఫీని గెలుచుకుంది, ఆ తర్వాత మళ్లీ గెలవలేదు. అతను తమిళనాడుకు, సౌత్ జోన్‌కు రెండింటికీ కెప్టెన్‌గా ఉన్నాడు. అతను తన ట్రినిడాడ్ అండ్ టొబాగో పాస్‌పోర్ట్‌ను వదులుకుని, భారత పౌరుడు అయ్యాడు. భారత జాతీయ క్రికెట్ జట్టు తరపున ఆడాడు. [6]

జీవితం తొలి దశలో[మార్చు]

1963 సెప్టెంబరు 14న ట్రినిడాడ్ అండ్ టొబాగోలోని ప్రిన్సెస్ టౌన్‌లో భారత సంతతికి చెందిన రామ్‌నరైన్, సావిత్రి సింగ్ దంపతులకు రొబీంద్ర రామ్‌నరైన్ సింగ్ [7] జన్మించాడు. [7] అతని పూర్వీకులు రాజస్థాన్‌లోని అజ్మీర్‌కు చెందినవారు. [7] [8] 19 సంవత్సరాల వయస్సులో, సింగ్ మద్రాస్‌ వెళ్లాడు. అక్కడ మద్రాస్ విశ్వవిద్యాలయంలో ఆర్థికశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీని పొందాడు. అప్పుడే క్రికెట్ కెరీర్‌ను ప్రారంభించాడు. అతను ప్రస్తుతం తన భార్య సుజాత, కుమారుడు ధనంజయ్‌తో కలిసి చెన్నైలో నివసిస్తున్నాడు. అతని తల్లిదండ్రులు, తోబుట్టువులు ఇప్పటికీ ట్రినిడాడ్ అండ్ టొబాగోలోనే నివసిస్తున్నారు. [9]

దేశీయ క్రికెట్లో[మార్చు]

ట్రినిడాడ్‌లో ఉన్నప్పుడు, సింగ్ 1982 నుండి 1983 వరకు ప్రాంతీయ టోర్నమెంట్‌లలో ట్రినిడాడ్ యూత్ క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు. అతను 1983లో సీనియర్ ట్రినిడాడ్ క్రికెట్ జట్టుకు రెండు వన్డే మ్యాచ్‌లలో ప్రాతినిధ్యం వహించాడు. ఆ సమయంలో అతను ఫిల్ సిమ్మన్స్, డేవిడ్ విలియమ్స్, లారీ గోమ్స్, గస్ లోగీ, రంగీ నానన్, షెల్డన్ గోమ్స్, రిచర్డ్ గాబ్రియేల్‌లతో కలిసి ఆడాడు.

సింగ్ 1985 – 86 సీజన్‌లో తమిళనాడు తరపున ఫస్ట్-క్లాస్ కెరీర్‌ను ప్రారంభించాడు. సింగ్ అత్యద్భుత ప్రదర్శనతో తమిళనాడు 33 ఏళ్ల తర్వాత తొలిసారి రంజీ ట్రోఫీని గెలుచుకుంది. దాదాపు రెండు దశాబ్దాల సుదీర్ఘ కెరీర్‌లో, నిజమైన ఆల్-రౌండరుగా తన క్లబ్‌కు 6,000 కంటే ఎక్కువ పరుగులు చేశాడు. మీడియం-ఫాస్ట్ బౌలింగ్‌తో 172 వికెట్లు తీసుకున్నాడు.

అంతర్జాతీయ కెరీర్[మార్చు]

సింగ్ 1989 మార్చి 11 న వెస్టిండీస్ క్రికెట్ జట్టుతో జరిగిన వన్డే ఇంటర్నేషనల్‌లో భారత జాతీయ క్రికెట్ జట్టుకు అరంగేట్రం చేశాడు. అతను రెండు వన్డే ఇంటర్నేషనల్స్ ఆడాడు. రెండు సార్లూ జట్టు ఓటమిలో ఉన్న పరిస్థితుల్లో 7వ స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చాడు. ఈ సిరీస్ తర్వాత భారత జట్టు సింగ్‌ను తొలగించింది. ఆ తరువాత ఏడు సంవత్సరాల పాటు దేశీయ, విదేశీ లీగ్‌లలో ఆడాడు. ఆ తర్వాత అతను భారత క్రికెట్ జట్టులో స్థానాన్ని సంపాదించుకున్నాడు. 1996లో టైటాన్ కప్ టోర్నమెంట్ కోసం సింగ్‌ను రీకాల్ చేశారు. అతను 2001 వరకు వన్డే ఇంటర్నేషనల్స్‌లో ఆటగాడిగా కొనసాగాడు. సింగ్ తన మిడిల్-టు-లోయర్ ఆర్డర్ బ్యాటింగ్, మీడియం-పేస్ బౌలింగు, గ్రౌండ్ ఫీల్డింగ్ నైపుణ్యాలకు ప్రసిద్ధి చెందాడు. ఆ కాలంలో అతన్ని అత్యుత్తమ భారతీయ ఫీల్డర్‌గా పరిగణించారు. ముగింపు ఓవర్లలో (సాధారణంగా అజయ్ జడేజాతో కలిసి) బ్యాటింగ్‌కి కూడా ప్రసిద్ది చెందాడు. 1999 క్రికెట్ ప్రపంచ కప్ సమయంలో ఈ నైపుణ్యమే అతన్ని సమగ్రమైన ఆటగాడిగా చేసింది.[10] అతని కెరీర్ మొత్తంలో, సింగ్ వన్డే మ్యాచ్‌లకైతేనే బాగా సరిపోతాడని భావించారు.

కోచింగ్ కెరీర్[మార్చు]

సింగ్ పదవీ విరమణ చేసిన వెంటనే కోచింగ్ ప్రారంభించాడు. అతని మొదటి కోచింగ్ స్థానం భారత అండర్-19 క్రికెట్ జట్టుతో. 2004లో, అతను హాంకాంగ్ జాతీయ క్రికెట్ జట్టుకు శిక్షణ ఇవ్వడం ప్రారంభించాడు.[11] ఆ జట్టు 2004 ఆసియా కప్‌కు అర్హత సాధించడంలో కృషి చేశాడు. 2006 లో సింగ్, ఇండియా A క్రికెట్ జట్టుకు కోచ్‌గా నియమితుడయ్యాడు. అక్కడ గౌతమ్ గంభీర్, రాబిన్ ఉతప్ప వంటి క్రికెటర్లకు శిక్షణ ఇచ్చాడు. సింగ్ కోచ్‌గా ఉన్న పలువురు క్రికెటర్లు భారత జాతీయ జట్టుకు ఆడారు.[12] 2007, 2008లో భారత జాతీయ జట్టు ఫీల్డింగ్ కోచ్‌గా ఎంపికయ్యాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో డెక్కన్ ఛార్జర్స్ ఫ్రాంచైజీకి మొదటి ప్రధాన కోచ్‌గా నియమితుడయ్యాడు. [13]

సింగ్ 2009 అక్టోబరు వరకు భారత జాతీయ క్రికెట్ జట్టుకు ఫీల్డింగ్ కోచ్‌గా ఉన్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ జట్టు అయిన ముంబై ఇండియన్స్‌కు బ్యాటింగ్ కోచ్‌గా పనిచేసాడు. 2010లో MIలో 3 సంవత్సరాల కాలానికి ప్రధాన కోచ్‌గా చేరాడు. అంతకు ముందు ఎప్పుడూ మొదటి నాలుగు స్థానాలకు అర్హత సాధించని ఆ జట్టు అదృష్టం దాంతో మలుపు తిరిగింది. అతను 2010 IPL సీజన్‌లో ముంబై ఇండియన్స్‌కు రన్నరప్ స్థానం సాధించడంలో తోడ్పడ్డాడు. అప్పటి నుండి 2013, 2015, 2017, 2019, 2020 ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఛాంపియన్‌షిప్‌లను గెలుచుకోవడంలో కోచింగ్ నిర్మాణంలో భాగమయ్యాడు. 2013 ఛాంపియన్స్ లీగ్ ట్వంటీ 20, 2011 ఛాంపియన్స్ లీగ్ ట్వంటీ 20 లను ముంబై ఇండియన్స్ గెలవడంలో కూడా కృషి చేసాడు.

అతను బార్బడోస్ ట్రైడెంట్స్ కూడా కోచ్‌గా పనిచేసాడు. దాని ప్రారంభం నుండి, ట్రైడెంట్స్ ఒకసారి గెలిచి, రెండు సార్లు ఫైనల్స్, ఒకసారి సెమీఫైనల్ ఆడింది. హాంకాంగ్ T20 బ్లిట్జ్ 2017 ఎడిషన్‌లో రన్నరప్‌గా నిలిచిన సిటీ కైటాక్‌కి రాబిన్ సింగ్ హెడ్ కోచ్, మెంటర్‌గా ఉన్నారు. [14] అతను 2016, 2017 మధ్య తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో కరైకుడి కలైకి ప్రధాన కోచ్‌గా పనిచేసాడు. అతను T10 లీగ్ ప్రారంభ ఎడిషన్‌లో ఛాంపియన్‌గా నిలిచిన కేరళ కింగ్స్‌కు కూడా కోచ్‌గా పనిచేశాడు.[15] 2018లో T10 లీగ్ రెండవ ఎడిషనులో కొత్త ఫ్రాంచైజీ అయిన నార్తర్న్ వారియర్స్‌కు మారాడు. టోర్నమెంట్‌లో ఆ జట్టును విజయతీరాలకు చేర్చాడు. రెండు సంవత్సరాల్లో 2 వేర్వేరు జట్లతో వరుసగా టైటిల్‌లను సాధించాడు. [16] 2020 ఎడిషన్‌లో నార్తర్న్ వారియర్స్ మళ్లీ గెలిచింది.

రాబిన్ సింగ్ 2020లో UAE క్రికెట్ కి డైరెక్టర్‌గా, UAE జాతీయ క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా నియమితుడయ్యాడు. 2 సంవత్సరాల పాటు మహమ్మారి అతని పదవీకాలానికి అంతరాయం కలిగించింది. కొన్ని నెలల క్రియాశీల క్రికెట్‌లో అతని శిక్షణలో ఉన్న ఆటగాళ్ళు అసలు క్రికెట్ ఆడనే లేదు. అయినప్పటికీ, UAE వరుస విజయాలను సాధించి, ఆస్ట్రేలియాలో జరిగే ICC T20 ప్రపంచ కప్‌కు అర్హత సాధించింది. రాబిన్ సింగ్ ప్రస్తుతం 2023లో జరిగే UAE ILT20 లీగ్ ప్రారంభ ఎడిషన్ కోసం MI ఎమిరేట్స్ కు GMగా నియమితుడయ్యాడు.

ఇతర క్రికెట్ కార్యక్రమాలు[మార్చు]

రాబిన్ సింగ్, దుబాయ్‌లో రాబిన్ సింగ్ స్పోర్ట్స్ అకాడమీ [17] ప్రారంభించాడు. ఇది యువకులకు అత్యాధునిక సౌకర్యాలను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. అతని అకాడమీ లక్ష్యం - యుఏఈ లో అన్ని క్రీడలకు ఒకే గమ్యస్థానంగా ఉండటం, GCC మొత్తాన్నీ కవర్ చేసేలా విస్తరించడం, స్త్రీ పురుష క్రీడాకారులు తమ దేశానికి ఛాంపియన్‌లుగా, అంబాసిడర్‌లుగా మారడానికి సహాయపడటం.

మూలాలు[మార్చు]

  1. "Robin Singh". ESPNcricinfo. Retrieved 31 January 2012.
  2. "Robin Singh – Coach of Tridents CPL T20 Team". Cplt20.com. Retrieved 14 June 2016.
  3. "Robin Singh – T10 League Coach". cricdash.com. Archived from the original on 9 అక్టోబర్ 2019. Retrieved 16 October 2019. {{cite web}}: Check date values in: |archive-date= (help)
  4. "Indian Fielding: Energetic, Enthusiastic and Enviable". Zeenews.india.com. 19 July 2013. Retrieved 14 June 2016.
  5. "TUCC: Robin Singh: Chennai's Jonty Rhodes | UCC.in". Archived from the original on 20 July 2014. Retrieved 2014-07-16.
  6. "I thought that if you perform you would get in: Robin". The Times of India. 16 May 2002. Retrieved 2019-03-04.
  7. 7.0 7.1 7.2 "I thought that if you perform you would get in: Robin". The Times of India. Retrieved 14 June 2016.
  8. "ROBIN SINGH: A FORGOTTEN HERO | Sports Overload |". 25 April 2020. Archived from the original on 1 ఆగస్టు 2023. Retrieved 1 ఆగస్టు 2023.
  9. "Robin Singh calls it a day". ESPNcricinfo. Retrieved 31 January 2012.
  10. "India Squad for 1999 Cricket World Cup". ESPNcricinfo. Retrieved 31 January 2012.
  11. "Nayan Mongia to coach Thailand". ESPNcricinfo. Retrieved 31 January 2012.
  12. "India A showing augurs well for the future – Robin". ESPNcricinfo. Retrieved 31 January 2012.
  13. "India's coaching staff fear double standards". ESPNcricinfo. Retrieved 31 January 2012.
  14. "Execute your skills or fail, says City Kaitak coach Robin Singh ahead of Hong Kong T20 Blitz". South China Morning Post. 5 February 2017. Retrieved 5 February 2017.
  15. "Kerala Kings appoint Robin Singh as head coach". The Gulf Today. Archived from the original on 4 అక్టోబర్ 2018. Retrieved 5 November 2017. {{cite web}}: Check date values in: |archive-date= (help)
  16. "My partnership with Robin will help Northern Warriors, says Sammy". Khaleej Times. Retrieved 26 September 2018.
  17. "Robin Singh hopes to produce top cricketers for UAE". Khaleej Times. Retrieved 13 September 2017.