అజిత్ అగార్కర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అజిత్ అగార్కర్
Ajit Agarkar.jpg
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు అజిత్ బాలచంద్ర అగార్కర్
జననం (1977-12-04) 1977 డిసెంబరు 4 (వయసు 45)
ముంబాయి, మహారాష్ట్ర, భారాతదేశం
బ్యాటింగ్ శైలి కుడిచేయి
బౌలింగ్ శైలి కుడి చేయి ఫాస్ట్ మీడియం
పాత్ర ఆల్‌రౌండర్
అంతర్జాతీయ సమాచారం
జాతీయ జట్టు India
టెస్టు అరంగ్రేటం 7 అక్టోబరు 1998 v Zimbabwe
చివరి టెస్టు 13 జనవరి 2006 v Pakistan
వన్డే లలో ప్రవేశం 1 ఏప్రిల్ 1998 v Australia
చివరి వన్డే 5 సెప్టెంబరు 2007 v England
టి20ఐ లో ప్రవేశం(cap 1) 1 డిసెంబరు 2006 v South Africa
చివరి టి20ఐ 16 సెప్టెంబరు 2007 v New Zealand
దేశవాళీ జట్టు సమాచారం
సంవత్సరాలు జట్టు
1996–present ముంబాయి క్రికెట్ క్లబ్
2008–2010 కోల్కతా నైట్
2011-present ఢిల్లీ డేర్‌డెవిల్స్
కెరీర్ గణాంకాలు
పోటీ Test ODI FC LA
మ్యాచ్‌లు 26 191 103 267
సాధించిన పరుగులు 571 1269 3117 2252
బ్యాటింగ్ సగటు 16.79 14.58 28.08 17.73
100s/50s 1/0 0/3 3/15 0/8
ఉత్తమ స్కోరు 109* 95 109* 95
బాల్స్ వేసినవి 4857 9484 17232 13146
వికెట్లు 58 288 282 412
బౌలింగ్ సగటు 47.32 27.85 31.03 26.44
ఇన్నింగ్స్ లో 5 వికెట్లు 1 2 12 3
మ్యాచ్ లో 10 వికెట్లు 0 n/a 0 n/a
ఉత్తమ బౌలింగ్ 6/41 6/42 6/41 6/18
క్యాచులు/స్టంపింగులు 6/– 52/– 36/– 69/–
Source: క్రిక్‌ఇన్ఫో, 28 June 2012

1977 డిసెంబర్ 4ముంబాయిలో జన్మించిన అజిత్ అగార్కర్ భారతదేశానికి చెందిన క్రికెట్ ఆటగాడు. ఇతని పూర్తి పేరు అజిత్ భాలచంద్ర అగార్కర్ (Ajit Bhalchandra Agarkar) (Marathi:अजित भालचंद्र आगरकर). 1998లో భారత జట్టుకు ఎంపికై 26 టెస్టులు, 191 వన్డేలు, 4 టీ20 ఆటలు ఆడాడు. తన క్రీడాజీవితం ప్రారంభంలోనే వన్డే క్రికెట్ లో అత్యంతవేగంగా 50 వికెట్లు సాధించిన బౌలర్ గా ప్రపంచ రికార్డు సృష్టించాడు. టెస్టులలో కూడా 2002లో లార్డ్స్లో 8 వ నెంబర్ బ్యాట్స్‌మెన్ గా బ్యాటింగ్ కు వచ్చి సెంచరీ సాధించాడు. అంతర్జాతీయ కెరీర్లో టెస్టుల్లో 109 (నాటవుట్), వన్డేల్లో 95 అతని అత్యధిక స్కోర్లు. టెస్టుల్లో 58 వికెట్లు, వన్డేల్లో 288, టీ20లో 3 వికెట్లు పడగొట్టాడు. 2007లో టీ20 ప్రపంచకప్ గెలిచిన భారతజట్టు సభ్యుల్లో అగార్కర్ కూడా ఒకడు. 2013 లో క్రికెట్ అన్ని ఫార్మాట్ల నుంచి విరమించుకున్నాడు. వన్డేల్లో భారతదేశం తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో అగార్కర్ మూడో స్థానంలో ఉన్నాడు. అతని కంటే ముందు అనిల్ కుంబ్లే (334), జవగళ్ శ్రీనాథ్ (315) ఉన్నారు.

వ్యక్తిగతం[మార్చు]

అజిత్ అగర్కర్

చిన్నప్పుడు అజిత్ శివాజీ పార్క్లో నివాసముండే అతని తాతయ్య ఇంట్లో పెరిగాడు. ప్రస్తుతం భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ముంబై క్రికెటర్లు ఇక్కడ సాధన చేసిన వారే. అజిత్ అగార్కర్ ప్రస్తుతం ముంబాయి లోని వోర్లిలో నారాయణ పూజారి నగర్ అనే ప్రాంతంలో నివాసముంటున్నాడు. అజిత్ మతుంగ లోని రూపారెల్ కళాశాలలో చదివాడు.అగార్కర్ ఫాతిమా ఘడియాలీని వివాహం చేసుకున్నాడు.[1] వారికి రాజ్ అనే కుమారుడున్నాడు.

కెరీర్[మార్చు]

1998లో కోచి లోని నెహ్రూ స్టేడియంలో తన తొలి వన్డే మ్యాచ్ ఆడినాడు.[2] అందులో కొద్ది పరుగులకే ఆడం గిల్‌క్రిస్ట్ చేతిలో ఔటైనాడు. అగార్కర్ వన్డేలో సాధించిన మరో ప్రపంచ రికార్డు 200 వికెట్లు, 1000 పరుగులు అతి తక్కువ మ్యాచ్‌లలో సాధించడం. అగార్కర్ ఈ ఘనతకు కేవలం 133 వన్డేలలో సాధించి ఇంతకు క్రితం దక్షిణాఫ్రికాకు చెందిన షాన్ పోలాక్ రికార్డును అధికమించాడు.

వన్డేలలో రికార్డులు సృష్టించిననూ టెస్ట్ క్రికెట్ లో మాత్రం ఒకటి, రెండు సందర్భాలు మినహా అతని గణాంకాలు పేవలంగా ఉన్నాయి. 2003లో ఆస్త్రేలియా పై అడిలైడ్ టెస్ట్ లో 41 పరుగులకు 6 వికెట్లు సాధించి రెండు దశాబ్దాల తర్వాత ఆస్ట్రేలియా గడ్డపై భారత్ టెస్ట్ విజయం సాధించుటకు కృషిచేశాడు.

మూలాలు[మార్చు]

  1. http://timesofindia.indiatimes.com/articleshow/468425.cms
  2. "బ్యాట్‌తో చుక్కలు.. బంతితో నిప్పులు." www.eenadu.net. Retrieved 2020-12-14.