Jump to content

ఆశిష్ నెహ్రా

వికీపీడియా నుండి
ఆశిష్ నెహ్రా
2010 లో నెహ్రా
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ (1979-04-29) 1979 ఏప్రిల్ 29 (వయసు 45)
ఢిల్లీ కంటోన్మెంటు, ఢిల్లీ
ఎత్తు6 అ. 1 అం. (185 cమీ.)[1]
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుఎడమచేతి మీడియం ఫాస్ట్
పాత్రబౌలరు
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 220)1999 ఫిబ్రవరి 24 - శ్రీలంక తో
చివరి టెస్టు2004 ఏప్రిల్ 13 - పాకిస్తాన్ తో
తొలి వన్‌డే (క్యాప్ 137)2001 జూన్ 21 - జింబాబ్వే తో
చివరి వన్‌డే2011 మార్చి 30 - పాకిస్తాన్ తో
వన్‌డేల్లో చొక్కా సంఖ్య.64
తొలి T20I (క్యాప్ 25)2009 డిసెంబరు 9 - శ్రీలంక తో
చివరి T20I2017 నవంబరు 1 - న్యూజీలాండ్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1997–2017ఢిల్లీ క్రికెట్ జట్టు
2008ముంబై ఇండియన్స్
2009–2010ఢిల్లీ డేర్‌డెవిల్స్
2011–2012పూణే వారియర్స్ ఇండియా
2013ఢిల్లీ డేర్‌డెవిల్స్
2014–2015చెన్నై సూపర్ కింగ్స్
2016–2017సన్‌రైసర్స్ హైదరాబాద్
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డే టి20
మ్యాచ్‌లు 17 120 27
చేసిన పరుగులు 77 157 34
బ్యాటింగు సగటు 5.50 5.19 5.60
100s/50s 0/0 0/0 0/0
అత్యధిక స్కోరు 19 24 22
వేసిన బంతులు 3,447 5,751 588
వికెట్లు 44 157 34
బౌలింగు సగటు 42.40 31.72 22.29
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 2 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0
అత్యుత్తమ బౌలింగు 4/72 6/23 3/19
క్యాచ్‌లు/స్టంపింగులు 5/– 18/– 4/–
మూలం: ESPNcricinfo, 2022 04 September

ఆశిష్ నెహ్రా ( జననం 1979 ఏప్రిల్ 29) క్రికెట్ కోచ్, ఆటలోని అన్ని ఫార్మాట్లలో ఆడిన మాజీ క్రికెటర్. నెహ్రా 2017 చివరలో అన్ని రకాల క్రికెట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. 2017 నవంబర్ 1న ఫిరోజ్ షా కోట్లా గ్రౌండ్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన ట్వంటీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో చివరి సారి ఆడాడు. [2] [3] నెహ్రా 2002 ICC ఛాంపియన్స్ ట్రోఫీ యొక్క ఉమ్మడి విజేతలలో ఒకరైన భారత జట్టులో సభ్యుడు. 2011 క్రికెట్ ప్రపంచ కప్ గెలిచిన జట్టులో సభ్యుడు.

ప్రారంభ జీవితం

[మార్చు]

నెహ్రా, ఢిల్లీ కంటోన్మెంట్‌లోని సదర్ బజార్‌లో హిందూ జాట్ కుటుంబంలో దివాన్ సింగ్ నెహ్రా, సుమిత్రా నెహ్రాలకు జన్మించాడు. [4]

అంతర్జాతీయ కెరీర్

[మార్చు]

2003 ICC క్రికెట్ ప్రపంచ కప్ సందర్భంగా 2003 ఫిబ్రవరి 26 న నెహ్రా, ఇంగ్లండ్‌పై 23 పరుగులకు 6 వికెట్లు తీసుకున్నాడు. ఇది ఇప్పటి వరకు క్రికెట్ ప్రపంచ కప్ చరిత్రలో ఒక భారతీయ బౌలర్ చేసిన అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు. [5]

ఐసిసి, క్రిక్‌ఇన్‌ఫో 2016 టి 20 ప్రపంచ కప్ కోసం 'టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్'లో నెహ్రా పేరు సంపాదించుకున్నాడు. [6] [7]

2013-14 రంజీ ట్రోఫీలో, ఢిల్లీలోని రోషనారా క్లబ్ గ్రౌండ్‌లో విదర్భను మొదటి ఇన్నింగ్స్‌లో 88 పరుగులకే ఆలౌటైనపుడు అతను 10 ఓవర్లలో 6/16 తీసుకున్నాడు. [8]

2007-08 సీజన్‌లో ఢిల్లీ రంజీ జట్టుకు ఆడకుండా నిరోధించిన చీలమండ గాయం నుండి కోలుకున్న తర్వాత, [9] ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో చేరాడు. ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీలో చేరాడు.[9] చెన్నై సూపర్ కింగ్స్ తరపున 2014, 2015 లో అతని ప్రదర్శనలకు, అతను క్రిక్ఇన్ఫో CLT20 XIలో పేరు పొందాడు. [10]

కోచింగ్ కెరీర్

[మార్చు]

2018 జనవరిలో, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెహ్రాను తమ బౌలింగ్ కోచ్‌గా నియమించింది. 2019 ఐపీఎల్‌లో తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు.

2022 జనవరిలో, అతను కొత్తగా ఏర్పడిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంచైజీ గుజరాత్ టైటాన్స్ కు ప్రధాన కోచ్‌గా నియమితుడయ్యాడు.[11] 2022 IPL సీజన్‌లో, గుజరాత్ టైటాన్స్ పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఫైనల్‌లో ట్రోఫీని గెలుచుకుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో విజేతగా నిలిచిన తొలి భారత ప్రధాన కోచ్‌గా కూడా నెహ్రా నిలిచాడు. [12]

మూలాలు

[మార్చు]
  1. Ashish Nehra’s profile on Sportskeeda
  2. "Nehra farewell hogs headlines in T20I series opener". International Cricket Council. Retrieved 1 November 2017.
  3. "Rohit, Dhawan break both records and New Zealand". ESPN Cricinfo. Retrieved 1 November 2017.
  4. http://www.jatmahasabha.in/2009/09/ashish-nehra-jat-cricketer-from-delhi.html Archived 2022-11-15 at the Wayback Machine Ashish Nehra
  5. "World Cup - India Cricket Team Records & Stats | ESPNcricinfo.com". Cricinfo.
  6. "ICC names WT20 Teams of the Tournament". Cricket.com.au.
  7. "ESPNcricinfo's team of the 2016 World T20". ESPNcricinfo. 4 April 2016.
  8. "Group Scorecard - ESPN Cricinfo". Retrieved 6 June 2016.
  9. 9.0 9.1 "Nehra for Mumbai Indians, Mishra for Delhi". Cricinfo. 14 March 2008. Archived from the original on 17 March 2008. Retrieved 21 April 2008.
  10. "The IPL 2015 tournament XI".
  11. "IPL 2018: Gary Kirsten, Ashish Nehra Join RCB Coaching Team". The Quint (in ఇంగ్లీష్). Retrieved 2018-01-30.
  12. "Ashish Nehra breaks 14-year-long pattern with historic first as GT beat RR to win IPL 2022". Hindustan Times (in ఇంగ్లీష్). 2022-05-30. Retrieved 2022-05-30.