ఢిల్లీ క్రికెట్ జట్టు
వ్యక్తిగత సమాచారం | |
---|---|
కెప్టెన్ | యష్ ధుల్ (FC) శిఖర్ ధావన్ (List A) Nitish Rana (T20) |
కోచ్ | Bhaskar Pillai |
యజమాని | ఢిల్లీ & డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ |
జట్టు సమాచారం | |
స్థాపితం | 1876 |
స్వంత మైదానం | అరుణ్ జైట్లీ స్టేడియం |
సామర్థ్యం | 55,000 |
చరిత్ర | |
Ranji Trophy విజయాలు | 7 |
ఇరానీ కప్ విజయాలు | 2 |
విజయ్ హజారే ట్రోఫీ విజయాలు | 1 |
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ విజయాలు | 1 |
అధికార వెబ్ సైట్ | DDCA |
ఢిల్లీ క్రికెట్ జట్టు ఢిల్లీలో ఉన్న ఫస్ట్-క్లాస్ క్రికెట్ జట్టు. దీన్ని ఢిల్లీ & డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ నిర్వహిస్తుంది. ఇది భారతదేశపు ఫస్ట్ క్లాస్ పోటీ, రంజీ ట్రోఫీ, పరిమిత ఓవర్ల విజయ్ హజారే ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలలో ఆడుతుంది. జట్టు ఏడుసార్లు రంజీ ట్రోఫీని గెలుచుకుని, ఎనిమిది సార్లు రన్నరప్‌లుగా నిలిచింది. 16 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత 2007-08లో మళ్ళీ రంజీ టైటిల్ గెలుచుకుంది. అంతకుముందు 1991-92 సీజన్‌లో ఫైనల్‌లో తమిళనాడును ఓడించి ట్రోఫీ సాధించింది. జట్టు హోమ్ గ్రౌండ్ అరుణ్ జైట్లీ స్టేడియం.
పోటీ చరిత్ర
[మార్చు]ఢిల్లీ రంజీ ట్రోఫీలో బలమైన ప్రదర్శన చేసింది. దాని ఐదు విజయాలలో మూడు 1980లలో రాగా, మిగిలినవి 1970ల చివరలో వచ్చాయి. ఈ కాలంలో ముంబై జట్టు ఆధిపత్యంలో ఉండేది. ఇది 1978, 1987 మధ్య కాలం ఢిల్లీకి స్వర్ణయుగంగా చెప్పవచ్చు: ఆ సంవత్సరాల్లో ఒకటి మినహా మిగిలిన అన్ని రంజీ ఫైనల్స్‌లోనూ ఢిల్లీ ఆడింది. (4 గెలిచింది, 4లో రన్నరప్). [1]
ఇరానీ ట్రోఫీలో రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టుతో ఆరు మ్యాచ్‌లు ఆడి, నాలుగు సార్లు ఓడిపోయి రెండుసార్లు గెలిచింది.
పరిమిత ఓవర్ల క్రికెట్‌లో కేవలం రెండు టైటిల్స్ మాత్రమే ఉన్నాయి. 2012-13లో రజత్ భాటియా నేతృత్వంలో విజయ్ హజారే ట్రోఫీని గెలుచుకున్నారు. ప్రదీప్ సాంగ్వాన్ నేతృత్వంలో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని గెలుచుకున్నారు
రంజీ ట్రోఫీ
[మార్చు]సంవత్సరం | స్థానం |
---|---|
1976-77 | ద్వితియ విజేత |
1978-79 | విజేత |
1979-80 | విజేత |
1980-81 | ద్వితియ విజేత |
1981-82 | విజేత |
1983-84 | ద్వితియ విజేత |
1984-85 | ద్వితియ విజేత |
1985-86 | విజేత |
1986-87 | ద్వితియ విజేత |
1988-89 | విజేత |
1989-90 | ద్వితియ విజేత |
1991-92 | విజేత |
1996-97 | ద్వితియ విజేత |
2007-08 | విజేత |
2017-18 | ద్వితియ విజేత |
ఇరానీ కప్
[మార్చు]సంవత్సరం | స్థానం |
---|---|
1980-81 | విజేత |
1989-90 | విజేత |
విజయ్ హజారే ట్రోఫీ
[మార్చు]సంవత్సరం | స్థానం |
---|---|
2012-13 | విజేత |
2015-16 | ద్వితియ విజేత |
2018-19 | ద్వితియ విజేత |
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ
[మార్చు]సంవత్సరం | స్థానం |
---|---|
2017-18 | విజేత |
ప్రముఖ ఆటగాళ్లు
[మార్చు]భారతదేశం తరపున టెస్ట్ క్రికెట్ ఆడిన ఢిల్లీ ఆటగాళ్ళు. బ్రాకెట్లలో తొలి మ్యాచ్ ఆడిన సంవత్సరం:
- ప్రకాష్ భండారి (1955)
- మన్ సూద్ (1960)
- మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ (పటౌడీ నవాబ్) (1961)
- రాజిందర్ పాల్ (1964)
- రమేష్ సక్సేనా (1967)
- అశోక్ గండోత్రా (1969)
- మదన్ లాల్ (1974)
- సురీందర్ అమర్నాథ్ (1976)
- కీర్తి ఆజాద్ (1981)
- రాకేష్ శుక్లా (1982)
- మణిందర్ సింగ్ (1982)
- మనోజ్ ప్రభాకర్ (1984)
- రామన్ లంబా (1987)
- అజయ్ శర్మ (1988)
- సంజీవ్ శర్మ (1988)
- వివేక్ రజ్దాన్ (1989)
- అతుల్ వాసన్ (1990)
- ఆశిష్ నెహ్రా (1999)
- రాబిన్ సింగ్, జూనియర్ (1999)
- నిఖిల్ చోప్రా (2000)
- విజయ్ దహియా (2000)
- రాహుల్ సంఘ్వి (2001)
- వీరేంద్ర సెహ్వాగ్ (2001)
- ఆకాశ్ చోప్రా (2003)
- గౌతమ్ గంభీర్ (2004)
- ఇషాంత్ శర్మ (2007)
- విరాట్ కోహ్లీ (2011)
- శిఖర్ ధావన్ (2013)
- రిషబ్ పంత్ (2018)
- నవదీప్ సైనీ (2021)
భారతదేశం తరపున వన్‌డేలు ఆడిన (కానీ టెస్ట్ క్రికెట్ ఆడని) ఢిల్లీ ఆటగాళ్ళు.బ్రాకెట్లలో తొలి మ్యాచ్ ఆడిన సంవత్సరం:
- సురీందర్ ఖన్నా (1979)
- అమిత్ భండారి (2000)
- నితీష్ రాణా (2021)
భారతదేశం కోసం T20I లు ఆడిన (కానీ ODI లేదా టెస్ట్ క్రికెట్ ఆడని) ఢిల్లీ ఆటగాళ్ళు. బ్రాకెట్లలో తొలి మ్యాచ్ ఆడిన సంవత్సరం:
- పర్విందర్ అవానా (2012)
- పవన్ నేగి (2016)
ఢిల్లీ తరపున ఆడిన భారతదేశం తరపున టెస్ట్ క్రికెట్ ఆడిన, ఇతర రాష్ట్ర జట్లకు చెందిన క్రికెటర్లు. బ్రాకెట్లలో తొలి మ్యాచ్ ఆడిన సంవత్సరం:
- బిషన్ సింగ్ బేడీ (1966)
- చేతన్ చౌహాన్ (1969)
- మొహిందర్ అమర్నాథ్ (1969)
- అరుణ్ లాల్ (1982)
దేశీయ స్థాయిలో ప్రముఖ క్రికెటర్లు:
ప్రస్తుత స్క్వాడ్
[మార్చు]అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్ల పేర్లు బోల్డ్‌లో
పేరు | పుట్టినరోజు | బ్యాటింగు శైలి | బౌలింగు శైలి | గమనికలు | |
---|---|---|---|---|---|
Batters | |||||
హిమ్మత్ సింగ్ | 1996 నవంబరు 8 | కుడిచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | ||
యష్ ధుల్ | 2002 నవంబరు 11 | కుడిచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | First-class Captain Plays for Delhi Capitals in IPL | |
ధ్రువ్ షోరే | 1992 జూన్ 5 | కుడిచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | ||
ఆయుష్ బదోని | 1999 డిసెంబరు 3 | కుడిచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | Plays for Lucknow Super Giants in IPL | |
వైభవ్ రావల్ | 1991 నవంబరు 9 | ఎడమచేతి వాటం | కుడిచేతి లెగ్ బ్రేక్ | ||
జాంటీ సిద్ధూ | 1997 డిసెంబరు 9 | ఎడమచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | ||
కున్వర్ బిధురి | 1996 ఏప్రిల్ 24 | ఎడమచేతి వాటం | కుడిచేతి మీడియం | ||
హితేన్ దలాల్ | 1994 సెప్టెంబరు 25 | కుడిచేతి వాటం | కుడిచేతి లెగ్ బ్రేక్ | ||
శిఖర్ ధావన్ | 1985 డిసెంబరు 5 | ఎడమచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | List A Captain Plays for Punjab Kings in IPL | |
విరాట్ కోహ్లీ | 1988 నవంబరు 5 | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం | Plays for Royal Challengers Bangalore in IPL | |
All-rounders | |||||
లలిత్ యాదవ్ | 1997 జనవరి 3 | కుడిచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | Plays for Delhi Capitals in IPL | |
నితీష్ రాణా | 1993 డిసెంబరు 27 | ఎడమచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | Twenty20 Captain Plays For Kolkata Knight Riders in IPL | |
Wicket-keepers | |||||
అనుజ్ రావత్ | 1999 అక్టోబరు 17 | ఎడమచేతి వాటం | Plays For Royal Challengers Bangalore in IPL | ||
లక్షయ్ తరేజా | 1997 సెప్టెంబరు 15 | కుడిచేతి వాటం | |||
రిషబ్ పంత్ | 1997 అక్టోబరు 4 | ఎడమచేతి వాటం | Plays for Delhi Capitals in IPL | ||
Spin bowlers | |||||
శివంక్ వశిష్ట్ | 1995 సెప్టెంబరు 17 | ఎడమచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | ||
హృతిక్ షోకీన్ | 2000 ఆగస్టు 14 | కుడిచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | Plays for Mumbai Indians in IPL | |
యోగేష్ శర్మ | 1998 సెప్టెంబరు 15 | ఎడమచేతి వాటం | ఎడమచేతి స్లో ఆర్థడాక్స్ | ||
వికాస్ మిశ్రా | 1992 డిసెంబరు 27 | కుడిచేతి వాటం | ఎడమచేతి స్లో ఆర్థడాక్స్ | ||
Pace bowlers | |||||
ప్రన్షు విజయరన్ | 1995 నవంబరు 18 | ఎడమచేతి వాటం | కుడిచేతి మీడియం | ||
మయాంక్ యాదవ్ | 2002 జూన్ 17 | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం-fast | Plays for Lucknow Super Giants in IPL | |
నవదీప్ సైనీ | 1992 నవంబరు 23 | కుడిచేతి వాటం | Right-arm fast | Plays for Rajasthan Royals in IPL | |
హర్షిత్ రాణా | 2001 డిసెంబరు 22 | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం | Plays for Kolkata Knight Riders in IPL | |
ఇషాంత్ శర్మ | 1988 సెప్టెంబరు 2 | కుడిచేతి వాటం | కుడిచేతి ఫాస్ట్ మీడియం | Plays for Delhi Capitals in IPL | |
దివిజ్ మెహ్రా | 2002 సెప్టెంబరు 25 | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం | ||
ప్రదీప్ సాంగ్వాన్ | 1990 నవంబరు 5 | కుడిచేతి వాటం | ఎడమచేతి మీడియం | Plays for Gujarat Titans in IPL | |
కుల్వంత్ ఖేజ్రోలియా | 1992 మార్చి 13 | ఎడమచేతి వాటం | ఎడమచేతి మీడియం ఫాస్ట్ | Plays for Kolkata Knight Riders in IPL |
2023 మే 4 నాటికి నవీకరించబడింది
కోచింగ్ సిబ్బంది
[మార్చు]- ప్రధాన కోచ్ - భాస్కర్ పిళ్లై
- బౌలింగ్ కోచ్ - రాజ్‌కుమార్ శర్మ
- అసిస్టెంట్ కోచ్ - అమిత్ భండారీ
- మేనేజర్ - మనోజ్ కపూర్
- అండర్-19 కోచ్ - మదన్ శర్మ
- ఫిజియో - దీపక్ సూర్య
- శిక్షకులు - నిశాంత బోర్డోలోయ్