కృష్ణమాచారి శ్రీకాంత్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
కృష్ణమాచారి శ్రీకాంత్
DrHariPrasadSrikanth.jpg
Krishnamachari Srikkanth with Dr.K. Hari Prasad at a social-awareness event
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు కృష్ణమాచారి శ్రీకాంత్
జననం (1959-12-21) 21 డిసెంబరు 1959 (వయస్సు: 58  సంవత్సరాలు)
మద్రాసు, India
బ్యాటింగ్ శైలి Right hand bat
బౌలింగ్ శైలి Right arm medium, Off spin
సంబంధాలు Anirudha Srikkanth (కొడుకు)
అంతర్జాతీయ సమాచారం
జాతీయ జట్టు India
టెస్టు అరంగ్రేటం(cap 43) 27 November 1981 v England
చివరి టెస్టు 1 February 1992 v Australia
వన్డే ప్రవేశం(cap 146) 25 November 1981 v England
చివరి వన్డే 15 March 1992 v South Africa
కెరీర్ గణాంకాలు
Competition Tests ODIs
Matches 43 146
Runs scored 2062 4091
Batting average 29.88 29.01
100s/50s 2/12 4/27
Top score 123 123
Balls bowled 216 712
Wickets 0 25
Bowling average 25.64
5 wickets in innings 2
10 wickets in match
Best bowling 5/27
Catches/stumpings 40/0 42/0
Source: [1], 7 October 2009

1959 డిసెంబర్ 21చెన్నైలో జన్మించిన కృష్ణమాచారి శ్రీకాంత్ (Krishnamachari Srikkanth) భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు. 1981లో ఇంగ్లాండు పై అహ్మదాబాదులో తొలి వన్డే, ముంబాయిలో తొలి టెస్ట్ ఆడి అంతర్జాతీయ క్రికెట్ లో ప్రవేశించాడు. 21 ఏళ్ళ వయసులోనే సునీల్ గవాస్కర్కు జతగా ఓపెనర్ గా భారత జట్టు తరఫున ఆడినాడు. అయితే ఇద్దరికీ ఆట విధానమ్లో చాలా తేడా ఉంది. గవాస్కర్ నైపుణ్యం కల బ్యాట్స్‌మెన్ కాగా శ్రీకాంత్ బ్యాటింగ్ హిట్టర్. తన హిట్టింగ్ ద్వారా ముఖ్యంగా వన్డేలలో భారత జట్టుకు మంచి శూభారంభం చేసేవాడు. గవాస్కర్, రవిశాస్త్రి, దిలీప్ వెంగ్‌సర్కార్, మోహిందర్ అమర్‌నాథ్ లాంటి నైపుణ్యం కల బ్యాట్స్‌మెన్ ల కాలంలోనూ జట్టులో హిట్టర్ గా నిలదొక్కున్నాడంటే అతని ప్రతిభను ప్రశంసించాల్సందే. అతని 43 టెస్టులకు ప్రాతినిధ్యం వహించి 2062 పరుగులు చేసాడు. ఇందులో 2 సెంచరీలు, 12 అర్థ సెంచరీలు ఉన్నాయి. వన్డేలలో భారత జట్టుకు 146 మ్యాచ్‌లలో ప్రాతినిధ్యం వహించి 4091 పరుగులు సాధించాడు. ఇందులో 4 సెంచరీలు, 27 అర్థ సెంచరీలు ఉన్నాయి. 1983లో ప్రపంచ కప్ సాధించిన భారత జట్టులో కూడా ఇతను ప్రాతినిధ్యం వహించాడు. 1989లో శ్రీకాంత్ భారత జట్టు కెప్టెన్ గా నియమించబడ్డాడు. ఒకే వన్డేలో 5 వికెట్లు మరియు అర్థ సెంచరీ సాధించిన మొట్టమొదటి భారతీయుడితను. 1988లో న్యూజీలాండ్ పై విశాఖపట్నం వన్డేలో ఈ ఘనత సాధించాడు. క్రికెట్ నుంచి రిటైర్‌మెంట్ తర్వాత ఇండియా-ఏ జట్టుకు కోచింగ్ ఇచ్చి మంచి ఫలితాలను సాధించాడు. ప్రస్తుతం ఇతను టెలివిజన్ వ్యాఖ్యాతగా రాణిస్తున్నాడు.

బయటి లింకులు[మార్చు]

ఇవి కూడా చూడండి[మార్చు]