రోజర్ బిన్నీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Roger Binny 2018.jpg

కర్ణాటక లోని బెంగుళూరులో 1955 జూలై 19 న జన్మించిన రోజర్ బిన్నీ పూర్తి పేరు రోజర్ మైకెల్ హంప్రీ బిన్నీ (Roger Michael Humphrey Binny) (Kannada:ರೋಜರ್‌ ಮೈಖೆಲ್‌ ಹಂಫ್ರಿ ಬಿನ್ನಿ). పూర్వపు భారత క్రికెట్ ఆల్‌రౌండర్ అయిన రోజర్ బిన్నీ 1983 ప్రపంచ కప్ క్రికెట్ లో మంచి ప్రతిభను చూపినాడు. ఆ ప్రపంచ కప్ లో మొత్తం 18 వికెట్లు సాధించి, అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ గా నిల్చాడు. 1985లో వరల్డ్ సీరీస్ క్రికెట్ చాంపియన్ లో కూడా ఇదే ప్రతిభ ప్రదర్శించి 17 వికెట్లు సాధించాడు.

బిన్నీ అతని సొంత మైదానమైన బెంగుళూరు లోనే 1979లో పాకిస్తాన్ పై తన అంతర్జాతీయ క్రికెట్ ఆరంగేట్రం చేసాడు. ఇమ్రాన్ ఖాన్, సర్ఫ్రరాజ్ నవాజ్ లాంటి మేటి బౌలర్లను ఎదుర్కొని తొలి మ్యాచ్ లోనే 46 పరుగులు సాధించాడు. ఈ సీరీస్ లోని ఐదవ టెస్టులో ఇమ్రాన్ ఖాన్ బౌన్సర్ కు సిక్సర్ కొట్టిన సంఘటన ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఆ సమయంలో అతడు మంచి బౌలర్, ఫీల్డర్ కూడా. రోజర్ బిన్నీ భారతదేశం తరఫున ఆడిన తొలి ఆంగ్లో-ఇండియన్ [1]. రోజర్‌ బిన్నీ బీసీసీఐ 36వ అధ్యక్షుడిగా 2022 అక్టోబర్ 18న నియమితుయ్యాడు.[2]

టెస్ట్ గణాంకాలు[మార్చు]

రోజర్ బిన్నీ భారత్ తరఫున 27 టెస్టులకు ప్రాతినిధ్యం వహించి 23.05 సగటుతో 830 పరుగులు సాధించాడు. ఇందులో 5 అర్థ సెంచరీలు ఉన్నాయి. టెస్ట్ క్రికెట్ లో అతని అత్యధిక స్కోరు 83 నాటౌట్. బౌలింగ్ లో 32.63 సగటుతో 47 వికెట్లు సాధించాడు. రెండు సార్లు ఇన్నింగ్సులో 5 వికెట్లు సాధించిన ఘనత పొందినాడు. అతని అత్యుత్తమ బౌలింగ్ 56 పరుగులకు 6 వికెట్లు.

వన్డే గణాంకాలు[మార్చు]

72 వన్డే లకు ప్రాతినిధ్యం వహించిన బిన్నీ 16.12 సగటుతో మొత్తం 629 పరుగులు సాధించాడు. ఇందులో ఒక అర్థ సెంచరీ ఉంది. వన్డేలో అతని అత్యధిక స్కోరు 57 పరుగులు. బౌలింగ్లో 29.35 సగటుతో 77 వికెట్లు సాధించాడు. వన్డేలో అత్యుత్తమ బౌలింగ్ విశ్లేషణ 29 పరుగులకు 4 వికెట్లు.

ప్రపంచకప్ లో ప్రాతినిధ్యం[మార్చు]

భారతదేశం గెలుపొందిన 1983 ప్రపంచ కప్ క్రికెట్ జట్టులో రోజర్ బిన్నీ ప్రాతినిధ్యం వహించాడు. ఈ కప్ లో 18 వికెట్లు సాధించి అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ గా అవతరించడమే కాకుండా భారత్ కప్ గెల్వడానికి కారకుడైనాడు. ఆ తర్వాత 1987 ప్రపంచ కప్ క్రికెట్ లో కూడా ప్రాతినిధ్యం వహించాడు.

మూలాలు[మార్చు]

  1. http://content-usa.cricinfo.com/ci/content/current/story/149642.html
  2. "బీసీసీఐ 36వ అధ్యక్షుడిగా రోజర్‌ బిన్నీ." 18 October 2022. Archived from the original on 18 October 2022. Retrieved 18 October 2022.

ఇవి కూడా చూడండి[మార్చు]