ప్రవీణ్ ఆమ్రే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రవీణ్ ఆమ్రే
Cricket no pic.png
Flag of India.svg India
వ్యక్తిగత సమాచారం
బ్యాటింగ్ శైలి కుడిచేతి బ్యాట్స్‌మన్
బౌలింగ్ శైలి లెగ్ బ్రేక్
కెరీర్ గణాంకాలు
TestsODIs
మ్యాచ్‌లు 11 37
పరుగులు 425 513
బ్యాటింగ్ సగటు 42.50 20.51
100లు/50లు 1/3 0/2
అత్యుత్తమ స్కోరు 103 84*
ఓవర్లు - 0.2
వికెట్లు - -
బౌలింగ్ సగటు - -
ఒకే ఇన్నింగ్స్ లో 5 వికెట్లు - 0
ఒకే మ్యాచ్ లో 10 వికెట్లు - n/a
అత్యుత్తమ బౌలింగ్ - -
క్యాచ్ లు/స్టంపింగులు 9/- 12/-

As of ఫిబ్రవరి 4, 200
Source: [1]

1968లో ముంబాయిలో జన్మించిన ప్రవీణ్ ఆమ్రే (Pravin Kalyan Amre) భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు. ఇతడు భారత జట్టు తరఫున 11 టెస్ట్ మ్యాచ్ లు ఆడి ఒక సెంచరీ, 3 అర్థ సెంచరీలతో మొత్తం 425 పరుగులు సాధించాడు. ఇతని సగటు స్కోరు 42.5 పరుగులు. 1992 నుంచి 1994 మధ్య కాలంలో ప్రవీణ్ ఆమ్రే భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ప్రవేశించిన తొలి టెస్టులోనే దక్షిణాఫ్రికా పై సెంచరీ సాధించి మంచి రికార్డుతో ఉన్ననూ తదుపరి మ్యాచ్‌లలో అంతగా రాణించలేడు. దేశవాళీ క్రికెట్ లో అతనికి మంచి రికార్డు ఉంది. ముంబాయి, రైల్వేస్, [[రాజస్థాన్. బెంగాళ్ తరఫున దేశవాళీ క్రికెట్ ఆడినాడు. దక్షిణాఫ్రికా లో బొలాండ్ తరఫున కూడా ప్రాతినిధ్యం వహించాడు. సచిన్ టెండుల్కర్, వినోద్ కాంబ్లిలు చదివిన స్కూలు నుంచే ప్రవీణ్ కూడా అభ్యసించాడు. అంతేకాకుండా సచిన్, కాంబ్లీ లకు క్రికెట్ నేర్పిన రమాకాంత్ అచ్రేకర్ ఇతనికి కూడా గురువే.