సబ్స్క్రయిబర్ ఐడెంటిటీ మాడ్యూల్

వికీపీడియా నుండి
(సిమ్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
సిమ్‌కార్డులలో రకరకాలు ఉన్నాయి.
ఒక రకపు సిమ్‌ కార్డు (మినీ-సిమ్‌)
నోకియా 6233 లో సిమ్‌ ఉంచే చోటు, దాని ప్రక్కన్న ఒక మిని-సిమ్‌కార్డు
A TracFone Wireless SIM card has no distinctive carrier markings and is only marked as a "SIM CARD"

సబ్స్క్రయిబర్ ఐడెంటిటీ మాడ్యూల్ లేదా సబ్స్క్రయిబర్ ఐడెంటిఫికేషన్ మాడ్యూల్ లేదా సిమ్ (SIM) అనేది ఒక ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ చిప్, ఇది ఇంటర్నేషనల్ మొబైల్ సబ్స్క్రయిబర్ ఐడెంటిఫై (IMSI) సంఖ్య, దాని సంబంధితకీ ని సురక్షితంగా స్టోర్ చెయ్యడానికి ఉద్దేశించబడింది, దీనిని మొబైల్ టెలిఫోనీ పరికరాల (మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు వంటి) చందాదారులను గుర్తించడానికి, ధృవీకరించడానికి ఉపయోగిస్తారు. అనేక సిమ్ కార్డులలో పరిచయాలు నిల్వ చేయడానికి కూడా అవకాశం ఉంది. సిమ్ కార్డులు ఎప్పుడూ జిఎస్ఎమ్ ఫోన్లలో ఉపయోగిస్తారు. సిమ్ కార్డులను ఉపగ్రహ ఫోన్లలో కూడా ఉపయోగిస్తారు. సిమ్‌కార్డులు మొబైల్ ఫోన్లలో వాడేందుకే అయినా మొబైల్ ఫోన్లను వేరు వేరు కంపెనీలు, సిమ్‌కార్డులను వేరువేరు కంపెనీలు తయారు చేసి సరఫరా చేస్తున్నాయి. సిమ్‌కార్డులను తయారు చేసే కంపెనీలలో బిఎస్‌ఎన్‌ఎల్, ఎమ్‌టిఎన్‌ఎల్, ఎయిర్టెల్, టాటా డొకమో, వోడాఫోన్, ఐడియా, యూనినార్, రిలయన్స్ మొదలైనవి ముఖ్యమైనవి.

ఇవి కూడా చూడండి

[మార్చు]