ఈ-సిం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఈ-సిమ్‌ (eSIM) (ఎంబెడెడ్-SIM) అనేది ప్రోగ్రామబుల్ SIM కార్డుకి ఒక రూపం. దీనిని నేరుగా పరికరంలో పొందుపరుస్తారు. సాధారణంగా PVCతో తయారు చేయబడిన, తొలగించగల యూనివర్సల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ కార్డ్ (UICC) పై ఉన్న ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ కు బదులుగా, ఈ-సిమ్‌ అనేది పరికరానికి శాశ్వతంగా జోడించబడిన eUICC చిప్‌లో ఇన్‌స్టాల్ చేయబడిన సాఫ్ట్‌వేర్‌ను కలిగి ఉంటుంది. eUICCలో ఈ-సిమ్‌ క్యారియర్ ప్రొఫైల్ ఇన్‌స్టాల్ చేయబడిన తర్వాత, ఇది క్యారియర్ ద్వారా రూపొందించబడిన ప్రత్యేకమైన ICCID, నెట్‌వర్క్ ప్రమాణీకరణ కీతో పూర్తి చేయబడిన ఫిజికల్ SIM వలె పనిచేస్తుంది.

ఈ-సిమ్‌ ప్రమాణం మొదట 2016లో విడుదల చేయబడింది; అప్పటి నుండి, సెల్యులార్ టెలిఫోనీతో సహా డొమైన్‌లలో భౌతిక SIMని ఈ-సిమ్‌ భర్తీ చేయడం ప్రారంభించింది. సెల్‌ఫోన్లలో ఉపయోగించే సిమ్‌­ (సబ్స్క్రయిబర్ ఐడెంటిటీ మాడ్యూల్) కార్డు క్రమంగా పెద్ద పరిమాణం నుంచి చిన్నదిగా మారుతూ ప్రస్తుతం ఈ సిం లాంటి డిజిటల్‌ రూపంలోకి మారింది. అందుబాటులోకి వస్తోన్న అత్యాధునిక సెల్‌ఫోన్లు, వాచ్‌లతో పాటే ‘ఈ–సిమ్‌’లూ విస్తృతంగా వినియో­గంలోకి వస్తున్నాయి. కొన్నేళ్ల కిందటే ఇది మార్కెట్‌లోకి వచ్చినా ఇంకా అంతగా ప్రాచుర్యం పొందలేదు. సైబర్‌ మోసాలు భారీగా పెరుగుతుండటంతో అత్యధిక మంది ‘ఈ–సిమ్‌’పై ఆసక్తి చూపిస్తున్నారు. పైగా మొబైల్‌ స్టోర్‌కు వెళ్ల­కుండానే ఎస్‌ఎంఎస్, ఈ–మెయిల్‌ ద్వారా యాక్టివేట్‌ చేసుకునే అవకాశం ఉండడం ఇందులో ప్రత్యే­కత.

చరిత్ర

[మార్చు]

2010 నుండి, GSMA సాఫ్ట్‌వేర్ ఆధారిత SIM యొక్క అవకాశం గురించి చర్చిస్తోంది.[1]

Motorola eUICC పారిశ్రామిక పరికరాలపై దృష్టి సారించిందని పేర్కొన్నప్పటికీ, Apple "వినియోగదారు ఉత్పత్తిలో పొందుపరిచిన UICCని ఉపయోగించడాన్ని నిషేధించే ఏదైనా ప్రకటన ఉందని అంగీకరించలేదు". ప్రస్తుతం, GSMA ప్రమాణం యొక్క రెండు వేర్వేరు వెర్షన్‌లను నిర్వహిస్తోంది: ఒకటి వినియోగదారు పరికరాల కోసం [2], మరొకటి మెషిన్ టు మెషిన్ పరికరాల కోసం.[3]

ప్రపంచంలో మొట్టమొదట ఈ–సిమ్‌ను 2016లో శామ్‌సంగ్‌ గేర్‌ ఎస్‌2 3జీ స్మార్ట్‌వాచ్‌ కోసం అందుబాటులోకి తెచ్చారు. అనంతరం 2017లో యాపిల్‌ స్మార్ట్‌ వాచ్‌లో కూడా దీన్ని ప్రవేశపెట్టారు. అతి తక్కువ కాలంలోనే పలు చరవాణి తయారీ సంస్థలు తమ ఫోన్లలో ఈ–సిమ్‌ సపోర్టును ఏర్పాటు చేయగా.. పలు టెలికాం సంస్థలు ఈ–సిమ్‌ సేవలను అందుబాటులోకి తెచ్చాయి. మన దేశంలో భారతి ఎయిర్‌టెల్, రిలయన్స్‌ జియో, వోడాఫోన్‌–ఐడియా ఈ–సిమ్‌ సేవలను అందిస్తున్నాయి.

ఈ-సిం ఆవశ్యకత

[మార్చు]

కొన్నేళ్లుగా సిమ్‌ కార్డులతో ఆన్‌లైన్‌ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. టెలికాం సంస్థలు, బ్యాంకులు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఎప్పటికప్పుడు కొత్త తరహా మోసాలు పుట్టుకొస్తున్నాయి. వాటిలో చాలా కేసులు సిమ్‌ స్వాప్‌ మోసాలకు సంబంధించినవే. ఇందులో నేరగాళ్లు మొదట ఫోన్‌ నంబర్లు, ఈ–మెయిల్‌ ఐడీల వంటివి సేకరిస్తారు. వివిధ ఆకర్షణీయ ఈ–మెయిల్స్, మెసేజ్‌లు పంపించి, ఫోన్‌ కాల్స్‌ చేసి అవతలి వ్యక్తుల వ్యక్తిగత వివరాలు సేకరిస్తారు. ఆ తర్వాత ఫోన్‌ పోగొట్టుకున్నామని, లేదా పాత సిమ్‌ పాడైపోయిందని చెప్పి నెట్‌వర్క్‌ ప్రొవైడర్‌ నుంచి డూప్లికేట్‌ సిమ్‌ తీసుకుంటారు. టెలికాం ఆపరేటర్‌ కంపెనీకి సమర్పించిన వివరాలు సరైనవే అయితే మోసగాడు సులువుగా బాధితుడి నంబర్‌తో కొత్త సిమ్‌ తీసుకుంటాడు. సిమ్‌ యాక్టివేట్‌ అయిన తర్వాత పూర్తి కంట్రోల్‌ హ్యాకర్‌ చేతికి వెళ్లిపోతుంది. ఇక సులువుగా మన బ్యాంక్‌ అకౌంట్‌లోని డబ్బుతో పాటు ఫోన్‌లోని రహస్య సమాచారమంతా లాగేస్తారు.

ఈ–సిమ్‌ ప్రయోజనాలు

[మార్చు]

ఈ–సిమ్‌ అనేది ప్రస్తుతం మనం ఫోన్లలో వినియోగిస్తున్న ఫిజికల్‌ సిమ్‌కు డిజిటల్‌ రూపం. దీన్ని యాక్టివేట్‌ చేయాలంటే వ్యక్తిగత వివరాలతో పాటు వ్యక్తిగత వివరాలతో రిజిస్టర్‌ చేసుకోవాలి. ఈ–సిమ్‌ ఖాతాను సురక్షితంగా ఉంచుకోవడానికి ఫేస్‌ ఐడీ లేదా బయోమెట్రిక్‌ విధానంలో పాస్‌వర్డ్‌ పెట్టుకోవచ్చు. ఒకరు ఈ–సిమ్‌ వాడుతున్నప్పుడు మరొకరు సిమ్‌ పోయిందని లేదా పాడైపోయిందని నెట్‌వర్క్‌ ప్రొవైడర్‌కు ఫిర్యాదు చేయడానికి కుదరదు. అదే నంబర్‌తో మరో సిమ్‌ను తీసుకునే అవకాశం కూడా ఉండదు. ఎవరైనా అలా చేస్తే.. వారు సైబర్‌ నేరగాళ్లుగా గుర్తించి పట్టుకునేందుకు వీలుంటుంది. ప్రస్తుతం అమెరికాలో వినియోగిస్తున్న ఐఫోన్‌–14 మోడ­ల్స్‌కు సిమ్‌ స్లాట్స్‌ లేవు. ఇవి ఈ–సిమ్‌ను మాత్రమే సపోర్ట్‌ చేస్తాయి.

ఈ-సిం వాడకము

[మార్చు]

వీటిని సులభంగా యాక్టివేట్‌ చేయడంతో పాటు డి–యాక్టివేట్‌ కూడా చేయవచ్చు. పలు ఫోన్‌ నంబర్లు, ప్లాన్లను ఒకే సాధనంలో వినియోగించుకోవచ్చు. అంటే సింగిల్‌ సిమ్‌ మాత్రమే సపోర్టు చేసే ఆధునిక ఫోన్లలో అదనంగా ఈ–సిమ్‌ కూడా వినియోగించుకోవచ్చన్నమాట. వీటిని పోగొట్టుకోవడం, పాడవడం లేదా దొంగిలించడం వంటివి సాధ్యం కాదు. వివిధ నెట్‌వర్క్‌లకు, ప్లాన్లకు సులువుగా మారవచ్చు. పైగా నెట్‌వర్క్‌ ప్రొవైడర్‌ స్టోర్‌కు వెళ్లే అవసరం కూడా ఉండదు. అన్నీ రిమోట్‌ విధానంలోనే ఎస్‌ఎమ్‌ఎస్, ఈ–మెయిల్‌ ద్వారానే యాక్టివేట్‌ చేయవచ్చు. అయితే, మనం వాడుతున్న చరవాణి ఈ–సిమ్‌ను సపోర్ట్‌ చేస్తుందా టెలికాం ఆపరేటర్‌ ఈ తరహా సదుపాయాలు అందిస్తున్నారా లేదా అని తెలుసుకోవాలి. మనదేశంలో ఐఫోన్, శామ్‌సంగ్, హానర్, గూగుల్‌ ఫ్లిక్స్, సోనీ, షావోమీ, నోకియా, మొటొరోలా తదితర కంపెనీలకు చెందిన కొన్ని చరవాణులు మాత్రమే ఈ–సిమ్‌ను సపోర్టు చేస్తున్నాయి.

మూలాలు

[మార్చు]
  1. Diana ben-Aaron (18 November 2010). "GSMA Explores Software-Based Replacement for Mobile SIM Cards". Bloomberg. p. 1. Retrieved 17 October 2014.
  2. "eSIM Consumer Specifications". eSIM (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2022-01-22.
  3. "eSIM for M2M". eSIM (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2022-01-22.

బయటి లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=ఈ-సిం&oldid=4076676" నుండి వెలికితీశారు