షావోమీ
![]() | |
దస్త్రం:చిత్రం చిత్రం పేరు | |
Native name | [小米科技] Error: {{Lang}}: unrecognized language tag: Chinese (help) |
---|---|
Romanized name | Xiǎomĭ Kējì |
Type | ప్రైవేట్ |
ISIN | KYG9830T1067 ![]() |
పరిశ్రమ | |
స్థాపన | 2010 ఏప్రిల్ 6బీజింగ్, చైనా | ,
Founders | |
ప్రధాన కార్యాలయం | , చైనా
ఎన్నుకున్న మార్కెట్ దేశాల జాబితా |
Areas served | ప్రాంతాల సేవలు |
Key people | |
Products | |
Revenue | ![]() |
20,00,00,00,000 యునైటెడ్ స్టేట్స్ డాలర్ ![]() | |
13,47,80,00,000 (2018) ![]() | |
Total assets | 2,53,67,98,23,000 (2020) ![]() |
Number of employees | Approximately 3,000[1] |
షియోమి చైనాకు చెందిన ఒక ఎలక్ట్రానిక్, మొబైల్ ఫోన్ తయారీ సంస్థ. చైనా యాపిల్ గా పేరుగాంచిన ఈ సంస్థ చౌక ధరలలో అధునాతన చరవాణి లను తయారు చేస్తూ భారతదేశంలో బాగా ప్రాచుర్యం పొందింది.
నేపధ్యము[మార్చు]
షియోమి కంపెనీ ప్రపంచంలోనే ఆరవ, చైనాలో మూడో అతి పెద్ద మొబైల్ ఫోన్ల కంపెనీ. 2010లో ఈ కంపెనీని లీ జూన్ ప్రారంభించారు. బీజింగ్ కేం ద్రంగా పనిచేసే ఈ కంపెనీ అనతికాలంలోనే అతి పెద్ద ఎలక్ట్రానిక్స్ కంపెనీల్లో ఒకటిగా నిలిచింది. కంపెనీ వెబ్‌సైట్ వివరాల ప్రకారం ఈ సంస్థ 2014 నాటికి 1.7 కోట్ల హ్యాండ్‌సెట్లను విక్రయించింది. ఎంఐ 3, రెడ్‌మి, ఎంఐ వై-ఫై, ఎంఐ బాక్స్ తదితర హ్యాండ్‌సెట్లను అందిస్తోంది. ఈ కంపెనీ ఆన్‌లైన్‌లోనే తన ఉత్పత్తులను విక్రయిస్తోంది. రిటైల్ స్టోర్స్‌లో ఎక్కడా తన ఫోన్‌లను విక్రయించదు.
ఇక కంపెనీ మొత్తం ఆదాయంలో 1 శాతమే మార్కెటింగ్‌కు కేటాయిస్తోంది (శామ్‌సంగ్ కేటాయింపు 5.1%). ఇలా ఆదా చేసిన సొమ్ములతో నాణ్యమైన విడిభాగాలను కొనుగోలు చేసి అత్యంత ఆధునిక ఫీచర్లున్న ఫోన్‌లను తక్కువ ధరకే అందిస్తోంది. షియోమి కంపెనీ భారత కార్యకలాపాలను జబాంగ్ సహ వ్యవస్థాపకుడు మను కుమార్ జైన్ చూస్తారు. ఈ మేరకు షియోమి కంపెనీ అతనితో ఒప్పందం కుదుర్చుకుంది. హువాయి, జెడ్‌టీఈ, లెనొవొ, జియోని, అప్పో వంటి ఇతర చైనా కంపెనీలు ఇప్పటికే భారత్‌లో స్మార్ట్‌ఫోన్లను విక్రయిస్తున్నాయి.
సంస్థ తయారు చేసిన కొన్ని చరవాణులు[మార్చు]
ఎం.ఐ.3[మార్చు]
ఈ సంస్థ ఎంఐయూఐ వీ5 పేరుతో ఆండ్రాయిడ్ యూజర్ ఇంటర్‌ఫేస్‌ను కస్టమైజ్ చేసింది. ఎంఐయూఐ వీ5 ఓఎస్‌పై పనిచేసే ఎంఐ 3 స్మార్ట్‌ఫోన్‌లో 5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ 1080పి ఎల్‌సీడీ టచ్ డిస్‌ప్లే, క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 800 2.3 గిగా హెర్ట్జ్ ప్రాసెసర్, అడ్రెనో 330 450 మెగా హెర్ట్జ్ జీపీయూ, 2 జీబీ ర్యామ్, ఈఎంఎంసీ 4.5 ఫ్లాష్ మెమరీ, 16 జీబీ, 13 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, 2 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 3050 ఎంఏహెచ్ లిథియమ్-ఐయాన్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలున్నాయి. ఈ కంపెనీ ఉత్పత్తులకు చైనాలో ఎంత గిరాకీ ఉందంటే, ఆన్‌లైన్‌లో ఎంఐ 3 ఫోన్‌లు 86 సెకన్లలోనే లక్ష అమ్ముడు కావడం విశేషం.
రెడ్‌మి 1ఎస్[మార్చు]
రు.5,999 ధర ఉండే ఈ డ్యుయల్ సిమ్ ఫోన్ (ఒకటి 3జీ, ఇంకొకటి 2జీ) ను 2014 సెప్టెంబరు నెల 2న మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఆన్‌లైన్‌లో విక్రయాలకు అందుబాటులో ఉంచింది. ఈ ఫోన్ కొనుగోళ్లకు ముందస్తు రిజిస్ట్రేషన్లు ముందు నుంచే ప్రారంభమయ్యాయని షియోమి గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్ హ్యుగో బర్రా పేర్కొన్నారు.
ఈ ఫోన్‌లో 4.7 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ, 1.6 గిగాహెర్ట్జ్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 400 క్వాడ్ కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్ మెమరీ, 64 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమరీ, 8 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, 1.6 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా వంటి ఫీచర్లున్నాయని వివరించారు. షియోమి ఫ్లాగ్‌షిప్ మోడల్, ఎంఐ3ని ఆన్‌లైన్ మార్కెట్ ప్లేస్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా మంచి అమ్మకాలు సాధించిన ఉత్సాహాంతో రెడ్‌మి 1 ఎస్‌ను షియోమి భారత్‌లోకి తెస్తోంది. రూ.13,999 ధర ఉన్న ఎంఐ3 స్మార్ట్‌ఫోన్‌లు ఇప్పటివరకూ 90 వేలు అమ్ముడయ్యాయి. ఒక్కో విడతకు 10,000-20,000 వరకూ ఆరు విడతల్లో ఈ ఫోన్‌లను కంపెనీ ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఆఫర్ చేసింది. ప్రతిసారి ఐదు సెకన్లలోనే ఫోన్లన్నీ అమ్ముడయ్యాయని కంపెనీ పేర్కొంది.
ఫ్లిప్‌కార్ట్‌తో ఒప్పందం[మార్చు]
ఉత్పత్తుల విక్రయాల కోసం షియోమి కంపెనీ ప్రముఖ ఈ కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్తో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దేశవ్యాప్తంగా 35 సర్వీస్ సెంటర్లను ఏర్పాటు చేసింది. 2014 సెప్టెంబరు నెలలో రెడ్‌ఎంఐ 1ఎస్ స్మార్ట్‌ఫోన్‌ను, రెడ్‌ఎంఐ నోట్ (ఫ్యాబ్లెట్) లను అందిస్తున్నది. 4.7 అంగుళాల రెడ్‌ఎంఐ 1ఎస్ ఫోన్‌ను రూ.6,999కు, 5.5 అంగుళాల డిస్‌ప్లే ఉన్న రెడ్‌ఎంఐ నోట్‌ను రూ.9,999కు విక్రయిస్తోంది.
భద్రతా ముప్పులు[మార్చు]
షియోమీ కంపెనీ భారత్‌లో విక్రయిస్తున్న ఫోన్‌లను తమ అధికారులు, కుటుంబీకులు వాడొద్దంటూ గతవారం భారత వాయు సేన (ఐఏఎఫ్) హెచ్చరించింది.షియోమీ ఫోన్‌లలోని డేటా అంతా చైనాలోని సర్వర్లకు చేరుతోందని.. దీనివల్ల సెక్యూరిటీ రిస్కులు పొంచిఉన్నాయని ఐఏఎఫ్ హెచ్చరించింది [2]. 2013 లో రెడ్ మీ 1ఎస్ ఫోన్ ద్వారా సర్వీస్ ప్రోవైడర్ పేరు, ఫోన్ ఐఎమ్ఈఐ నంబర్లను ఏవిధంగా చేరవేస్తుందనే అంశాన్ని ఫిన్ లాండ్ కు చెందిన ఎఫ్ సెక్యూర్ కంపెనీ ఓ డెమోను నిర్వహించింది.
మూలాలు[మార్చు]
- ↑ "About Us". mi.com. Xiaomi. 2014-06-05. Retrieved 2014-06-05.
- ↑ http://gadgets.ndtv.com/mobiles/news/indian-air-force-reportedly-issues-security-warning-against-xiaomi-products-611292
బయటి లంకెలు[మార్చు]

- మూసలను పిలవడంలో డూప్లికేటు ఆర్గ్యుమెంట్లను వాడుతున్న పేజీలు
- Pages with non-numeric formatnum arguments
- తెగిపోయిన ఫైలులింకులు గల పేజీలు
- Pages using infobox company with unknown parameters
- Commons category link is locally defined
- Official website different in Wikidata and Wikipedia
- సంస్థలు
- చైనా
- మొబైల్ ఫోన్ తయారీదారులు
- మొబైల్ ఫోన్‌లు