చరవాణి

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
Motorola SLVR L7 mobile phone

చరవాణి లేదా సెల్‌ఫోన్ లేదా మొబైల్ ఫోన్ ను అరచేతిలో ఇమిడే తీగలు (వైర్లు) లేని ఆధునిక దూరవాణి పరికరముగా చెప్పవచ్చు. నేడు ఇది మానవ జీవితములో విడదీయరాని భాగము అయినది. మునుపటి రోజులలో ఫోను సౌకర్యము చాలామందికి వుండేది కాదు. మనం ఒక ఫోన్ కాల్ చేయడానికి ఒక పబ్లిక్ టెలిఫోన్ బూత్ కోసం అన్వేషణ చేసే వాళ్ళం. కానీ ఇప్పుడు, మీ మొబైల్ ఫోన్ ద్వారా ఎవరైనా ఎప్పుడైనా ఫోను ద్వారా సంభాషించే వీలుంది. మీ భూభాగం లేదా మరొక దేశంలో ఉన్నా, మీరు ఎక్కడున్నా మరియు అన్ని సమయం కనెక్ట్ ఉండాలి రోమింగ్ సౌకర్యం ఉపయోగించవచ్చు. మీరు వార్తలు, విమాన సమయాలను మరియు మరిన్ని ఫీచర్లు వంటి సమాచారాన్ని పొందేందుకు, చిత్రాలు పంపేందుకు, గ్రీటింగ్స్ పంపండానికి, సందేశాలను అందుకోవడం, సందేశాలను పంపడానికి MMS టెక్స్ట్ సందేశం వంటి లక్షణాలను ఉపయోగించి చేయవచ్చు.

ఇప్పుడు చాలా మొబైల్ ఫోన్ సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా GPRS లేదా EDGE లేదా 3G ఎనేబుల్ నెట్వర్క్ ఉంది. మీరు ఎప్పుడైనా ఎక్కడైనా ఇంటర్నెట్ ఉపయోగించి చేయవచ్చు. ఎప్పుడైనా మెయిల్ చెక్ చేసుకోవచ్చు

చరిత్ర[మార్చు]

భారతదేశములో మొబైల్ ఫోన్ సేవలు[మార్చు]

మన దేశములో మొదటగా 1985 లో ఢిల్లీ లో మొబైల్ సేవలు ప్రారంభమయ్యయి.[1].ప్రభుత్వ రంగములో బి.ఎస్.ఎన్.ఎల్, ఎం.టి.ఎన్.ఎల్ లు ఈ సేవలు అందిస్తుండగా, ప్రైవేటు రంగములో రిలయెన్స్, ఎయిర్ టెల్, వోడాఫోన్, ఐడియా,ఎయిర్ సెల్ మరియు ఇతర సంస్థలు ఈ సేవలను అందిస్తున్నాయి.

దస్త్రం:MobilePhone.JPG
నోకియా మొబైల్ ఫోన్ మరియు దాని పేటిక.
దస్త్రం:Toshiba tg01.jpg
తాకే తెర సౌకర్యము కల మొబైల్ ఫోన్.

సైకిల్‌తో సెల్‌ ఛార్జింగ్‌[మార్చు]

సైకిల్కు అమర్చే ఈ పరికరంలో ఛార్జర్‌, డైనమో ఉంటాయి. సైకిల్‌ చక్రం తిరినప్పుడు విడుదలయ్యే శక్తి ఆధారంగా డైనమో విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. నోకియా మొబైళ్లను దీనితో ఛార్జింగ్‌ చేయవచ్చు. ధర సుమారు రూ.860.

మానవ కదలికలతో సెల్ ఛార్జింగ్[మార్చు]

చార్జర్ల గొడవ అనేది లేకుండా శాస్త్రవేత్తలు 'జెన్నీయో' అనే ఒక కొత్త పరికరాన్ని అభివృద్ధి చేశారు. మన కదలికల ద్వారా సెల్ ఫోన్‌ను చార్జ్ చేసుకోవచ్చంటున్నారు శాస్త్రవేత్తలు. 'దీన్ని ఎక్కడికైనా చాలా సులభంగా తీసుకుపోవచ్చు. కదలికల వల్ల ఉత్పత్తయిన శక్తి.. దాంట్లో ముందే అమర్చిన బ్యాటరీలో నిక్షిప్తమవుతుంది. ఎల్ఈడీ బ్యాటరీ కొలమానం బ్యాటరీలో ఎంత చార్జింగ్ ఉందో తెలియజేస్తుంది' అన్నారు. ఈ మొబైల్ జనరేటర్ రెండు మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేస్తామని శాస్త్రవేత్తలు తెలిపారు.

నీటిలో తడవని సెల్ ఫోన్లు[మార్చు]

అమెరికా శాస్త్రవేత్తల పరిశోధన ఫలితంగా సెల్‌ఫోన్లు కూడా చాలా ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా వాటర్‌ప్రూఫ్‌గా అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతానికి సెల్‌ఫోన్లలోని ఆర్గానిక్ లైట్ ఎమిటింగ్ డయోడ్ (ఓఎల్ఈడీ)లు తడిస్తే పాడైపోతున్నాయి. కానీ, వీటికి రక్షణ కవచంలాగా ఆటామిక్ లేయర్ డిపొజిషన్ పద్ధతిలో ఒక ఫిల్మ్ (పొర)ను శాస్త్రవేత్తలు రూపొందించారు. ఇది అత్యంత పలుచనైనది. కానీ ఎంతో మన్నికైనది. ఎంత పలుచనైనదంటే... దీని మందం కేవలం 10 నానోమీటర్లు మాత్రమే! ప్రస్తుతం వాడుతున్న ఫిల్మ్‌లు దీనికి కంటే వేల రెట్ల ఎక్కువ మందంలో ఉంటాయంటున్నారు శాస్త్రవేత్తలు. ఈ ఫిల్మ్‌లను కేవలం సెల్‌ఫోన్లలోనే కాకుండా భవిష్యత్తులో బయోమెడికల్ పరికరాలు, ఎల్ఈడీ ఆధారిత లైటింగ్, డిస్‌ప్లేలు, సోలార్ సెల్స్, ఆర్గానిక్ ఎలక్ట్రానిక్ విం డోస్‌లలో కూడా ఉపయోగించవచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు

సెల్‌ఫోన్‌లో ఈసీజీ[మార్చు]

గుండెపోటు ముప్పును పసిగట్టి తక్షణం వైద్యసాయం పొందటం అవసరం. బ్లాక్‌బెర్రీ స్మార్ట్‌ఫోన్ల వినియోగదారులు తమ ఈసీజీ వివరాలను ఉన్న చోటు నుంచే వైద్యులకు చేరవేయవచ్చు. ఈ నివేదికను హృద్రోగ నిపుణులు పరిశీలించి రోగి ఎలాంటి చర్యలు తీసుకోవాలో తక్షణం వివరిస్తారు. సెల్‌ఫోన్‌ సేవా సంస్థ వోడాఫోన్‌తో కలిసి మాస్ట్రోస్‌ మెడిలైన్‌ సిస్టమ్స్‌ లిమిటెడ్‌ ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. దీన్ని eUNO R10 సొల్యూషన్‌ అని వ్యవహరిస్తున్నారు.

సెల్‌ఫోన్‌తో బ్రెయిన్ క్యాన్సర్[మార్చు]

అతి వాడకంతో కొన్ని రకాల మెదడు క్యాన్సర్ల ముప్పు ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తెలిపింది. సెల్‌ఫోన్‌ను.. డీడీటీ పురుగు మందు, వాహనాల నుంచి వెలువడే పెట్రోలు పొగ వంటి క్యాన్సర్ కారకాల (2బీ) విభాగంలో చేర్చింది.

  • హెడ్‌సెట్ వాడండి: రేడియేషన్ ప్రభావం నుంచి మెదడును రక్షించుకోవటానికి ఇది చాలా తేలికైన మార్గం. ఇది ఫోన్ యాంటెనా నుంచి తల దూరంగా ఉండేలా చేస్తుంది. బ్లూటూత్ కూడా కొంతమేరకు ఉపయోగపడుతుంది.
  • లిఖిత సందేశాలు పంపండి: సెల్‌ఫోన్ మెదడుకు దూరంగా ఉంటుంది కాబట్టి ఎలాంటి రేడియేషన్ ప్రభావమూ దానిపై పడదు.
  • మాట్లాడుతున్నప్పుడే కాదు. పక్కన పడేసినప్పుడూ సెల్‌ఫోన్ నుంచి రేడియేషన్ వెలువడుతుంది. అందుకే దీన్ని తల పక్కనే పెట్టుకొని అలారం గడియారంలా వాడకపోవటమే మంచిది. .
  • సెల్‌ఫోన్‌ని ప్యాంటు జేబులో పెట్టుకున్నా, బెల్ట్‌కు ధరించినా సంతాన సామర్థ్యంపై ప్రభావం చూపుతుంది..వీలైనప్పుడల్లా సెల్‌ఫోన్‌ని దూరంగా ఉంచటం మేలు.(ఈనాడు2.6.2011)

సవరణ[మార్చు]

సెల్ టవర్లు, సెల్‌ఫోన్ల రేడియేషన్ కారణంగా ఆరోగ్యసమస్యలు తలెత్తుతాయనడానికి ఎలాంటి ఆధారాలు లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ప్రకటించింది. టవర్లు, ఫోన్ల నుంచి వెలువడే రేడియేషన్ కారణంగా క్యాన్సర్ ముప్పు ఉందనడానికి ఆధారాలు లేవని, మెదడుపైన, నిద్రపోయే సమయంపై పడే ప్రభావం కూడా చాలా స్వల్పమని పేర్కొంది. అయితే టవర్ల నుంచి వెలువడే రేడియో ఫ్రీక్వెన్సీ తరంగాల కన్నా సెల్‌ఫోన్ నుంచి వెలువడే తరంగాలు వెయ్యి రెట్లు అధికమని దీన్ని దృష్టిలో ఉంచుకుని ఫోన్ వాడకాన్ని నియంత్రించుకోవాలని సూచించింది.

సెల్‌ఫోన్ వాడకూడని ప్రదేశాలు[మార్చు]

పెట్రోల్‌పంపుల దగ్గర[మార్చు]

లౌడ్‌స్పీకర్లు, రేడియోలు ఉన్నచోట సెల్‌ఫోనును ఉపయోగించేప్పుడు గరగర శబ్దాలు రావడాన్ని గమనించే ఉంటారు. ఇందుకు కారణం సెల్‌ఫోన్‌కు చేరే విద్యుదయస్కాంత తరంగాలు, రేడియోలలో ఉన్న సున్నితమైన విద్యుత్ వలయాలు కృత్రిమంగా విద్యుత్ ప్రవాహాన్ని ప్రేరేపించడమే. దీనిని ఎలక్ట్రోమ్యాగ్నటిక్ ఇండక్షన్ అంటారు. ఈ సూత్రం ఆధారంగానే ట్రాన్స్‌ఫార్మర్లు, మోటార్లు, జనరేటర్లు పనిచేస్తుంటాయి. పెట్రోలు బంకుల దగ్గర మనం సెల్‌ఫోన్ వాడేటప్పుడు సున్నితమైన విద్యుత్ పరికరాల్లో కూడా విద్యుత్ ప్రేరణ జరిగే అవకాశం ఉంది. వీటికి ఓ దిశ, దశ పద్ధతి లేకపోవడం వల్ల విద్యుత్ సర్క్యూట్‌తో స్పార్కులు రావచ్చు. అంటే అగ్ని ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంటుంది. అందువల్లే పెట్రోల్‌పంపుల దగ్గర సెల్‌ఫోన్లు వాడకూడదు.

మొబైల్ లో ఎఫ్.ఎమ్ రేడియో[మార్చు]

  • ఇంతకు ముందు వరకూ రేడియోను వినాలంటే ప్రత్యేకమైన్ పరికరము దానికి బ్యాటరీ అవసరమయ్యేవి కాని ఫోన్ కాల్ తో పాటే రేడియోను వినే సౌకర్యము నేటి మొబైల్ ఫోన్లు కలిగి ఉన్నాయి ఇది ఒక గొప్ప అవకాశము

మొబైల్‌ బ్రాడ్‌బ్యాండ్ టెలిఫోనీ‌[మార్చు]

మొబైల్‌ బ్రాడ్‌ బ్యాండ్‌ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ బ్రౌజింగ్‌, దూర వైద్యం, దూర విద్య (టెలీ ఎడ్యుకేషన్‌), మార్కెట్‌ ధరలు, మేలైన సాగు విధానాలు, మొక్కల సంరక్షణ, సస్యరక్షణ, వాతావరణం, ముఖ్యమైన పంటల వివరాలు రైతులు పొందవచ్చు.

కాన్ఫ్లిక్ట్ ఖనిజాలు[మార్చు]

మొబైల్ ఫోన్లు మరియు ఇతర electroncs కనిపించే లోహాల కొరకు డిమాండు రెండవ కాంగో యుద్ధం రాజుకుంది . యుద్ధం. దాదాపు 5.5 మిలియన్ చెందారు ఒక 2012 న్యూస్ స్టోరి , గార్డియన్ తూర్పు కాంగోలో భూగర్భంలోని , పిల్లలు ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ కోసం అవసరమైన ఖనిజాలు సేకరించేందుకు కృషి సురక్షితం గనుల్లో " , నివేదించారు. ఖనిజాలు నుండి లాభాలు ఆర్థిక రక్తపాత సంఘర్షణ రెండో ప్రపంచ యుద్ధం నాటి నుంచి ; . యుద్ధం సుమారు 20 సంవత్సరాల పాటు కొనసాగింది మరియు ఇటీవల మళ్ళీ అప్ రాజుకున్నాయి ... గత 15 సంవత్సరాలుగా, కాంగో డెమొక్రాటిక్ రిపబ్లిక్ మొబైల్ ఫోన్ పరిశ్రమ కోసం సహజ వనరులను యొక్క ప్రధాన వనరుగా ఉంది . "

సంఘర్షణ ఖనిజాలు కలిగివుండదు ఒక మొబైల్ ఫోన్ అభివృద్ధి చేయడానికి ఒక ప్రయత్నం.[2]

మూలాలు[మార్చు]

  1. http://en.wikipedia.org/wiki/Communications_in_India
  2. "whatsapp for pc". youngstershub.com. Jan 20, 2015. Retrieved Jan 20, 2015. 

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=చరవాణి&oldid=1743888" నుండి వెలికితీశారు