వెంకట రాఘవన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎస్ వెంకట రాఘవన్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
శ్రీనివాస రాఘవన్ వెంకట రాఘవన్
పుట్టిన తేదీ (1945-04-21) 1945 ఏప్రిల్ 21 (వయసు 79)
చెన్నై
మారుపేరువెంకట్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి వాటం ఆఫ్ బ్రేక్
పాత్రబౌలరు
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 110)1965 ఫిబ్రవరి 27 - న్యూజీలాండ్ తో
చివరి టెస్టు1983 సెప్టెంబరు 24 - పాకిస్తాన్ తో
తొలి వన్‌డే (క్యాప్ 8)1974 జూలై 13 - ఇంగ్లాండ్ తో
చివరి వన్‌డే1983 ఏప్రిల్ 7 - వెస్టిండీస్ తో
వన్‌డేల్లో చొక్కా సంఖ్య.79
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1963–1970Madras
1970–1985తమిళనాడు
1973–1975డెర్బీషైర్
అంపైరుగా
అంపైరింగు చేసిన టెస్టులు73 (1993–2004)
అంపైరింగు చేసిన వన్‌డేలు52 (1993–2003)
అంపైరింగు చేసిన ఫ.క్లా79 (1990–2004)
అంపైరింగు చేసిన లిస్ట్ ఎ56 (1990–2003)
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు ఫస్ట్ లిస్ట్ ఎ
మ్యాచ్‌లు 57 15 341 71
చేసిన పరుగులు 748 54 6,617 346
బ్యాటింగు సగటు 11.68 10.80 17.73 11.16
100లు/50లు 0/2 0/0 1/24 0/0
అత్యుత్తమ స్కోరు 64 26* 137 26*
వేసిన బంతులు 14,877 868 83,548 3,985
వికెట్లు 156 5 1390 64
బౌలింగు సగటు 36.11 108.40 24.14 35.34
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 3 0 85 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 1 0 21 0
అత్యుత్తమ బౌలింగు 8/72 2/34 9/93 4/31
క్యాచ్‌లు/స్టంపింగులు 44/– 4/– 316/– 29/–
మూలం: CricketArchive, 2014 మార్చి 10

1945, ఏప్రిల్ 21చెన్నైలో జన్మించిన శ్రీనిసరాఘవన్ వెంకటరాఘవన్ (Srinivasaraghavan Venkataraghavan) భారతదేశానికి చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు. ఇంగ్లీష్ కౌంటీ క్రికెట్ లో ఇతడు డెర్బీషైర్ తరఫున ఆడినాడు. భారత క్రికెట్ జట్టు నుంచి రిటైర్ అయిన తర్వాత అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఎలైట్ టెస్ట్ ప్యానెల్ అంపైర్ గా నియమించబడ్డాడు.

1970 దశాబ్దంలో భారత జట్టులో ప్రముఖ స్పిన్నర్లయిన చంద్రశేఖర్, బిషన్ సింగ్ బేడీ, ఎరపల్లి ప్రసన్న లతో బాటు వెంకట రాఘవన్ ఒకరు. ఇతను ఫీల్డింగ్ లో మంచి నేర్పరి. అంతేకాకుండా చివరి వరుస బ్యాట్స్‌మెన్ లలో ఇతను ప్రయోజనకారిగా ఉండేవాడు. 20 సంవత్సరాల ప్రాయంలోనే భారత్ తరఫున న్యూజీలాండ్ పై టెస్ట్ మ్యాచ్ ఆడి, సీరీస్ చివరి నాటికి ప్రపంచ శ్రేణి స్పిన్నర్ గా అవతరించాడు. ఢిల్లీ టెస్టులో 12 వీకెట్లు సాధించి భారత విజయానికి దోహదపడ్డాడు. 1970-71 లో ఇంగ్లాండు పర్యటించిన భారత జట్టుకు ఉప నాయకుడిగా వ్యవహరించాడు. ఆ సీరీస్ లో భారత్ గెల్వడమే కాకుండా చరిత్ర సృష్టించింది. ఇందులో వెంకట రాఘవన్ కీలక పాత్ర వహించాడు. ట్రినిడాడ్ టెస్టులో 5 వికెట్లు సాధించడమే కాకుండా 3 టెస్టులలో మొత్తం 13 వికెట్లు పడగొట్టాడు.

1975లో జరిగిన మొదటి ప్రపంచ కప్ క్రికెట్ లో, 1979 రెండో ప్రపంచ కప్ క్రికెట్ లో ఇతను భారత జట్టుకు నాయకత్వం వహించాడు. 1979లో ఇంగ్లాండుతో జరిగిన 4 టెస్టుల సీరీస్ కు కూడా ఇతను నాకకత్వం వహించాడు. దేశవాళీ క్రికెట్ లో ఇతను సౌత్ జోన్ కు, తమిళనాడుకు దశాబ్దం పైగా నేతృత్వం వహించాడు.

1985లో వెంకట రాఘవన్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ నుంచి నిష్క్రమించాడు. ఆ తర్వాత భారత టెస్ట్ జట్టుకు అడ్మినిస్ట్రేటర్ గా నియమించబడ్డాడు. 2003లో ఇతనికి పద్మశ్రీ బిరుదును భారత ప్రభుత్వం ప్రధానం చేసింది. వృత్తిరీత్యా ఇతను మెకానికల్ ఇంజనీరు.

అంపైర్ గా క్రీడా జీవితం

[మార్చు]

మొదటిసారిగా 1993, జనవరి 18జైపూర్లో జరిగిన భారత-ఇంగ్లాండు వన్డే మ్యాచ్ కు అంపైర్ గా బాధ్యతలు నిర్వహించాడు. అప్పటి నుంచి 73 టెస్టు మ్యాచ్ లకు, 52 వన్డే మ్యాచ్ లకు అతను అంపైరింగ్ బాధ్యతలు చేపట్టాడు. అతని అంపైర్ క్రీడా జీవితంలో ముఖ్యఘట్టాలు 1996, 1999, 2003 ప్రపంచ కప్ లలో అంపైరింగ్ విధులను నిర్వహించడం.

బయటి లింకులు

[మార్చు]

ఇవి కూడా చూడండి

[మార్చు]