వసీం జాఫర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వసీం జాఫర్
2012 లో దోహాలో వసీం జాఫర్
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ (1978-02-16) 1978 ఫిబ్రవరి 16 (వయసు 46)
ముంబై
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఆఫ్ బ్రేక్
పాత్రబ్యాటరు
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 225)2000 ఫిబ్రవరి 24 - దక్షిణాఫ్రికా తో
చివరి టెస్టు2008 ఏప్రిల్ 11 - దక్షిణాఫ్రికా తో
తొలి వన్‌డే (క్యాప్ 166)2006 నవంబరు 22 - దక్షిణాఫ్రికా తో
చివరి వన్‌డే2006 నవంబరు 29 - దక్షిణాఫ్రికా తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1996–2015ముంబై
2008–2009రాయల్ చాలెంజర్స్ (స్క్వాడ్ నం. 10)
2015–2020విదర్భ
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డే ఫక్లా లిఎ
మ్యాచ్‌లు 31 2 260 118
చేసిన పరుగులు 1,944 10 19,410 4,849
బ్యాటింగు సగటు 34.10 5.00 50.67 44.08
100లు/50లు 5/11 0/0 57/91 10/33
అత్యుత్తమ స్కోరు 212 10 314* 178*
వేసిన బంతులు 66 138
వికెట్లు 2 2
బౌలింగు సగటు 9.00 37.00
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0
అత్యుత్తమ బౌలింగు 2/18 2/18
క్యాచ్‌లు/స్టంపింగులు 27/– 0/– 297/– 45/–
మూలం: ESPNcricinfo, 2020 అక్టోబరు 4

వసీం జాఫర్ (జననం 1978 ఫిబ్రవరి 16) భారత జట్టుకు ఆడిన క్రికెటరు. అతను కుడిచేతి ఓపెనింగ్ బ్యాట్స్‌మన్. అప్పుడప్పుడూ రైట్ ఆర్మ్ ఆఫ్ బ్రేక్ బౌలింగు కూడా చేసేవాడు. అతను ప్రస్తుతం రంజీ ట్రోఫీ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు.[1] 2018 నవంబరులో, రంజీలో 11,000 పరుగులు చేసిన మొదటి బ్యాట్స్‌మన్ అయ్యాడు. [2] 2019 జనవరిలో అతను మధ్యప్రదేశ్‌కు చెందిన దేవేంద్ర బుందేలా (145) ను అధిగమించి తన 146వ మ్యాచ్‌లో రంజీ ట్రోఫీ చరిత్రలో అత్యధికంగా ఆడిన ఆటగాడిగా నిలిచాడు.[3] అతను బంగ్లాదేశ్ క్రికెట్ జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా నియమితుడయ్యాడు.[4] 2020 మార్చిలో, అతను అన్ని రకాల క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు.[5]

2020 జూన్‌లో, జాఫర్‌ను 2020–21 సీజన్‌కు ఉత్తరాఖండ్ ప్రధాన కోచ్‌గా ప్రకటించారు.[6] జట్టు ఎంపికలో "జోక్యం, పక్షపాతం" కారణంగా, అతను 2021 ఫిబ్రవరిలో వైదొలిగాడు [7] 2021 జూలైలో, అతను ఒడిశాకు రెండేళ్లపాటు ప్రధాన కోచ్‌గా నియమితుడయ్యాడు. [8] వసీం జాఫర్ బంగ్లాదేశ్ అండర్-19 క్రికెట్ జట్టు బ్యాటింగ్ కన్సల్టెంట్ అయ్యాడు.

ప్రారంభ సంవత్సరాల్లో

[మార్చు]

పాఠశాల కెరీర్‌లో ఒక 400 నాటౌట్ ఇన్నింగ్స్‌తో సహా పలు చక్కటి ఆటలు ఆడాక,15 ఏళ్ల వయస్సులో జాఫర్ ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లోకి ప్రవేశించాడు. అతని రెండవ మ్యాచ్‌లోనే ట్రిపుల్ సెంచరీ సాధించాడు. 314 పరుగుల ఆ ఇన్నింగ్స్‌తో ముంబయికి తొలి వరుస విజయాలు వచ్చాయి. ఓ ముంబై బ్యాటరు ముంబైలో కాకుండా వేరే చోట చేసిన తొలి ట్రిపుల్ సెంచరీ అది. తన ఓపెనింగ్ భాగస్వామి సులక్షణ్ కులకర్ణితో కలిసి 459 పరుగులు చేసి, వీళ్ళిద్దరూ ముంబై తరపున తొలిసారి 400 దాటిన జోడీగా నిలిచారు.[9] [10] ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఇలా రాసింది, "675 నిమిషాల పాటు క్రీజులో నిలబడ్డ అతని తత్వం ఎలా ఉందంటే, ఇది అతని రెండవ మ్యాచ్ అంటే నమ్మడం కష్టం. మరింత ప్రశంసించదగినది ఏమిటంటే, ఫీల్డింగులో ఖాళీలు అతనికి చాలా తేలిగ్గా కనబడిపోతున్నాయి." [11]

దేశీయ కెరీర్

[మార్చు]

జాఫర్ విదేశీ ఆటగాడిగా అనేక సీజన్లలో హడర్స్‌ఫీల్డ్ డ్రేక్స్ లీగ్‌లో స్కూల్స్ CCకి ప్రాతినిధ్యం వహించాడు. 2010 సీజనులో అతను స్కెల్‌మంథోర్ప్ క్రికెట్ క్లబ్‌కు వెళ్లాడు. ఒకే సీజన్‌లో ఒక ఆటగాడు చేసిన అత్యధిక పరుగుల లీగ్ రికార్డును బద్దలు కొట్టాడు. 2011 సీజన్‌లో జాఫర్, బర్మింగ్‌హాం అండ్ డిస్ట్రిక్ట్ ప్రీమియర్ లీగ్‌లో హిమ్లీ CCకి సంతకం చేశాడు.

అతని టెస్ట్ కెరీర్‌లో ఇప్పటివరకు, జాఫర్ ఐదు సెంచరీలు చేసాడు. అందులో రెండు డబుల్ సెంచరీలు. పాకిస్థాన్, ఇంగ్లండ్, వెస్టిండీస్, దక్షిణాఫ్రికాపై టెస్టు సెంచరీలు సాధించాడు. [12]

2013 సీజన్ నాటికి జాఫర్ ఇంగ్లండ్‌ వెళ్లాడు. అక్కడ అతను ఎల్‌డిసిసి లీగ్‌లో ఐన్స్‌డేల్ సిసి తరఫున ఆడాడు. అక్కడ అనేక సెంచరీలు సాధించి, 97.93 స్ట్రైక్ రేట్, 153 నాటౌట్ టాప్ స్కోర్‌ను సాధించి, సీజన్ మొదటి అర్ధభాగంలో విజయాలను ఆస్వాదించాడు. ఐన్స్‌డేల్‌లో తగిలిన గాయం కారణంగా, మోకాలి ఆపరేషను కోసం భారతదేశానికి తిరిగి వచ్చేసాడు.

2015 జూన్‌లో జాఫర్, 2015/16 రంజీ సీజన్ నుండి విదర్భకు మారాడు. [13] 2018 జనవరి 1 న విదర్భ రంజీ ట్రోఫీ గెలుచుకుంది. ఢిల్లీతో జరిగిన ఫైనల్‌లో, జాఫర్ విజయాన్ని సాధించిన చివరి బౌండరీని కొట్టాడు. [14]

2018 నవంబరులో బరోడాతో జరిగిన 2018-19 రంజీ ట్రోఫీ మూడవ రౌండ్‌లో జాఫర్, రంజీ ట్రోఫీలో 11,000 పరుగులు చేసిన మొదటి బ్యాట్స్‌మన్ అయ్యాడు. [15] ఆ తర్వాతి నెలలో, టోర్నమెంటు ఏడవ రౌండ్‌లో, ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో తన 55 వ శతకాన్ని సాధించాడు. [16] అదే నెలలో, అతను రంజీ ట్రోఫీలో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన రికార్డును 145 తో సమం చేశాడు [17] అతను 2018–19 రంజీ ట్రోఫీ గ్రూప్-స్టేజ్‌లో ఎనిమిది మ్యాచ్‌లలో 763 పరుగులు చేసి, విదర్భ తరఫున అత్యధిక పరుగుల స్కోరర్‌గా నిలిచాడు.[18] టోర్నమెంట్‌లోని క్వార్టర్-ఫైనల్ మ్యాచ్‌లో, ఉత్తరాఖండ్‌తో జరిగిన మ్యాచ్‌లో, అతను ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో తన 19,000 వ పరుగును సాధించాడు. [19]

2019-20 రంజీ ట్రోఫీ ప్రారంభ రౌండ్‌లో, రంజీ ట్రోఫీలో 150 మ్యాచ్‌లు ఆడిన మొదటి క్రికెటర్‌గా జాఫర్ నిలిచాడు. [20] [21] 2020 మార్చి 7 న జాఫర్, గేమ్‌లోని అన్ని ఫార్మాట్‌ల నుండి రిటైరయ్యాడు. [22]

అంతర్జాతీయ కెరీర్

[మార్చు]
జాఫర్ యొక్క టెస్ట్ మ్యాచ్ బ్యాటింగ్ కెరీర్‌లో స్కోర్ చేసిన పరుగులు ఎరుపు పట్టీలు, చివరి పది ఇన్నింగ్స్‌ల చలన సగటును బ్లూ లైనూ చూపిస్తాయి.

2000 లో స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌లో జాఫర్ టెస్ట్ క్రికెట్‌లోకి ప్రవేశించాడు. అనుభవజ్ఞులైన బౌలర్లు షాన్ పొలాక్, అలన్ డోనాల్డ్ లను తట్టుకోవడం అతనికి చాలా కష్టమైంది. నాలుగు ఇన్నింగ్స్‌లలో కేవలం 46 పరుగులు మాత్రమే చేయగలిగాడు. కొంతకాలం పాటు మరో అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడలేదు. చివరికి 2002 మేలో వెస్టిండీస్ పర్యటన జట్టులో తిరిగి చేరాడు. ఈ సీరీస్‌లో జాఫర్, బ్రిడ్జ్‌టౌన్‌లో 51, ఆంటిగ్వాలో 86 పరుగులు చేశాడు. తరువాతి వేసవిలో ఇంగ్లాండ్ పర్యటన కోసం భారత జట్టులో చేరాడు. లార్డ్స్‌లో హాఫ్ సెంచరీ చేసినప్పటికీ, ఆ తరువాతి ఇన్నింగ్స్‌లో కష్టపడ్డాడు. రెండు టెస్టుల తర్వాత అతన్ని తుది జట్టు నుంచి తొలగించారు.

జాఫర్ అద్భుతమైన దేశీయ ఫామ్ నేపథ్యంలో 2005-06 పాకిస్తాన్ పర్యటన కోసం టెస్ట్ జట్టులోకి తిరిగి చేర్చుకున్నారు. కానీ టెస్టుల్లో ఆడలేదు. భారతదేశంలోని తదుపరి సిరీస్‌లో జాఫర్ తన తొలి టెస్ట్ సెంచరీ సాధించాడు: నాగ్‌పూర్‌లో ఇంగ్లండ్‌పై సరిగ్గా 100 పరుగులు చేశాడు. మళ్ళీ జట్టులో చేరాక ఆడిన తొలి టెస్టు అది.

2006 జూన్‌లో వెస్టిండీస్‌పై ఆంటిగ్వా రిక్రియేషన్ గ్రౌండ్‌లో జాఫర్ తన మొదటి టెస్ట్ డబుల్ సెంచరీ చేసాడు.[23] రెండో ఇన్నింగ్స్‌లో 500 నిమిషాలకు పైగా ఆడి చేసిన 212 పరుగులు కరేబియన్‌లో ఒక భారతీయ బ్యాట్స్‌మన్ చేసిన రెండో అత్యధిక స్కోరు. [24]

2006 జూలైలో, భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ సెంట్రల్ కాంట్రాక్ట్ (గ్రేడ్ C) ఇచ్చి, భాగస్వామి వీరేంద్ర సెహ్వాగ్‌తో భారతజట్టులో తొలి ఎంపిక ఓపెనర్‌గా అతని స్థానాన్ని నిర్ధారించింది.

జాఫర్ వన్‌డేల్లో 2006 నవంబరులో దక్షిణాఫ్రికాపై మ్యాచ్‌లో అడుగుపెట్టాడు. కానీ సరిగా ఆడనందున వెంటనే తొలగించారు. అయితే, టెస్ట్ ఫార్మాట్‌లో స్కోర్లు చేస్తూనే ఉన్నాడు. న్యూలాండ్స్‌లో దక్షిణాఫ్రికాపై తన మూడవ టెస్ట్ శతకం చేశాడు.

చిట్టగాంగ్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన తన తదుపరి సిరీస్‌లో ఓపెనింగ్ టెస్ట్‌లో రెండు ఇన్నింగ్సుల్లోనూ సున్నా చేసినప్పటికీ, తర్వాతి టెస్టులో 138 పరుగులతో మళ్ళీ ఫామ్‌లోకి వచ్చాడు. అయితే ఆ తరువాతి కాలంలో అతను గాయపడి రిటైర్ అయ్యాడు. [25]

కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో పాకిస్థాన్‌తో జరిగిన 2007 సిరీస్‌లో రెండో టెస్టు [26] మొదటి ఇన్నింగ్స్‌లో జాఫర్ 202 పరుగులు చేశాడు.

కోచింగ్ కెరీర్

[మార్చు]

బంగ్లాదేశ్ క్రికెట్ జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా, అతను కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కు బ్యాటింగ్ కోచ్‌గా పనిచేసాడు.


ఉత్తరాఖండ్ క్రికెట్ జట్టుకు ప్రధాన కోచ్‌గా, ఒడిశా క్రికెట్ జట్టుకు ప్రధాన కోచ్‌గా కూడా పనిచేసాడు.

వివాదం

[మార్చు]

ఆటగాళ్ళ ఎంపికలో అధికారులు పక్షపాతం చూపుతున్నారని ఆరోపిస్తూ 2021 జనవరిలో ఉత్తరాఖండ్ క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ పదవికి వసీం జాఫర్ రాజీనామా చేశాడు. ప్రతిస్పందనగా ఉత్తరాఖండ్ క్రికెట్ అసోసియేషన్, అతను జట్టులో ముస్లిం ఆటగాళ్లను ప్రోత్సహిస్తున్నాడనీ మతపరమైన ప్రార్థనలు చేసేందుకు మౌల్వీలను డ్రెస్సింగ్ రూమ్‌లోకి తీసుకువస్తున్నాడనీ ఆరోపించారు. ఆ ఆరోపణలను అతను ఖండించాడు. దాని తర్వాత చాలా మంది క్రికెటర్లు అతనికి మద్దతుగా వచ్చారు.[27]

మూలాలు

[మార్చు]
 1. "Jaffer breaks Ranji run record".
 2. "Wasim Jaffer Becomes The First Player To Reach 11,000 Runs In Ranji Trophy". NDTV. Retrieved 21 November 2018.
 3. "Wasim Jaffer becomes Sachin Tendulkar of Ranji Trophy, achieved this stunning milestone". CatchNews.com (in ఇంగ్లీష్). Retrieved 8 January 2019.
 4. Acharya, Shayan. "Bangladesh board ropes in Wasim Jaffer as batting coach". Sportstar (in ఇంగ్లీష్).
 5. "Wasim Jaffer, former India opener and domestic cricket giant, retires at 42". ESPN Cricinfo. Retrieved 7 March 2020.
 6. "Wasim Jaffer named Uttarakhand head coach". EspnCricinfo. 23 June 2020. Retrieved 23 June 2020.
 7. "Wasim Jaffer steps down as Uttarakhand coach, cites 'interference and bias' in team selection". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 11 March 2021.
 8. "Wasim Jaffer named Odisha chief coach ahead of domestic season". ESPNCricinfo. Retrieved 14 July 2021.
 9. "Most Runs in an Innings for Mumbai". CricketArchive.
 10. "Highest Partnership for Each Wicket for Mumbai". CricketArchive.
 11. Chakravarty, Joy (8 November 1996). "Wasim Jaffar slams triple hundred". The Indian Express. Archived from the original on 23 April 1997. Retrieved 14 October 2018.
 12. "Jaffer Centuries". Archived from the original on 2019-01-15. Retrieved 2023-08-10.
 13. Jaffer leaves Mumbai for Vidarbha
 14. "Jaffer hit the winning boundary". Archived from the original on 2018-11-22. Retrieved 2023-08-10.
 15. "Wasim Jaffer becomes first batsman to reach 11,000 runs in Ranji Trophy". The Indian Express. 21 November 2018. Retrieved 21 November 2018.
 16. "Ranji Trophy Takeaways: Three Centurions for UP; Jaffer Hits 55th First-class Ton". Network18 Media and Investments Ltd. Retrieved 23 December 2018.
 17. "No stopping Wasim Jaffer". ESPN Cricinfo. Retrieved 31 December 2018.
 18. "From irresistible Rajasthan to inconsistent Karnataka". ESPN Cricinfo. Retrieved 15 January 2019.
 19. "Ranji Trophy 2018-19: Wasim Jaffer crosses 19,000 runs during 206 in quarters". Cricket Country. 17 January 2019. Retrieved 17 January 2019.
 20. "Wasim Jaffer becomes 1st player to play 150 Ranji games". India Today. Retrieved 10 December 2019.
 21. "Wasim Jaffer makes record 150th Ranji appearance". Times of India. Retrieved 10 December 2019.
 22. "Wasim Jaffer announces retirement from all forms of cricket". The Hindu. 7 March 2020. Retrieved 4 October 2020.
 23. "West Indies v India 1st Test Scorecard". CricketArchive.
 24. "Individual Scores of 200 for India in Test cricket". CricketArchive. Archived from the original on 29 June 2011. Retrieved 26 October 2017.
 25. "Bangladesh v India 2nd Test Scorecard". CricketArchive.
 26. Cricinfo - 2nd Test: India v Pakistan at Kolkata, 30 Nov – 4 Dec, 2007
 27. "'With you Wasim: India's cricket fraternity lends support to Wasim Jaffer over resignation row". The Indian Express.