విదర్భ క్రికెట్ జట్టు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
విదర్భ క్రికెట్ జట్టు
వ్యక్తిగత సమాచారం
కెప్టెన్అక్షత్ వాడ్కర్
కోచ్ట్రెవర్ గాన్సాల్వెస్
యజమానివిదర్భ క్రికెట్ అసోసియేషన్
జట్టు సమాచారం
స్థాపితం1957
స్వంత మైదానంవిదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం
సామర్థ్యం45,000
చరిత్ర
రంజీ ట్రోఫీ విజయాలు2
ఇరానీ కప్ విజయాలు2
విజయ్ హజారే ట్రోఫీ విజయాలు0
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ విజయాలు0
అధికార వెబ్ సైట్VCA

విదర్భ క్రికెట్ జట్టు భారత దేశీయ ఫస్ట్-క్లాస్ క్రికెట్ పోటీ అయిన రంజీ ట్రోఫీ లోను, పరిమిత ఓవర్ల విజయ్ హజారే ట్రోఫీ లోను, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలలోనూ ఆడే భారత దేశీయ క్రికెట్ జట్టు. ఇది తూర్పు మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. 2017 డిసెంబరులో 2017–18 రంజీ ట్రోఫీ టోర్నమెంటు సెమీ-ఫైనల్స్‌లో కర్ణాటకను 5 పరుగుల తేడాతో ఓడించి, చరిత్రలో మొదటిసారిగా రంజీ ట్రోఫీ ఫైనల్‌కు చేరుకున్నారు. [1] [2] ఫైనల్లో ఢిల్లీని 9 వికెట్ల తేడాతో ఓడించి తొలి రంజీ ట్రోఫీని గెలుచుకుంది. [3] 2018-19 రంజీ ట్రోఫీలో, నాగ్‌పూర్‌లో జరిగిన ఫైనల్‌లో సౌరాష్ట్రను 78 పరుగుల తేడాతో ఓడించి విదర్భ, విజయవంతంగా కిరీటాన్ని కాపాడుకుంది.

చరిత్ర[మార్చు]

విదర్భ మొదటిసారిగా 1957-58 సీజన్‌లో ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడింది, [4] ఇతర సెంట్రల్ జోన్ జట్లతో 2001-02 వరకు పోటీపడింది. ఆ తర్వాత రంజీ ట్రోఫీ జోనల్ ప్రాతిపదికన జరగలేదు. 2017-18 సీజన్‌కు ముందు, విదర్భ అత్యుత్తమ సీజన్‌లు, రంజీ ట్రోఫీలో క్వార్టర్-ఫైనల్‌కు చేరిన 1970-71, 1995-96. 2002-03, 2011-12లో ప్లేట్ గ్రూప్ సెమీ-ఫైనల్‌కు చేరుకుంది. 2017-18 సీజన్ ప్రారంభం వరకు, విదర్భ 259 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు ఆడగా, ఇందులో 41 విజయాలు, 89 ఓటములు, 129 డ్రాలు ఉన్నాయి. [5]

విదర్భ ప్రధాన హోమ్ గ్రౌండ్ 2009 వరకు నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ గ్రౌండ్‌గా ఉండేది. తరువాత నాగ్‌పూర్‌లోనే జమ్తాలో కొత్తగా విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం ను నిర్మించారు.[6]


విదర్భ రికార్డు స్కోరు, 2019-20లో ఆంధ్రపై గణేష్ సతీష్ చేసిన 237. [7] ఒక ఇన్నింగ్స్‌లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు 1967-68లో మధ్యప్రదేశ్‌పై అరుణ్ ఒగిరాల్ 39 పరుగులకు 8 వికెట్లు, [8] 2014-15లో గుజరాత్‌పై అక్షయ్ వాఖారే 162 పరుగులు ఇచ్చి 13 వికెట్లకు తీయడం. [9]

ఆటగాళ్ళు[మార్చు]

ప్రస్తుత స్క్వాడ్[మార్చు]

కోచ్: ట్రెవర్ గాన్‌సాల్వెస్

అంతర్జాతీయ ఆటగాళ్ల పేర్లను బొద్దుగా చూపించాం

పేరు పుట్టిన తేదీ బ్యాటింగ్ శైలి బౌలింగ్ శైలి గమనికలు
బ్యాటర్లు
అథర్వ తైదే (2000-04-26) 2000 ఏప్రిల్ 26 (వయసు 23) ఎడమచేతి వాటం ఎడమచేతి స్లో ఆర్థడాక్స్ ఐపీఎల్‌లో పంజాబ్‌ కింగ్స్‌ తరఫున ఆడాడు
ఫైజ్ ఫజల్ (1985-09-07) 1985 సెప్టెంబరు 7 (వయసు 38) ఎడమచేతి వాటం కుడిచేతి మీడియం
గణేష్ సతీష్ (1988-03-15) 1988 మార్చి 15 (వయసు 36) కుడిచేతి వాటం కుడిచేతి మీడియం
సంజయ్ రఘునాథ్ (1995-04-01) 1995 ఏప్రిల్ 1 (వయసు 29) కుడిచేతి బ్యాట్ కుడిచేతి కాలు విరిగింది
అపూర్వ్ వాంఖడే (1992-03-14) 1992 మార్చి 14 (వయసు 32) కుడిచేతి వాటం కుడిచేతి మీడియం
అమన్ మొఖడే కుడిచేతి వాటం కుడిచేతి లెగ్ బ్రేక్
శుభమ్ దూబే (1994-08-27) 1994 ఆగస్టు 27 (వయసు 29) ఎడమచేతి వాటం కుడి చేయి ఆఫ్‌బ్రేక్
వికెట్ కీపర్లు
అక్షయ్ వాడ్కర్ (1994-07-09) 1994 జూలై 9 (వయసు 29) కుడిచేతి వాటం కెప్టెన్
జితేష్ శర్మ (1992-10-22) 1992 అక్టోబరు 22 (వయసు 31) కుడిచేతి వాటం ఐపీఎల్‌లో పంజాబ్‌ కింగ్స్‌ తరఫున ఆడాడు
స్పిన్ బౌలర్లు
ఆదిత్య సర్వతే (1989-12-10) 1989 డిసెంబరు 10 (వయసు 34) కుడిచేతి వాటం ఎడమచేతి స్లో ఆర్థడాక్స్
అక్షయ్ కర్నేవార్ (1992-10-12) 1992 అక్టోబరు 12 (వయసు 31) ఎడమచేతి వాటం ఎడమచేతి స్లో ఆర్థడాక్స్
అక్షయ్ వాఖారే (1985-10-03) 1985 అక్టోబరు 3 (వయసు 38) కుడిచేతి వాటం కుడి చేయి ఆఫ్‌బ్రేక్
హర్ష దూబే (2002-07-23) 2002 జూలై 23 (వయసు 21) ఎడమచేతి వాటం ఎడమచేతి స్లో ఆర్థడాక్స్
ఫాస్ట్ బౌలర్లు
యశ్ ఠాకూర్ (1998-12-28) 1998 డిసెంబరు 28 (వయసు 25) కుడిచేతి వాటం కుడిచేతి మీడియం ఐపీఎల్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ తరఫున ఆడాడు
లలిత్ యాదవ్ (1995-12-17) 1995 డిసెంబరు 17 (వయసు 28) కుడిచేతి వాటం కుడిచేతి మీడియం ఫాస్ట్
నచికేత్ భూతే (1999-11-01) 1999 నవంబరు 1 (వయసు 24) కుడిచేతి వాటం కుడిచేతి మీడియం
ఉమేష్ యాదవ్ (1987-10-25) 1987 అక్టోబరు 25 (వయసు 36) కుడిచేతి వాటం కుడిచేతి ఫాస్ట్ ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తరఫున ఆడుతున్నాడు
దర్శన్ నల్కండే (1998-10-04) 1998 అక్టోబరు 4 (వయసు 25) కుడిచేతి వాటం కుడిచేతి మీడియం ఫాస్ట్ ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడుతున్నాడు
రజనీష్ గుర్బానీ (1993-01-23) 1993 జనవరి 23 (వయసు 31) కుడిచేతి వాటం కుడిచేతి ఫాస్ట్ మీడియం

2023 జనవరి 24 నాటికి నవీకరించబడింది

కోచింగ్ సిబ్బంది[మార్చు]

  • ప్రధాన కోచ్: ట్రెవర్ గోన్సాల్వేస్ [10]
  • బ్యాటింగ్ కోచ్: యూసుఫ్ పఠాన్
  • బౌలింగ్ కోచ్: సుబ్రొతో బెనర్జీ [11]
  • అండర్-19 కోచ్: ఉస్మాన్ ఘనీ
  • వీడియో విశ్లేషకుడు: అనిరుద్ధ దేశ్‌పాండే
  • ట్రైనర్: అమీకుమార్ మొహంతి
  • ఫిజియో: డాక్టర్ నీరజ్ కరంచందాని

మూలాలు[మార్చు]

  1. "Ranji Trophy 2017: Rajneesh Gurbani's seven-for takes Vidarbha to maiden final". Indian Express. Retrieved 21 December 2017.
  2. "Gurbani seven-for books Vidarbha's maiden Ranji final berth". ESPN Cricinfo. Retrieved 21 December 2017.
  3. "Vidarbha crowned champions in maiden Ranji final". ESPN Cricinfo. Retrieved 1 January 2018.
  4. "Vidarbha's maiden Ranji title in 61 seasons". ESPN Cricinfo. Retrieved 1 January 2018.
  5. "Vidarbha playing record". CricketArchive. Retrieved 17 September 2017.
  6. "First-class matches played on Vidarbha Cricket Association Ground". CricketArchive. Retrieved 7 November 2015.
  7. Kishore, Shashank (12 December 2019). "'Local' hero Ganesh Satish relishes Vidarbha leadership role". Cricinfo. Retrieved 17 December 2019.
  8. "Most wickets in an innings for Vidarbha". CricketArchive. Retrieved 7 November 2015.
  9. "Most wickets in a match for Vidarbha". CricketArchive. Retrieved 7 November 2015.
  10. Trevor Gonsalves appointed coach of Vidarbha cricket team
  11. Vijay Telang appointed Vidarbha coach