యూసఫ్ పఠాన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
యూసుఫ్ పఠాన్
Yusuf Pathan.jpg
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు యూసుఫ్ ఖాన్ పఠాన్
జననం (1982-11-17) 1982 నవంబరు 17 (వయసు 40)
వడోదర, గుజరాత్, భారతదేశం
బ్యాటింగ్ శైలి కుడి చేతి బ్యాట్స్‌మెన్
బౌలింగ్ శైలి కుడి చేతి ఆఫ్ స్పిన్
పాత్ర అల్ -రౌండర్
సంబంధాలు
అంతర్జాతీయ సమాచారం
జాతీయ జట్టు India
వన్డే లలో ప్రవేశం(cap 172) 10 జూన్ 2008 v పాకిస్తాన్
చివరి వన్డే 18 మార్చ్ 2012 v పాకిస్తాన్
ఒ.డి.ఐ. షర్టు నెం. 28
టి20ఐ లో ప్రవేశం(cap 18) 24 సెప్టెంబర్ 2007 v పాకిస్తాన్
చివరి టి20ఐ 30 మార్చ్ 2012 v దక్షిణాఫ్రికా
టి20ఐ షర్టు సంఖ్య. 28
దేశవాళీ జట్టు సమాచారం
సంవత్సరాలు జట్టు
2001/02–2019-20 బరోడా
2008–2010 రాజస్తాన్ రాయల్స్ (squad no. 28)
2011–2017 కోల్‌కతా నైట్‌రైడర్స్ (squad no. 24)
2018–2019 సన్ రైజర్స్ హైదరాబాద్ (squad no. 17)
కెరీర్ గణాంకాలు
పోటీ వన్డే క్రికెట్ ట్వంటీ20 ఫస్ట్ -క్లాస్ క్రికెట్ లిస్ట్ ఎ
మ్యాచ్‌లు 57 274 100 199
సాధించిన పరుగులు 810 4,852 4,825 4,797
బ్యాటింగ్ సగటు 27.00 27.56 34.01 33.78
100s/50s 2/3 1/21 11/20 9/28
ఉత్తమ స్కోరు 123* 100 210* 148
బాల్స్ వేసినవి 1,490 2,210 13,384 6,034
వికెట్లు 33 99 201 124
బౌలింగ్ సగటు 41.36 28.42 32.67 41.39
ఇన్నింగ్స్ లో 5 వికెట్లు 0 0 14 2
మ్యాచ్ లో 10 వికెట్లు 0 0 2 0
ఉత్తమ బౌలింగ్ 3/49 4/01 6/40 5/52
క్యాచులు/స్టంపింగులు 17/– 86/– 80/– 83/–
Source: ESPNCricinfo, 15 ఏప్రిల్ 2021

యూసఫ్ పఠాన్ భారతదేశానికి చెందిన అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారుడు. ఆయన భారత్ తరుపున 2007 టీ20 వరల్డ్‌కప్‌లో, 2011 వన్డే వరల్డ్‌కప్‌ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉండి, మొత్తం 57 వన్డేలు ఆడి 810 పరుగులు చేసి 33 వికెట్లు పడగొట్టాడు. యూసఫ్ పఠాన్ ఐపీఎల్‌లో 12 సీజన్ లలో పాల్గొన్ని కోల్‌కతా నైట్‌రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల తరుపున ఆడాడు.[1]

కెరీర్[మార్చు]

యూసఫ్ పఠాన్ 2007లో ఇంటర్నేషనల్ క్రికెట్ లో అడుగుపెట్టి 57 వన్డేల్లో 810 పరుగులు , 22 టీ20లు ఆడి 232 పరుగులు చేశాడు. వన్డేల్లో 2 సెంచరీలు, 5 అర్ధ సెంచరీలు చేసిన యూసఫ్ పఠాన్ 2012 తర్వాత మళ్లీ టీమిండియా జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. ఆయన ఐపీఎల్ లో 2008లో రాజస్తాన్ రాయల్స్ తరఫున అరంగేట్రం చేసి 435 పరుగులు, 8 వికెట్లు తీసి, ఆ ఏడాది రాజస్తాన్ టైటిల్ గెలుచుకోవడంలో కీలక పాత్రను పోషించాడు. యూసఫ్ పఠాన్ ఆ తర్వాత సీజన్లలో కోల్ కతా నైట్ రైడర్స్, పుణే వారియర్స్, సన్ రైజర్స్ హైదాబాద్ జట్లకు ప్రాతినిధ్యం వహించి 2018లో చివరిసారి ఐపీఎల్‌లో ఆడాడు. యూసఫ్ పఠాన్ 2021లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.[2][3]

మూలాలు[మార్చు]

  1. News18 Telugu (26 February 2021). "అంతర్జాతీయ క్రికెట్ కు యూసఫ్ పఠాన్ గుడ్ బై.. ఆల్ రౌండర్ గా ఎన్నో రికార్డులు." Archived from the original on 15 May 2022. Retrieved 15 May 2022.
  2. Andhra Jyothy (27 February 2021). "యూసఫ్‌ పఠాన్‌ అల్విదా" (in ఇంగ్లీష్). Archived from the original on 17 May 2022. Retrieved 17 May 2022.
  3. TV9 Telugu (27 February 2021). "ఇక అంతర్జాతీయ ఆటకు గుడ్ బై.. ఎన్నో రికార్డులు.. ఎంతో చరిత్ర.. యూసఫ్ పఠాన్ రిటైర్మెంట్". Archived from the original on 17 May 2022. Retrieved 17 May 2022.