అస్సాం క్రికెట్ జట్టు
వ్యక్తిగత సమాచారం | |
---|---|
కెప్టెన్ | కునాలొ సైకియా (FC & LA) మృణ్మయ్ దత్తా (T20) |
కోచ్ | ట్రెవర్ గాన్‌సాల్వెస్ |
యజమాని | అస్సాం క్రికెట్ అసోసియేషన్ |
జట్టు సమాచారం | |
రంగులు | Dark Green Yellow |
స్థాపితం | 1948 |
స్వంత మైదానం | అస్సాం క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, గౌహతి |
సామర్థ్యం | 40,000 |
రెండవ స్వంత మైదానం | నెహ్రూ స్టేడియం, గౌహతి |
రెండవ మైదాన సామర్థ్యం | 15,000 |
చరిత్ర | |
రంజీ ట్రోఫీ విజయాలు | 0 |
విజయ్ హజారే ట్రోఫీ విజయాలు | 0 |
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ విజయాలు | 0 |
అధికార వెబ్ సైట్ | www.assamcricket.com |
అస్సాం క్రికెట్ జట్టు, అస్సాం క్రికెట్ అసోసియేషన్ నిర్వహణలో అస్సాం రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న దేశీయ క్రికెట్ జట్టు. వారు ఏటా ఫస్ట్-క్లాస్ రంజీ ట్రోఫీ టోర్నమెంట్, పరిమిత ఓవర్ల విజయ్ హజారే ట్రోఫీ టోర్నమెంటు, ట్వంటీ20 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో రాష్ట్రం తరపున ప్రాతినిధ్యం వహిస్తారు.
చరిత్ర
[మార్చు]అస్సాం తన మొదటి ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌ను 1948-49 రంజీ ట్రోఫీలో ఆడింది. రూపెర్ట్ కెటిల్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. రెండు సీజన్‌ల తర్వాత అతను తన మొదటి సెంచరీని సాధించాడు. వారు 1951–52 రంజీ ట్రోఫీలో ఒరిస్సాపై 103 పరుగుల తేడాతో విజయం సాధించారు; కెప్టెన్, పీటర్ బుల్లక్, 31, 148 పరుగులతో అత్యధిక స్కోరు సాధించాడు. 70 పరుగులకు 7 వికెట్లు, 29కి 3 వికెట్లు తీసుకున్నాడు.[1]
2002-03 సీజన్ వరకు, జోనల్ వ్యవస్థ రద్దు చేయక ముందు వరకు, అస్సాం ఈస్ట్ జోన్‌లో భాగంగా ఉండేది. ప్రీ-క్వార్టర్-ఫైనల్స్ కంటే ముందుకు ఎప్పుడూ పోలేదు. 2006/07లో తమ ప్లేట్ గ్రూప్‌ను గెలుచుకున్నాక, సెమీ-ఫైనల్‌లో ఒరిస్సా చేతిలో ఓడిపోయింది. 2009-10 సీజన్‌లో అస్సాం, రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్‌లోకి ప్రవేశించింది. ప్లేట్ గ్రూప్‌లో అగ్రస్థానంలో నిలిచి, సూపర్ లీగ్‌కు చేరుకుంది. అయితే, 2010-11 సీజన్‌లో, వారు సూపర్ లీగ్‌లో తమ గ్రూప్‌లో అట్టడుగున నిలవడంతో, తరువాతి సీజన్‌లో ప్లేట్ లీగ్‌కు పంపబడ్డారు. 2012-13 విజయ్ హజారే ట్రోఫీలో అస్సాం చాలా బాగా ఆడి రన్నరప్‌గా నిలిచింది. [2] 2014-15 రంజీ సీజన్‌లో అస్సాం, మళ్లీ గ్రూప్ A స్థాయికి పదోన్నతి పొందింది. [3] 2015-16 రంజీ ట్రోఫీలో, జట్టు చరిత్రలో తొలిసారిగా సెమీ-ఫైనల్‌కు చేరుకుంది. [4]
2017 సెప్టెంబరులో భారత మాజీ బ్యాట్స్‌మెన్ లాల్‌చంద్ రాజ్‌పుత్ రెండు రంజీ ట్రోఫీ సీజన్‌లకు అస్సాం క్రికెట్ జట్టుకు ప్రధాన కోచ్‌గా ఎంపికయ్యాడు.
హోమ్ గ్రౌండ్స్
[మార్చు]- అస్సాం క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, బర్సపరా, గౌహతి
- నెహ్రూ స్టేడియం, గౌహతి, 14 వన్డేలకు ఆతిథ్యం ఇచ్చింది.
- అమిన్‌గావ్ క్రికెట్ గ్రౌండ్, అమీన్‌గావ్
- ఈశాన్య ఫ్రాంటియర్ రైల్వే స్టేడియం, మాలిగావ్, గౌహతి
- సతీంద్ర మోహన్ దేవ్ స్టేడియం, సిల్చార్
1948లో అస్సాం తన మొదటి హోమ్ మ్యాచ్ ఆడినప్పటి నుండి, షిల్లాంగ్, జోర్హాట్, నౌగాంగ్, డిబ్రూఘర్, కరీంగంజ్, హైలకండి, మంగళ్‌దోయ్, టిన్సుకియాలో (కాలక్రమానుసారం) కూడా ఫస్ట్-క్లాస్ హోమ్ మ్యాచ్‌లను ఆడింది. [5]
ప్రసిద్ధ క్రీడాకారులు
[మార్చు]- రియాన్ పరాగ్
- అబు నెచిమ్
- అనూప్ ఘటక్
- అర్లెన్ కొన్వర్
- గౌతమ్ దత్తా
- హేమంగా బారుహ్
- జావేద్ జమాన్
- కృష్ణ దాస్
- నిశాంత బోర్డోలోయ్
- జహీర్ ఆలం
- రాజేష్ బోరా
- సుభ్రజిత్ సైకియా
- జకారియా జుఫ్రీ
ప్రస్తుత స్క్వాడ్
[మార్చు]పేరు | పుట్టినరోజు | బ్యాఅటింగు శైలి | బౌలింగు శైలి | గమనికలు | ||
---|---|---|---|---|---|---|
బ్యాటర్లు | ||||||
రాహుల్ హజారికా | 1993 మే 31 | ఎడమచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | |||
రిషవ్ దాస్ | 1989 డిసెంబరు 16 | కుడిచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | |||
సిబ్శంకర్ రాయ్ | 1990 అక్టోబరు 10 | ఎడమచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | |||
శుభం మండలం | 1998 ఆగస్టు 23 | ఎడమచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | |||
గోకుల్ శర్మ | 1985 డిసెంబరు 25 | కుడిచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | |||
సాహిల్ జైన్ | 1998 అక్టోబరు 22 | కుడిచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | |||
నిహార్ నరహ్ | 2002 అక్టోబరు 10 | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం ఫాస్ట్ | |||
డెనిష్ దాస్ | 2002 మే 17 | కుడిచేతి వాటం | కుడిచేతి లెగ్ బ్రేక్ | |||
ఆల్ రౌండర్లు | ||||||
రియాన్ పరాగ్ | 2001 నవంబరు 10 | కుడిచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | Plays for Rajasthan Royals in IPL | ||
స్వరూపం పురకాయస్థ | 1989 సెప్టెంబరు 15 | కుడిచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | |||
రజ్జకుద్దీన్ అహ్మద్ | 1995 సెప్టెంబరు 2 | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం | |||
ఆకాష్ సేన్‌గుప్తా | 2000 అక్టోబరు 26 | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం ఫాస్ట్ | |||
నిపాన్ దేకా | 2001 నవంబరు 15 | కుడిచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | |||
వికెట్ కీపర్లు | ||||||
కునాల్ సైకియా | 1988 జూన్ 19 | కుడిచేతి వాటం | First-class and List A Captain | |||
అభిషేక్ ఠాకూరి | 1998 అక్టోబరు 31 | ఎడమచేతి వాటం | ||||
వసీకర్ రెహమాన్ | 1994 డిసెంబరు 29 | కుడిచేతి వాటం | ||||
స్పిన్ బౌలర్లు | ||||||
అవినోవ్ చౌదరి | 1999 డిసెంబరు 1 | కుడిచేతి వాటం | ఎడమచేతి స్లో ఆర్థడాక్స్ | Vice-captain | ||
సిద్ధార్థ శర్మ | 1998 డిసెంబరు 7 | ఎడమచేతి వాటం | ఎడమచేతి స్లో ఆర్థడాక్స్ | |||
రోషన్ ఆలం | 1995 ఏప్రిల్ 20 | కుడిచేతి వాటం | ఎడమచేతి స్లో ఆర్థడాక్స్ | |||
అమలంజ్యోతి దాస్ | 2002 జనవరి 15 | కుడిచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | |||
ఫాస్ట్ బౌలర్లు | ||||||
ముఖ్తార్ హుస్సేన్ | 1999 జనవరి 11 | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం ఫాస్ట్ | |||
సునీల్ లచిత్ | 1999 డిసెంబరు 6 | కుడిచేతి వాటం | ఎడమచేతి మీడియం ఫాస్ట్ | |||
మృణ్మోయ్ దత్తా | 1998 నవంబరు 24 | ఎడమచేతి వాటం | ఎడమచేతి ఫాస్ట్ మీడియం | Twenty20 Captain | ||
హృదీప్ దేకా | 1999 అక్టోబరు 10 | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం ఫాస్ట్ | |||
ధరణి రభా | 1997 సెప్టెంబరు 10 | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం ఫాస్ట్ |
2023 జనవరి 24 నాటికి నవీకరించబడింది
కోచింగ్ సిబ్బంది
[మార్చు]- ప్రధాన కోచ్: ట్రెవర్ గోన్సాల్వెస్
- అసిస్టెంట్ కోచ్: సలీల్ సిన్హా, సుభ్రజిత్ సైకియా
- శిక్షకుడు: భాస్కర్ బోరా
- ఫిజియో: డాక్టర్ కూస్తోబ్ భరద్వాజ్
- వీడియో విశ్లేషకుడు: రాజేష్ శర్మ
మూలాలు
[మార్చు]- ↑ "Assam v Orissa 1951–52". CricketArchive. Retrieved 21 December 2017.
- ↑ "Assam reach first Vijay Hazare final". espncricinfo.com. Retrieved 14 October 2015.
- ↑ "Team unity behind Assam's remarkable season". cricbuzz.com. Retrieved 14 October 2015.
- ↑ "Assam relaxed ahead of maiden semi-final". espncricinfo.com. Retrieved 27 February 2017.
- ↑ "First-class matches played by Assam". CricketArchive. Retrieved 25 January 2015.