Jump to content

త్రిపుర క్రికెట్ జట్టు

వికీపీడియా నుండి
త్రిపుర క్రికెట్ జట్టు
వ్యక్తిగత సమాచారం
కెప్టెన్వృద్ధిమాన్ సాహా
యజమానిత్రిపుర క్రికెట్ అసోసియేషన్
జట్టు సమాచారం
స్థాపితం1985
స్వంత మైదానంమహారాజా బీర్ బిక్రం కాలేజ్ స్టేడియం, అగర్తలా
సామర్థ్యం30,000
చరిత్ర
రంజీ ట్రోఫీ విజయాలు0
విజయ్ హజారే ట్రోఫీ విజయాలు0
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ విజయాలు0
అధికార వెబ్ సైట్www.tcalive.com

త్రిపుర క్రికెట్ జట్టు త్రిపుర రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న దేశీయ క్రికెట్ జట్టు.

చరిత్ర

[మార్చు]

1960వ దశకం ప్రారంభంలో మొదటిసారిగా నిర్వహించబడిన పోటీలతో, భారతదేశంలోని ఇతర ప్రాంతాల కంటే త్రిపురలో క్రికెట్ ఆలస్యంగా అభివృద్ధి చెందింది.[1] త్రిపుర క్రికెట్ అసోసియేషన్‌ 1968లో ఏర్పడింది.

1985-86 సీజన్‌కు పోటీని విస్తరించినప్పుడు గోవా, హిమాచల్ ప్రదేశ్‌లతో పాటు త్రిపుర రంజీ ట్రోఫీలోకి ప్రవేశించింది. [2] పోటీలోని బలహీన జట్లలో ఇది ఒకటి. 2022-23 సీజన్ ముగిసే వరకు, వారు 193 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు ఆడారు. అందులో తొమ్మిది విజయాలు, 120 ఓటములు, 64 డ్రాలు ఉన్నాయి. [3] లిస్ట్ A క్రికెట్‌లో వారు 138 మ్యాచ్‌లు ఆడి, 26 విజయాలు, 111 ఓటములు పొందారు. ఒకదానిలో ఫలితం తేలలేదు. [4]

1985-86లో, అంతకు ముందు ఫస్ట్-క్లాస్ అనుభవం లేని జట్టును దింపడంతో[5] త్రిపుర మొత్తం నాలుగు మ్యాచ్‌ల్లో, మొదటి మూడింటిలో ఇన్నింగ్స్ తేడాతో ఓడిపోయింది. [6] 1986–87లో వారు తమ మొదటి మ్యాచ్‌ని డ్రా చేసుకున్నారు. తర్వాతి మూడు మ్యాచ్‌ల్లో, రెండింటిలో ఇన్నింగ్స్ తేడాతో ఓడిపోయారు. [7] 2001–02లో, తమ చివరి సీజన్‌లో వారి ఈస్ట్ జోన్ పొరుగు రాష్ట్రాలైన అస్సాం, బెంగాల్, బీహార్, ఒరిస్సాలతో మాత్రమే ఆడింది. వీటిలో రెండు మ్యాచ్‌లలో ఇన్నింగ్స్ తేడాతో ఓడిపోయి మిగిలిన రెండింటిని డ్రా చేసుకుంది. [8]

రంజీ ట్రోఫీని 2002-03 సీజన్‌లో పునర్నిర్మించారు. దేశంలో దిగువ ర్యాంక్‌లో ఉన్న జట్లు ఒకదానితో ఒకటి ఆడటం ప్రారంభించాయి. త్రిపుర అదృష్టం మొదట్లో కాస్త మెరుగుపడింది. వారు 2002-03లో ఇన్నింగ్స్‌తో రెండు ఓటములను, మూడు డ్రాలను నమోదు చేసుకున్నారు. [9] 2003-04లో వారు మొత్తం ఐదు మ్యాచ్‌లను డ్రా చేసుకున్నారు, వాటిలో రెండింటిలో మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని పొందారు. [10] 2004-05లో వారు మూడింటిలో ఓడి రెండు డ్రా చేసుకున్నారు. [11]

త్రిపుర ఫస్ట్ క్లాస్ విజయాలు

[మార్చు]

త్రిపుర 2005-06 సీజన్‌లో మొదటి ఫస్ట్-క్లాస్ విజయాన్ని సాధించింది. అప్పటి వరకు 87 మ్యాచ్‌లు ఆడి 65 ఓటములు, 22 డ్రాలు చవిచూసింది. [12] సీజన్‌లోని వారి చివరి మ్యాచ్‌లో, రెండు డ్రాలు, రెండు ఓటముల తర్వాత, వారు హిమాచల్ ప్రదేశ్‌తో త్రిపుర ప్రధాన హోమ్ గ్రౌండ్ అయిన అగర్తలలోని మహారాజా బిర్ బిక్రమ్ కాలేజ్ స్టేడియంలో ఆడారు. వారి కెప్టెన్, రాజీబ్ దత్తా, తక్కువ స్కోరింగ్ మ్యాచ్‌లో 32, 71 పరుగులు చేశాడు. ఇందులో ఎవరూ 50కి చేరుకోలేదు. ఆ మ్యాచ్‌ త్రిపుర 130 పరుగుల తేడాతో గెలిచింది. త్రిపుర ఓపెనింగ్ బౌలర్ వినీత్ జైన్ 20కి 2, 29కి 7 వికెట్లు తీసాడు.[13]

అప్పటి నుండి త్రిపుర చాలా సీజన్లలో విజయాన్ని నమోదు చేసింది. 2006–07లో, మళ్లీ అగర్తలాలో, దత్తా కెప్టెన్సీలో, వారు జమ్మూ కాశ్మీర్‌ను 132 పరుగుల తేడాతో ఓడించారు. జైన్ 40 పరుగులు ఇచ్చి 4, 40 కి 5 వికెట్లు తీసుకున్నాడు [14] 2007-08లో, మరోసారి అగర్తలాలో, ఈసారి రాజేష్ బానిక్ కెప్టెన్సీలో, వారు కేరళను నాలుగు వికెట్ల తేడాతో ఓడించారు. దత్తా 47 పరుగులు చేసి, త్రిపురకు తొలి ఇన్నింగ్స్‌లో స్వల్ప ఆధిక్యాన్ని అందించాడు. జైన్ 42 పరుగులకు 4, 53 పరుగులకు 2 వికెట్లూ తీసాడు.[15] 2008-09లో, తుషార్ సాహా సారథ్యంలో, వారు న్యూ ఢిల్లీలోని పాలమ్ ఎ స్టేడియంలో సర్వీసెస్‌ను 54 పరుగుల తేడాతో ఓడించి, తొలి విజయాన్ని అందుకున్నారు. [16] 2009-10లో, మరోసారి అగర్తలాలో, దత్తా కెప్టెన్సీలో, వారు రాజస్థాన్‌ను ఓడించారు.[17] 2010–11లో, దత్తా మళ్లీ కెప్టెన్‌గా చేసాడు. పోర్వోరిమ్‌లో ఏడు వికెట్ల తేడాతో గోవాను ఓడించారు. ఆ మ్యాచ్‌లో తిమిర్ చందా 35 పరుగులకు 4 వికెట్లు, 116 పరుగులకు 7 వికెట్లూ పడగొట్టాడు.[18]

ఒక్క గెలుపు కూడా సాధించని సీజన్ తర్వాత, అజయ్ రాత్రా సారథ్యంలోని త్రిపుర 2012–13లో నాదౌన్‌లోని అటల్ బిహారీ వాజ్‌పేయి స్టేడియంలో హిమాచల్ ప్రదేశ్‌పై 169 పరుగుల తేడాతో విజయం సాధించింది. సుభ్రజిత్ రాయ్ మొదటి ఇన్నింగ్స్‌లో 111 పరుగులు చేశాడు. మణిశంకర్ మురాసింగ్ 29, 63 పరుగులు చేసి 86 పరుగులకు 4 వికెట్లు, 34 పరుగులకు ఒకటీ [19] తీసుకున్నాడు. త్రిపుర తదుపరి విజయం దాదాపు నాలుగు సంవత్సరాల తరువాత వచ్చింది. 2016–17లో గౌహతిలో, ఈ రోజు వరకు వారి అత్యంత అద్భుతమైన ఆ విజయంలో, తమ రెండవ ఇన్నింగ్స్‌లో 3 వికెట్లకు 340 పరుగుల వద్ద డిక్లేర్ చేసి తర్వాత సర్వీసెస్‌ను 219 పరుగుల తేడాతో ఓడించారు. ఉదియన్ బోస్ 165, స్మిత్ పటేల్ 127 నాటౌట్ చేయగా, కెప్టెన్ మణిశంకర్ మురాసింగ్ రెండు ఇన్నింగ్స్‌లలో 22 పరుగుల చొప్పున చేసి ఒక్కో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు పడగొట్టాడు. [20]

2018 డిసెంబరులో, 2018–19 రంజీ ట్రోఫీ ఆరో రౌండ్‌లో, త్రిపుర గోవాను 10 వికెట్ల తేడాతో ఓడించింది. ఒక మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో విజయం సాధించడం, రంజీ ట్రోఫీలో బోనస్ పాయింట్ సాధించడం ఇదే తొలిసారి. [21] ఆ మ్యాచ్‌తో సహా జట్టు, 171 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు ఆడి, వాటిలో తొమ్మిది మాత్రమే గెలిచింది. [21] [22] అయితే, ఆ తర్వాతి నెలలో, రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో జట్టు 35 పరుగులకే ఆలౌట్ అయింది. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో ఇది వారి అత్యల్ప స్కోరు. [23]

వ్యక్తిగత రికార్డులు

[మార్చు]

2013–14లో హైదరాబాద్‌పై యోగేష్ తకవాలే చేసిన 212 పరుగులే త్రిపుర అత్యధిక ఫస్ట్ క్లాస్ స్కోరు. [24] 2011–12లో హిమాచల్ ప్రదేశ్‌పై తిమిర్ చందా 133 పరుగులకు 8 వికెట్లు అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు. [25] 2016 అక్టోబరులో త్రిపుర తరఫున హ్యాట్రిక్ సాధించిన తొలి బౌలర్‌గా రాణా దత్తా నిలిచాడు. [26]

త్రిపుర మొదటి ఐదు విజయాలలో రాజీబ్ దత్తా ఆడాడు, వాటిలో నాలుగింటికి కెప్టెన్‌గా ఉన్నాడు.

హోమ్ గ్రౌండ్స్

[మార్చు]
  • నర్సింగఢ్ క్రికెట్ గ్రౌండ్
  • మహారాజా బీర్ బిక్రమ్ కాలేజ్ స్టేడియం

ఆటగాళ్ళు

[మార్చు]

స్క్వాడ్

[మార్చు]
  • అంతర్జాతీయ పోటీల్లో ఆడిన ఆటగాళ్ల పేర్లను బొద్దుగా చూపించాం
పేరు పుట్టిన తేదీ బ్యాటింగ్ శైలి బౌలింగ్ శైలి గమనిక
బ్యాటర్లు
సుదీప్ ఛటర్జీ (1991-11-11) 1991 నవంబరు 11 (వయసు 33) ఎడమచేతి వాటం కుడిచేతి లెగ్ బ్రేక్
రజత్ దే (1996-12-31) 1996 డిసెంబరు 31 (వయసు 27) కుడిచేతి వాటం కుడిచేతి ఆఫ్ బ్రేక్ వైస్ కెప్టెన్
బిక్రమ్‌కుమార్ దాస్ (1999-11-15) 1999 నవంబరు 15 (వయసు 25) ఎడమచేతి వాటం కుడిచేతి ఆఫ్ బ్రేక్
బిషల్ ఘోష్ (1996-04-27) 1996 ఏప్రిల్ 27 (వయసు 28) కుడిచేతి వాటం
శ్రీదాం పాల్ (2002-02-01) 2002 ఫిబ్రవరి 1 (వయసు 22) కుడిచేతి వాటం కుడిచేతి మీడియం
ఉడియాన్ బోస్ (1993-12-07) 1993 డిసెంబరు 7 (వయసు 31) కుడిచేతి వాటం కుడిచేతి ఆఫ్ బ్రేక్
ఆల్ రౌండర్లు
దీపక్ ఖత్రి (1994-12-05) 1994 డిసెంబరు 5 (వయసు 30) కుడిచేతి వాటం కుడిచేతి మీడియం
శుభం ఘోష్ (1998-10-07) 1998 అక్టోబరు 7 (వయసు 26) కుడిచేతి వాటం కుడిచేతి ఆఫ్ బ్రేక్
వికెట్ కీపర్
వృద్ధిమాన్ సాహా (1984-10-24) 1984 అక్టోబరు 24 (వయసు 40) కుడిచేతి వాటం కెప్టెన్
ఐపీఎల్‌లో గుజరాత్ లయన్స్ తరఫున ఆడాడు
స్పిన్ బౌలర్లు
పర్వేజ్ సుల్తాన్ (2003-07-18) 2003 జూలై 18 (వయసు 21) ఎడమచేతి వాటం స్లో లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్
చిరంజిత్ పాల్ (1996-06-20) 1996 జూన్ 20 (వయసు 28) ఎడమచేతి వాటం స్లో లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్
శంకర్ పాల్ (2000-11-15) 2000 నవంబరు 15 (వయసు 24) కుడిచేతి వాటం కుడిచేతి ఆఫ్ బ్రేక్
పేస్ బౌలర్లు
మణిశంకర్ మురాసింగ్ (1993-01-01) 1993 జనవరి 1 (వయసు 31) ఎడమచేతి వాటం కుడిచేతి మీడియం
అభిజిత్ సర్కార్ (1996-12-20) 1996 డిసెంబరు 20 (వయసు 27) కుడిచేతి వాటం కుడిచేతి మీడియం
రాణా దత్తా (1989-05-15) 1989 మే 15 (వయసు 35) ఎడమచేతి వాటం కుడిచేతి మీడియం
అజోయ్ సర్కార్ (1997-05-10) 1997 మే 10 (వయసు 27) కుడిచేతి వాటం కుడిచేతి మీడియం

2023 జనవరి 25 నాటికి నవీకరించబడింది

మూలాలు

[మార్చు]
  1. "History of TCA". Tripura Cricket Association. Archived from the original on 18 అక్టోబరు 2021. Retrieved 22 December 2016. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  2. Wisden 1987, p. 1138.
  3. "Tripura's first-class playing record". CricketArchive. Retrieved 8 May 2023.
  4. "Tripura's List A playing record". CricketArchive. Retrieved 8 May 2023.
  5. "Bengal v Tripura 1985–86". CricketArchive. Retrieved 21 December 2016.
  6. Wisden 1987, p. 1140.
  7. Wisden 1988, p. 1100.
  8. Wisden 2003, pp. 1491–92.
  9. Wisden 2004, pp. 1384–85.
  10. Wisden 2005, pp. 1461–62.
  11. Wisden 2006, pp. 1345–46.
  12. Wisden 2007, p. 1383.
  13. "Tripura v Himachal Pradesh 2005–06". CricketArchive. Retrieved 21 December 2016.
  14. "Tripura v Jammu and Kashmir 2006–07". CricketArchive. Retrieved 21 December 2016.
  15. "Tripura v Kerala 2007–08". CricketArchive. Retrieved 21 December 2016.
  16. "Services v Tripura 2008–09". CricketArchive. Retrieved 21 December 2016.
  17. "Tripura v Rajasthan 2009–10". CricketArchive. Retrieved 21 December 2016.
  18. "Goa v Tripura 2010–11". CricketArchive. Retrieved 21 December 2016.
  19. "Himachal Pradesh v Tripura 2012–13". CricketArchive. Retrieved 21 December 2016.
  20. "Services v Tripura 2016–17". CricketArchive. Retrieved 21 December 2016.
  21. 21.0 21.1 "Race for quarter-finals hots up, Tripura make history". ESPN Cricinfo. Retrieved 19 December 2018.
  22. "Ranji Trophy Playing Record". Cricket Archive. Retrieved 19 December 2018.
  23. "Ranji Trophy: Rajasthan skittle Tripura for 35, their lowest total ever". Cricket Country. Retrieved 7 January 2019.
  24. Hyderabad v Tripura 2013–14
  25. Tripura v Himachal Pradesh 2011–12
  26. "Group C: Himachal Pradesh v Tripura at Kalyani, Oct 20–23, 2016". Cricinfo. Retrieved 2016-11-23.