అజింక్య రహానే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అజింక్య రహానే
2016 లో రహానే
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
అజింక్య మధుకర్ రహానే
పుట్టిన తేదీ (1988-06-06) 1988 జూన్ 6 (వయసు 36)
అష్వి కె.డి., మహారాష్ట్ర
ఎత్తు168 cమీ. (5 అ. 6 అం.)
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఆఫ్ స్పిన్
పాత్రTop-order బ్యాటరు
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 278)2013 మార్చి 22 - ఆస్ట్రేలియా తో
చివరి టెస్టు2023 జూన్ 07 - ఆస్ట్రేలియా తో
తొలి వన్‌డే (క్యాప్ 191)2011 సెప్టెంబరు 3 - ఇంగ్లాండ్ తో
చివరి వన్‌డే2018 ఫిబ్రవరి 16 - దక్షిణాఫ్రికా తో
వన్‌డేల్లో చొక్కా సంఖ్య.27 (formerly 37)
తొలి T20I (క్యాప్ 39)2011 ఆగస్టు 31 - ఇంగ్లాండ్ తో
చివరి T20I2016 ఆగస్టు 28 - వెస్టిండీస్ తో
T20Iల్లో చొక్కా సంఖ్య.27 (formerly 17, 37)
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2007–presentముంబై
2008–2010ముంబై ఇండియన్స్
2011–2015రాజస్థాన్ రాయల్స్
2016–2017రైజింగ్ పూణే సూపర్‌జైంట్
2018–2019రాజస్థాన్ రాయల్స్
2019హాంప్‌షైర్
2020–2021ఢిల్లీ క్యాపిటల్స్
2022కోల్‌కతా నైట్‌రైడర్స్
2023చెన్నై సూపర్ కింగ్స్
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు ఫక్లా లిఎ
మ్యాచ్‌లు 83 90 178 174
చేసిన పరుగులు 5,066 2,962 13,000 6,317
బ్యాటింగు సగటు 38.96 35.26 47.27 40.23
100లు/50లు 12/26 3/24 39/55 10/44
అత్యుత్తమ స్కోరు 188 111 265* 187
వేసిన బంతులు 108 42
వికెట్లు 0 3
బౌలింగు సగటు 14.33
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0
అత్యుత్తమ బౌలింగు 2/36
క్యాచ్‌లు/స్టంపింగులు 100/- 48/– 187/– 83/–
మూలం: ESPNcricinfo, 11 June 2023

అజింక్య మధుకర్ రహానే (జననం 1988 జూన్ 6) భారతీయ అంతర్జాతీయ క్రికెటరు, మాజీ కెప్టెన్, టెస్టు ఫార్మాట్‌లో భారత జట్టుకు ప్రస్తుత వైస్-కెప్టెన్. అతను బ్యాట్స్‌మన్‌గా అన్ని ఫార్మాట్‌లలో భారత క్రికెట్ జట్టుకు ఆడాడు. ప్రస్తుతం రంజీ ట్రోఫీలో ముంబైకి కెప్టెన్‌గా ఉన్నాడు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) తరఫున కూడా ఆడుతున్నాడు. రహానే ప్రధానంగా టెస్టు ఫార్మాట్‌లో మిడిల్-ఆర్డర్ బ్యాట్స్‌మన్‌గా, తెల్ల బంతి ఆటల్లో టాప్-ఆర్డర్ బ్యాట్స్‌మన్‌గా ఆడతాడు. అతని కెప్టెన్సీ కింద అడిన ఒకే ఒక్క మ్యాచ్‌లో భారత్ ఓడిపోయింది.

రహానే 2007–08 రంజీ ట్రోఫీ సీజన్‌లో ముంబై తరపున ఫస్టు క్లాస్ రంగప్రవేశం చేశాడు. అతను 2011 ఆగస్టులో మాంచెస్టర్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన T20I లలో అంతర్జాతీయ రంగప్రవేశం చేసాడు.[1] [2] 2013 మార్చిలో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో రహానే టెస్టుల్లో అడుగుపెట్టాడు.న్యూజిలాండ్‌పై వెల్లింగ్‌టన్‌లోని బేసిన్ రిజర్వ్‌లో అతని మొదటి టెస్టు సెంచరీ సాధించాడు. [3] అతని కెప్టెన్సీలో, ఆస్ట్రేలియాలో 2020-21 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని భారత్ గెలుచుకుంది. [4] 2021 మే నాటికి రహానే ఐసిసి టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో 612 పాయింట్లతో 27వ స్థానంలో ఉన్నాడు. [5] అతనికి 2022 మార్చిలో BCCI గ్రేడ్ B కాంట్రాక్టును అందజేసింది. రహానే విదేశాల్లో ఆడే మ్యాచ్‌ల్లో భారత అత్యుత్తమ ఆటగాళ్ళలో ఒకడు. విదేశాల్లో అతను, 40కి పైగా సగటుతో 3000 పరుగులు చేశాడు.

జీవితం తొలినాళ్ళు

[మార్చు]

రహానే 1988 జూన్ 6న అహ్మద్ నగర్ జిల్లా సంగమ్నేర్ తాలూకాలోని అశ్వి కెడిలో మధుకర్ బాబూరావు రహానే, సుజాతా రహానే దంపతులకు జన్మించాడు. [6] [7] [8] అతనికి ఒక తమ్ముడు సోదరి ఉన్నారు. [9] ఏడేళ్ల వయసులో, మధుకర్ రహానే డోంబివ్లీలోని మ్యాటింగ్ వికెట్‌ ఉన్న ఒక చిన్న కోచింగ్ క్యాంప్‌కు రహానేని తీసుకువెళ్లాడు. [6] [10] వారు సరైన కోచింగ్‌ను పొందలేకపోయారు. [6] 17 సంవత్సరాల వయస్సు నుండి, అతను మాజీ భారత బ్యాట్స్‌మెన్ ప్రవీణ్ ఆమ్రే వద్ద కోచింగ్ తీసుకున్నాడు. [11] రహానే తన సెకండరీ స్కూల్ సర్టిఫికేట్‌ను డోంబివిలిలోని SV జోషి హై స్కూల్ నుండి క్లియర్ చేశాడు. [8]

రహానే తన చిన్ననాటి స్నేహితురాలు రాధిక ధోపావ్కర్‌ను 2014 సెప్టెంబరు 26న వివాహం చేసుకున్నాడు [12] ఈ జంటకు ఒక అమ్మాయి, ఒక అబ్బాయి.[13]

దేశీయ కెరీర్

[మార్చు]

2007 ప్రారంభంలో భారత్ U-19 న్యూజిలాండ్‌లో పర్యటించినప్పుడు రహానే రెండు సెంచరీలతో మంచి ప్రదర్శన చేశాడు. [14] పాకిస్థాన్‌లో జరిగే మహ్మద్ నిస్సార్ ట్రోఫీకి ఎంపికయ్యాడు. [15]

ఫస్ట్ క్లాస్ కెరీర్

[మార్చు]

2007 సెప్టెంబరులో మొహమ్మద్ నిస్సార్ ట్రోఫీలో ముంబై తరపున కరాచీ అర్బన్‌తో జరిగిన మ్యాచ్‌లో రహానే తన 19వ ఏట తొలి ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌ ఆడాడు. కరాచీలో చాలా మంది ఫస్ట్-ఛాయిస్ ముంబై ఆటగాళ్లు వివిధ కారణాల వల్ల అందుబాటులో లేరు. సాహిల్ కుక్రేజాతో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించి, అతను తొలి మ్యాచ్‌లో 143 (207) చేసాడు. కుక్రేజా 110 పరుగులతో మొత్తం ఇద్దరూ కలిసి 247 పరుగులు చేశారు.[16] రెస్ట్ ఆఫ్ ఇండియాతో జరిగిన ఇరానీ ట్రోఫీ మ్యాచ్‌కు రహానే ఎంపికయ్యాడు . [17]

2007–08 దులీప్ ట్రోఫీలో వెస్ట్ జోన్ తరఫున ఇంగ్లండ్ లయన్స్‌పై రహానే 172 పరుగులు చేశాడు. [18]

రహానే, తన రెండవ రంజీ సీజన్ (2008–09)లో 1089 పరుగులతో, [19] ముంబై యొక్క 38వ టైటిల్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. [20] 2009-10 సీజన్‌లో ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో, అతను 265 నాటౌట్ (ముంబైకి నం. 3 వద్ద బ్యాటింగ్) చేసాడు. [21] రహానే మూడు వేర్వేరు సీజన్లలో 1000 పరుగులను దాటాడు. రాజస్థాన్‌తో జరిగిన 2011 ఇరానీ ట్రోఫీ మ్యాచ్‌లో 152 పరుగులు చేయడం అతనికి భారత టెస్ట్ జట్టుకు ఎంపిక కావడానికి సహాయపడింది. [22]


ఏప్రిల్ 2019లో, రహానే సీజన్‌లో రెండు నెలల పాటు హాంప్‌షైర్‌లో వారి విదేశీ ఆటగాడిగా చేరాడు. [23]

ఆస్ట్రేలియాలో జరిగిన ఎమర్జింగ్ ప్లేయర్స్ టోర్నమెంట్‌లో రెండు వెంటవెంటనే చేసిన సెంచరీలు (201) ఇంగ్లండ్ పర్యటన కోసం భారత పరిమిత ఓవర్ల జట్టులో స్థానం సంపాదించడంలో రహానేకి సహాయపడ్డాయి. అతను ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ స్థానంలో ఇంగ్లండ్‌తో చెస్టర్-లీ-స్ట్రీట్‌లో రంగప్రవేశం చేశాడు. రహానే 90.90 స్ట్రైక్ రేట్‌తో 40 పరుగులు చేసినప్పటికీ, 2011 వేసవిలో ఇంగ్లండ్‌పై తమ మొదటి విజయంపై భారత్ ఆశలు చెస్టర్-లీ-స్ట్రీట్‌లో వాష్‌అవుట్‌తో విఫలమయ్యాయి. [24]

అంతర్జాతీయ కెరీర్

[మార్చు]

టెస్టు కెరీర్

[మార్చు]

2011 నవంబరులో వెస్టిండీస్‌తో ఆడేందుకు రహానే టెస్టు జట్టులోకి ఎంపికయ్యాడు. రహానేను 16 నెలల పాటు జట్టులో ఉన్నాడు. అతని ఎదురుగా ఏడుగురు ఆటగాళ్లు రంగప్రవేశం చేయడం చూశాడు. [25] పరిమిత ఓవర్ల క్రికెట్‌లో (వన్‌డే, T20I) అతని ఆటతీరు తగిన స్థాయిని అందుకోలేకపోయింది, అతను వన్‌డే, T20I క్రికెట్‌లో సగటు 25 మాత్రమే. పాకిస్తాన్, ఇంగ్లాండ్‌లతో జరిగిన సిరీస్‌లలో (2013 జనవరిలో) ఫామ్ కోసం కష్టపడ్డాడు. ) [26]

ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా స్టేడియంలో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాపై 2013 మార్చి 22న రహానే టెస్టుల్లో అడుగు పెట్టాడు. ‘కేవలం అదృష్టం’ కొద్దీ రహానేకు ఈ అవకాశం దక్కిందని మీడియా పేర్కొంది. మొహాలీలో జరిగిన మూడో టెస్ట్‌లో, రంగప్రవేశంలోనే 187 పరుగులు చేసి తన కెరీర్‌ను అబ్బురపరిచిన శిఖర్ ధావన్ జట్టు లోకి ఎంపిక కావాల్సింది. అతని ఎడమ చేతి పిడికిలికి గాయం అవడంతో అతని స్థానంలో ఎంపికైన గౌతమ్ గంభీర్ జాండిస్ కారణంగా జట్టుకు దూరమయ్యాడు. ఆ విధంగా రహానే, తన ఇండియా టెస్టు క్యాప్‌ను అందుకున్నాడు [25] ఆటలో రెండు సింగిల్-డిజిట్ స్కోర్‌లు మాత్రమే చేసాడు. రహానే సామర్థ్యాన్ని చాలా మంది ప్రశ్నించారు.[27]


రంగప్రవేశం మ్యాచ్‌లో విఫలమైనప్పటికీ, దక్షిణాఫ్రికా పర్యటనలో (2013–14) భారత తొలి మ్యాచ్‌లో రహానే తొలి 11 మందిలో చోటు సంపాదించాడు. లోయర్-మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేస్తూ, డేల్ స్టెయిన్, మోర్నే మోర్కెల్, వెర్నాన్ ఫిలాండర్‌లతో కూడిన బౌలింగ్ దాడిని ఎదుర్కొంటూ, అతను సిరీస్‌లో 69.66 సగటుతో 209 పరుగులు చేశాడు ( కింగ్స్‌మీడ్, డర్బన్‌లో 157 బంతుల్లో 96 పరుగులు సహా). "చాలా పర్యటనలు, సిరీస్‌లలో బెంచిని అరగదీయడం, డ్రింక్స్ తీసుకెళ్ళడం, తనకు అవకాశం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ గడిపిన వ్యక్తికి, బ్యాటింగు చేసే అవకాశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో వచ్చినప్పటికీ, అతను తన అవకాశాన్ని రెండు దోసిళ్ళతో అందుకున్నాడు", అని క్రికెట్ పండిట్ సిద్ధార్థ్ మోంగా రాశాడు. రహానే ఈ సిరీస్‌లో భారతదేశపు మూడవ అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. అయితే సిరీస్ ప్రారంభమయ్యే ముందు అతను అందరికంటే అత్యంత ప్రమాదకరమైన స్థితిలో ఉన్నాడు. [28]

రహానే తన మొదటి టెస్టు శతకం బేసిన్ రిజర్వ్, వెల్లింగ్టన్, న్యూజిలాండ్‌లో 2014 ఫిబ్రవరి 15న న్యూజిలాండ్‌పై చేశాడు. [29] రహానే ఐదు వికెట్ల నష్టానికి 156 పరుగుల వద్ద క్రీజులోకి వచ్చినప్పుడు భారతదేశం క్లిష్ట స్థితిలో ఉంది. అతను 118 పరుగులతో నిష్క్రమించే సమయానికి భారత్ మ్యాచ్ విన్నింగ్ పొజిషన్‌లో ఉంది. అయితే బ్రెండన్ మెకల్లమ్ యొక్క ప్రసిద్ధ ట్రిపుల్ సెంచరీతో ఆ అవకాశం చేజారిపోయింది.[30] "అతను ఫస్ట్-క్లాస్‌లో కొండంత పరుగులు చేసాడు. అయితే అతనికి X- ఫ్యాక్టర్ అనే వింత పేరు గానీ ఉందా? అతని ఆటలో, వ్యక్తిత్వంలో టాప్-క్లాస్ అంతర్జాతీయ ఆటగాళ్లను మిగిలిన వారి నుండి వేరుచేసే ఆ అదనపు పదును ఉందా? అతను కేవలం వినయపూర్వకంగా ఉన్నాడా లేదా అతను తనను తాను నొక్కి చెప్పుకోలేకపోయాడా, నిజమైన ఒత్తిడిని తట్టుకోలేకపోయాడా? దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌లలో అతని మొదటి రెండు టెస్టు పర్యటనల తర్వాత, ఖచ్చితంగా మొదటిదే అని నిర్ధారించవచ్చు. బఈటికి మృదువుగా కనిపించినా లోపల ఒక దిట్టమైన టెస్టు బ్యాటరు [31] దాగి ఉన్నాడు. బేసిన్ రిజర్వ్‌లో అతడు బయటికి వచ్చాడు", అని ESPN Cricinfo తన విశ్లేషణలో రాసింది.

అంతర్జాతీయ వన్డే కెరీర్

[మార్చు]

ఆస్ట్రేలియాలో జరిగిన ఎమర్జింగ్ ప్లేయర్స్ టోర్నమెంట్‌లో వెంటవెంటనే చేసిన రెండు సెంచరీలతో (201) ఇంగ్లండ్ పర్యటన కోసం భారత పరిమిత ఓవర్ల జట్టులో రహానేకి స్థానం దొరికింది. అతను ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ స్థానంలో ఇంగ్లండ్‌తో చెస్టర్-లీ-స్ట్రీట్‌లో రంగప్రవేశం చేశాడు. రహానే 90.90 స్ట్రైక్ రేట్‌తో 40 పరుగులు చేసినప్పటికీ, 2011 వేసవిలో ఇంగ్లండ్‌పై తమ మొదటి విజయంపై భారత్ ఆశలు చెస్టర్-లీ-స్ట్రీట్‌లో వాష్‌అవుట్‌తో విఫలమయ్యాయి. [24]

అతను తన తొలి అంతర్జాతీయ సిరీస్‌లో (2011 నాట్‌వెస్ట్ సిరీస్), ఇంగ్లండ్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లోను, రిటర్న్ సిరీస్‌లోనూ బాగా రాణించాడు. అతను తన రెండో మ్యాచ్‌లో 47 బంతుల్లో 54 పరుగులు చేశాడు. [32] వెస్టిండీస్, శ్రీలంక, పాకిస్థాన్, ఇంగ్లండ్‌లతో జరిగిన పరిమిత ఓవర్ల మ్యాచ్‌లలో రహానే ఆకట్టుకోలేక పోయాడు.

2013-14 ఆసియా కప్‌లో రహానే తన రెండో వన్డే అర్ధశతకం సాధించాడు. ఆ తర్వాత మరో క్షీణ దశను చూసాడు. [33] [34] కొదిపాటి వన్‌డే కెరీర్‌లో, మిడిల్ ఆర్డర్‌లో ఆడుతూ రహానే, అనిశ్చితంగా కనిపించాడు. కొన్నిసార్లు డిఫెన్స్, అటాక్‌ల మధ్య సమతుల్యతను కనుగొనడంలో ఇబ్బంది పడ్డాడు. ఎగువ వరుసలో బ్యాటింగు చేస్తూ అతను, ఇంగ్లండ్ (2014 సెప్టెంబరు), శ్రీలంక (2014 నవంబరు)పై వేగవంతమైన సెంచరీలు చేసి కాస్త మెరుగవుతున్న సంకేతాలను చూపించాడు. అయితే రోహిత్ శర్మ రెండవ వన్‌డే డబుల్ సెంచరీ, ఆ తర్వాత MCGలో ఆస్ట్రేలియాపై మరొక భారీ సెంచరీలు చెయ్యడంతో రహానే మళ్ళీ మిడిల్ ఆర్డర్‌కి వెళ్ళాల్సి వచ్చింది. T20లు [35] ఐసిసి క్రికెట్ ప్రపంచ కప్‌లో, రహానే 8 మ్యాచ్‌లలో 34.66 సగటుతో 208 పరుగులు మాత్రమే చేయగలిగాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన రెండవ వన్‌డేలో అతని స్థానంలో మహేంద్ర సింగ్ ధోని వచ్చాడు. ఆ సిరీస్ తర్వాత, 2015లో వన్‌డేలు, T20Iల కోసం జింబాబ్వే పర్యటన కోసం రెండవ స్థాయి స్క్వాడ్‌ను ఎంపిక చేసినప్పుడు రహానే, దానికి కెప్టెన్‌గా నియమితుడయ్యాడు.[36] భారత్ ఆ వన్‌డే సిరీస్‌ను 3-0తో గెలుచుకుంది, అయితే రహానే బ్యాట్‌తో పెద్దగా ప్రభావం చూపలేదు. అతను మూడు మ్యాచ్‌లలో ఒక అర్ధ సెంచరీతో మొత్తం 112 పరుగులు చేశాడు. [37]

అంతర్జాతీయ సెంచరీల జాబితా

[మార్చు]

రహానే టెస్టుల్లో 12, వన్డేల్లో మూడు, సెంచరీలు సాధించాడు. 2016 అక్టోబరులో ఇండోర్‌లో న్యూజిలాండ్‌పై అతని అత్యధిక టెస్టు స్కోరు 188. అతని అత్యధిక వన్‌డే స్కోరు 111, 2011 నవంబరులో కటక్‌లో శ్రీలంకపై చేసాడు. అతను ట్వంటీ-20ల్లో సెంచరీ చేయలేదు.

List of Test centuries[38]
No. Score Against Pos. Inn. Test Venue H/A/N Date Result Ref
1 118  న్యూజీలాండ్ 7 2 2/2 Basin Reserve, Wellington Away 14 February 2014 Drawn [39]
2 103  ఇంగ్లాండు 5 1 2/5 Lord's, London Away 17 July 2014 Won [40]
3 147  ఆస్ట్రేలియా 5 2 3/4 Melbourne Cricket Ground, Melbourne Away 26 December 2014 Drawn [41]
4 126  శ్రీలంక 3 3 2/3 P Sara Oval, Colombo Away 20 August 2014 Won [42]
5 127  దక్షిణాఫ్రికా 5 1 2/3 Arun Jaitley Stadium, New Delhi Home 3 December 2015 Won [43]
6 100*  దక్షిణాఫ్రికా 6 3
7 108*  వెస్ట్ ఇండీస్ 5 2 2/4 Sabina Park, Kingston Away 30 July 2016 Drawn [44]
8 188  న్యూజీలాండ్ 5 1 3/3 Arun Jaitley Stadium, New Delhi Home 8 October 2016 Won [45]
9 132  శ్రీలంక 5 1 2/3 Sinhalese SCG, Colombo Away 3 August 2017 Won [46]
10 102  వెస్ట్ ఇండీస్ 5 3 1/2 Sir Vivian Richards Stadium, Antigua Away 22 September 2019 Won [47]
11 115  దక్షిణాఫ్రికా 5 1 3/3 JCSA Stadium, Ranchi Home 19 October 2019 Won [48]
12 112  ఆస్ట్రేలియా 4 2 2/4 Melbourne Cricket Ground, Melbourne Away 26 December 2020 Won [49]
వన్‌డే సెంచరీల జాబితా [50]
నం. స్కోర్ వ్యతిరేకంగా పోస్. ఇన్. SR వేదిక H/A/N తేదీ ఫలితం Ref
1 106  ఇంగ్లాండు 1 2 106.00 ఎడ్జ్‌బాస్టన్, బర్మింగ్‌హామ్ దూరంగా 2 September 2014 గెలిచింది [51]
2 111  శ్రీలంక 1 1 102.78 బారాబతి స్టేడియం, కటక్ హోమ్ 2 November 2014 గెలిచింది [52]
3 103  వెస్ట్ ఇండీస్ 1 1 99.04 క్వీన్స్ పార్క్ ఓవల్, పోర్ట్ ఆఫ్ స్పెయిన్ దూరంగా 25 June 2017 గెలిచింది [53]

ఐపీఎల్ కెరీర్

[మార్చు]

రహానేను 2012 ఇండియన్ ప్రీమియర్ లీగ్ కోసం రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసింది. గతంలో అతను ముంబై ఇండియన్స్ జట్టులో ఉన్నాడు , కానీ అక్కడ అవకాశాలు పరిమితంగానే లభించాయి.[32] ఆపై అతను రాజస్థాన్ రాయల్స్‌లో షేన్ వాట్సన్ దృష్టిని ఆకర్షించాడు. 2010 లో ఆస్ట్రేలియా ఎ తో జరిగిన మూడు రోజుల ఆట రెండవ ఇన్నింగ్సులో ఒక సెషన్లో 80 బంతుల్లో సెంచరీ సాధించాడు. ముంబై ఇండియన్స్ నుంచి రాహుల్ ద్రవిడ్ , వాట్సన్ అతనిని కొనుగోలు చేసి రహానే చేత ఇన్నింగ్సును ప్రారంభింపజేసారు. "రాహుల్ భాయ్ తో బ్యాటింగ్ ప్రారంభించడం నన్ను నేను వ్యక్తీకరించడానికీ, సంవత్సరాలుగా నేను నేర్చుకున్నవన్నీ ప్రదర్శించడానికీ అవకాశం లభించింది " అని రహానే వివరించాడు.[27]

ఐపీఎల్‌లో అజింక్యా రహానే (2008–15)
జట్లు మ్యాచ్‌లు పరుగులు HS ఏవ్ SR 100
MI, RR, RPS 97 3789 105* 37.73 131.34 2

రాహుల్ ద్రవిడ్ ఆధ్వర్యంలో రాజస్థాన్ రాయల్స్ జట్టుతో రహానే విజయవంతమయ్యాడు..[54] అతను 2012 ఐపిఎల్ లో రాజస్థాన్ రాయల్స్ తరపున ప్రాచుర్యం పొందాడు. 2012లో కింగ్స్[55] ఎలెవన్ పంజాబ్తో జరిగిన తొలి మ్యాచ్లో 98 పరుగులు చేసి , ఆ తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో 103 పరుగులతో అజేయంగా నిలిచాడు.[56] ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 63 బంతుల్లో 84 పరుగులు చేసాడు.[57] 2012 ఐపీఎల్లో రహానే సెంచరీ సాధించిన తొలి బ్యాటరుగా నిలిచాడు. రాజస్థాన్ రాయల్స్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.[24] 2014 ప్రీమియర్ లీగ్ సీజన్ కోసం అతన్ని రాయల్స్ నిలుపుకుంది.[58]

రహానే ఆటగాడిగా పరిణతి చెందడంలో చాలా శ్రేయస్సు రాహుల్ ద్రవిడ్‌కు చెందుతుంది. ద్రావిడ్ మార్గనిర్దేశంలో రహానే, సిగ్గుపడే, దీర్ఘ-ఫార్మాట్ స్పెషలిస్టు నుండి ఏ స్థానంలోనైనా, ఏ ఫార్మాట్‌లోనైనా బ్యాటింగ్ చేయగల సామర్థ్యం గల ఆటగాడిగా మారాడు. భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ NDTVతో మాట్లాడుతూ, "రహానే కెరీర్‌లో ఆకట్టుకునేది ఏమిటంటే, అతను ఆ చిన్న మార్పులను చేసిన విధానం, ఆటలోని ప్రతి ఫార్మాట్‌లో మెరుగ్గా ఉండటానికి అతనికి సహాయపడింది. అతను ఆలోచించే బ్యాటరు. ఎలా మెరుగవ్వాలనే దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అందుకే రాజస్థాన్ రాయల్స్ జట్టులో అతనిది చాలా కీలకమైన స్థానం, భారత క్రికెట్ జట్టులో కీలకమైన స్థానం." [59]


2016, 2017 సీజన్లలో రాజస్థాన్ రాయల్స్ రెండేళ్ల పాటు ఐపిఎల్ నుండి నిషేధించబడినప్పుడు రహానే రైజింగ్ పూణె సూపర్ జెయింట్ తరపున ఆడాడు. 2016 సీజన్‌లో RPS తరఫున రహానే అత్యధిక పరుగుల స్కోరర్‌గా నిలిచాడు. ఫుడ్ పాయిజనింగ్ కారణంగా RPS కెప్టెన్ స్టీవ్ స్మిత్ తప్పుకున్నప్పుడు 2017 సీజన్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను RPSకి నాయకత్వం వహించాడు.

2018లో, రైట్-టు-మ్యాచ్ కార్డ్‌ని ఉపయోగించి రాజస్థాన్ రాయల్స్ రూ. 4 కోట్లకు రహానేని మళ్ళీ తీసుకుంది. స్టీవ్ స్మిత్ 2018 ఫిబ్రవరి 24న రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. దక్షిణాఫ్రికాపై బాల్ ట్యాంపరింగ్ కుంభకోణం తర్వాత స్టీవ్ స్మిత్, రాయల్స్ కెప్టెన్సీ నుండి వైదొలిగాడు, రహానే 2018 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్‌కు నాయకత్వం వహించాడు.

విజయ్ గోయెల్ ( ఎడమ ) రహానే ( మధ్యలో ), 2016కి అర్జున అవార్డును ప్రదానం చేశారు
  • CEAT ఇండియన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్: 2014–15 [60]
  • ఉత్తమ అండర్-19 క్రికెటర్‌గా MA చిదంబరం ట్రోఫీ: 2006–07 [61]
  • అర్జున అవార్డు : 2016 [62]

మూలాలు

[మార్చు]
  1. Ajinkya Rahane | India Cricket | Cricket Players and Officials. ESPN Cricinfo. Retrieved on 2013-12-23.
  2. "Professional companies should manage cricketers". Yahoo Cricket India. 9 June 2013.
  3. "Ajinkya Rahane profile and biography, stats, records, averages, photos and videos". ESPNcricinfo.
  4. "Ajinkya Rahane's captaincy masterclass puts the heat on Virat Kohli as England loom | Cricket News - Times of India". The Times of India.
  5. "Live Cricket Scores & News International Cricket Council". www.icc-cricket.com.
  6. 6.0 6.1 6.2 "A childhood dream finally realised". Cricibuzz. Retrieved 25 July 2014.
  7. "Indian Cricket Team Players Caste and Religion List (A to Z)". TᗩᗰIᒪᖴᑌᑎᗪᗩ (in అమెరికన్ ఇంగ్లీష్). 2017-06-05. Retrieved 2021-02-14.
  8. 8.0 8.1 Pradhan, Sandip (3 January 2021). "'अजिंक्य डोंबिवलीकर' होऊन रहाणे!". Lokmat (in మరాఠీ). Retrieved 7 January 2021.
  9. "I want a Lamborghini and an Aston Martin: Ajinkya Rahane". The Times of India. Retrieved 25 July 2014.
  10. "My struggle begins now: Ajinkya Rahane". DNA India. 23 August 2011. Retrieved 25 July 2014.
  11. "Ajinkya Rahane's debut ton extremely important for his career: Pravin Amre". NDTV. Archived from the original on 29 July 2014. Retrieved 25 July 2014.
  12. "Indian cricketer Ajinkya Rahane ties the knot". crictracker. 26 September 2014. Retrieved 26 September 2014.
  13. "Ajinkya Rahane becomes father, wife Radhika gives birth to a baby girl". indiatoday. Retrieved 5 October 2019.
  14. "Rahane and Srivastava help India clinch series". espncricinfo. Retrieved 12 February 2007.
  15. "Karachi Urban, Mumbai to contest Nissar Trophy". espncricinfo. Retrieved 28 March 2018.
  16. "Mohammed Nissar Trophy:Karachi Urban v Mumbai at Darwin, 8–11 September 2007". Cricinfo. Retrieved 2012-06-09.
  17. "Irani trophy 2007/08: Mumbai v Rest of India; Full scorecard". espncricinfo.
  18. "Duleep Trophy 2007/08: England Lions v West zone- Full scorecard". espncricinfo.
  19. "Ranji super league 2008: Most runs". espncricinfo.
  20. "Ranji trophy super league 2008/09 final : Mumbai vs Uttar Pradesh, Full scorecard". espncricinfo.
  21. "Group A: Hyderabad (India) v Mumbai at Hyderabad (Deccan), Dec 1-4, 2009 - Cricket Scorecard - ESPN Cricinfo". Cricinfo.
  22. "Irani trophy 2011/12: Rajasthan vs Rest of India, Full scorecard". espncricinfo.
  23. "Ajinkya Rahane: India batsman to join Hampshire as overseas player" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2019-04-25. Retrieved 2019-07-08.
  24. 24.0 24.1 24.2 "Ajinkya Rahane - India - Cricket Stats and Records - Wisden India". wisdenindia.com. Archived from the original on 5 April 2014. Retrieved 3 April 2014.
  25. 25.0 25.1 ""Long wait for Mumbai and Ajinkya Rahane finally ends". NDTV 22 March 2013 [". Archived from the original on 15 July 2014.
  26. "Cricket Australia Player Profile – Ajinkya Rahane". Archived from the original on 14 July 2014. Retrieved 1 July 2014.
  27. 27.0 27.1 "Forbes India Magazine - Ajinkya Rahane's steady road to stardom". Archived from the original on 17 September 2021. Retrieved 30 January 2017.
  28. "Ajinkya Rahane showcases his No. 6 mettle - Cricket - ESPN Cricinfo". Cricinfo.
  29. "Rahane's ton and India's lower-order success". ESPNcricinfo.
  30. "England v India: Ajinkya Rahane succeeds where the great Sachin Tendulkar failed with Lord's Test century". www.telegraph.co.uk. Archived from the original on 12 January 2022.
  31. "Ajinkya Rahane shows his X-factor - Cricket - ESPN Cricinfo". Cricinfo.
  32. 32.0 32.1 "I've learned to adapt, improvise: Rahane - IBNLive". 15 July 2014. Archived from the original on 15 July 2014.
  33. "Injured Rohit to miss rest of England series". Cricinfo.
  34. "Ajinkya Rahane hundred caps crushing win - Cricket - ESPN Cricinfo". Cricinfo.
  35. "Flexible Rahane switches to attack mode". Retrieved 30 January 2017.
  36. Sunam, Ashim (23 June 2015). "India vs Bangladesh: MS Dhoni Explains Ajinkya Rahane's Omission From Second ODI". International Business Times. Retrieved 30 January 2017.
  37. "Batting records - One-Day Internationals - Cricinfo Statsguru - ESPN Cricinfo". Retrieved 30 January 2017.
  38. "Ajinkya Rahane Test centuries". HowSTAT!. Retrieved 12 April 2020.
  39. "India in New Zealand Test Series – 2nd Test". ESPNcricinfo. Archived from the original on 20 February 2014. Retrieved 21 February 2014.
  40. "2nd Test: England v India at London, July 17–21, 2014". Retrieved 12 November 2015.
  41. "3rd Test: Australia v India at Melbourne, Dec 26–30, 2014". ESPNcricinfo. Archived from the original on 19 November 2016. Retrieved 5 June 2017.
  42. "2nd Test: Sri Lanka v India at Colombo, Aug 20–24, 2015". ESPNcricinfo. Retrieved 5 June 2017.
  43. "4th Test, Dec 03 - 07 2017, South Africa tour of India". ESPNcricinfo. Retrieved 13 March 2021.
  44. "2nd Test, India tour of West Indies at Kingston, July 30 - Aug 03 2016". ESPNcricinfo. Retrieved 12 April 2020.
  45. "New Zealand tour of India, 3rd Test: India v New Zealand at Indore, Oct 8–12, 2016". ESPNcricinfo. Archived from the original on 10 November 2017. Retrieved 9 October 2016.
  46. "Full Scorecard of India vs Sri Lanka 2nd Test 2017 - Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2021-01-07.
  47. "1st Test, India tour of West Indies at North Sound, Aug 22 - 25 2019". ESPNcricinfo. Retrieved 12 April 2020.
  48. "3rd Test, ICC World Test Championship at Ranchi, Oct 19-23 2019". ESPNcricinfo. Archived from the original on 19 October 2019. Retrieved 20 October 2019.
  49. "2nd Test, Melbourne, December 26 - 29, 2020, India tour of Australia". ESPNcricinfo. Retrieved 12 April 2020.
  50. "Ajinkya Rahane ODI centuries". HowSTAT!. Retrieved 12 April 2020.
  51. "4th ODI, Birmingham, September 02, 2014, India tour of England". ESPNcricinfo. Retrieved 3 March 2019.
  52. "1st ODI (D/N), Sri Lanka tour of India at Cuttack, Nov 2 2014". ESPNcricinfo. Retrieved 3 March 2019.
  53. "2nd ODI, Port of Spain, June 25, 2017, India tour of West Indies". ESPNcricinfo. Retrieved 3 March 2019.
  54. "Ajinkya Rahane to employ 'baseball technique' at World T20". intoday.in.
  55. "4th match: Rajasthan Royals v Kings XI Punjab at Jaipur, Apr 6, 2012". Cricinfo. Retrieved 7 January 2013.
  56. "18th match: Royal Challengers Bangalore v Rajasthan Royals at Bangalore, Apr 15, 2012". Cricinfo. Retrieved 7 January 2013.
  57. "39th match: Delhi Daredevils v Rajasthan Royals at Delhi, Apr 29, 2012". Cricinfo. Retrieved 7 January 2013.
  58. "Rajasthan Royals retain Shane Watson, Ajinkya Rahane, James Faulkner, Stuart Binny and Sanju Samson". ndtv.com. Archived from the original on 9 March 2014. Retrieved 3 April 2014.
  59. "IPL 8: The Evolution of Ajinkya Rahane into a Shorter Format Menace". Archived from the original on 4 March 2016. Retrieved 30 January 2017.
  60. "Ajinkya Rahane, Kumar Sangakkara conferred with CEAT awards". The Times of India. Retrieved 30 January 2017.
  61. "Seniors honoured at BCCI awards - Rediff.com Cricket". Retrieved 30 January 2017.
  62. "Ajinkya Rahane, Rohit Sharma conferred with Arjuna Award". The Indian Express (in ఇంగ్లీష్). 2016-09-17. Retrieved 2021-09-06.