బ్రెండన్ మెక్‌కలమ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Brendon McCullum
Brendon McCullum, Dunedin, NZ, 2009.jpg
Brendon McCullum at the University Oval in 2009
Flag of New Zealand.svg New Zealand
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు Brendon Barrie McCullum
మారుపేరు Bazza
జననం (1981-09-27) 1981 సెప్టెంబరు 27 (వయస్సు: 38  సంవత్సరాలు)
Dunedin, Otago, New Zealand
పాత్ర Wicket-keeper
బ్యాటింగ్ శైలి Right-handed
International information
తొలి టెస్టు 10 March 2004: v South Africa
చివరి టెస్టు 15 February 2010: v Bangladesh
తొలి వన్డే 17 January 2002: v Australia
చివరి వన్డే 9 November 2009:  v Pakistan
ODI shirt no. 42
Domestic team information
Years Team
2007–present Otago
2009–present New South Wales
2003–2006 Canterbury
2006 Glamorgan
1999–2003 Otago
2008–2009 present Kolkata Knight Riders
కెరీర్ గణాంకాలు
TestODIFCLA
మ్యాచ్‌లు 50 166 93 210
పరుగులు 2,678 3,415 5,155 4,463
బ్యాటింగ్ సగటు 34.33 28.94 34.36 29.36
100s/50s 4/15 2/16 8/29 5/20
అత్యుత్తమ స్కోరు 185 166 185 170
వేసిన బంతులు
వికెట్లు
బౌలింగ్ సగటు
ఒకే ఇన్నింగ్స్ లో 5 వికెట్లు
ఒకే మ్యాచ్ లో 10 వికెట్లు
అత్యుత్తమ బౌలింగ్
క్యాచ్ లు/స్టంపింగులు 158/10 186/13 263/18 229/15

As of 19 February, 2010
Source: CricketArchive

బ్రెండన్ బారీ మెక్‌కలమ్ (జననం 1981 సెప్టెంబరు 27, జన్మస్థలం డూనెడిన్) న్యూజిలాండ్‌ కు చెందిన ఒక అంతర్జాతీయ క్రికెటర్, రాష్ట్ర స్థాయిలో ఇతను ఒటాగో వోల్ట్స్ తరపున ఆడుతున్నాడు. మెక్‌కలమ్ వికెట్-కీపర్‌గా జట్టుకు సేవలు అందిస్తుండటంతోపాటు, అంతర్జాతీయ వన్డేల్లో ఓపెనర్ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు, దూకుడైన బ్యాటింగ్, వేగంగా పరుగులు సాధించడం ద్వారా ప్రత్యేక గుర్తింపు పొందాడు. అతని సోదరుడు నాథన్ మెక్‌కలమ్ కూడా రాష్ట్రస్థాయిలో ఫస్ట్-క్లాస్ ఆటగాడిగా మరియు అంతర్జాతీయ క్రికెటర్‌గా గుర్తింపు పొందాడు, వారి తండ్రి స్టు మెక్‌కలమ్ ఒటాగో జట్టుకు సుదీర్ఘకాలంపాటు ఫస్ట్-క్లాస్ క్రికెటర్‌గా సేవలు అందించాడు.

బ్రెండన్ మరియు నాథన్ ఇద్దరూ డునెడిన్‌లోని కింగ్స్ హైస్కూల్‌లో చదువుకున్నారు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో బ్రెండన్ మెక్‌కలమ్ కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు తరపున ఆడుతున్నాడు. 2008 ఏప్రిల్ 18న జరిగిన ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్‌లో అతను 158 పరుగులతో అజేయంగా నిలిచాడు. దీంతో ప్రపంచ ట్వంటీ20 క్రికెట్‌లో అతిపెద్ద వ్యక్తిగత స్కోరు చేసిన బ్యాట్స్‌మన్ రికార్డు ప్రస్తుతం అతని పేరుమీద ఉంది.[1]

ప్రారంభ క్రీడా జీవితం[మార్చు]

2000/01లో న్యూజిలాండ్ తరపున అండర్-19 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన మెక్‌కలమ్ మూడు సెంచరీలు సాధించడంతోపాటు, 151.66 సగటుతో 455 పరుగులు చేశారు. ఈ పరుగులను కూడా చాలా వేగంగా సాధించడం గమనార్హం, ప్రతి 100 బంతులకు 95.58 పరుగుల స్ట్రైక్ రేట్‌తో అతను ఈ పరుగులు చేశారు.

జులై 2002లో ఆస్ట్రేలియాలో క్లబ్ క్రికెట్ ఆడుతున్న సందర్భంగా, ఉత్తర ప్రాంతానికి చెందిన పాల్మెర్‌స్టోన్ క్రికెట్ క్లబ్ తరపున ఆడిన మెక్‌కలమ్ 100 కంటే తక్కువ బంతుల్లో రికార్డు స్థాయిలో 250 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ ప్రాంతంలో ఇప్పటి వరకు నమోదయిన అత్యధిక వ్యక్తిగత స్కోరు ఇదే కావడం గమనార్హం.[2]

క్రీడాజీవితపు ముఖ్యాంశాలు[మార్చు]

2004లో అతను ఇంగ్లండ్‌పై ఒక టెస్ట్ సిరీస్ ఆడాడు, లార్డ్స్‌లో జరిగిన మ్యాచ్‌లోని ఒక ఇన్నింగ్స్‌లో 96 పరుగులు చేశాడు, ఇది ఈ సిరీస్‌లో అతనికి అత్యధిక స్కోరు. టెస్ట్ క్రికెట్‌లో తన మొదటి సెంచరీని తరువాత కొన్ని నెలలకు బంగ్లాదేశ్‌పై 143 పరుగులు చేయడం ద్వారా నమోదు చేశాడు. శ్రీలంకపై రెండో టెస్ట్ సెంచరీ సాధించేందుకు వచ్చిన అవకాశాన్ని సెంచరీకి ఒక్క పరుగు దూరంలో అవుటవడంతో, తృటిలో చేజార్చుకున్నాడు. తరువాత జింబాబ్వేపై అతను రెండో టెస్ట్ సెంచరీని నమోదు చేశాడు, ఈ మ్యాచ్‌లో ప్రతి బంతికి ఒక పరుగు చొప్పున 111 పరుగులు చేశాడు.

జులై 2005లో ICC సూపర్ సిరీస్ కోసం ఎంపిక చేసిన 20 మంది ఆటగాళ్లు ఉన్న ICC వరల్డ్ XI బృందంలో మెక్‌కలమ్ కూడా ఉన్నాడు.

మార్చి 2006లో, వెస్టిండీస్‌తో జరిగిన ఒక వన్డే సందర్భంగా ఆటను వివాదాస్పదం చేసినట్లు అతను ఆరోపణలు ఎదుర్కొన్నాడు, అయితే తరువాత ఇందులో అతని తప్పు లేదని నిర్ధారణ అయింది.[3]

2006లో కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో ఆడుతున్న సందర్భంగా గ్లామోర్గాన్ జట్టు తరపున బరిలో దిగిన మెక్‌కలమ్ లీసెస్టెర్‌షైర్‌పై 160 పరుగులు చేశాడు.

2007 జనవరి 28 నాడు పెర్త్ లో ఆస్ట్రేలియా పై జరిగిన ఒక ODIలో జేకబ్ ఓరంతో కలిసి అతను చేసిన 137 పరుగుల బాగస్వామ్యం అప్పట్లో న్యూ జీలండ్ 6వ వికట్ కు అత్యధిక బాగస్వామ్యం. అయితే ఈ రికార్డ్ మరుసటి నెలలో అధికమించబడింది.[4]

2007 ఫిబ్రవరి 20న, ఆస్ట్రేలియాను 1997 తరువాత 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో న్యూజిలాండ్ జట్టు వైట్‌వాష్ చేసింది, ఈ వైట్‌వాష్‌కు కారమైన మ్యాచ్ విజయంలో, 86 పరుగుల వ్యక్తిగత స్కోరుతో అజేయంగా నిలవడం ద్వారా మెక్‌కలమ్ కీలకపాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో ఇరుజట్ల స్కోర్లను సమం చేసేందుకు నాథన్ బ్రాకెన్ వేసిన ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో తొలి బంతిని అతను భారీ సిక్స్‌గా మిలిచాడు, తరువాత ఒక బౌండరీతో న్యూజిలాండ్‌ను విజయతీరాలకు చేర్చాడు. ఈ మ్యాచ్‌విన్నింగ్ ప్రదర్శనతోపాటు, మెక్‌కలమ్ ఈ మ్యాచ్‌లో క్రైగ్ మెక్‌మిలన్‌తో కలిసి ఆరో వికెట్‌కు అతిపెద్ద భాగస్వామ్యంగా ఉన్న 165 పరుగుల ప్రపంచ రికార్డును సమం చేశాడు.[5]

2007 మార్చి 21లో, అతను కొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు, సెయింట్ లూసియాలో కెనడాతో జరిగిన మ్యాచ్‌లో 20 బంతుల్లోనే 50 పరుగులు సాధించడం ద్వారా అతను అత్యంత వేగవంతమైన అర్ధ సెంచరీతో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఈ ఇన్నింగ్స్‌లో 21 బంతులు ఎదుర్కొన్న మెక్‌కలమ్ 52 పరుగులు నమోదు చేశాడు, ఈ స్కోరును 247.61 స్ట్రైక్ రేట్‌తో 10 ఫోర్లు, 5 సిక్స్‌లతో సాధించాడు. దీనికి ముందు వరకు అత్యంత వేగవంతమైన అర్ధ సెంచరీ రికార్డు మార్క్ బౌచర్ (దక్షిణాఫ్రికా) పేరుపై ఉంది, అతను నెదర్లాండ్స్‌పై మార్చి 16న (21 బంతుల్లో 50 పరుగులు) ఈ రికార్డు నెలకొల్పాడు.

2007 డిసెంబరు 14న ఆస్ట్రేలియాపై మెక్‌కలమ్ తన వన్డే క్రీడాజీవితంలో అత్యుత్తమ వ్యక్తిగత స్కోరు 96 (103) నమోదు చేశాడు. ఈ సందర్భంలో 35.3 ఓవర్ వద్ద బ్రాడ్ హాగ్ బౌలింగ్‌లో నాథన్ బ్రాకెన్‌కు క్యాచ్ ఇచ్చి పెవీలియన్ దారిపట్టాడు.

2007 డిసెంబరు 31న బంగ్లాదేశ్‌పై 19 బంతుల్లోనే 50 పరుగులు సాధించాడు. ఈ మ్యాచ్‌లో 28 బంతులు మాత్రమే ఎదుర్కొన్న అతను 80 పరుగులు సాధించాడు, వీటిలో 9 ఫోర్లు, 6 సిక్స్‌లు ఉన్నాయి, 285.71 స్ట్రైక్ రేట్‌తో అతను ఈ స్కోరు చేశాడు, ఈ ప్రదర్శన కారణంగా న్యూజిలాండ్ మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది: 50 ఓవర్లకు 93 పరుగుల అతిస్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలో దిగిన న్యూజిలాండ్ ఈ లక్ష్యాన్ని 6 ఓవర్లలో 95 పరుగులు చేసి అందుకుంది.

2008 ఫిబ్రవరి 12న ఇంగ్లండ్‌పై మెక్‌కలమ్ 27 బంతుల్లోనే 50 పరుగులు నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో 47 బంతులు ఎదుర్కొన్న అతను 80 పరుగుల వ్యక్తిగత స్కోరు నమోదు చేశాడు, 170.21 స్ట్రైక్ రేట్‌తో 8 ఫోర్లు, 5 సిక్స్‌లతో అతను ఈ స్కోరు సాధించాడు, ఈ ప్రదర్శనతో రెండో వన్డేలో 10 వికెట్ల తేడాతో విజయం సాధించిన న్యూజిలాండ్ 5 మ్యాచ్‌ల సిరీస్‌లో తన ఆధిక్యతను 2-0కు పెంచుకుంది.

2008 మార్చి 2న, టెస్ట్ సిరీస్‌లో ఇంగ్లండ్‌ను ఎదుర్కోవడానికి ముందు, అతను ఆక్లాండ్ ఏసెస్‌తో జరిగిన స్టేట్-షీల్డ్ ఫైనల్ మ్యాచ్‌లో పాల్గొన్నాడు, ఈడెన్ పార్క్ యొక్క అవుటర్ ఒవల్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో ఒటాగో వోల్ట్స్ తరపున బరిలో దిగిన అతను 170 పరుగులు చేశాడు, దీంతో ఒటాగో వోల్ట్స్ 310 పరుగుల విజయలక్ష్యాన్ని ఏడు వికెట్లు కోల్పోయి విజయవంతంగా ఛేదించింది, అంతేకాకుండా ఈ మ్యాచ్‌లో మెక్‌కలమ్ పలు స్టేట్ షీల్డ్ బ్యాటింగ్ రికార్డులను బద్దలుకొట్టాడు.

 • వేగవంతమైన 100తో (52 బంతుల్లో) స్టేట్ షీల్డ్ (వన్డే) రికార్డు, ఇందులో 14 ఫోర్లు మరియు 5 సిక్స్‌లు ఉన్నాయి.
 • 135 పరుగులకు చేరుకున్నప్పుడు, అతను అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఒటాగో వోల్ట్స్ ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.
 • 162 పరుగులకు చేరుకున్నప్పుడు, దేశవాళీ వన్డే క్రికెట్‌లో (షెల్ లేదా స్టేట్ కాంపిటీషన్‌లు) అత్యధిక స్కోరు సాధించిన ఆటగాడిగా రికార్డు నమోదు చేశాడు
 • మొత్తంమీద ఈ మ్యాచ్‌లో అతను 19 ఫోర్లు, 7 సిక్స్‌లతో 170 పరుగులు చేశాడు.

2009 ఏప్రిల్ 18న, ఒక ట్వంటీ20 ఇన్నింగ్స్‌లో మెక్‌కలమ్ అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన రికార్డును నెలకొల్పాడు, ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున బరిలో దిగిన అతను బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్‌పై 73 బంతులు ఎదుర్కొని 13 సిక్స్‌లు, 10 బౌండరీలతో 158 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు, ఈ మ్యాచ్‌లో నైట్ రైడర్స్ 140 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది.[6] అప్పటివరకు 141 పరుగులతో ఆస్ట్రేలియాకు చెందిన కామెరూన్ వైట్ పేరిట ఈ రికార్డు నమోదయి ఉంది, ఇదిలా ఉంటే ఈ మ్యాచ్‌లో వైట్ కూడా మెక్‌కలమ్‌కు బౌలింగ్ చేయడం గమనార్హం, అతను వేసిన ఓవర్‌లో మెక్‌కలమ్ 24 పరుగులు సాధించాడు, మ్యాచ్‌లో వైట్ వేసిన ఒకేఒక్క ఓవర్ ఇదే.[7] ఇదే మ్యాచ్‌లో అతను ఒక ట్వంటీ20 ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన ఆటగాడిగా (13) కూడా అతను రికార్డు సృష్టించాడు, [8] అయితే తరువాత ఇంగ్లండ్ ఆటగాడు గ్రాహం నేపియర్ ఈ రికార్డును అధిగమించాడు.

జులై 1, 2008న, మెక్‌కలమ్ వన్డేల్లో తన తొలి సెంచరీని నమోదు చేశాడు, ఐర్లాండ్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో అతను 166 పరుగుల వద్ద అవుటయి పెవీలియన్ దారిపట్టాడు. జేమ్స్ మార్షల్‌తో కలిసి తొలి వికెట్‍‌కు 266 పరుగులు భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు, న్యూజిలాండ్ క్రికెట్ చరిత్రలో ఏ వికెట్‌కు అయినా ఇదే అత్యధిక భాగస్వామ్యం కావడం గమనార్హం, ఇదిలా ఉంటే వన్డే క్రికెట్ చరిత్రలో ఇది రెండో అత్యుత్తమ తొలి వికెట్ భాగస్వామ్యం.

2009 జనవరి 24న, ఆస్ట్రేలియా KFC ట్వంటీ20 బిగ్ బాష్ ఫైనల్ మ్యాచ్‌లో న్యూసౌత్ వేల్స్ జట్టు తరపున అతను ఆడాడు. ట్వంటీ20 ఛాంపియన్స్ లీగ్‌లో ఆడేందుకు అతనికి అర్హత కల్పించేందుకు జరిగిన ప్రయత్నం ఇది. అయితే న్యూసౌత్ వేల్స్ జట్టులో ఒక విదేశీ ఆటగాడిని ఆడించేందుకు ఆ జట్టుకు అనుమతి ఉన్నప్పటికీ, దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ మ్యాచ్‌లో ఆడటం ద్వారా తనకు వచ్చిన ఫీజును ఒటాగో జూనియర్ క్రికెట్‌కు విరాళంగా ఇచ్చాడు.

2009 ఏప్రిల్ 5న, భారత జట్టు న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ మూడో రోజున, మెక్‌కలమ్ రాహుల్ ద్రావిడ్‌ను అవుట్ చేసేందుకు అద్భుతమైన చురుకుదనాన్ని ప్రదర్శించాడు. డేనియల్ వెటోరి బౌలింగ్‌లో ద్రావిడ్ స్వీప్ షాట్‌కు ప్రయత్నించాడు, అయితే మెక్‌కలమ్ బంతి పిచ్ కాకముందే ద్రావిడ్ ఉద్దేశాన్ని గమనించి, బాగా ఎడుమవైపుకు కదిలాడు (ద్రావిడ్ లెగ్ సైడ్). తొలి స్లిప్‌లోని రాస్ టేలర్ కూడా ఇదే పనిచేశాడు. ద్రావిడ్ బ్యాటుకు తగిలిన తరువాత బంతి నేరుగా బ్రెండన్ మెక్‌కలమ్ చేతుల్లోకి వెళ్లింది.[9] దీనికి రెండు బంతుల ముందు కూడా, మెక్‌కలమ్ ఇదే పని చేసేందుకు ప్రయత్నించాడు, అయితే అతను ఆ సమయంలో ఆలస్యంగా స్పందించాడు, ద్రావిడ్ కూడా బంతిని భూమికి చాలా తక్కువ ఎత్తులో స్వీప్ చేశాడు. బంతి పిచ్ కాకముందే మెక్‌కలమ్ కదలికకు న్యాయబద్ధత ఉందా లేదా అనే అంశం చర్చనీయాంశమైనప్పటికీ, అతని చర్య కల్పించిన హక్కుల పరిధిలోనే ఉందని క్రికెట్ చట్టాలు సూచిస్తున్నాయి.[10]

2009 నవంబరు 6న, పాకిస్థాన్‌తో అబుదాబిలో జరిగిన మ్యాచ్‌లో, మెక్‌కలమ్ రెండో వన్డే సెంచరీని నమోదు చేశాడు (131, 129 బంతులు, 14 ఫోర్లు, 3 సిక్స్‌లు), ఈ ప్రదర్శనతో న్యూజిలాండ్ స్కోరు 303 పరుగులకు చేరుకోవడంతోపాటు, ఈ మ్యాచ్ విజయంతో ఆ జట్టు సిరీస్‌ను సమం చేయగలిగింది.[11]

2010 జనవరి 16న, 2009-10 HRV కప్ సందర్భంగా, ఆక్లాండ్ ఏసెస్‌తో యూనివర్శిటీ ఒవల్‌లో జరిగిన మ్యాచ్‌లో, మెక్‌కలమ్ 67 బంతుల్లో 10 ఫోర్లు మరియు నాలుగు సిక్స్‌లతో 108 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు, దీంతో ఒటాగో వోల్ట్స్ మూడు బంతులు మిగిలివుండగానే విజయతీరాలకు చేరుకుంది. ఈ ఇన్నింగ్స్‌లో మెక్‌కలమ్ తన అర్ధ సెంచరీని 32 బంతుల్లో, సెంచరీని 65 బంతుల్లో పూర్తి చేశాడు.

2010 ఫిబ్రవరి 16న, బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్ సందర్భంగా, ఒక ఇన్నింగ్స్‌లో అతను 185 పరుగులు చేశాడు, టెస్ట్ క్రికెట్‌లో న్యూజిలాండ్ వికెట్ కీపర్ సాధించిన అత్యధిక స్కోరు ఇదే కావడం గమనార్హం. అంతేకాకుండా అతను మార్టిన్ గుప్తిల్‌తో కలిసి 339 పరుగులు జోడించి, ఆరో వికెట్‌కు అత్యధిక పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన న్యూజిలాండ్ జోడీగా రికార్డు సృష్టించాడు, అయితే ఆరో వికెట్ భాగస్వామ్యానికి సంబంధించిన ప్రపంచ రికార్డును 12 పరుగుల తేడాతో వీరు చేజార్చుకున్నారు.

ఫిబ్రవరి 2010న, 116 పరుగులతో అజేయంగా నిలవడం ద్వారా T20I సెంచరీ (అంతర్జాతీయ ట్వంటీ20 సెంచరీ) సాధించిన రెండో ఆటగాడిగా మెక్‌కలమ్ గుర్తింపు పొందాడు, క్రిస్ గేల్ యొక్క 117 పరుగుల రికార్డుకు అతను ఒక్కపరుగు దూరంలో నిలిచాడు.

పాత్ర[మార్చు]

వన్డే క్రికెట్‌లో న్యూజిలాండ్ జట్టులో ఓపెనింగ్ వికెట్‌కీపర్-బ్యాట్స్‌మన్‌గా మెక్‌కలమ్ సేవలు అందిస్తున్నాడు, టెస్ట్ క్రికెట్‌లో అయితే అతను మిడిల్-ఆర్డర్ బ్యాట్స్‌మన్‌గా తన సేవలు అందిస్తున్నాడు. న్యూజిలాండ్ టెస్ట్ వికెట్‌కీపర్‌గా ఉన్న సందర్భంగా మెక్‌కలమ్ తన వికెట్‌కీపింగ్ నైపుణ్యాన్ని మెరుగుపరుచుకున్నాడు. సాధారణంగా అతను స్టంప్‌ల వెనుక చాలా చురుకైన పాత్ర పోషిస్తాడు, అతని ఖాతాలో కొన్ని అద్భుతమైన క్యాచ్‌లు ఉన్నాయి. న్యూజిలాండ్ జట్టులో చోటు దక్కించుకునేందుకు సరిపోయిన బ్యాటింగ్ నైపుణ్యాన్ని అతను కలిగివున్నాడు, పెద్దగా ప్రభావం చూపని సందర్భాలు కూడా ఉన్నప్పటికీ, అతడిని ఇప్పటికీ బ్యాట్స్‌మన్‌గా జట్టుకు ఎంపిక చేస్తున్నారు.[12] న్యూజిలాండ్ వన్డే జట్టు ఓపెనర్‌గా అతను బరిలో దిగుతున్నాడు, నిలకడగా తన ప్రదర్శనను మెరుగుపరుచుకుంటున్నాడు. ఇతనొక దూకుడుతనం కలిగిన బ్యాట్స్‌మన్, ముఖ్యంగా ఎక్స్‌ట్రా కవర్‌లో అలవోకగా షాట్‌లు కొట్టగలడు, తరచుగా స్టాండ్స్‌లోకి బంతిని తరలించగల సామర్థ్యం అతని సొంతం. జూన్ 2006లో గ్లామోర్గాన్ వద్ద ఐదు-వారాల పోటీకి ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు, ట్వంటీ20 క్రికెట్‌కు బాగా సరిపోయే ఆటగాడిగా అతడు ప్రశంసలు అందుకున్నాడు.[13] ఈ ఒప్పందాన్ని దేశవాళీ 2006 ట్వంటీ20 కప్ మొత్తం మ్యాచ్‌ల కోసం కుదుర్చుకున్నాడు. తరువాత IPLలోని కోల్‌కతా ఫ్రాంఛైజ్ అతడిని $700,000లకు కొనుగోలు చేసింది. IPLతో అతని ఒప్పందం 3 ఏళ్లుపాటు అమల్లో ఉంటుంది.

2009లో ట్వంటీ20 ప్రపంచ కప్ సందర్భంగా, మెక్‌కలమ్ తన వికెట్‌కీపింగ్ బాధ్యతలను పీటర్ మెక్‌గ్లాషన్‌కు అప్పగించాడు. ఈ సందర్భంగా తన ఆఫ్-స్పిన్ బౌలింగ్‌కు మెరుగులు దిద్దుతూ కనిపించాడు.

ఛాంపియన్స్ లీగ్ ప్రారంభ టోర్నీలో న్యూసౌత్ వేల్స్, కోల్‌కతా లేదా ఒటాగో జట్లలో దేని తరపున ఆడాలో అతను నిర్ణయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కోల్‌కతా ఈ టోర్నీకి అర్హత సాధించకపోవడంతో, అతడు న్యూసౌత్ వేల్స్ లేదా ఒటాగో జట్లలో ఏదో ఒక దానిని అతడు ఎంచుకోవాల్సి వచ్చింది; చివరకు మెక్‌కలమ్ తన సోదరుడు నాథన్ మెక్‌కలమ్‌తో కలిసి ఒటాగో జట్టు తరపున ఆడాలని నిర్ణయించుకున్నాడు.[14]

సూచనలు[మార్చు]

 1. Kumar, K. C. Vijaya (26 April 2008). "McCullum runs amok". Sportstar Weekly. Cite news requires |newspaper= (help)
 2. http://content-aus.cricinfo.com/newzealand/content/story/117075.html
 3. "2006: Penalties imposed on players for breaches of ICC Code of Conduct". International Cricket Council. Retrieved 2007-02-22. Cite web requires |website= (help)
 4. "Highest partnership for the sixth wicket". Cricinfo.com. Retrieved October 11, 2008. Cite web requires |website= (help)
 5. http://www1.cricinfo.com/db/STATS/ODIS/PARTNERSHIPS/ODI_PARTNERSHIP_RECORDS.html
 6. "McCullum record 158 stuns Bangalore". Cricinfo. Retrieved 2008-04-18. Cite web requires |website= (help)
 7. "Twenty20 matches, Most runs in an innings". Cricinfo. Retrieved 2008-04-18. Cite web requires |website= (help)
 8. "Most sixes in an innings". Cricinfo. Retrieved 2008-04-18. Cite web requires |website= (help)
 9. http://content.cricinfo.com/nzvind2009/content/current/story/398362.html
 10. http://www.lords.org/laws-and-spirit/laws-of-cricket/laws/law-40-the-wicket-keeper,66,AR.html
 11. http://www.cricinfo.com/pakvnz2009/engine/match/426721.html
 12. http://tvnz.co.nz/cricket-news/butler-replaced-fourth-odi-2527429
 13. బ్రెండన్ మెక్‌కలమ్ సైన్స్ ఫర్ గ్లామోర్గాన్, క్రిక్‌ఇన్ఫో, జూన్ 15, 2006న ప్రచురించబడింది.
 14. మెక్‌కలమ్ కమిట్స్ టు ఒటాగో ఫర్ ఛాంపియన్స్ లీగ్, క్రిక్‌ఇన్ఫో, ఆగస్టు 21, 2009న ప్రచురించబడింది.

బాహ్య లింకులు[మార్చు]

Commons-logo.svg
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.