స్టీవ్ స్మిత్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
స్టీవ్ స్మిత్
2014 లో స్మిత్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
స్టీవెన్ పీటర్ డెవెరూ స్మిత్
పుట్టిన తేదీ (1989-06-02) 1989 జూన్ 2 (వయసు 35)
Kogarah, న్యూ సౌత్ వేల్స్, Australia
మారుపేరుSmudge, Smithy,[1] Chachu[2]
ఎత్తు1.76[3] మీ. (5 అ. 9 అం.)
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి లెగ్ స్పిన్
పాత్రBatter
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 415)2010 జూలై 13 - పాకిస్తాన్ తో
చివరి టెస్టు2023 జూలై 27 - ఇంగ్లాండ్ తో
తొలి వన్‌డే (క్యాప్ 182)2010 ఫిబ్రవరి 19 - వెస్టిండీస్ తో
చివరి వన్‌డే2023 మార్చి 22 - ఇండియా తో
వన్‌డేల్లో చొక్కా సంఖ్య.49
తొలి T20I (క్యాప్ 43)2010 ఫిబ్రవరి 5 - పాకిస్తాన్ తో
చివరి T20I2022 నవంబరు 4 - Afghanistan తో
T20Iల్లో చొక్కా సంఖ్య.49
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2007/08–presentన్యూ సౌత్ వేల్స్
2011వోర్సెస్టర్‌షైర్
2011/12–presentSydney Sixers
2012–2013Pune వారియర్స్
2014–2015, 2019–2020రాజస్థాన్ రాయల్స్
2016–2017రైజింగ్ పూణే సూపర్‌జైంట్
2018బార్బడాస్ ట్రైడెంట్స్
2019Comilla విక్టోరియాns
2021ఢిల్లీ క్యాపిటల్స్
2023ససెక్స్
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు T20I FC
మ్యాచ్‌లు 102 142 63 164
చేసిన పరుగులు 9,320 4,939 1,008 13,942
బ్యాటింగు సగటు 58.61 44.49 25.20 55.54
100లు/50లు 32/39 12/29 0/4 48/60
అత్యుత్తమ స్కోరు 239 164 90 239
వేసిన బంతులు 1,470 1,076 291 5,365
వికెట్లు 19 28 17 72
బౌలింగు సగటు 53.05 34.67 22.17 51.65
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 0 1
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0 0
అత్యుత్తమ బౌలింగు 3/18 3/16 3/20 7/64
క్యాచ్‌లు/స్టంపింగులు 169/– 81/– 39/– 260/–
మూలం: ESPNcricinfo, 11 June 2023

స్టీవెన్ పీటర్ డెవెరూ స్మిత్ (జననం 1989 జూన్ 2) ఒక ఆస్ట్రేలియన్ అంతర్జాతీయ క్రికెటరు. ఆస్ట్రేలియా జాతీయ జట్టు మాజీ కెప్టెన్. ఆధునిక యుగంలో అత్యుత్తమ టెస్టు బ్యాట్స్‌మన్‌గా, అలాగే క్రీడా చరిత్రలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌గా కొంతమంది అతన్ని పరిగణించారు. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; పేరు లేని ref లలో తప్పనిసరిగా కంటెంటు ఉండాలి అత్యధిక టెస్టు బ్యాటింగ్ సగటుకు గాను స్మిత్‌ను, డాన్ బ్రాడ్‌మాన్‌తో పోల్చారు. 'డాన్ తరువాతి అత్యుత్తమ బ్యాట్స్‌మెన్'గా అతన్ని గౌరవించారు. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; పేరు లేని ref లలో తప్పనిసరిగా కంటెంటు ఉండాలి 2015 క్రికెట్ ప్రపంచ కప్, 2021 ఐసిసి T20 ప్రపంచ కప్, 2023 ఐసిసి వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టులో స్మిత్ సభ్యుడు.

మొదట్లో రైట్ ఆర్మ్ లెగ్ స్పిన్నర్‌గా ఆస్ట్రేలియాకు ఎంపికైనప్పటికీ, స్మిత్ తర్వాత ప్రాథమికంగా బ్యాట్స్‌మన్‌గా ఆడాడు. 2010 నుండి 2011 వరకు ఐదు మ్యాచ్‌లు ఆడిన తర్వాత, 2013 లో అతన్ని మళ్ళీ ఆస్ట్రేలియన్ జట్టుకు తీసుకున్నారు. 2015 చివరిలో మైఖేల్ క్లార్క్ నుండి కెప్టెన్సీని తీసుకున్నాడు. ఆ తర్వాత అతను ప్రధానంగా 3 లేదా 4 స్థానంలో బ్యాటింగ్ చేశాడు.

అతను గెలుచుకున్న అవార్డులలో, 2015లో సర్ గార్ఫీల్డ్ సోబర్స్ ట్రోఫీ (ఐసిసి క్రికెటర్ ఆఫ్ ది ఇయర్), 2015, 2017లో ఐసిసి టెస్టు ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ ; 2011–2020కి ఐసిసి పురుషుల టెస్టు ప్లేయర్ ఆఫ్ ది డికేడ్ ; 2015, 2018, 2021, 2023లో ఆస్ట్రేలియా క్రికెట్‌లో అత్యుత్తమ ఆటగాడిగా అలన్ బోర్డర్ మెడల్ ; 2015, 2018లో ఆస్ట్రేలియన్ టెస్టు ప్లేయర్ ఆఫ్ ది ఇయర్, 2015, 2021లో ఆస్ట్రేలియన్ వన్ డే ఇంటర్నేషనల్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ లు ఉన్నాయి. 2016 విస్డెన్ అల్మానాక్‌లో అతనిని విస్డెన్ వారి క్రికెటర్లలో ఒకరిగా ఎంపిక చేసింది.

2014లో, న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ మార్టిన్ క్రోవ్, స్మిత్‌ని జో రూట్, కేన్ విలియమ్సన్, విరాట్ కోహ్లీలతో పాటు టెస్టు క్రికెట్‌లోని యువ ఫాబ్ ఫోర్‌లో ఒకరిగా అభివర్ణించాడు. [4] 2017 డిసెంబరు 30న, అతని టెస్టు బ్యాటింగ్ రేటింగ్ 947కి చేరుకుంది. ఇది డాన్ బ్రాడ్‌మాన్ 961 తర్వాత రెండవ అత్యధిక రేటింగ్.

2018 మార్చిలో, దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్ట్‌లో బాల్ టాంపరింగ్‌ను పర్యవేక్షించడం, చురుగ్గా ప్రోత్సహించడం చేసినందుకు గాను, స్మిత్ విస్తృతంగా విమర్శలు ఎదుర్కొన్నాడు. ఆ సమయంలో అతను జట్టు కెప్టెన్సీ నుండి వైదొలిగాడు. అతని స్థానంలో టిమ్ పైన్ ఎంపికయ్యాడు. క్రికెట్ ఆస్ట్రేలియా జరిపిన విచారణ తరువాత, 2018 మార్చి 29 నుండి ఆస్ట్రేలియాలోని అన్ని అంతర్జాతీయ, దేశీయ క్రికెట్ నుండి స్మిత్‌ను ఒక సంవత్సరం పాటు నిషేధించారు. అదనంగా మరొక సంవత్సరం పాటు ఎటువంటి నాయకత్వ పాత్రను పరిగణనలోకి తీసుకోకుండా నిషేధించబడ్డాడు.

ప్రారంభ జీవితం

[మార్చు]

స్టీవ్ స్మిత్ 1989 జూన్ 2 న సిడ్నీలోని కోగరాలో ఆస్ట్రేలియన్ తండ్రి పీటర్, ఆంగ్ల తల్లి గిలియన్‌కి జన్మించాడు.[5] స్మిత్ మెనై హైస్కూల్‌లో చదువుకున్నాడు. 17 సంవత్సరాల వయస్సులో ఇంగ్లాండ్‌లో క్రికెట్ ఆడటానికి బయలుదేరాడు. అక్కడ అతను కెంట్ క్రికెట్ లీగ్‌లో సెవెనోక్స్ వైన్ కోసం క్లబ్ క్రికెట్ ఆడాడు. అతను సెవెనోక్స్ కోసం చాలా బాగా ఆడడంతో, సర్రే యొక్క సెకండ్ XI కు ఆడటానికి ఎంపికయ్యాడు.[6][7][8]

అతని తల్లి లండన్‌లో జన్మించినందున, స్మిత్‌కు బ్రిటిష్, ఆస్ట్రేలియన్ పౌరసత్వాలు రెండూ ఉన్నాయి. [9] 2011లో, స్మిత్ మాక్వేరీ యూనివర్శిటీలో కామర్స్, లా విద్యార్థి డాని విల్లీస్‌తో డేటింగ్ ప్రారంభించాడు. [10] 2017 జూన్లో, ఈ జంట న్యూయార్క్‌లో సెలవులో ఉన్నప్పుడు తమ నిశ్చితార్థాన్ని ప్రకటించారు. [11] ఈ జంట న్యూ సౌత్ వేల్స్‌ లోని బెర్రిమాలో 2018 సెప్టెంబరు 15న పెళ్ళి చేసుకున్నారు [12]

స్మిత్ ,నేషనల్ రగ్బీ లీగ్‌లో సిడ్నీ రూస్టర్స్‌కు మద్దతుదారు.[13]

2010–2011: తొలి అంతర్జాతీయ కెరీర్

[మార్చు]

స్టీవ్ స్మిత్ 2010 ఫిబ్రవరిలో మెల్‌బోర్న్‌లో పాకిస్తాన్‌పై లెగ్ స్పిన్నర్‌గా ఆడుతున్న ట్వంటీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. అదే నెలలో, అతను మెల్‌బోర్న్‌లో వెస్టిండీస్‌పై కూడా తన తొలి వన్డే అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడాడు.[14]

వెస్టిండీస్‌లో జరిగిన 2010 ఐసిసి వరల్డ్ ట్వంటీ20 పోటీలో, ఆస్ట్రేలియా ఇంగ్లాండ్‌తో రన్నరప్‌గా నిలిచింది. స్మిత్ ఏడు మ్యాచ్‌ల్లో 14.81 సగటుతో 11 వికెట్లు పడగొట్టి టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా నిలిచాడు. [15]

స్మిత్ 2010 జూలైలో లార్డ్స్‌లో అరంగేట్రం చేసాడు, 2010లో ఇంగ్లాండ్‌లో ఆడిన టెస్టు సిరీస్‌లో పాకిస్తాన్‌తో రెండు టెస్టులు ఆడాడు. [14] అతన్ని ప్రధానంగా అతని బౌలింగ్ కోసం ఎంపిక చేసారు. మొదటి ఇన్నింగ్స్‌లో అతని బౌలింగ్ అవసరం రాలేదు. బ్యాటింగు వరుసలో దిగువన ఆడాడు. రెండో ఇన్నింగ్స్‌లో 51 పరుగులకు 3 వికెట్లు పడగొట్టడంతో ఆస్ట్రేలియా 150 పరుగుల తేడాతో విజయం సాధించింది. [16] రెండవ టెస్ట్‌లో అతను కేవలం పది ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసాడు. రెండవ ఇన్నింగ్స్‌లో బ్యాట్‌తో ఆకట్టుకునే పాత్ర పోషించినప్పటికీ, వికెట్లు తీయలేదు. దిగువ వరుసలో బ్యాటింగు చేస్తూ అతను, తొమ్మిది ఫోర్లు, వరుస బంతుల్లో రెండు సిక్సర్లతో సహా 77 పరుగులు చేశాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 88 పరుగులకు ఆలౌట్ అయిన తర్వాత ఆస్ట్రేలియాకు మంచి లక్ష్యాన్ని నిర్దేశించడానికి ఇది సహాయపడింది. [17]

2009–10 సీజన్‌లో అవుట్‌ఫీల్డ్‌లో కొన్ని అద్భుతమైన క్యాచ్‌లతో స్మిత్ ఫీల్డింగ్ అందరి దృష్టిని ఆకర్షించింది. [18]

2010-11 ఆస్ట్రేలియన్ వేసవిలో, 2010-11 యాషెస్ సిరీస్‌లో స్మిత్ మూడు టెస్టులు ఆడాడు, ఈసారి బ్యాట్స్‌మన్‌గా ఎక్కువ ఆడుతూ క్రమంలో ఆరవ స్థానంలో నిలిచాడు. సిరీస్ సమయంలో అతని ప్రదర్శనలు పటిష్టంగా ఉన్నాయి. రెండు అర్ధ సెంచరీలు సాధించాడు. 2010-11 యాషెస్ తర్వాత, స్మిత్ రెండేళ్లపాటు మరో టెస్టు ఆడలేదు, అతని తదుపరి టెస్టు సిరీస్ 2013 మార్చిలో భారత్‌తో జరిగింది.[19]

ఆస్ట్రేలియాలో క్రికెట్ ప్రపంచ కప్ 2015

[మార్చు]

ప్రపంచ కప్‌లో, స్మిత్ బహుముఖ బ్యాట్స్‌మెన్‌గా కీలక పాత్ర పోషించాడు, అతను మూడవ నంబరు నుండి మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్‌గా అనేక బ్యాటింగ్ స్థానాల్లో ఆడాడు. ప్రపంచ కప్‌లో ఆస్ట్రేలియా యొక్క ఓపెనింగ్ మ్యాచ్‌లో, ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో, అతను 5 పరుగులకే ఔటయ్యాడు. అయితే టోర్నమెంటు పురోగమిస్తున్న కొద్దీ అతను మెరుగుపడ్డాడు. ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక, పాకిస్తాన్‌లపై హాఫ్ సెంచరీలు చేసిన తర్వాత, అతను సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో సెమీ-ఫైనల్స్‌లో భారత్‌పై సెంచరీ చేసి, ఆస్ట్రేలియాను ఫైనల్‌లోకి నడిపించాడు. [20] ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను ఓడించి, న్యూజిలాండ్‌పై ఆస్ట్రేలియా డ్రా చేసుకుంది. న్యూజిలాండ్ పతనం తర్వాత 183 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే ఆస్ట్రేలియా లక్ష్యాన్ని స్టీవ్ స్మిత్, 58 పరుగులు చేసి నాటౌట్‌గా రాణించడంతో ఆస్ట్రేలియా 101 బంతులు మిగిలి ఉండగానే 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. [21] స్మిత్ టోర్నమెంట్‌లో ఆస్ట్రేలియా తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు. 67 సగటుతో, ఒక సెంచరీ, నాలుగు అర్ధసెంచరీలతో 402 పరుగులు చేసాడు.[22] ఐసిసి 2015 ప్రపంచ కప్ కోసం టోర్నమెంటు జట్టులో అతను స్థానం పొందాడు. [23] అతను ESPNcricinfo, Cricbuzz ద్వారా టోర్నమెంటు జట్టులో కూడా స్థానం పొందాడు. [24] [25]

వెస్టిండీస్ పర్యటన 2015

[మార్చు]

2015–2018: ఆస్ట్రేలియా కెప్టెన్సీ

[మార్చు]
కెప్టెన్‌గా స్టీవ్ స్మిత్ రికార్డు
మ్యాచ్‌లు గెలుపులు ఓటములు డ్రాలు టైలు ఫలితం తేలనివి గెలుపు %
టెస్టులు [26] 37 21 10 6 0 56.76%
వన్‌డే [27] 51 25 23 0 0 3 52.08%
T20I [28] 8 4 4 0 0 50.00%
చివరిగా నవీకరించబడింది: 2023 మార్చి 9

2015 యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా 3 - 2 తో ఓడిపోయిన తరువాత మైఖేల్ క్లార్క్ పదవీ విరమణ చేయడంతో స్మిత్‌ను ఆస్ట్రేలియా టెస్టు జట్టుకు పూర్తి స్థాయి కెప్టెన్‌గా నియమించారు. డేవిడ్ వార్నర్‌ను అతనికి వైస్ కెప్టెన్‌గా నియమించారు.[29][30]

దక్షిణాఫ్రికా పర్యటన, బాల్ ట్యాంపరింగు

[మార్చు]

న్యూజిలాండ్, ఇంగ్లండ్‌తో జరిగిన T20 సిరీస్‌లకు స్మిత్‌కు విశ్రాంతి ఇచ్చారు. తద్వారా అతను దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్‌కు సిద్ధమయ్యాడు.[31] ఫీల్డ్‌లోనూ, బయటా జరిగిన వివాదాస్పద సంఘటనలతో ఆ సిరీస్ దెబ్బతింది. స్మిత్ 56, 38 పరుగుల స్కోరుతో ఆస్ట్రేలియా 118 పరుగుల తేడాతో తొలి టెస్టును గెలుచుకుంది.[32] ఆస్ట్రేలియన్ వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్, దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ క్వింటన్ డి కాక్‌ల మధ్య జరిగిన వాగ్వివాదం మ్యాచ్‌పై నీడలు కమ్మేసింది.[33] ఇద్దరి మధ్య మాటలు జరిగిన తర్వాత వార్నర్‌ను పట్టుకుని ఆపాల్సి వచ్చిందని ఫుటేజీల్లో కనబడింది. స్మిత్‌ను, ప్రత్యర్థి కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్‌నూ అంపైర్లు, మ్యాచ్ అధికారుల సమావేశానికి పిలిచారు. తమ జట్లను నియంత్రించాల్సిన బాధ్యతను వారికి గుర్తు చేసారు. రెండో టెస్టులో స్మిత్ 25, 11 పరుగులు చేయగా, దక్షిణాఫ్రికా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.[34] స్మిత్ బ్యాట్‌తో పస తగ్గిపోవడం, సగటు స్ట్రైక్ రేట్ కంటే తక్కువగా ఉండటం వల్ల అతను కొంత ఇబ్బంది పడుతున్నాడని సూచించింది. మ్యాచ్ సమయంలో దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలరు, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కగిసో రబాడా స్మిత్‌ను అవుట్ చేసిన తర్వాత స్మిత్‌ను అంటుకున్నాడని రబాడాను తదుపరి టెస్టుకు సస్పెండ్ చేసారు.[35] రబాడా నిషేధంఒపై అప్పీల్ చేసి, విజయం సాధించాడు; అది స్మిత్‌కు చికాకు కలిగించే నిర్ణయం.[36]

బాల్-ట్యాంపరింగ్ ఘటన, సస్పెన్షను

[మార్చు]

మూడో టెస్టులో ఆస్ట్రేలియా 322 పరుగుల తేడాతో ఓడిపోయింది, స్మిత్ పెద్దగా పరుగులు చెయ్యలేదు.[37] అయితే, మూడో రోజు జరిగిన అక్రమ బాల్‌ ట్యాంపరింగ్‌తో మ్యాచ్‌ ఫలితం మసకబారింది. జట్టులోని రెండవ-పిన్నవయస్కుడు, అనుభవం లేని ఆటగాడూ అయిన కామెరాన్ బాన్‌క్రాఫ్ట్, క్రికెట్ బంతిని రఫ్ చేయడానికి సాండ్ పేపరును ఉపయోగించడం టెలివిజన్ కెమెరాలలో కనబడింది.[38] మైదానంలోని అంపైర్లు అడిగే లోపు దాన్ని లోదుస్తుల్లో దాచుకున్నాడు. బాన్‌క్రాఫ్ట్‌తో మూడవ రోజు ఆట ముగింపులో జరిగిన విలేకరుల సమావేశానికి హాజరైన స్మిత్, లంచ్ విరామ సమయంలో మ్యాచ్ ఫలితాన్ని ప్రభావితం చేసేందుకు జట్టులోని "నాయకత్వ సమూహం" బాల్ టాంపరింగ్ గురించి చర్చించినట్లు స్మిత్ అంగీకరించాడు. తాను "నాయకత్వ సమూహం"లో భాగమని అంగీకరించాడు గానీ ఇతర సభ్యులెవరో చెప్పలేదు.[39] సంఘటన జరిగిన మరుసటి రోజు ఉదయం స్మిత్, వైస్-కెప్టెన్ డేవిడ్ వార్నర్ లు జట్టు నాయకత్వం నుండి వైదొలిగారు. కానీ ఆడడం కొనసాగించారు. ఇప్పటికీ ఆడారు. వికెట్ కీపర్ టిమ్ పైన్ మిగిలిన టెస్ట్ మ్యాచ్‌కు తాత్కాలిక కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. తదనంతరం, ఐసిసి మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ స్మిత్‌పై ఒక టెస్టు మ్యాచ్ నిషేధం, అతని మ్యాచ్ ఫీజులో 100% జరిమానా విధించాడు. అతను బాన్‌క్రాఫ్ట్‌కు మూడు డీమెరిట్ పాయింట్‌లు ఇచ్చి, అతని మ్యాచ్ ఫీజులో 75% జరిమానా విధించాడు.[40]

క్రికెట్ ఆస్ట్రేలియా, ఆటకు చెడ్డపేరు తెచ్చిపెట్టినందుకు స్మిత్‌పై స్వతంత్ర దర్యాప్తు ప్రారంభించింది. అతన్ని సస్పెండ్ చేసి పర్యటన నుంచి ఇంటికి పంపించారు. ప్లాను వేసినది స్వయంగా అతను కానప్పటికీ స్మిత్, మ్యాచ్ అధికారులను, ఇతరులను తప్పుదారి పట్టించాడని, కెప్టెన్‌గా దానిని నిరోధించేలా వ్యవహరించలేదని దర్యాప్తు నివేదిక పేర్కొంది. అందువల్ల అతన్ని 2018 మార్చి 29 నుండి 12 నెలల పాటు అన్ని అంతర్జాతీయ, దేశీయ క్రికెట్ నుండి నిషేధించారు. అదనంగా 12 నెలల పాటు జట్టులో నాయకత్వ పాత్రను పరిగణనలోకి తీసుకోకుండా కూడా నిషేధించారు. వార్నర్, బాన్‌క్రాఫ్ట్‌లపై కూడా నిషేధం విధించారు. ఆంక్షల పర్యవసానంగా 2018 సీజన్ కోసం రాజస్థాన్ రాయల్స్ IPL జట్టుతో స్మిత్ తన ఒప్పందాన్ని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు రద్దు చేసింది.[41]

స్మిత్ మార్చి 29న సిడ్నీ చేరుకున్నాడు. సిడ్నీ ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో, క్రికెట్ ఆస్ట్రేలియా నివేదికకు అదనంగా తాను చెప్పేదేమీ లేదని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆస్ట్రేలియన్ క్రికెట్ జట్టు కెప్టెన్‌గా తాను పూర్తి బాధ్యత వహించానని (బాల్ పరిస్థితిని మార్చడానికి తాను ప్రణాళిక వేయనప్పటికీ, లేదా ఆ పని స్వయంగా చేయనప్పటికీ), తాను తీవ్రమైన తప్పు చేశాననీ చెప్పాడు: "ఇది నాయకత్వ వైఫల్యం, నా నాయకత్వ వైఫల్యం." అన్నాడు. "తన సహచరులకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులకు, నిరాశతో, కోపంతో ఉన్న ఆస్ట్రేలియన్లందరికీ" క్షమాపణలు చెప్పడంతో పాటు, అతను ఈ సంఘటన తన తల్లిదండ్రులపై చూపిన ప్రభావాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించాడు. ప్రశ్నార్థకమైన నిర్ణయాలు చేసే ఇతరులను కూడా, అలా చేసేముందు వారి తల్లిదండ్రులను గుర్తు చేసుకొమ్మని వేడుకున్నాడు. అతను, "నా జీవితాంతం నేను దీని గురించి పశ్చాత్తాపపడతానని నాకు తెలుసు. నేను పూర్తిగా దృఢంగా ఉన్నాను. సరైన సమయంలో నేను తిరిగి గౌరవం, క్షమనూ పొందగలనని ఆశిస్తున్నాను." అని అన్నాడు.[42][43][44]

ఆట శైలి

[మార్చు]
2008లో న్యూ సౌత్ వేల్స్ తరఫున స్మిత్ బౌలింగ్ చేస్తూ..

స్మిత్ ఒక అసాధారణ టెక్నిక్‌ కలిగిన కుడిచేతి వాటం బ్యాటరు. అతను క్రీజులో తరచుగా తిరుగుతూ ఉంటాడు, ముఖ్యంగా బౌలర్ల రన్-అప్ సమయంలో. చివరికి, కుడిచేతి వాటం బౌలర్లను ఆడేటపుడు, ఆఫ్ స్టంప్ వెలుపల కాలి వేళ్ళు ఉండేలా నిలుచుంటాడు.[45] బ్యాట్‌ను తన దిగువ చేతితో నియంత్రిస్తాడు. రివర్స్ స్వీప్ వంటి సంప్రదాయేతర క్రికెట్ షాట్లను ఆడగల చక్కటి సామర్థ్యం అతనికి ఉంది. [46] 2010 జనవరిలో ఒక క్లబ్ మ్యాచ్‌లో ఆడుతూ, కుడిచేతి వాటం కలిగిన స్మిత్, ఎడమచేతి వాటంతో నిలబడి సిక్సర్ కొట్టాడు.[47] అతని అసాధారణ శైలి కారణంగా, స్మిత్‌కు మొదట పరిమిత ఓవర్ల బ్యాట్స్‌మన్‌గా ముద్రవేసారు. టెస్టుల్లో, ముఖ్యంగా కెరీర్ ప్రారంభంలో అతను ఆఫ్ స్టంప్ వెలుపల బలహీనంగా ఉన్న సమయంలో, ఇబ్బంది పడతాడని అనుకున్నారు. [46] అయితే, స్మిత్‌కు - చేతికీ కంటికీ ఉన్న సమన్వయం, ఫోకస్‌, ముఖ్యంగా స్పిన్ బౌలర్లకు వ్యతిరేకంగా అతని ఫుట్‌వర్కులు అసమానమైనవి. [48] వీటితో తన విలక్షణమైన సాంకేతికతను కప్పి పెట్టాడు.[46] 2013–14 యాషెస్‌లో పెర్త్ టెస్టు మ్యాచ్ సమయంలో స్మిత్, తన టెక్నిక్‌తో ఆకస్మికంగా ప్రయోగాలు చేశాడు, ఆ సమయంలో అతను షార్ట్-పిచ్ బౌలింగ్‌ను ఎదుర్కోవడానికి "ముందు కొంత వెనగ్గా, పక్కగా" నిలబడాలని నిర్ణయించుకున్నాడు. [49] ఆ ఒక్క మార్పు వలన అతని బ్యాటింగ్ సగటు, 2013 లో 33 నుండి, 2019 లో 64.95కి పెరిగింది. 2023 నాటికి, ఇది 58.61. [50] డెలివరీ సమయంలో, స్మిత్ స్టంప్‌లు పూర్తిగా కవర్‌చేసి నిలుచుంటాడు. తద్వారా బౌల్డ్ అవుట్‌లు అసంభవం. ఈ స్థానం అతనిని ఆన్ లేదా ఆఫ్ సైడ్‌లో సులభంగా ఆడటానికి అనుమతిస్తుంది. [51] [52]

స్మిత్ విజయంలో చాలా శ్రేయస్సు బ్యాటింగ్ కోచ్ ట్రెంట్ వుడ్‌హిల్‌కు కూడా చెందుతుందని చెప్పవచ్చు. అతను స్మిత్‌కు జూనియర్‌గా శిక్షణ ఇచ్చినపుడు, అతని అపారమైన ప్రతిభను గుర్తించాడు. [8] స్మిత్ ప్రత్యేకమైన బ్యాటింగ్ శైలిని కూడా అతను సమర్థించాడు. ఆస్ట్రేలియాలో చాలా మంది సహజంగా ప్రతిభావంతులైన క్రికెటర్లు తప్పనిసరిగా సనాతన టెక్నిక్‌నే కలిగి ఉండాలనేమీ లేదని చాలా కాలంగా వాదిస్తున్నాడు; పాఠశాలను విడిచిపెట్టి అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎదగడానికి మధ్య సంవత్సరాలలో, స్మిత్ తన టెక్నిక్‌ను అనేక మంది సదుద్దేశం కలిగిన కోచ్‌లు తప్పు పట్టారు.[8] వుడ్‌హిల్‌తో శిక్షణ తిరిగి స్థాపించినప్పటి నుండి, స్మిత్ తన క్రికెట్‌పై ప్రశాంతతను, విశ్వాసాన్నీ తిరిగి పొందినట్లు కనిపించాడు. ఇది కొన్ని సీజన్‌లలో ఫలితాలను అందించింది. [53] స్మిత్ తన ఏకాగ్రతకు కూడా ప్రసిద్ధి చెందాడు -అతను రోజంతా బ్యాటింగు చేయగలడు. [54] [55]

అయితే బౌలరుగా, అతను బ్యాటింగు వరుసలో పైకి వచ్చిన తర్వాత (అతను కెప్టెన్ అయ్యి, 4 వద్ద స్థిరపడే వరకు), [56] షేన్ వార్న్‌తో ఉన్న పోలికలు ఎప్పుడూ ఊపందుకోలేదు. తన కెరీర్ ప్రారంభంలో లెగ్ స్పిన్నర్‌గా పేరుండేది, కానీ అతను చాలా డిఫెన్సివ్ బౌలరని భావించినందున అతన్ని తక్కువగా ఉపయోగించారు. [57] [58]

ఆస్ట్రేలియాకు కెప్టెన్‌గా ఉన్నప్పుడు, అతని కెప్టెన్సీ పాలన ప్రారంభంలో అలన్ బోర్డర్ లాగానే అతనూ "కోపదారి కెప్టెన్" అని పేరుతెచ్చుకున్నాడు. క్రీడాస్ఫూర్తి చూపనందుకు మిచెల్ స్టార్క్‌ను హెచ్చరించాడు. 2015లో న్యూజీలాండ్ 200కి పైగా పరుగులతో ఓడించినప్పటికీ, జట్టు బౌలింగు, ఫీల్డింగు బాలేదని తీవ్రంగా విమర్శించాడు. [59] తర్వాత, 2017–2018లో, అతను మాక్స్‌వెల్‌ను ఆస్ట్రేలియన్ వన్‌డే జట్టు నుండి తొలగించిన సమయంలో గ్లెన్ మాక్స్‌వెల్ శిక్షణా విధానాన్ని బహిరంగంగా విమర్శించారు. [60] జట్టు ఎంపికలపై కూడా అతని ప్రభావం ఎక్కువగా ఉంటుందని విమర్శలున్నాయి.[61]

ఐసిసి ప్లేయర్ ర్యాంకింగ్స్ ప్రకారం, స్మిత్ ప్రపంచంలోని టాప్-ర్యాంక్ టెస్టు బ్యాట్స్‌మెన్‌లలో ఒకరిగా గుర్తింపు పొందాడు.

కెరీర్‌లో అత్యుత్తమ ప్రదర్శనలు

[మార్చు]
వివిధ దేశాలకు వ్యతిరేకంగా శతకాలు
టెస్టులు వన్‌డే T20I
 ఇంగ్లాండు 12 1 -
 India 9 5 -
 న్యూజీలాండ్ 2 2 -
 పాకిస్తాన్ 2 2 -
 దక్షిణాఫ్రికా 2 2 -
 శ్రీలంక 2 - -
 వెస్ట్ ఇండీస్ 3 - -
మొత్తం 32 12 -

2022 డిసెంబరు నాటికి, స్మిత్ మొత్తం 45 ఫస్టు క్లాస్ సెంచరీలు, 13 లిస్టు ఎ సెంచరీలు, ఒక టీ20 సెంచరీ చేశాడు. అతని ఫస్ట్-క్లాస్ సెంచరీలలో 29, టెస్టు మ్యాచ్‌లలో, లిస్టు A సెంచరీలలో 12, వన్డే ఇంటర్నేషనల్స్‌లోనూ చేసాడు. షెఫీల్డ్ షీల్డ్‌లో సౌత్ ఆస్ట్రేలియాపై న్యూ సౌత్ వేల్స్ తరపున 64 పరుగుల (7/64)కి ఏడు వికెట్లు పడగొట్టడం అతని అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు.[62]

  • 2017లో పెర్త్‌లోని డబ్ల్యూఏసీఏ గ్రౌండ్‌లో ఇంగ్లండ్‌పై స్మిత్ చేసిన 239 పరుగులు టెస్టు, ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అత్యధిక స్కోరు.[63]
  • 2016లో సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో న్యూజిలాండ్‌పై వన్ డే, లిస్ట్ ఎ క్రికెట్‌లో అతని అత్యధిక స్కోరు 164 పరుగులు.[64]
  • 2015లో కార్డిఫ్‌లోని సోఫియా గార్డెన్స్‌లో ఇంగ్లండ్‌పై ట్వంటీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లలో అతని అత్యధిక స్కోరు 90 పరుగులు.[65]
  • మూడు టీ20 సెంచరీలు సాధించాడు. 2016 ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో గుజరాత్ లయన్స్‌తో రైజింగ్ పూణే సూపర్‌జెయింట్స్‌కు మొదటిది, రెండవది సిడ్నీ సిక్సర్‌ల తరఫున సి.ఎక్స్ కాఫ్స్ ఇంటర్నేషనల్ స్టేడియంలో అడిలైడ్ స్ట్రైకర్స్‌పై 56 బంతుల్లో 101 పరుగులు చేయడం, 2022–23 బిగ్ బాష్ లీగ్ సీజన్‌లో SCGలో సిడ్నీ సిక్సర్స్ కోసం సిడ్నీ థండర్‌తో మ్యాచ్‌లో మూడోది.

[66][67][68]

This is the current graphical representation of the test cricket record of Steve Smith. Individual innings are represented by the blue and red (not out) bars; the black line is his career batting average. (as of 15 January 2021)
ఇది స్టీవ్ స్మిత్ టెస్టు క్రికెట్ రికార్డు. నీలం, ఎరుపు (నాటౌట్) బార్‌లు ఒక్కో ఇన్నింగ్సును సూచిస్తాయి. నలుపు గీత అతని కెరీర్ బ్యాటింగు సగటు. (2021 జనవరి 15 నాటికి) [69]

రికార్డులు, విజయాలు

[మార్చు]
  • అంతర్జాతీయ క్రికెట్లో 10,000 పరుగులు సాధించిన వేగవంతమైన ఆస్ట్రేలియా బ్యాటరు. ప్రపంచంలోనే ఆరవ వేగవంతమైన బ్యాటరు.[70][71]
  • టెస్టుల్లో 7000, 8000 పరుగులు సాధించిన అత్యంత వేగవంతమైన బ్యాటరు.[72][73][74]
  • ఉమ్మడిగా టెస్టుల్లో రెండవ వేగవంతమైన 6,000 పరుగులు సాధించిన అతి పిన్న వయస్కుడైన ఆస్ట్రేలియా బ్యాటరు (డాన్ బ్రాడ్మన్ తరువాత). మొత్తం మీద నాల్గవ అతి పిన్న వయస్కుడు.[75][76][77]
  • వరుసగా నాలుగు క్యాలెండర్ సంవత్సరాలలో టెస్టు క్రికెట్లో 1,000 కంటే ఎక్కువ పరుగులు చేసిన రెండవ బ్యాటరు మాత్రమే.[78][79]
  • టెస్టు చరిత్రలో ఒకే ప్రత్యర్థిపై వరుసగా 10 సార్లు 50 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన మొదటి బ్యాటరు.[80]
  • డాన్ బ్రాడ్మన్ 961 బ్యాటింగ్ రేటింగ్ తర్వాత రెండవ అత్యధిక టెస్టు బ్యాటింగ్ రేటింగు (947) కలిగిన బ్యాటరు. 2017 డిసెంబరు 30న ఇది సాధించాడు.[81]
  • ఐసీసీ టెస్టు ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ఒకటి కంటే ఎక్కువసార్లు గెలుచుకున్న ఏకైక ఆటగాడు.[82]
  • ఐసీసీ టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగుల్లో అగ్రస్థానంలో నిలిచిన రెండో అతి పిన్న వయస్కుడైన బ్యాటరు.[83]
  • 2015 క్రికెట్ ప్రపంచ కప్‌లో ఐదు సార్లు వరుసగా అత్యధిక 50+ స్కోర్లు.[84][85]
  • ఉమ్మడి అత్యధిక 50+ స్కోర్లు (క్రికెట్ ప్రపంచ కప్ నాకౌట్ మ్యాచ్లలో నాలుగు).[86]
  • 2018 ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికా పర్యటనలో అతను టెస్టు ఇన్నింగ్సులో వికెట్ కీపర్ కాని వ్యక్తిగా ఐదు క్యాచ్లు పట్టడం ద్వారా ప్రపంచ రికార్డును సమం చేశాడు. ఈ ఘనత సాధించిన 11వ ఫీల్డర్ అయ్యాడు.[87]
  • సర్ గార్ఫీల్డ్ సోబర్స్ ట్రోఫీ (ఐసిసి క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు) గెలుచుకున్న అతి పిన్న వయస్కుడైన ఆటగాడు.
  • డోనాల్డ్ బ్రాడ్మన్ తర్వాత అత్యంత వేగంగా 25 టెస్టు సెంచరీలు (119 ఇన్నింగ్సుల్లో) సాధించిన బ్యాటరుగా నిలిచాడు.[88][89]
  • ఒకటి కంటే ఎక్కువసార్లు అలన్ బోర్డర్ పతకాన్ని గెలుచుకున్న ఐదవ ఆటగాడు.[90]
  • నాలుగు సార్లు మెక్గిల్వ్రే పతకాన్ని గెలుచుకున్న మొదటి క్రికెటరు.[91]
  • 2010లో ఐసీసీ టెస్టు బ్యాటరుగా ఎంపికయ్యాడు.[92][93]
  • అంతర్జాతీయ క్రికెట్లో 14,000 పరుగులు సాధించిన అతి వేగవంతమైన ఆస్ట్రేలియా బ్యాటరు.[94]
  • సిడ్నీ సిక్సర్స్ తరఫున బిగ్ బాష్ లీగ్లో సెంచరీ సాధించిన తొలి ఆటగాడు. కాఫ్స్ హార్బర్లోని కాఫ్స్ ఇంటర్నేషనల్ స్టేడియంలో అడిలైడ్ స్ట్రైకర్స్తో జరిగిన మ్యాచ్లో స్మిత్ 56 బంతుల్లో 101 పరుగులు చేసి 59 పరుగుల తేడాతో విజయం సాధించాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా కూడా ఎంపికయ్యాడు.[95]
  • మాజీ కెప్టెన్లు రికీ పాంటింగ్, మైఖేల్ క్లార్క్‌లతో పాటు నాలుగుసార్లు అలన్ బోర్డర్ పతకాన్ని గెలుచుకున్న మూడవ ఆటగాడు.
  • టెస్టు క్రికెట్లో 32 సెంచరీలు సాధించిన అతి తక్కువ ఇన్నింగ్స్ - 174 ఇన్నింగ్సుల్లో.[96]

పురస్కారాలు

[మార్చు]
  • సర్ గార్ఫీల్డ్ సోబర్స్ ట్రోఫీ (ఐసిసి క్రికెటర్ ఆఫ్ ది ఇయర్): 2015 [97]
  • ఐసిసి టెస్టు ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ : 2015, [97] 2017 [98]
  • ఐసిసి పురుషుల టెస్టు ప్లేయర్ ఆఫ్ ది డికేడ్ : 2011–2020 [99]
  • ఐసిసి పురుషుల టెస్టు టీమ్ ఆఫ్ ది డికేడ్ : 2011–2020 [100]
  • ఐసిసి టెస్టు టీమ్ ఆఫ్ ది ఇయర్ : 2015, 2016, 2017, [97] 2019
  • ఐసిసి వన్‌డే టీమ్ ఆఫ్ ది ఇయర్ : 2015 [97]
  • అలన్ బోర్డర్ మెడల్ : 2015, [101] 2018, [102] 2021, [103] [104] 2023 [105]
  • ఆస్ట్రేలియన్ టెస్టు ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ : 2015, 2018 [102]
  • ఆస్ట్రేలియన్ వన్ డే ఇంటర్నేషనల్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ : 2015, [101] 2021 [104]
  • కాంప్టన్-మిల్లర్ మెడల్ : 2017–18, [106] 2019 [107]
  • మెక్‌గిల్వ్రే పతకం : 2014, 2015, 2016, 2017
  • స్టీవ్ వా అవార్డు: 2009–10, 2011–12 [108]
  • విస్డెన్ క్రికెటర్స్ ఆఫ్ ది ఇయర్ : 2015 [109] [110]

జనాదరణ పొందిన సంస్కృతిలో

[మార్చు]

ది టెస్ట్ అనే 2020 నాటి ఆస్ట్రేలియన్ ఆంగ్ల భాషా TV డాక్యుమెంటరీని Amazon Prime వీడియో కోసం ఒరిజినల్‌గా రూపొందించారు. ఈ డాక్యుమెంటరీకి క్రికెట్ ఆస్ట్రేలియా సహ-నిర్మాత కూడా. ఈ డాక్యుమెంటరీ 2018 మార్చిలో కేప్ టౌన్‌లో జరిగిన బాల్ ట్యాంపరింగ్ కుంభకోణం, ఆ కుంభకోణం తర్వాత ఆస్ట్రేలియా తమ ఖ్యాతిని ఎలా పునర్నిర్మించుకుంది అనే దాని చుట్టూ తిరుగుతుంది. కుంభకోణం తర్వాత 2019 యాషెస్‌లో స్మిత్ విముక్తి, అతని ఆధిపత్య బ్యాటింగ్ ప్రదర్శన ఈ సిరీస్‌లోని కీలకాంశాలలో ఒకటి. [111] [112]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Barrett, Chris (15 December 2014). "Steve Smith pushes through shyness to become Australia's 45th Test captain". The Sydney Morning Herald (in ఇంగ్లీష్). Retrieved 18 December 2018.
  2. IANS (5 May 2020). "Sanju Samson reveals origin of Steve Smith's nickname". Hindustan Times (in ఇంగ్లీష్). Retrieved 22 June 2023.
  3. "Steve Smith". cricket.com.au. Cricket Australia. Retrieved 15 January 2014.
  4. "Test cricket's young Fab Four". ESPNcricinfo (in ఇంగ్లీష్). 29 August 2014. Retrieved 10 January 2019.
  5. Barrett, Chris (15 December 2014). "Steve Smith goes from teenage club sensation to Australian cricket captain". The Sydney Morning Herald. Retrieved 26 January 2015.
  6. Bull, Andy (9 May 2010). "Steve Smith spins from England's grasp to boost Australia's attack". The Guardian. Retrieved 24 March 2011.
  7. Hooper, James (11 January 2010). "Young leg-spin tyro Steven Smith sets his sights on Test cricket heights". Herald Sun. Retrieved 26 January 2015.
  8. 8.0 8.1 8.2 Brettig, Daniel (18 November 2013). "Learning on the job". Cricinfo Magazine. Retrieved 26 January 2015.
  9. "Steve Smith almost played cricket for England". news.com. 20 November 2017. Retrieved 29 April 2018.
  10. Webster, Andrew (16 December 2014). "How love turned Steve Smith from cricket tragic to Australian Test captain". The Sydney Morning Herald. Retrieved 26 January 2015.
  11. "Australian cricket captain Steve Smith announces engagement to Dani Willis". news.com.au. News Corp Australia. 29 June 2017.
  12. "Smith, Willis marry in Southern Highlands". cricket.com.au. Cricket Australia. 16 September 2018.
  13. https://www.dailytelegraph.com.au/sport/nrl/teams/roosters/steve-smith-and-david-warner-flying-nrl-flag-in-the-australian-cricket-team/news-story/5ff721555c2656b7fc17d9a25cc202e5
  14. 14.0 14.1 "Steven Smith". ESPNcricinfo. Retrieved 2 January 2018.
  15. "ICC World Twenty20, 2010 Cricket Team Records & Stats-most wickets". ESPNcricinfo. Retrieved 13 June 2019.
  16. "Scorecard: 1st Test: Australia v. Pakistan at Lord's, 13–16 July 2010". ESPNcricinfo. Retrieved 13 January 2015.
  17. "Scorecard: 2nd Test: Australia v. Pakistan at Headingley, 21–24 July 2010". ESPNcricinfo. Retrieved 13 January 2015.
  18. "Super leg-spinner catches the eye". The Daily Telegraph. Sydney. 24 February 2010. Retrieved 9 August 2013.
  19. "Steven Smith's lucky break". ESPNcricinfo. 14 March 2013. Retrieved 29 March 2018.
  20. Marks, Vic (26 March 2015). "Steve Smith century helps Australia crush India to reach World Cup final". The Guardian. Retrieved 26 December 2016.
  21. Lynch, Steven (30 April 2016). "Australia v New Zealand". Wisden Cricketers' Almanack. Retrieved 26 December 2016 – via ESPNcricinfo.
  22. "ICC Cricket World Cup, 2014/15 Most runs". ESPNcricinfo. Retrieved 3 March 2019.
  23. Bilton, Dean (30 March 2015). "World Cup team of the tournament revealed". ABC News (in ఆస్ట్రేలియన్ ఇంగ్లీష్). Retrieved 17 July 2019.
  24. "NZ 5, Australia 4 in our World Cup team". ESPNcricinfo (in ఇంగ్లీష్). 30 March 2015. Retrieved 18 July 2019.
  25. "ICC Cricket World Cup 2015: Cricbuzz team of the tournament". Cricbuzz (in ఇంగ్లీష్). 31 March 2015. Retrieved 18 July 2019.
  26. "List of Test Captains". ESPNcricinfo. Retrieved 11 December 2022.
  27. "List of ODI Captains". ESPNcricinfo. Retrieved 28 January 2018.
  28. "List of Twenty20 Captains". ESPNcricinfo. Retrieved 2 September 2015.
  29. "Smith named as Australia's new cricket captain". Al Jazeera. Reuters. 15 August 2015. Retrieved 15 August 2016.
  30. "Steven Smith appointed Australia's next Test captain, David Warner his deputy" (Press release). Cricket Australia. 14 August 2015. Archived from the original on 5 September 2015. Retrieved 20 September 2015.
  31. "Jhye Richardson in for SA Tests, no room for Maxwell, Sayers". ESPNcricinfo. Retrieved 26 March 2018.
  32. "1st Test, Australia tour of South Africa at Durban, Mar 1–5 2018 | Match Summary | ESPNCricinfo". ESPNcricinfo. Retrieved 26 March 2018.
  33. "Australia, South Africa point finger at the other over stairwell incident". ESPNcricinfo. Retrieved 26 March 2018.
  34. "2nd Test, Australia tour of South Africa at Port Elizabeth, Mar 9–12 2018 | Match Summary | ESPNCricinfo". ESPNcricinfo. Retrieved 26 March 2018.
  35. Moonda, Firdose (12 March 2018). "Rabada handed two-Test suspension". ESPNcricinfo.
  36. Collins, Adam (21 March 2018). "'Pretty interesting': Steve Smith hits out at Kagiso Rabada appeal process". The Guardian. Retrieved 26 March 2018.
  37. "3rd Test, Australia tour of South Africa at Cape Town, Mar 22–25 2018 | Match Summary | ESPNCricinfo". ESPNcricinfo. Retrieved 26 March 2018.
  38. "Desperation drove Australia to cheat – Smith". ESPNcricinfo. 24 March 2018. Retrieved 26 March 2018.
  39. "This is Australia's moment of truth". ESPNcricinfo. Retrieved 26 March 2018.
  40. "Cameron Bancroft: Australia player admits to ball-tampering, Steve Smith knew in advance". BBC Sport. 24 March 2018. Retrieved 27 March 2018.
  41. "CA slaps bans on tampering trio". cricket.com.au (in ఇంగ్లీష్). Retrieved 16 July 2019.
  42. "Emotional Smith breaks down in press conference". cricket.com.au (in ఇంగ్లీష్). Retrieved 16 July 2019.
  43. "'I'm absolutely gutted': Distraught Smith apologises for ball-tampering scandal". abc.net.au. 29 March 2018.
  44. "Tearful Steve Smith Takes Responsibility & Says: I Hope I Can Earn Forgiveness". wisden.com8. 29 March 2018.
  45. BT Sport (3 January 2018), What makes Steve Smith special? Fascinating must-watch chat with Boycott and Hussey, archived from the original on 29 ఆగస్టు 2020, retrieved 5 January 2018{{citation}}: CS1 maint: bot: original URL status unknown (link)
  46. 46.0 46.1 46.2 Chopra, Aakash (4 January 2015). "What can India do against Steven Smith?". Cricinfo Magazine.
  47. Swanton, Will (22 January 2010). "Time to limit the amount of one-dayers and give Twenty20 more of a bash". The Sydney Morning Herald. Retrieved 9 August 2013.
  48. "Steve Smith: Why Australia's batting hero is more than just a cricket obsessive". BBC Sport. 11 August 2019. Retrieved 25 August 2019.
  49. "Smith takes us through his technique". cricket.com.au. 7 January 2017. Retrieved 3 January 2018.
  50. "Steven Smith batting bowling stats". cricinfo. Archived from the original on 31 July 2023. Retrieved 31 July 2023.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  51. Dec 17, Gaurav Joshi •; Ist, Gaurav Joshi • (17 December 2017). "Decoding Steve Smith's unique technique that has befuddled cricketing world - Firstcricket News, Firstpost". Firstpost. Retrieved 16 July 2019.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  52. "The transformation of Steven Smith". ESPNcricinfo (in ఇంగ్లీష్). 29 June 2015. Retrieved 16 July 2019.
  53. Kimber, Jarrod (19 December 2014). "The evolution of Steven Smith". ESPNcricinfo.
  54. BT Sport (18 December 2017), "I hope Ben Stokes is hurting" | Must watch England debate following Ashes humiliation, retrieved 19 December 2017
  55. "You talk, Steven Smith bats". ESPNcricinfo (in ఇంగ్లీష్). 31 May 2019. Retrieved 1 June 2019.
  56. "Smith confirms batting order reshuffle". cricket.com.au. Retrieved 18 November 2015.
  57. Mallett, Ashley (3 September 2013). "A modern-day Benaud?". ESPNcricinfo. Archived from the original on 20 June 2017. Retrieved 5 January 2017.
  58. Warne, Shane (14 July 2010). "Shane Warne: Australian leg-spinner Steve Smith has chance to show he has the X-factor". www.telegraph.co.uk. Retrieved 16 July 2019.
  59. "Smith laughs off 'grumpy' tag". ESPNcricinfo. 12 November 2015. Retrieved 13 November 2015.
  60. "Smith's strong advice for axed Maxwell". cricket.com.au. Retrieved 4 January 2018.
  61. "Steve Smith slammed for 'picking his bloody mates'". NewsComAu. Retrieved 4 January 2018.
  62. Bull, Andy (8 May 2010). "Steve Smith spins from England's grasp to boost Australia's attack". The Guardian. Retrieved 16 July 2019.
  63. "AUS 561/6 (156.5 ov, TD Paine 1*, MA Starc 1*, JM Anderson 2/92) – Live | Match Summary | ESPNcricinfo". ESPNcricinfo. Retrieved 17 December 2017.
  64. "New Zealand tour of Australia, 1st ODI: Australia v NZ at Sydney, Dec 4, 2016". ESPNcricinfo. 4 December 2016. Retrieved 4 December 2016.
  65. "Australia tour of England and Ireland, 2015 – England v Australia Scorecard". ESPNcricinfo. 31 August 2015. Retrieved 31 August 2015.
  66. Marcuson, Jamie (30 April 2016). "Steve Smith scores maiden Twenty20 ton". The Sydney Morning Herald (in ఇంగ్లీష్). Retrieved 16 July 2019.
  67. "Indian Premier League: Rising Pune Supergiants v Gujarat Lions at Pune, Apr 29, 2016". ESPNcricinfo. 29 April 2016. Retrieved 30 April 2016.
  68. "Steve Smith 10 year return after results in a century". Live Cricket. 17 January 2023. Retrieved 17 January 2023.
  69. "HowSTAT! Test Cricket - Steve Smith - Batting Graph". www.howstat.com. Retrieved 2021-06-25.
  70. "Steve Smith joins Virat Kohli, Joe Root on reaching 10000 international runs milestone". timesnownews.com. Retrieved 28 March 2018.
  71. "Stats: Fastest players to complete 10000 runs in International cricket". 3 March 2018. Archived from the original on 4 March 2018. Retrieved 28 March 2018.
  72. "Fastest to 7000 runs in Test cricket". ESPNcricinfo. Retrieved 30 November 2019.
  73. "Super Smith smashes 73-year-old record". cricket.com.au (in ఇంగ్లీష్). Retrieved 30 November 2019.
  74. "Fastest to 8000 Test runs". ESPNcricinfo. Retrieved 24 March 2022.
  75. "Records – Test matches – Batting records – Fastest to 6000 runs – ESPNcricinfo". Retrieved 28 March 2018.
  76. "Stats: Youngest cricketer to score 6000 Test runs – CricTracker". crictracker.com. 5 January 2018. Archived from the original on 6 మార్చి 2018. Retrieved 28 March 2018.
  77. "Smith soars to equal Sobers landmark". cricket.com.au (in ఇంగ్లీష్). Retrieved 16 July 2019.
  78. "Hayden's grand record within Smith's reach – cricket.com.au". www.cricket.com.au.
  79. "Steven Smith's glorious four-year run". ESPNcricinfo (in ఇంగ్లీష్). 16 December 2017. Retrieved 16 July 2019.
  80. "Smith's lowest score this series earns another record". cricket.com.au (in ఇంగ్లీష్). Retrieved 2 October 2019.
  81. "Reliance ICC Best-Ever Test Championship Rating". Reliance ICC Rankings. Retrieved 8 August 2015.
  82. "List of winners". www.icc-cricket.com (in ఇంగ్లీష్). Archived from the original on 2 జూన్ 2021. Retrieved 9 March 2019.
  83. "Steven Smith becomes second youngest player to top batting charts". www.icc-cricket.com (in ఇంగ్లీష్). Retrieved 9 March 2019.
  84. "Steve Smith World Cup match list". ESPNcricinfo. Retrieved 30 March 2015.
  85. "Virat Kohli Joins Steve Smith In Elite World Cup Club". sports.ndtv.com (in ఇంగ్లీష్). Retrieved 6 July 2019.
  86. "Steve Smith equals Sachin Tendulkar's record in World Cup knockouts". India Today (in ఇంగ్లీష్). Retrieved 13 July 2019.
  87. "Steve Smith joins elite club for taking 5 test catches in a single test innings". CricketAustralia. Retrieved 23 March 2018.
  88. "Steve Smith becomes second-fastest batsman to register 25 Test centuries". Business Standard India. Retrieved 2021-03-23.
  89. "Steve Smith second-fastest to 25 Test tons, beats Kohli". Deccan Herald (in ఇంగ్లీష్). 2019-08-04. Retrieved 2021-03-23.
  90. "Australia captain Smith wins second Allan Border medal". Reuters. 12 February 2018.
  91. "Steve Smith wins fourth-straight McGilvray Medal". ABC News Sport (in ఆస్ట్రేలియన్ ఇంగ్లీష్). 6 January 2018. Retrieved 16 July 2019.
  92. "Steve Smith 'humbled to be named Test player of the decade': Can't wait to see what next decade has in store". India Today (in ఇంగ్లీష్). Retrieved 2021-03-22.
  93. "ICC names Steve Smith as Men's Test Cricketer of the Decade, Rashid Khan wins T20I's player of the decade award". Hindustan Times (in ఇంగ్లీష్). 2020-12-28. Retrieved 2021-03-22.
  94. "Steve Smith Completes 14000 Runs in International Cricket, Becomes Fastest Australian To Achieve The Landmark". ProBatsman. 20 November 2022. Retrieved 20 November 2022.
  95. "Steve Smith first player for the Sydney Sixers to score a century, in there 59 run win against the Adelaide Strikers". Live Cricket. 17 January 2023. Retrieved 17 January 2023.
  96. "Smith equals Waugh with latest chapter in Lord's story". cricket.com.au (in ఇంగ్లీష్). Retrieved 2023-06-29.
  97. 97.0 97.1 97.2 97.3 "Steven Smith claims top ICC awards". ESPNcricinfo. 23 December 2015. Retrieved 28 December 2015.
  98. "Steve Smith named world's premier Test player". www.icc-cricket.com (in ఇంగ్లీష్). Retrieved 4 January 2019.
  99. "Steve Smith named ICC Men's Test Player of the Decade". www.icc-cricket.com (in ఇంగ్లీష్). Retrieved 28 December 2020.
  100. "ICC Men's Test Team of the Decade". www.icc-cricket.com (in ఇంగ్లీష్). Retrieved 28 December 2020.
  101. 101.0 101.1 "Smith collects first Allan Border Medal". cricket.com.au (in ఇంగ్లీష్). Retrieved 31 December 2018.
  102. 102.0 102.1 "Smith, Warner win big on Allan Border medal night". ESPNcricinfo. 12 February 2018. Retrieved 9 July 2018.
  103. "Super Steve Smith claims third Allan Border Medal". cricket.com.au (in ఇంగ్లీష్). Retrieved 6 February 2021.
  104. 104.0 104.1 "Smith and Mooney crowned Australia's players of the year". www.icc-cricket.com (in ఇంగ్లీష్). Retrieved 6 February 2021.
  105. "All the winners from the Australian Cricket Awards". cricket.com.au (in ఇంగ్లీష్). Retrieved 2023-01-30.
  106. "Smith wins Compton-Miller Medal". cricket.com.au (in ఇంగ్లీష్). Retrieved 31 December 2018.
  107. "Australia lift Ashes after drawn series". cricket.com.au (in ఇంగ్లీష్). Retrieved 15 September 2019.
  108. "Awards – Cricket NSW". cricketnsw.com.au. Archived from the original on 19 మార్చి 2018. Retrieved 28 March 2018.
  109. Brettig, Daniel (4 May 2016). "Steven Smith – Wisden Cricketers of the Year 2015". ESPNcricinfo. Archived from the original on 7 August 2017. Retrieved 30 December 2017.
  110. Martin, Ali (13 April 2016). "Wisden 2016: Stokes, Bairstow, Smith, McCullum and Williamson are players of the year". The Guardian. London. Archived from the original on 7 August 2017. Retrieved 30 December 2017.
  111. "From ball tampering to Ashes success - what's in Amazon's Aussie documentary". BBC Sport (in బ్రిటిష్ ఇంగ్లీష్). Retrieved 2021-03-22.
  112. Mohanarangan, Vinayakk (22 March 2020). "From ball-tampering low to Ashes high, Steve Smith's redemption story is highlight of 'The Test'". Scroll.in (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-03-22.