మిచెల్ స్టార్క్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మిచెల్ స్టార్క్
2021 లో స్టార్క్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
మిచెల్, ఆరన్ స్టార్క్
పుట్టిన తేదీ (1990-01-30) 1990 జనవరి 30 (వయసు 34)
బాల్ఖాం హిల్స్, న్యూ సౌత్ వేల్స్, ఆస్ట్రేలియా
ఎత్తు1.97[1] మీ. (6 అ. 6 అం.)
బ్యాటింగుఎడమచేతి వాటం
బౌలింగుఎడమచేతి ఫాస్ట్
పాత్రబౌలరు
బంధువులుAlyssa Healy (wife)[2]
Brandon Starc (brother)
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 425)2011 డిసెంబరు 1 - న్యూజీలాండ్ తో
చివరి టెస్టు2023 జూలై 28 - ఇంగ్లాండ్ తో
తొలి వన్‌డే (క్యాప్ 185)2010 అక్టోబరు 20 - ఇండియా తో
చివరి వన్‌డే2023 మార్చి 22 - ఇండియా తో
వన్‌డేల్లో చొక్కా సంఖ్య.56
తొలి T20I (క్యాప్ 59)2012 సెప్టెంబరు 7 - పాకిస్తాన్ తో
చివరి T20I2022 అక్టోబరు 31 - ఐర్లాండ్ తో
T20Iల్లో చొక్కా సంఖ్య.56
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2008/09–presentన్యూ సౌత్ వేల్స్
2011/12–2014/15Sydney Sixers
2012యార్క్‌షైర్
2014–2015రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు T20I FC
మ్యాచ్‌లు 82 110 58 133
చేసిన పరుగులు 1,980 483 94 2,852
బ్యాటింగు సగటు 21.52 12.38 9.40 22.28
100లు/50లు 0/10 0/1 0/0 0/13
అత్యుత్తమ స్కోరు 99 52* 14 99
వేసిన బంతులు 16,242 5,676 1,314 24,544
వికెట్లు 333 219 73 509
బౌలింగు సగటు 27.60 22.09 22.91 26.89
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 14 9 0 21
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 2 0 0 4
అత్యుత్తమ బౌలింగు 6/50 6/28 4/20 8/73
క్యాచ్‌లు/స్టంపింగులు 35/– 38/– 15/– 63/–
మూలం: ESPNcricinfo, 2023 జూలై 3

మిచెల్ ఆరోన్ స్టార్క్ (జననం 1990 జనవరి 30) ఆస్ట్రేలియా అంతర్జాతీయ క్రికెటరు. అతను ఆస్ట్రేలియన్ జాతీయ జట్టు దేశీయ క్రికెట్‌లో న్యూ సౌత్ వేల్స్ జట్టుకూ ఆడుతున్నాడు. ఎడమచేతి ఫాస్టు బౌలరు, దిగువ వరుసలో ఆడే ఎడమచేతి వాటం బ్యాటరు. స్టార్క్ అంతర్జాతీయ క్రికెట్‌లోని మూడు ప్రధాన ఫార్మాట్‌లలోనూ ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహిస్తాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అతను ఆల్ టైమ్ అత్యుత్తమ బౌలర్‌లలో ఒకరిగా పరిగణించబడ్డాడు. 2015 లో వన్డే క్రికెట్‌లో అత్యధిక రేటింగు పొందిన బౌలరతను.

2010 లో స్టార్క్ అంతర్జాతీయ క్రికెట్ ఆడటం ప్రారంభించాడు. కానీ అతని కెరీర్ ప్రారంభంలో నిరంతర గాయాల కారణంగా ఆటంకం ఏర్పడింది. అతను 2015 క్రికెట్ ప్రపంచ కప్‌ను గెలుచుకున్న ఆస్ట్రేలియన్ జట్టులో ప్రముఖ సభ్యుడిగా ప్రపంచవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించాడు. మ్యాచ్‌లన్నిటి లోనూ స్థిరమైన ప్రదర్శనల ఫలితంగా అతను ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా ఎంపికయ్యాడు. వన్‌డే క్రికెట్ చరిత్రలో స్టార్క్, అత్యంత వేగంగా 200 వికెట్లు సాధించిన బౌలరు. ఆ మైలురాయిని చేరుకోవడానికి 102 మ్యాచ్‌లు తీసుకున్నాడు. స్టార్క్ 2021 ICC T20 ప్రపంచ కప్, 2023 ICC వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టులో సభ్యుడు కూడా.

స్టార్క్ 160.4 కిమీ/గం వేగంతో బౌలింగ్ చేసినందుకు (టెస్టు మ్యాచ్‌లో ఇప్పటివరకు నమోదైన అత్యంత వేగవంతమైనది), రివర్స్ స్వింగ్‌ వేసినందుకూ ప్రసిద్ధి చెందాడు. 2022 డిసెంబరు నాటికి, అతను టెస్టు క్రికెట్‌లో ఆస్ట్రేలియా తరపున అత్యధిక వికెట్లు తీసిన 7వ బౌలరు.[3]

ప్రారంభ అంతర్జాతీయ కెరీర్

[మార్చు]

2010 శీతాకాలంలో అతని ఆకట్టుకునే ప్రదర్శనల కారణంగా, స్టార్క్ 2010 చివరలో ఆస్ట్రేలియా యొక్క భారత పర్యటనలో గాయపడిన జోష్ హేజిల్‌వుడ్ స్థానంలో చివరి నిమిషంలో ఎంపికయ్యాడు.[4] ఈ పర్యటనలో స్టార్క్ తన అంతర్జాతీయ రంగప్రవేశం చేసాడు. 2010 అక్టోబరు 20న భారత్‌తో జరిగిన వన్డే ఇంటర్నేషనల్ (వన్‌డే)లో ఆడాడు. అతను బ్యాటింగ్ చేయలేదు, వికెట్లు కూడా పడలేదు.[5] వేసవిలో, ఆస్ట్రేలియా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో శ్రీలంకతో జరిగిన చివరి మ్యాచ్‌లో తన రెండవ వన్‌డే ఆడాడు. శ్రీలంక అప్పటికే మొదటి రెండు మ్యాచ్‌లు గెలిచి సిరీస్‌ను గెలుచుకుంది. ఆస్ట్రేలియాలో అది వారి మొట్టమొదటి సిరీస్ విజయం. శ్రీలంక ఇన్నింగ్స్‌లో స్టార్క్, సహచర ఫాస్టు బౌలర్ క్లింట్ మెక్‌కే కలిసి తొమ్మిది వికెట్లు పడగొట్టి ఆస్ట్రేలియాకు ఎనిమిది వికెట్ల విజయాన్ని అందించారు. ఈ విజయంతో ఆస్ట్రేలియా ఏడు మ్యాచ్‌ల వరుస ఓటములకు తెరపడింది.[6][7] 2010-11 యాషెస్ సిరీస్‌కు ముందు, ఇంగ్లాండ్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా A తరపున ఆడేందుకు స్టార్క్ ఎంపికయ్యాడు. మ్యాచ్‌కు ముందు వారం న్యూ సౌత్ వేల్స్ కోసం షెఫీల్డ్ షీల్డ్ మ్యాచ్ సందర్భంగా, స్టార్క్ సైడ్ స్ట్రెయిన్ గాయంతో నాలుగు వారాల పాటు తప్పుకున్నాడు. ఫలితంగా, అతను ఆస్ట్రేలియా A మ్యాచ్‌కు దూరమయ్యాడు. యాషెస్‌లో ఎంపిక కోసం పరిగణించబడలేదు.[8][9] 2011 శీతాకాలంలో జింబాబ్వేలో జరిగే ట్రై-సిరీస్‌లో ఆస్ట్రేలియా A తరపున ఆడేందుకు మళ్లీ ఎంపికయ్యాడు.[10]

స్టార్క్ 2011/12 సీజన్‌లో టెస్టు క్రికెట్ రంగప్రవేశం కోసం పోటీలో పడ్డాడు. అతను నవంబరులో క్వీన్స్‌లాండ్‌పై రెండు ఐదు వికెట్లు సాధించాడు: మొదట షెఫీల్డ్ షీల్డ్ మ్యాచ్‌లో, తర్వాత వన్డే మ్యాచ్‌లో. న్యూ సౌత్ వేల్స్ రెండు మ్యాచ్‌లలో ఓడిపోయినప్పటికీ, స్టార్క్ తన బౌలింగ్ ప్రదర్శన, న్యూ సౌత్ వేల్స్ బ్యాటింగ్ ఇన్నింగ్స్‌లో ఆలస్యంగా కొట్టిన బలమైన హిట్ -ఈ రెండింటి కారణంగా వన్డే మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.[11][12] అతను మరోసారి ఆస్ట్రేలియా A తరపున, ఈసారి నవంబరు చివరిలో న్యూజిలాండ్‌తో జరిగే వార్మప్ మ్యాచ్‌లో ఆడేందుకు ఎంపికయ్యాడు.[13] ఈ మ్యాచ్ సమయంలో గాయపడిన ర్యాన్ హారిస్ స్థానంలో న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి టెస్టు మ్యాచ్‌కు ఆస్ట్రేలియా జట్టులోకి అతన్ని తీసుకున్నారు. అతని టెస్టు రంగప్రవేశానికి రంగం సిద్ధమైంది.[14]

స్టార్క్ 2011 డిసెంబరు 1న న్యూజిలాండ్‌తో జరిగిన రెండు-టెస్టుల సిరీస్‌లో మొదటి టెస్ట్‌లో తన తొలి టెస్టు మ్యాచ్ ఆడాడు. అతను ఆ మ్యాచ్‌లో రెండు వికెట్లు తీసుకున్నాడు.[15] రెండవ టెస్ట్‌లో మరో రెండు వికెట్లు తీశాడు,[16] కానీ అతను, భారత్‌తో జరిగిన తదుపరి సిరీస్‌లో మొదటి టెస్ట్‌కి ఎంపిక చేసిన జట్టులో లేడు. 2012 న్యూ ఇయర్స్ టెస్టు కోసం జట్టు నుండి పూర్తిగా తొలగించబడ్డాడు.[17] జట్టులో లేనప్పుడు అతను బిగ్ బాష్ లీగ్‌లో సిడ్నీ సిక్సర్స్ తరపున ఆడి, సిడ్నీ థండర్‌పై మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ప్రదర్శనలో మూడు వికెట్లు తీసుకున్నాడు.[18] పాదాల గాయం కారణంగా జేమ్స్ ప్యాటిన్సన్ తొలగించబడినప్పుడు స్టార్క్, ఆస్ట్రేలియా యొక్క టెస్టు జట్టులోకి తిరిగి వచ్చాడు.[19] స్పిన్నర్ నాథన్ లియోన్ స్థానంలో పేస్‌కు అనుకూలంగా ఉండే WACA గ్రౌండ్‌లో మూడవ టెస్ట్‌లో ఆడాడు. అతను కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్‌కు స్వింగ్‌తో బౌలింగ్‌లో రాణించాడు. అతని నాలుగు వికెట్లలో అతను సచిన్ టెండూల్కర్‌ను లెగ్-బిఫోర్-వికెట్‌లో అవుట్ చేశాడు.[20][21] లియోన్ తిరిగి రావడంతో సిరీస్‌లోని చివరి టెస్టు మ్యాచ్‌లో జట్టు నుండి తప్పించారు.[22][23] ఆస్ట్రేలియా వన్‌డే జట్టు నుండి కూడా తొలగించారు. ఈ సీజన్‌లో న్యూ సౌత్ వేల్స్ తరపున దేశవాళీ క్రికెట్ ఆడేందుకు అతనికి స్వేచ్ఛ లభించింది.[24][25]

2018 జనవరిలో, స్టార్క్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ కొనుగోలు చేసింది.[26][27] కానీ అతను జట్టు కోసం ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. గాయం కారణంగా 2018 ఇండియన్ ప్రీమియర్ లీగ్ నుండి తొలగించబడ్డాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో అతని కుడి కాలులో అంతర్ఘంఘికాస్థ ఎముక ఒత్తిడికి గురైంది.[28] 2019 ఇండియన్ ప్రీమియర్ లీగ్ అవగానే ప్రపంచ కప్‌ జరగనున్నందున ఆటగాళ్లకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వకూడదని క్రికెట్ ఆస్ట్రేలియా నిర్ణయించింది. దీని అర్థం ప్రపంచ కప్‌లో ఆడటానికి ఎంపికైన ఆటగాళ్లు ఎవరైనా ప్రీ-టోర్నమెంట్ క్యాంప్‌లో చేరడానికి IPL నుండి ముందుగానే నిష్క్రమించాలి.[29] 2018 నవంబరులో, కోల్‌కతా తన కాంట్రాక్ట్ నుండి స్టార్క్‌ను విడుదల చేసి, ప్రపంచ కప్ కోసం సన్నద్ధమయ్యే సమయాన్ని వెచ్చించడానికి అతనికి స్వేచ్ఛనిచ్చింది.[30] ఐపీఎల్ సీజన్ మొత్తానికి స్టార్క్‌ను అందుబాటులో ఉంచేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా నిరాకరించడంతో కోల్‌కతా ఈ నిర్ణయం తీసుకుంది.[29] స్టార్క్ తన కాంట్రాక్ట్ కోసం బీమా తీసుకున్నాడు, ఇది గాయం కారణంగా 2018 సీజన్‌ను కోల్పోయినందున అతనికి 1.53 మిలియన్ల ఆస్ట్రేలియా డాలర్లు వచ్చి ఉండేది. కానీ బీమా సంస్థ, అందుకు అతను అనర్హుడని ప్రకటించి, చెల్లించడానికి నిరాకరించింది. 2019లో స్టార్క్ తన నష్టాలను పూడ్చుకోవడానికి బీమా కంపెనీపై చట్టపరమైన చర్య తీసుకున్నాడు.[31]

న్యూజిలాండ్‌తో ఓడిపోయిన తర్వాత, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక, స్కాట్‌లాండ్‌లతో జరిగిన మిగిలిన గ్రూప్ మ్యాచ్‌లలో ఆస్ట్రేలియా విజయం సాధించింది. స్కాట్లాండ్‌కు వ్యతిరేకంగా, స్టార్క్ కేవలం ఐదు ఓవర్ల బౌలింగ్‌లో 14 పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీశాడు. ఇన్నింగ్స్‌లోని మొదటి ఏడు ఓవర్లలో స్కాట్లాండ్ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌లిద్దరినీ అవుట్ చేయడంతో సహా.[32] న్యూజిలాండ్‌తో జరిగిన ప్రపంచ కప్‌లో ఆస్ట్రేలియా ఫైనల్‌కు చేరుకుంది. ఈసారి న్యూజిలాండ్ మొదట బ్యాటింగ్ చేయగా, స్టార్క్ ఆస్ట్రేలియాకు బౌలింగ్ ప్రారంభించాడు. మ్యాచ్ మూడో బంతికి స్టార్క్ బ్రెండన్ మెకల్లమ్‌ను బౌల్డ్ చేశాడు. ఈ వికెట్ న్యూజిలాండ్‌ను మొదటి నుండి డిఫెన్స్‌లో పడేసింది. ఆ తరువాత ఆ ఇన్నింగ్సులో న్యూజీలాండ్ మళ్ళీ కోలుకోలేదు.[33] స్టార్క్ 22 వికెట్లతో 10.18 బౌలింగ్ సగటుతో టోర్నమెంట్‌ను ముగించాడు. అతని బౌలింగ్ స్ట్రైక్-రేట్ ప్రతి వికెట్‌కు 17.4 బంతులు. ప్రారంభ 1975 క్రికెట్ ప్రపంచ కప్ నుండి ప్రపంచ కప్‌లో ఏ బౌలర్‌కైనా ఇది అత్యుత్తమం.[34][35] స్టార్క్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా ఎంపికయ్యాడు.[36] అతను ప్రపంచంలోనే అగ్రశ్రేణి వన్‌డే బౌలర్‌గా ఆ టోర్నమెంట్‌ను ముగించాడు.[37]

ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో జరిగిన 2015 క్రికెట్ ప్రపంచ కప్‌లో స్టార్క్ ఆస్ట్రేలియా విజేత జట్టులో భాగంగా ఉన్నాడు. అతను మొదటి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై రెండు వికెట్లు తీశాడు.[38] అయితే బంగ్లాదేశ్‌తో ఆస్ట్రేలియా రెండవ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది.[39] ఆస్ట్రేలియా మూడో మ్యాచ్ సహ-ఆతిథ్య న్యూజిలాండ్‌తో ఆడింది. ఆస్ట్రేలియా మొదట బ్యాటింగ్ చేసి 151 పరుగులు మాత్రమే చేసింది, ఈ లక్ష్యాన్ని వారు రక్షించుకోలేకపోయారు.[40] స్టార్క్ ప్రారంభంలో స్వింగ్‌తో బాగా బౌలింగ్ చేసాడు, కానీ 6 ఓవర్లు బౌలింగ్ చేసిన తర్వాత అతన్ని బౌలింగ్ అటాక్ నుండి తీసేసారు.[41] స్టార్క్ తన మిగిలిన ఓవర్లు బౌలింగ్ చేయడానికి తరువాత తిరిగి వచ్చాడు. న్యూజిలాండ్ 7 వికెట్లకు 145 పరుగుల వద్ద ఉండగా, విజయానికి ఇంకా 7 పరుగులు చేయాల్సి ఉండగా, అతను తనకు కేటాయించిన 10 ఓవర్లలో చివరిదైన 23వ ఓవర్ బౌల్ చేశాడు. స్టార్క్ వేసిన ఓవర్ ప్రారంభంలో స్ట్రైక్‌లో ఉన్న కేన్ విలియమ్సన్ రెండో బంతికి సింగిల్ తీశాడు. స్టార్క్ తర్వాతి బంతిని యార్కర్‌గా వేసి ఆడమ్ మిల్నేను బౌల్డ్ చేశాడు. అతని తర్వాతి డెలివరీ మరో యార్కర్, ఇది టిమ్ సౌథీని అవుట్ చేసి స్టార్క్‌ను హ్యాట్రిక్‌లో ఉంచింది. మ్యాచ్ గెలవడానికి ఆస్ట్రేలియాకు మరో వికెట్ అవసరం, కానీ న్యూజిలాండ్ ఆఖరి బ్యాట్స్‌మన్ ట్రెంట్ బౌల్ట్ స్టార్క్ వేసిన చివరి రెండు బంతులనుండి కాపాడుకున్నాడు. తర్వాతి ఓవర్‌లో విలియమ్సన్ న్యూజిలాండ్‌కు విజయవంతమైన పరుగులను అందించాడు.[42] స్టార్క్ 6 వికెట్లతో మ్యాచ్‌ను ముగించాడు, ఈ సీజన్‌లో అతను దీన్ని రెండోసారి సాధించాడు. అలా చేయడం ద్వారా, అతను అనేక సందర్భాల్లో వన్‌డేలో 6 వికెట్లు తీసిన మొదటి ఆస్ట్రేలియన్‌గా నిలిచాడు.[41]

2015 క్రికెట్ ప్రపంచ కప్

[మార్చు]


2019 క్రికెట్ ప్రపంచ కప్

[మార్చు]
2019 ప్రపంచ కప్ సందర్భంగా ట్రెంట్ బ్రిడ్జ్ వద్ద స్టార్క్.

ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా తొలి మ్యాచ్‌ వెస్టిండీస్‌తో జరిగింది. స్టార్క్ ఐదు వికెట్లు పడగొట్టాడు, ఆస్ట్రేలియా 15 పరుగుల విజయాన్ని సాధించింది.[43] అతని వికెట్లలో ఒకటి వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్ క్రిస్ గేల్‌ను వివాదాస్పదంగా ఔట్ చేయడం. స్టార్క్ బౌలింగ్‌లో ఒకే ఓవర్‌లో గేల్‌ను రెండుసార్లు ఔట్ అయ్యాడని అంపైర్ క్రిస్ గఫానీ తీర్పు ఇచ్చాడు - ఒకసారి కీపరు క్యాచ్, ఇంకోసారి లెగ్ బిఫోర్ వికెట్ (lbw). అయితే రెండు సందర్భాల్లోనూ గేల్ అంపైర్ నిర్ణయాన్ని డెసిషన్ రివ్యూ సిస్టమ్ (DRS)కి విజ్ఞప్తి చెయ్యడం, అది ఆ నిర్ణయాన్ని రద్దు చెయ్యడం జరిగాయి. తర్వాతి ఓవర్‌లో, స్టార్క్ బౌలింగ్‌లో గేల్‌ను ఎల్‌బిడబ్ల్యూ అవుట్‌గా గఫానీ మళ్లీ నిర్ధారించాడు. గేల్ మళ్లీ ఆ నిర్ణయాన్ని సమీక్షించమని కోరాడు. ఈసారి అంపైర్ నిర్ణయాన్ని DRS సమర్థించింది. తదుపరి రీప్లేల్లో, అంతకు ముందు వేసిన డెలివరీలో, స్టార్క్ ఓవర్‌స్టెప్పింగు చేసాడని కాబట్టి అది నోబాలనీ తేలింది. అంటే గేల్‌ ఔటైన బంతి ఫ్రీ హిట్ డెలివరీ అవుతుంది. అంటే, ఒకవేళ ఆ బంతిని నో బాల్ కాల్ చేసి ఉంటే, ఆ తర్వాత వచ్చిన బంతి ఫ్రీ హిట్‌గా మారి, గేల్‌ ఎల్బీడబ్ల్యూగా ఔట్ అయ్యేవాడు కాదు.[44] వెస్టిండీస్ కెప్టెన్ కార్లోస్ బ్రాత్‌వైట్ మ్యాచ్ ఫలితంలో అంపైరింగ్ పొరపాటూకు చాలా భాగం ఉందని భావించాడు, "క్రిస్‌ను 280 పరుగుల ఛేజింగ్‌లో కోల్పోవడంతో, మేం కోరుకున్న ఆరంభాన్ని పొందలేఖపోయం. బహుశా అతనొక్కడే 180 చెయ్యగలిగి ఉండేవాడు." [45] ఆట సమయంలో, అతను 77వ గేమ్‌లో 150 వికెట్లు తీసి, మ్యాచ్‌ల సంఖ్య పరంగా, వన్‌డేలలో అది సాధించిన అత్యంత వేగవంతమైన బౌలరయ్యాడు, (78 గేమ్‌లలో చేసిన సక్లైన్ ముస్తాక్ కంటే ఒక మ్యాచ్ వేగంగా).[46][47][48]

2019 జూన్ 29న, న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో, క్రికెట్ ప్రపంచ కప్‌లో మూడు సార్లు ఐదు వికెట్ల పంట తీసిన మొదటి బౌలర్‌గా స్టార్క్ నిలిచాడు.[49] అతను టోర్నమెంట్‌లో 27 వికెట్లు తీసుకున్నాడు. ఒకే ప్రపంచ కప్‌లో వ్యక్తిగతంగా అత్యధిక వికెట్లు తీసిన ఆల్-టైమ్ రికార్డు అది.[50]

ఇండియన్ ప్రీమియర్ లీగ్

[మార్చు]

అతని క్రికెట్ కెరీర్ మొత్తంలో, స్టార్క్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో బహుళ ఫ్రాంచైజీల కోసం ఆడటానికి సంతకం చేసాడు. అయితే గాయాలు, ఆస్ట్రేలియా జాతీయ జట్టుకు ఆడడం కారణంగా, అతను ఆడిన దానికంటే వదిలేసినవే ఎక్కువ. 2022 నాటికి, అతను ఆడిన ఏకైక ఫ్రాంచైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.

2014లో, స్టార్క్‌ను 2014 ఐపీఎల్‌లో ఆడేందుకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సంతకం చేసింది. కింగ్స్ XI పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో గ్లెన్ మాక్స్‌వెల్, వృద్ధిమాన్ సాహాలను అవుట్ చేయడానికి స్టార్క్ బౌండరీ దగ్గర రెండు డైవింగ్ క్యాచ్‌లు తీసుకున్నాడు. స్టార్క్ ఈ క్యాచ్‌లను పట్టుకోవడానికి చాలా మంది ఆస్ట్రేలియన్ క్రికెటర్లకు భిన్నమైన పద్ధతిని ఉపయోగించాడు, అతని వేళ్లను పైకి కాకుండా క్రిందికి చూపించేలా పెట్టాడు. స్టార్క్ దీని గురించి మాట్లాడుతూ, "ఆస్ట్రేలియాలో, చాలా మంది ఆటగాళ్ళు రివర్స్ కప్ పద్ధతిని ఇష్టపడతారు. ఇలాగైతే సరైన స్థితికి చేరుకోవడం సులభమని కూడా కొందరు చెబుతారు. కానీ నేను చిన్నప్పటి నుండి ఇతర పద్ధతికి అలవాటు పడ్డాను. అది అలవాటై పోయింది." [51] మే 6న ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో స్టార్క్, ముంబై బ్యాట్స్‌మెన్ కీరన్ పొలార్డ్‌తో వాగ్వాదానికి దిగాడు. బెంగుళూరు ఇన్నింగ్స్ 17వ ఓవర్‌లో, స్టార్క్ పొలార్డ్‌కి బౌన్సర్‌ను వేయగా, పొలార్డ్ కొట్టడంలో విఫలమయ్యాడు. ఆ తర్వాత ఇద్దరు ఆటగాళ్లు మాటల తూటాలు పేల్చుకున్నారు. స్టార్క్ తర్వాతి డెలివరీ కోసం రన్-అప్‌లో ఉండగా, పొలార్డ్ క్రీజు నుండి వైదొలిగాడు, స్టార్క్ తన రన్-అప్‌ను విరమించుకుంటాడని ఆశించాడు. దాని బదులు స్టార్క్, పొలార్డ్‌ని అనుసరించి బంతిని అతని కాళ్ల వద్ద వేశాడు. పొలార్డ్ తన బ్యాట్‌ని స్టార్క్‌పై విసిరేస్తానని బెదిరిస్తూ ఊపగా, అది అతని చేతిలోంచి జారి లెగ్ సైడ్‌కి వెళ్లింది. ఇద్దరు ఆటగాళ్లకు వారి మ్యాచ్ ఫీజులో కొంత భాగం జరిమానా విధించారు (స్టార్క్‌కు 75%, పొలార్డ్‌కు 50%). IPL ప్రవర్తనా నియమావళి ప్రకారం నేరాలకు పాల్పడినట్లు అభియోగాలు మోపారు, స్టార్క్‌తో "(ఎ) ఆట స్ఫూర్తికి విరుద్ధమైన ప్రవర్తన; లేదా (బి) ఆటకు అపకీర్తి తేవడం." [52] వాగ్వాదానికి ప్రజల స్పందన చాలా ప్రతికూలంగా ఉంది. ESPNcricinfo ఎడిటర్ నాగరాజు గొల్లపూడి, ప్రవర్తనా నియమావళిలోని శిక్ష వారి మ్యాచ్ ఫీజులో 100% వరకు ఉంటుంది, రెండు మ్యాచ్‌ల నిషేధం కూడా ఉండే అవకాశం ఉంది. కానీ, ఇద్దరినీ తక్కువ శిక్షతో వదిలిపెట్టారని అన్నాడు.[53] ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడు రవిశాస్త్రి, పునరావృత సంఘటనలు మ్యాచ్ నిషేధానికి దారితీస్తాయని, ఆటగాళ్ల మ్యాచ్ ఫీజు కంటే రెట్టింపు జరిమానా విధించవచ్చనీ హెచ్చరించాడు.[54]

మోకాలి గాయం కారణంగా స్టార్క్ 2015 సీజన్‌ను ప్రారంభించడం ఆలస్యమైంది.[55] స్టార్క్ రాకముందు, బెంగుళూరు IPL పట్టికలో అట్టడుగు స్థానంలో ఉంది. కానీ స్టార్క్ తిరిగి వచ్చాక, అతను బెంగళూరు బౌలింగ్‌లో ఆధిక్యం సాధించి జట్టును మలుపు తిప్పాడు.[56] రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, తదుపరి ఏడు మ్యాచ్‌లలో ఒకదానిలో మాత్రమే ఓడిపోయింది.[57] స్టార్క్ 20 వికెట్లతో టోర్నమెంట్‌ను ముగించాడు.[58] అతను పాదాల ఫ్రాక్చర్ కారణంగా 2016లో IPLకి దూరమయ్యాడు. 2017 ICC ఛాంపియన్స్ ట్రోఫీ కోసం తన పనిభారాన్ని తగ్గించుకోవడానికి, ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టడానికీ 2017 ఫిబ్రవరిలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నుండి తప్పుకున్నాడు.[59]

"బబుల్ ఫెటీగ్" కారణంగా స్టార్క్ 2022 IPL సీజన్ నుండి వైదొలిగాడు.[60]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

స్టార్క్ స్లోవేనియన్ సంతతికి చెందినవాడు.[61] ఆస్ట్రేలియన్ ఒలింపిక్ హైజంపర్ బ్రాండన్ స్టార్క్కు అన్నయ్య.[62]

స్టార్క్ తన తోటి ఆస్ట్రేలియన్ క్రికెటర్ అలిస్సా హీలీతో 2015 లో నిశ్చితార్థం చేసుకున్నాడు [63] వారు 2016 ఏప్రిల్ 15న వివాహం చేసుకున్నారు. 1950లు, 1960లలో ఇంగ్లండ్‌కు ప్రాతినిధ్యం వహించిన రోజర్, రూత్ ప్రిడోక్స్, అలాగే 1980లు, 1990లలో శ్రీలంకకు ప్రాతినిధ్యం వహించిన గై, రసాంజలి డి అల్విస్ ల తర్వాత, స్టార్క్, హీలీలు టెస్టు క్రికెట్ ఆడిన మూడవ జంట. ఆ తరువాత వారితో రెండు వివాహిత మహిళల జంటలు కూడా చేరాయి: కేథరీన్, నటాలీ స్కివర్-బ్రంట్, మారిజాన్నే కప్ప్, డేన్ వాన్ నీకెర్క్.[64]

9 సంవత్సరాల వయస్సులో, వాళ్ళు నార్తర్న్ డిస్ట్రిక్ట్‌లకు ఇద్దరూ వికెట్ కీపర్‌లుగా ఆడుతున్నప్పుడు కలుసుకున్నారు.[65] 2020 మార్చిలో, 2020 ICC మహిళల T20 ప్రపంచ కప్‌లో ఫైనల్‌లో హీలీ ఆడడాన్ని చూసేందుకు దక్షిణాఫ్రికాతో జరిగే చివరి వన్‌డే మ్యాచ్‌కు ముందు స్టార్క్ స్వదేశానికి వెళ్లాడు.[66]

గమనికలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
 1. Mitchell Starc, Cricket Australia. Retrieved 6 November 2021.
 2. "Starc and Healy tie the knot". cricket.com.au. 15 April 2016. Retrieved 2 May 2022.
 3. "Records / Australia / Test Matches / Most Wickets". ESPNcricinfo. Retrieved 15 December 2022.
 4. English, Peter (18 September 2010). "Injured Josh Hazlewood misses India tour". ESPNcricinfo. Retrieved 1 October 2022.
 5. "Full Scorecard of Australia vs India 2nd ODI 2010/11 - Score Report". ESPNcricinfo. 20 October 2010. Retrieved 1 October 2022.
 6. English, Peter (7 November 2010). "McKay ends Australia's losing streak". ESPNcricinfo. Retrieved 1 October 2022.
 7. English, Peter (7 November 2010). "A minor boost ahead of larger challenges". ESPNcricinfo. Retrieved 1 October 2022.
 8. "Clarke pulls up sore after century". ESPNcricinfo. 12 November 2010. Retrieved 1 October 2022.
 9. "McKay replaces injured Starc for Australia A". ESPNcricinfo. 15 November 2010. Retrieved 1 October 2022.
 10. "Ferguson fifty gives Australia A third win". ESPNcricinfo. 3 July 2011. Retrieved 1 October 2022.
 11. "Bollinger, Starc trouble Bulls". ESPNcricinfo. 15 November 2011. Retrieved 1 October 2022.
 12. "Bulls caravan rolls on over Blues". ESPNcricinfo. 20 November 2011. Retrieved 1 October 2022.
 13. "Pace quartet to duel for Australia A". ESPNcricinfo. 18 November 2011. Retrieved 1 October 2022.
 14. Brettig, Daniel (26 November 2011). "Starc, Pattinson, Siddle, Cutting to set pace for Gabba". ESPNcricinfo. Retrieved 1 October 2022.
 15. Brettig, Daniel (1 December 2011). "Starc searches for consistency". ESPNcricinfo. Retrieved 28 January 2012.
 16. "New Zealand tour of Australia, 2011/12 / Scorecard: Second Test". ESPNcricinfo. Retrieved 28 January 2012.
 17. Brettig, Daniel (29 December 2011). "Harris recalled, Watson's prospects cloudy". ESPNcricinfo. Retrieved 28 January 2012.
 18. Fuss, Andrew (8 January 2012). "Starc helps Sixers win rain-hit Sydney derby". ESPNcricinfo. Retrieved 1 October 2022.
 19. Brettig, Daniel (6 January 2012). "Injured Pattinson out of series". ESPNcricinfo. Retrieved 1 October 2022.
 20. Coverdale, Brydon (14 January 2012). "Starc eager to keep learning". ESPNcricinfo. Retrieved 1 October 2022.
 21. "Full Scorecard of India vs Australia 3rd Test 2011/12 - Score Report". ESPNcricinfo. 15 January 2012. Retrieved 1 October 2022.
 22. Brettig, Daniel (17 January 2012). "Lyon to return in Adelaide". ESPNcricinfo. Retrieved 1 October 2022.
 23. "Full Scorecard of Australia vs India 4th Test 2011/12 - Score Report". ESPNcricinfo. 28 January 2012. Retrieved 1 October 2022.
 24. Brettig, Daniel (20 February 2012). "Ponting dropped from ODI squad". ESPNcricinfo. Retrieved 4 October 2022.
 25. "Blues win despite Coulter-Nile". ESPNcricinfo. 22 February 2012. Retrieved 4 October 2022.
 26. "IPL Auction 2018: Johnson, Starc ready to be KKR's 'Mitch-factor' in IPL". India Today. Retrieved 8 September 2018.
 27. "Aussie stars go big in IPL auction". cricket.com.au. 27 January 2018. Retrieved 30 November 2022.
 28. "Starc out of IPL 2018 with 'tibial bone stress'". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 30 March 2018.
 29. 29.0 29.1 Brettig, Daniel (15 November 2018). "Australia players to have only limited IPL role". ESPNcricinfo. Retrieved 30 November 2022.
 30. Brettig, Daniel (14 November 2018). "Starc released from IPL amid Australia contracts debate". ESPNcricinfo. Retrieved 30 November 2022.
 31. "Mitchell Starc initiates legal action over IPL insurance payout". ESPNcricinfo. 9 April 2019. Retrieved 15 December 2022.
 32. "Mitchell Starc impresses with fiery spell against Scotland". ESPNcricinfo. 14 March 2015. Retrieved 7 October 2022.
 33. Brettig, Daniel (29 March 2015). "Australia's youth and their warning to the world". ESPNcricinfo. Retrieved 7 October 2022.
 34. "ICC Cricket World Cup, 2014/15 / Records / Most wickets". ESPNcricinfo. Retrieved 7 October 2022.
 35. Bull, Andy (31 March 2015). "Starc tops the new-gen class". ESPNcricinfo. Retrieved 7 October 2022.
 36. Coverdale, Brydon (29 March 2015). "Plans fall in place for Australia's A-Team". ESPNcricinfo. Retrieved 7 October 2022.
 37. "Starc becomes top-ranked ODI bowler". ESPNcricinfo. 31 March 2015. Retrieved 7 October 2022.
 38. Coverdale, Brydon (14 February 2015). "Australia cruise to opening win". ESPNcricinfo. Retrieved 6 October 2022.
 39. Isam, Mohammad (21 February 2015). "Points shared after Gabba washout". ESPNcricinfo. Retrieved 6 October 2022.
 40. Coverdale, Brydon (28 February 2015). "Australia batting 'extremely poor', concedes Clarke". ESPNcricinfo. Retrieved 7 October 2022.
 41. 41.0 41.1 Coverdale, Brydon (1 March 2015). "Starc asked Clarke for another over". ESPNcricinfo. Retrieved 7 October 2022.
 42. Binoy, George (28 February 2015). "Ice-cool Williamson wins New Zealand a thriller". ESPNcricinfo. Retrieved 7 October 2022.
 43. Kimber, Jarrod (6 June 2019). "Mitchell Starc strips away the resistance as Australia revive their fear factor". ESPNcricinfo. Retrieved 15 December 2022.
 44. Farrell, Melinda (6 June 2019). "West Indies' fury at 'dodgy' decisions as Australia get rub of the green". ESPNcricinfo. Retrieved 15 December 2022.
 45. Brettig, Daniel (6 June 2019). "Australia face down their Trent Bridge demons as Nathan Coulter-Nile leads stirring revival". ESPNcricinfo. Retrieved 15 December 2022.
 46. "World Cup 2019: Smith, Coulter-Nile, Starc shine as Australia beat West Indies". India Today. 6 June 2019. Retrieved 12 August 2019.
 47. "Starc breaks record, earns new nickname". Cricket Australia. 7 June 2019. Retrieved 7 June 2019.
 48. "Records | One-Day Internationals | Bowling records | Fastest to 150 wickets | ESPNcricinfo.com". Cricinfo. Retrieved 12 August 2019.
 49. "Alex Carey, Mitchell Starc to the fore as Australia thump New Zealand". ESPN Cricinfo. 29 June 2019. Retrieved 30 June 2019.
 50. "HowSTAT! Bowling Aggregates (Single World Cup Tournament)". www.howstat.com. Retrieved 12 August 2019.
 51. "Mumbai Indians sign Lendl Simmons". ESPNcricinfo. 29 April 2014. Retrieved 6 October 2022.
 52. "Pollard, Starc fined for altercation". ESPNcricinfo. 7 May 2014. Retrieved 6 October 2022.
 53. Gollapudi, Nagraj (7 May 2014). "IPL sends a poor message". ESPNcricinfo. Retrieved 6 October 2022.
 54. Gollapudi, Nagraj (8 May 2014). "'Pollard, Starc need a stern warning' - Shastri". ESPNcricinfo. Retrieved 6 October 2022.
 55. "Injured Starc to miss start of the IPL". ESPNcricinfo. 1 April 2015. Retrieved 7 October 2022.
 56. Monga, Sidharth (26 April 2015). "Starc breathes life into Royal Challengers". ESPNcricinfo. Retrieved 7 October 2022.
 57. Ravindran, Siddarth (25 May 2015). "Starc and the old boys". ESPNcricinfo. Retrieved 7 October 2022.
 58. Varghese, Mathew (25 May 2015). "The IPL 2015 tournament XI". ESPNcricinfo. Retrieved 7 October 2022.
 59. "RCB and Mitchell Starc part ways ahead of 2017 season". ESPNcricinfo. 19 February 2017. Retrieved 27 October 2022.
 60. PTI (31 January 2022). "Mitchell Starc Reveals Why He Opted Out Of IPL 2022 Mega Auction". NDTV. Retrieved 31 March 2022.
 61. "Brew ha-ha: Maddinson tweets for teen's expert advice to beat bad run".11 December 2011.
 62. "PB and finals berth for high jumper Starc". The Sydney Morning Herald. Retrieved 3 September 2015.
 63. "Ashes: Who will be in Australia's team for 2017–18 series?". BBC Sport. 24 August 2015. Retrieved 1 June 2022.
 64. "Husband-wife Test players, and T20 oldies". espncricinfo.com. 19 April 2016. Retrieved 1 October 2016.
 65. sehhwag (3 January 2018), Mitchell Starc and Alyssa Healy Most Romantic and Interesting Interview, archived from the original on 10 July 2019, retrieved 4 January 2018
 66. "Mitchell Starc to leave South Africa early to watch Alyssa Healy in Women's T20 World Cup final". ESPN Cricinfo. Retrieved 6 March 2020.